తెలుగు జాతి

3 views
Skip to first unread message

విరజాజి

unread,
Sep 19, 2008, 5:16:54 AM9/19/08
to తెలుగు భాషా ప్రచార సమితి
తెలుగు భాష ని పరిరక్షించడమే కాదు, చాలా ఇతర రాష్ట్రాల్లో / ప్రాంతాల్లో
పాతుకు పోయి, అస్తిత్వాన్ని కోల్పోతున్న తెలుగు వారందరినీ సమీకరిద్దామా?
ఈ విషయమై, తెలుగుపీపుల్.కాం లో వ్యాసాలు చదివాను. ఆ లింక్ ఇక్కడ
చూడండి.
http://telugupeople.com/discussion/userArticles.asp?userId=CV_RAMESH

kame...@yahoo.com

unread,
Sep 19, 2008, 1:44:18 PM9/19/08
to తెలుగు భాషా ప్రచార సమితి
విరజాజిగారు,
మీ ఆలోచన మంచిదే! బహుశా అంతర్జాలం ఎక్కువమందికి చేరువయ్యేకొద్దీ ఇది
మరింత సులువవుతుంది.
అసలు తెలుగునాట ఉన్న తెలుగువాళ్ళ కన్నా, ఇతర ప్రాంతాల్లోని వాళ్ళకే
తెలుగంటే ఎక్కువ అభిమానం ఉందేమో అని నాకనిపిస్తోంది. తమ అస్తిత్వాన్ని
నిలబెట్టుకొనే తాపత్రయం వల్ల తెలుగు భాషాసంస్కృతుల మీద ఎక్కువ మక్కువ
పెంచుకుంటున్నారేమో.
తెలుగునాట ఉన్నవాళ్ళకి ఈ అస్తిత్వ సమస్య లేదు/తెలీదు. కాబట్టి భాష
గురించి ప్రత్యేకమైన అభిమానమూ, ఆలోచన ఉండకపోవచ్చు. అదే సమస్యకి మూలం అని
నేననుకొంటున్నాను.
దీని గురించి నా ఆలోచనలు వేరే టపాలో (అందరికీ స్వాగతం పలకొద్దూ :-)
చెప్పడానికి ప్రయత్నిస్తాను.

- కామేశ్వర రావు

sujatha bedadakota

unread,
Sep 20, 2008, 12:06:33 AM9/20/08
to telugupra...@googlegroups.com

కామేశ్వర రావు గారు, మీరన్న మాట నిజమే! మనకు అందుబాటులో లేని దాని మీద అభిమానముండటం సహజమేగా! అందుకే ఇతర ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు భాష మీద కొద్దో గొప్పో అభిమానం (మనకంటే ఎక్కువగా) చూపిస్తారు, అమెరికాలో ఉన్నవాళ్ళు ప్రతి నెలా సత్యనారాయణ వ్రతం చేసుకున్నట్టు.

ఇదీ ఒకందుకు మంచిదే, భాషను, సంస్కృతిని నిలబెట్టుకోవడానికి ఎవరు ఎక్కడినుంచి కృషి చేసినా స్వాగతించదగిందే!

సుజాత

2008/9/19 <kame...@yahoo.com>
Reply all
Reply to author
Forward
0 new messages