నూర్ బాషా రెహమతుల్లా గారు మొన్నటి వరకైతే విశాఖలో Deputy Collector
హోదాలో పనిచేసేవారు. నేను సెప్టెంబర్ 2007లో ఆయన్ను ఆ వూళ్ళోకలిశాను. ఆయన
తెలుగు భాషపైన తెలుగు పత్రికల్లో తరచుగా రాస్తుంటారు.
ఆ 68వ వ్యాఖ్యలో సగ భాగం 05.11 న ఆంధ్రజ్యోతిలో కె. బాలగోపాల్ గారు రాసిన
వ్యాసంనుండి సంగ్రహింపబడింది.
69 వ వ్యాఖ్యతో నాకు చాలా విభేదాలున్నాయి.
మాధవపెద్ది, వేలూరి పద్యాలు గుర్తుకు తేవడం మాత్రం బాగుంది. భమిడిపాటి
కామేశ్వరరావు గారి ప్రఖ్యాతిగాంచిన "మన తెలుగు" (1938) వ్యాసం ఈ
సందర్భంలో యెంతైనా చదవదగ్గది. అలాగే ఇంద్రగంటి హనుమఛ్ఛాస్త్రి గారు
దాదాపు అదే ప్రాంతంలో "ప్రబుద్ధాంద్ర" అన్న పత్రికలో రాసిన "మనకు
సంస్కృతమెంత కావాలి" (సరిగ్గా టైటిల్ గుర్తులేదు. క్షంతవ్యుణ్ణి!) అన్న
వ్యాసం కూడా. ప్రతి పది, ఇరవై ఏళ్ళకొకసారి ఇలాంటి చర్చలు తెలుగులో గత 130
యేళ్ళుగా జరుగుతూనే వున్నాయి. అప్పట్లో సంస్కృతం తెలుగుని
మింగేస్తుందన్నట్లుగా అనేవారు/అనుకునేవారు. ఈసారి ఎదురుగాలి కాస్త బలంగా
వీస్తున్నట్లుంది.
కొంచెం పరుషంగా ధ్వనిస్తే క్షమించాలి, ఇలాంటి గ్రూపులు, బ్లాగులు,
కామెంట్లవల్ల భాష ప్రచారమవుతుందనో, రక్షింపబడుతుందనో నాకైతే యెలాంటి
నమ్మకాలు లేవు. మాతృభాష, తల్లిభాష అని అంటున్నారు. విచిత్రం! Mother
tongue కి అది ముక్కస్య ముక్కః లాంటి అనువాదం. అసలు mother tongue అనే
concept లేని దేశంలో మాతృభాషంటారేమిటి?
భవదీయుడు,
శ్రీనివాస్
On Nov 11, 5:22 pm, "sujatha bedadakota" <
gulab...@gmail.com> wrote:
> తెలుగు ప్రచార సమితి సభ్యులకు నమస్కారం!
> ఇంతకు ముందు నా బ్లాగులో స్పందించిన నూర్ భాషా రహమతుల్లా గారు రాష్ట్ర ప్రభుత్వ
> అధికారి అని ఈ రోజు ఆయన రాసిన మరో వ్యాఖ్య ద్వారా తెలిసింది. ఆయన ఈ రోజు నా టపా
> మీద రాసిన వ్యాఖ్య చాలా ఆవేదనతో నిండి ఉంది. ఒక సారి కింది లింకు చూడగలరు. ఈ
> పేజీలో చివరి నుంచి రెండో వ్యాఖ్య చూడండి.
>
>
https://www.blogger.com/comment.g?blogID=6811857956403203190&postID=9...
>
> 2008/11/6 sujatha bedadakota <
gulab...@gmail.com>