మీతో ఈరోజు కొన్ని విషయాలు చెప్పుదామని అనుకొంటున్నాను.
మన తెలుగు వాళ్ళమంతా ఇపుడు ఒక విషయము పునరాలోచించుకోవాల్సిన తరుణం
వచ్చింది.15 కోట్లమందికంటె ఎక్కువ మందికి మాతృభాషగా వున్న ఒకభాష నేడు
అంతరించిపొతోందంటే అది మన ఘనకార్యం కాక మరేంటి? బహుషా ఈవిషయం భాషా
శాస్త్రవేత్తలకు వారి జుట్టు వాళ్ళు పీక్కున్నా అర్థం కాదేమో?
కొంచెం అలోచించండి మిత్రులారా?
తెలుగు బంధువులారా!
ఇక్కడ నేను తెలుగు చరిత్రనో లేదా తెలుగు భాషా మాధుర్యాన్నో
చెప్పాలనుకోవటం లేదు.తెనుగును ఎలా బ్రతికించుకోవాలో మాత్రమే
చెప్తాను.ఈరోజు రాజ్యాధికారం వున్నవాడే ఏమైనా చేయగలడు, రాజు లేదా
పాలకుడిని శాసించేది ఓటు. ఆ ఓటు తోనే కొన్ని వర్గాలు ఎమి కావాలంటే అవి
చేయించుకొంటున్నాయి.ఒక వర్గం... అది ఏదైనా కావొచ్చు.... మతం, కులం,
ప్రాంతం లేదా మరి ఏదైనా, ఇంకేదైనా ఒక వాదనను (డిమాండును) లేవనెత్తి వారి
వారి డిమాండులను సాధించుకొంటున్నాయిమరి మనం కూడా అదే విధానాన్ని
అనుసరించి తెలుగు భాషా అభిమానులతో ఒక వర్గాన్ని ఏర్పరచుకొగలిగితే అదే
ఓటును ఆయుధంగా చేసుకొని ఈ దళసరి చర్మధారుల కళ్లు తెరిపించి మన మాతృభాషను
బ్రతికించుకోవచ్చు.
తిరిగి తెలుగుకు పూర్వ వైభవం తీసుకు రావొచ్చు.ఈ సంఘ సభ్యులెవ్వరికి మతంతొ
పని లేదు, కులంతో పని లేదు, ప్రాంతంతొ పని లేదుకావాల్సింది తెలుగు
మట్లాదగలగటం,వుండాల్సింది తెలుగు భాష మీద మమకారం.
సంఖ్య తక్కువ అవుతుందని అనుమానమా..... మరి ఒకసారి లెక్క వేసి
చూద్దామా....!
తెలుగు భాషాభిమానులు, తెలుగు అధ్యాపకులు, తెలుగు మీడియా( తెలుగు
జర్నలిస్టులు, తెలుగు టీవి చానెల్లు వారు) తెలుగు రచయితలు, కవులు,
కవయిత్రులు, అన్ని తరగతుల తెలుగు మీడియం విద్యార్థులు, మత గురువులు
( తెలుగు చర్చి ఫాదర్లు, పూజారులు, ఇంకా టివి ఛానెల్లలొ కనిపించే తెలుగు
లో బొధనలు చేసే వారు వారిది ఏమతం అయినా సరే .......), ఆధ్యాత్మిక సంస్థల
ప్రతినిధులు (ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు తమ కార్యకలాపాలను తెలుగు లోనె
నిర్వహించుకుంటున్నాయి వాటి ప్రతినిధులు) ఇలా ఎందరొ, ఎందరెందరో చూడండి!
మనం ఊహించనతమంది వున్నారు కదూ!
కావలసింది ఒక సరి అయిన వేదిక మాత్రమే....!
రండి, చేయి చేయి కలుపుదాం....
ఇకపై మన బ్లాగు లో తెనుగుకు తిరిగి పూర్వ వైభవం ఎలా తీసుకురావాలొ
చర్చిద్దాం....ఇంతవరకు ఎవరూ లేవనెత్తని, ఊహించని ఎన్నో విషయాలను
మాట్లాడుకుందాం,ప్రణాళికలను తయారు చేద్దాం...
పరిష్కారాలను కనుగొందాంవెంటనే కార్యాచరణకు దిగుదాం..!
'తెలుగును బ్రతికించుకుందాం '
చేయెత్తి జైకొట్టు తెలుగోడా..!గతమెంతొ ఘనకీర్తి కలవోడా!
సాటిలేని జాతి నేడు నిదురపొతుండాది...
జైకొట్టి మేల్కొలుపు తెలుగోడా..!గతమెంతొ ఘనకీర్తి కలవోడా!
చేయెత్తి జైకొట్టు తెలుగోడా..!గతమెంతొ ఘనకీర్తి కలవోడా!
వెనుక తరముల వారి వీర చరితల సిరులు
త్యాగమ్ము నార్వోసి నీర్వెత్తి పెంచరా..!
తిరిగి సుఖములు పండురా తెలుగునాడు..!
వెలలేని మాగాణిరా.. తెలుగునాడు..!
వెలలేని మాగాణిరా....!
భాషాభిమానం ఎందుకుండాలో కొందరుమహనీయుల మాటల్లో....
సొంత వారి ఎదుట సొంతభాషలో మట్లాడకుండా పరభాషలో మట్లాడుకొనే వారిని
గురించి
రమణ మహర్షి అన్న మాటలివి:
" వారు ఇంగ్లీషులో పాండిత్యం సంపాదించారు. ఆ విషయం అందరికీ తెలియవద్దూ?
అదీ గాక స్వభాషలో సారం లేదనే వారి భావం. ఆ భాషా వ్యామోహం అట్లా
చేయిస్తుంది.
వారేం చేస్తారు పాపం. ఉన్నదంతా బయటికి రావద్దూ..? "
" మాతృ భాషాభిమానం దేశాభిమానానికి ప్రథమ సొపానం " - వివేకానంద
" అన్య భాషలు నేర్చి, ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా,
చావవెందుకురా...!" - కాళోజి
" ఉన్న ఊరు కన్న తల్లి ఒక్కరూపు కన్నతల్లీ మాతృభాష ఒక్కరూపు!" -
శ్రీనాథుడు
" దేశభాషలందు తెలుగు లెస్స " - రాయలు
" పరభాష ద్వారా బొధన అంటే సోపానాలు లేని సౌధం ! " - ఠాగూర్
" ప్రపంచాన్ని దర్శించాలంటే మాతృ భాషా గవాక్షం నుంచే చూడాలి " - నెహ్రూ
" మాతృ భాషలో పట్టు సాధించినవారు అన్య భాషలను సులువుగా గ్రహించగలరు.." -
మనస్తత్వవేత్తలు
" ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ " - నికొలె కాంటె (ఇటలి)(తెలుగును గురించి)
కొందరు తెలుగు బంధువులు ఇలా అడిగారు...తెలుగు, తెలుగు అని విశాల భారతావని
నుండి దూరం చేయటం సబబేనా అని....
వారికి మేము ఇచ్చే సమధానం ఒకటె...
15 కోట్ల మందిని ఐక్యంగా వుంచటానికి మేము చేస్తున్న ప్రయత్నం సంకుచిత
ధొరణి ఎలా అవుతుందో కొంచెం అలోచించాలి..
మీ స్పందనల కోసం.......
మీ
చెన్నకేశవస్వామి,
teluguch...@gmail.com