తెలుగు వికీపీడియాలో కొత్తగా చేరాలనుకునే ఔత్సాహికులు ఇంకా స్వచ్ఛంద కార్యకర్తల కోసం రూపొందించిన మా ఇంటర్న్‌షిప్ & వాలంటియర్ శిక్షణ కార్యక్రమం వికీమీడియా సోదర ప్రాజెక్టుల్లో చురుకుగా పాల్గొనేందుకు అవసరమైన ప్రాథమిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడంలో ఎంతో సహాయపడుతుంది.
ప్రస్తుతం జరుగుతున్న తెలుగు వికీపీడియా ఆన్‌లైన్ శిక్షణ కార్యక్రమం – Stage 1 మూడు వారాలపాటు ప్రతి రోజు (ఆదివారం మినహా) సాయంత్రం 7:00 PM – 8:00 PM వరకు Google Meet వేదికగా నిర్వహించబడుతోంది.
ఈ శిక్షణా కార్యక్రమంలో అంశాల వారీగా శిక్షణ ఇవ్వడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. శిక్షణ ఇవ్వడానికి ఆసక్తి ఉన్న అంశాలను మీరే ఎంపిక చేసి, దయచేసి క్రింది పట్టికలో నమోదు చేయగలరు.
ప్రణాళిక & అంశాల జాబితా లింక్:
కార్యక్రమ వివరాలు
శిక్షణ పేరు: తెలుగు వికీపీడియా ఆన్‌లైన్ శిక్షణ కార్యక్రమం – Stage 1
కాలవ్యవధి: మూడు వారాలు (ఆదివారం మినహా)
తేదీలు: 14 నవంబర్ 2025 – 05 డిసెంబర్ 2025
సమయం: ప్రతిరోజూ రాత్రి 7:00 PM – 8:00 PM (IST)
ఈ కార్యక్రమంలో మీ సహకారం కొత్త సభ్యులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
మీ స్పందన కోసం ఎదురుచూస్తున్నాము.
ఏవైనా సందేహాలు లేదా సహాయం కావాలంటే ఈ క్రింది మార్గాల ద్వారా సంప్రదించండి:
WhatsApp:
9014120442 (దయచేసి కేవలం సందేశాలు మాత్రమే పంపండి)
ఈ మూడు వారాల పాటు శిక్షణ కోసం ఒకే Google Meet లింక్ ఉపయోగించబడుతుంది (
meet.google.com/cre-sfjo-rqv). సెషన్ ప్రారంభానికి 10 నిమిషాల ముందు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకునేందుకు రిమైండర్‌ను సెట్ చేసుకోండి.
ధన్యవాదాలు
తెలుగు వికీమీడియన్స్ వాడుకరుల సమూహం (TWUG)