తెలుగుని నిలుపుట

2 views
Skip to first unread message

Veeven (వీవెన్)

unread,
Nov 21, 2008, 3:11:23 AM11/21/08
to telugupra...@googlegroups.com
... గురించి ఇక్కడో చర్చ జరుగుతుంది: http://etelugu.org/node/138

ఈ గుంపు ఉద్దేశానికి సంబంధించిన అంశం కనుక ఈ లింకుని పంపిస్తున్నాను. తమ తమ అభిప్రాయాలు తెలియజేయండి.

--
http://koodali.org/

kame...@yahoo.com

unread,
Nov 21, 2008, 2:04:14 PM11/21/08
to తెలుగు భాషా ప్రచార సమితి
వివేన్ గారు,
e-తెలుగు గుంపులో కూడా ఈ విషయాన్ని ఆలోచించడం ఆనందంగా ఉంది. అక్కడ నా
ఆలోచనలు రాసాను. అది ఇక్కడవారితో కూడా పంచుకోవలసిన అవసరం ఉంది కాబట్టి
అక్కడ రాసింది మళ్ళీ ఇక్కడ పోస్టుతున్నాను:

ఎంతసేపూ తెలుగుభాషగురించి బాధపడేవాళ్ళే తప్పిస్తే క్రియాశీలకమైన ఆలోచనలు
చేసీవాళ్ళు తక్కువగా కనిపించిన నాకు ఇక్కడ వ్యాఖ్యలు చూస్తే చాలా
ఉత్సాహంగా ఉంది.
ప్రభావం చూపేలా తెలుగుభాషా ప్రచారం చెయ్యాలంటే, మన పరిధిలో రకరకాలుగా
ప్రయత్నం చెయ్యాలని నాకనిపిస్తోంది.
ఒకవైపు, రాజేంద్రగారు చెప్పినట్టు తెలుగుభాష వినియోగంపై అధికారిక
సమాచారాన్ని సంపాదించడం.
మరోవైపు ప్రభుత్వం, రాజకీయనాయకులపై వత్తిడి తేవడం. ఇది ఎంతవరకూ
సాధ్యమవుతుందన్న దానిపై నాకు నమ్మకం కొంచెం తక్కువగా ఉంది.
నా ఉద్దేశంలో మరో ముఖ్యమైన కోణం ప్రజలలో కొంత కదలిక తీసుకురావడం. ఇదికూడా
అంత సులువైన విషయం కాదు కాని గట్టిగా ప్రయత్నం చేస్తే ఇది సాధ్యమవుతుందని
అనిపిస్తోంది. ఒక ఏడాది, రెండేళ్ళు ఉద్యమంలా శ్రమిస్తే, ఆశించిన ఫలితాలు
వస్తాయనుకుంటున్నాను. దీనికి ఉన్న మందొకటే, ప్రచారం ప్రచారం ప్రచారం. ఒక
ప్రణాళిక ప్రకారం వీలైనన్ని ప్రచారమాధ్యమాల ద్వారా తెలుగు భాష మాట్లాడడం
గురించిన అపోహలని తొలగిస్తూ, తెలుగు భాషమీద అభిమానం పెంచేలా ఊదరగొట్టడమే.
ముఖ్యంగా టార్గెట్ చెయ్యాల్సిన వర్గం నగరాల్లో చదువుకున్న మధ్యతరగతి,
ఎగువ మధ్యతరగతి, ధనవంతుల వర్గాలు.
ఈ ప్రచారానికి భారతదేశంలో (ముఖ్యంగా ఆంధ్రాలో) ఉన్నవాళ్ళు ఒక ఇరవై
ముప్ఫైమంది దాకా కలిస్తే మంచిది. ఈ పని చెయ్యడానికి వైజాసత్యగారు అడిగిన
ప్రశ్నకి సమాధానం చెప్పడం చాలా ముఖ్యం. తెలుగెందుకో తెలుసుకోవాలి. అయితే
దీనికి నిజంగా వెతికితే ఓ కచ్చితమైన సమాధానం ఉంటుందని నేననుకోను. కాని
ప్రజాకర్షకమైన (అచ్చతెలుగులో చెప్పాలంటే జనాలకి ఎక్కే) సమాధానాన్ని లేదా
వివరణని తయారుచేసుకోవాలి. ఈ కాలంలో ఎంత బాగా ప్రెసెంత్ చెయ్యగలుగుతున్నాం
అన్నదే కదా ముఖ్యం!
తెలుగుభాషా ప్రచారంలో చేసే ఏ పనికైనా నేను తప్పకుండా నా చేతనైనది
చేస్తాను.
ఎ-తెలుగు అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి మాత్రమే పరిమితమన్న దృష్టితో
"తెలుగుభాషాప్రచారసమితి" అని కొత్త గుంపు పెట్టాను. మీరుకూడా బయటి
ప్రపంచంలో తెలుగు ప్రచారానికి నడుంబిగిస్తే, అందరమూ ఒకే గుంపుగా మన
ప్రయత్నాన్ని సాగించవచ్చు.

Reply all
Reply to author
Forward
0 new messages