స్వాగతం!

2 views
Skip to first unread message

kame...@yahoo.com

unread,
Sep 19, 2008, 2:18:06 PM9/19/08
to తెలుగు భాషా ప్రచార సమితి
నా పిలుపునందుకొని ఇక్కడ చేరిన అందరికీ ముందుగా నెనరులు/కృతజ్ఞతలు/
ధన్యవాదాలు! అందరికీ స్వాగతం!

ఈ గుంపు పెట్టడంలో నా ఆలోచనలు ఈ పాటికే అందరికీ కొంత అర్థమై ఉంటాయి.
ఒకసారి వాటిని మళ్ళీ వివరిస్తాను. అందరూ నా ఆలోచనలతో ఒప్పుకోవాల్సిన
అవసరం లేదు. అందరికీ తెలుగుభాషపై అభిమానం, దాని గూర్చి కొంత తపన ఉన్నాయి
కదా. అదే మనల్ని కలిపే శక్తి. ఏమిటి చెయ్యాలి, ఎలా చెయ్యాలి లాటివన్నీ
ముఖ్యమే అయినా secondary అంశాలు. దాని గురించి అందరమూ చర్చించి ఏదో ఒక
అంగీకారానికి రావచ్చనే నమ్మకం నాకుంది. కాబట్టి మీ మీ ఆలోచనలని
నిరభ్యరంతరంగా పంచుకో వచ్చు. నా ఆలోచనలని నిస్సంకోచంగా ఖండించ వచ్చు.

1. తెలుగుభాష మీద అంతర్జాలంలో చాలామందికి అభిమానం ఉంది. తెలుగుభాష
గురించి అంతర్జాలంలో చాలా కృషి జరిగింది, జరుగుతోంది. దీనికి ప్రత్యక్ష
సాక్ష్యం మన బ్లాగులే! దీనికి విజయ సారథులు ఒరెమున, వివేన్ ఈ గుంపులో
చేరడం నాకు మరింత స్ఫూర్తినిచ్చింది.
2. అయితే, మొత్తం తెలుగువాళ్ళలో అంతర్జాలాన్ని వాడే వారి సంఖ్య చాలా
తక్కువ. మరి ఇదే అభిమానం అందరికీ ఉందా? లేదేమో అని నా అనుమానం. చాలామంది
బ్లాగర్లు బ్లాగుల్లో రాసిన తమ తమ అనుభవాలు ఈ అనుమానాన్ని మరింత పెద్దవి
చేసాయి. సుజాతగారి ఇటీవలి టపా దీనికొక ఉదాహరణ.
3. కాబట్టి తెలుగుమీద అభిమానం ఉన్న మనం, మన అభిమానాన్ని అంతర్జాలం
బయటున్న ప్రపంచంలో కూడా ఎందుకు ప్రచారం చెయ్యకూడదు? ముఖ్యంగా, మన సొంత
గడ్డపై తెలుగు మరింతగా వ్యాప్తి చెందడానికి మనమేమీ చెయ్యలేమా?

ఇవి నా ప్రయత్నానికి మూలాధారాలు. ఇంక, ఏమిటి చెయ్యాలి ఎలా చెయ్యాలి అన్న
అంశాలమీద నాకు కచ్చితమైన ఆలోచనలు లేవు కాని, కొన్ని ఊహలు మాత్రం ఉన్నాయి.
అవి:

1. తెలుగుభాష ప్రచారం ముఖ్యంగా జరగాల్సినది ఎగువమధ్య తరగతి, పై తరగతి
జనాల్లో. అందులోనూ పట్టణాలూ నగరాల్లో ఉన్న ప్రజలలో.
2. ఇంగ్లీషు నేర్చుకోవాలంటే, తెలుగుని మర్చిపోవాలీ అన్న భ్రమ పోవాలి.
3. నిత్యవ్యవహారంలో (వాడుకలో) ఇంగ్లీషు అజమాయిషీ తగ్గాలి.
4. చదువు వచ్చిన ప్రతి (తెలుగు గడ్డపై ఉన్న)తెలుగువాడికీ తెలుగు చదవడం
రాయడం కచ్చితంగా రావాలి.
5. తెలుగెందుకు నేర్చుకోవాలి అన్న ప్రశ్నకి సరైన సమాధానం మనం
చెప్పగలగాలి, లేదా ఆ ప్రశ్నే రాని విధానాన్ని ఆలోచించాలి.
6. టీవీ, సినిమా వంటి మాధ్యమాల ప్రభావం భాష మీద చాలా ఉంది.
7. ప్రభుత్వాన్ని నమ్ముకుంటే, కుక్కతోకబట్టి గోదావరిని ఈదాలనుకోవడమే.

ఇవి నా ఆలోచనలు. మరి మీరేమంటారు?

- కామేశ్వర రావు

sujatha bedadakota

unread,
Sep 20, 2008, 12:15:37 AM9/20/08
to telugupra...@googlegroups.com
తెలుగు ప్రచార సమితి సభ్యులకు నమస్కారం!
 
కామేశ్వర రావు గారు చెప్పిన విషయాలు చాలా సబబుగా, ఆలోచించదగ్గవిగా ఉన్నాయి. నాకు తోచిన , చేస్తున్న కొన్ని పనులు చెప్తాను.

మనం చేయదగ్గ పనులు

1.ముందు మన పిల్లలతో పూర్తిగా తెలుగులోనే మాట్లాడాలి.(స్కూల్లో ఎలాగూ ఆంగ్లం తప్పదు)

2.తెలుగు వాడ దగిన ప్రతి ప్రదేశంలోనూ తెలుగే మాట్లాడాలి. ఉదాహరణకు I-MAX లాంటి ప్రదేశాలకు వెళితే తెలుగు మాట్లాడితే తక్కువ అన్న ఉద్దేశంతో ఇంగ్లీష్ లో మాటాడటం వంటి భేషజాలకు  సహజంగా దూరమవ్వాలి.

3.కొన్ని తెలుగు వార్తా చానెళ్ళలో కూడా వారల్లో కూడా సగానికి సగం ఇంగ్లీషే వాడుతున్నారు. ఈ వార్తల్ని చూస్తూ కూచోక, వీలైంత తెలుగు వాడమని వారిని 'డిమాండ్ ' చేయాలి.(ఈ విషయమై TV9 కి ఇప్పటికే నేను 2, 3, మెయిల్స్ పంపాను).

ప్రభుత్వ ప్రమేయం ఉండి తీరాలని కోరుకోక మన పరిథిలో మనం కృషి ప్రారంభించాలి.

సుజాత


 
2008/9/19 <kame...@yahoo.com>
Reply all
Reply to author
Forward
0 new messages