వర్డ్ ప్రెస్ వెబ్ సైట్ నిర్వహణ కు సహాయం,సూచనలు కావాలి

1 view
Skip to first unread message

దేవరపల్లి రాజేంద్ర కుమార్

unread,
Nov 24, 2008, 12:24:21 AM11/24/08
to తెలుగు భాషా ప్రచార సమితి
నేను ఇటీవలే http://www.vizagdaily.co.cc/ అన్న ఒక వెబ్ సైట్ ను
ప్రారంభించాను,తెలుగు యూనికోడ్ ఫాంట్స్ తో,ప్రస్తుతం రోజుకు ఒకటీ రెండు
వార్తలు/వ్యాసాలు ఇందులో జతచేస్తున్నాను.కానీ డైలీ కాబట్టి వీలయినంత
త్వరలో ప్రతి రోజూ సాధ్యమైనన్ని వార్తలు అందించాలని
ప్రత్యత్నిస్తున్నాను.అయితే ఈ వెబ్ సైట్ నిర్వహణ అంతా వర్డ్ ప్రెస్ కి
సంబంధించింది.నేను ఇప్పటి వరకూ నా బ్లాగులన్నీ బ్లాగరు లోనే
నడుపుతున్నాను.అయితే పత్రికకు కావాల్సిన థీమ్స్,టెంప్లేట్ వగైరాలు వర్డ్
ప్రెస్ లోనే ఉండటం వల్ల దాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది.కానీ వర్డ్ ప్రెస్
నిర్వహణ నాకు కొంత ఇబ్బంది కరంగా ఉంది,అసలు ఏమాత్రం పరిచయం అనుభవం
లేకపొవటం వల్ల.
నాకు కింది అంశాలలో మీ సూచనలు కావాలి
అ.వర్డ్ ప్రెస్ గురించి మన తెలుగు బ్లాగర్లు ఎవరన్నా విపులమైన టపాలు
రాసారా?
ఆ.వర్డ్ ప్రెస్ థీం,టెంప్లేట్ లాంటివి బ్లాగర్ లో దొరుకుతాయా?మ్యాగ జైన్
కు అనుగుణంగా
ఇ.ఈ రెంటికీ మధ్య ఫొలికలు,తేడాలున్నాయా?
ఈ.scribefire గురించి ఎవరన్నా వివరించగలరా? ఎందువల్లో ఈ సదుపాయానికి
ప్రచారం లేకుండా పోయింది?
ఎ.కొత్తగా రూపొందించిన తెలుగు వెబ్ సైట్లను అంతర్జాలం లో తెలుగువారందరికీ
తెలిసేలా ఎలాంటి పనులు/ఎక్కడ చేయాల్సుంటుంది?
Reply all
Reply to author
Forward
0 new messages