శివునికి ఎన్ని పర్యాయ పదాలున్నాఒక మిత్రుడు పున్నమరాజు (అంటే చంద్రుడు అని అర్థం) ఫేస్ బుక్ లో ఇచ్చాడు. కింద చూడండి.
దేశ్య.
• అంగమోములవేల్పు, అగ్గికంటి, అయిదుమోములవేల్పు, అరమెయిజోటివాడు, అలరుసాయకువైరి, ఆబోతురౌతు, ఎద్దుతత్తడిజోదు, ఏకపాత్తు, ఏనుగుతోలుదాల్పు, ఏనుగురాకాసిగొంగ, ఐదుమోములవేల్పు, కప్పుగుత్తుకవాడు, కఱిమెడదొర, కాట్రేడు, కొండమల్లయ్య, కొండయల్లుడు, గట్టువిల్తుడు, గాములదొర, గిబ్బడాల్దొర, గిబ్బపటాణిరౌతు, గిబ్బబాబాజోదు, గిబ్బరౌతు, గుబ్బలివిలుకాడు, చిచ్చఱకంటి, చిలువతాలుపు, చిలువసొమ్ము, జంగమయ్య, జడదారి, జడదాలుపువేలుపు, జడముడిజంగము, జడలసికదేవర, జన్నపుగొంగ, జన్నపువేటకాడు, జాబిలితాల్పు, జాళువావింటివాడు, జింకతాలుపరి, జింకతాల్పు, జోటింగుడు, తిగకంటి, తుంగుడు, తెల్లనిదొర, తోలుదాల్పు, దిసమొలవేల్పు, దిస్సమొలదేవుడు, నింగిసిగ, నీరుతిట్టబత్తళికవజీరు, నెలతాల్పు, నెలదారి, నొసలిచూపువేల్పు, పునుకతాలుపు, పెనుజోగి, బంగరుగట్టువింటివాడు, బుడిబుడితాల్పుడు, బూచిమనలవాడు, బూచులదొర, బూచులరాయడు, బూచులఱేడు, బేసికంటి, బేసికంటివేల్పు, మరుగొంగ, మరునిసూడు, మాయలచెంచురాయడు, మిక్కిలికంటివేల్పు, మిక్కిలికంటిసామి, మిత్తిగొంగ, మిత్తివేటగాడు, మినుసికగలాడ...
పద నిష్పాదక శక్తి (జనరేటివ్ పవర్) సంస్కృతానికే ఉంటుంది, తెలుగుకు లేదని పెద్ద గోల చేసే వారికి పైన ఇచ్చిన సమాచారమే మంచి సమాధానం. వారి నోరు మూయిస్తుందని భావిస్తున్నాను. శివునికి ఎన్ని పర్యాయపదాలు ఉన్నాయో చూస్తే తెలుగులో పద నిష్పాదకశక్తి కొత్త మాటలు పుట్టించే శక్తి సత్తువ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. మిత్రులు ఈ దిశగా ఆలోచించాలని మనవి.
పులికొండ సుబ్బాచారి.
--
Prof. P. Subbachary
Head, Department of Folklore and Tribal Studies
Director
Internal Quality Assurance Cell (IQAC)
Dravidian University
Kuppam 517425
A.P