పట్టికలకి సంబంధించిన పదాలు

5 views
Skip to first unread message

Veeven (వీవెన్)

unread,
Nov 1, 2009, 7:23:38 AM11/1/09
to తెలుగుపదం
పట్టికలకు సంబంధించిన పదజాలం:
  • పట్టిక (table): దత్తాంశాన్ని అడ్డువరుసలలోనూ నిలువు వరుసలలోనూ కలిగివున్న జాబితా
  • అడ్డువరుస (row)
  • నిలువువరుస (column)
  • గడి (cell): అడ్డు మరియు నిలువు వరుసల కలయిక (intersection)
  • గడిహద్దులు? (gridlines): గళ్ళను వేరుపరిచే రేఖలు/గీతలు లేదా హద్దులు (borders)
అడ్డువరుస నిలువవరుసలు కాకుండా వాడుకలో ఏమైనా పదాలు ఉన్నాయా?

నెనర్లు,
వీవెన్.

--
Read Telugu blogs @ koodali.org
పట్టిక.png

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Nov 1, 2009, 8:34:51 AM11/1/09
to telug...@googlegroups.com
మీ పదాలు బానే ఉన్నాయి.


నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org

Sirish Kumar Tummala

unread,
Nov 1, 2009, 12:10:46 PM11/1/09
to telug...@googlegroups.com
gridlines - సాళ్ళు అనొచ్చేమో. పొలాన్ని దున్నేప్పుడు నాగలి తవ్వే గీతను "సాలు" అంటారు. బహువచనం "సాళ్ళు".

- తుమ్మల శిరీష్ కుమార్
-----------
నా బ్లాగు: http://chaduvari.blogspot.com
బ్లాగులన్నీ: http://koodali.org, http://jalleda.com


2009/11/1 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>

ANANDASWARUP GADDE

unread,
Nov 1, 2009, 3:47:18 PM11/1/09
to telug...@googlegroups.com
2009/11/1 Veeven (వీవెన్) <vee...@gmail.com>:

> పట్టికలకు సంబంధించిన పదజాలం:
>
> పట్టిక (table): దత్తాంశాన్ని అడ్డువరుసలలోనూ నిలువు వరుసలలోనూ కలిగివున్న
> జాబితా
> అడ్డువరుస (row)
> నిలువువరుస (column)
> గడి (cell): అడ్డు మరియు నిలువు వరుసల కలయిక (intersection)
> గడిహద్దులు? (gridlines): గళ్ళను వేరుపరిచే రేఖలు/గీతలు లేదా హద్దులు (borders)
>
> అడ్డువరుస నిలువవరుసలు కాకుండా వాడుకలో ఏమైనా పదాలు ఉన్నాయా?
>
ఒకప్పుడు తెలుగు ఎకాడమీ వాళ్ళు సాంకేతక పదాలకు కొన్ని పుస్తకాలు విడుదల
చేశారు. అంత గొప్పగాలేవు. పరిష్కరించి మళ్ళీ ప్రచురిస్తామాన్నారు. ఏమైందో
తెలియదు. ఎవరికో పంపుదామని ఒక సెట్టు కొని హైదరాబాదులో ఉంచాను. కావాలంటే
ఇంకా ఉన్నయ్యోలేవో కనుక్కుంటాను. వీలైతే ఆవుల మంజులత గారిని కనుక్కోండి.
క్రిందటిసారి ఆవిడ సహాయం చేసింది.
ananda...@gmail.com

ANANDASWARUP GADDE

unread,
Nov 1, 2009, 6:17:23 PM11/1/09
to telug...@googlegroups.com
ఇంకొకమాట. సాంకేతిక పదాలలో చాలా (combinations)కావాలి. వీటికి ఎక్కువగా
సంస్క్రుతమే వాడాలిసి రావచ్చు. అలాగైతే మిగితా భారతీయ భాషలతోకొంత వీలు
(convenince )ఉండవచ్చు. కొన్నిభాషల్లో (కన్నడం వగైరా)సాంకేతిక పదాలు చాల
వచ్చినట్లు గుర్తు. వాటిని కూడా చూస్తే ఉపయయోగం ఉండవచ్చు.నేననుకోటం:
వాడుక భాషకు మీరుచేస్తున్నప్రయత్నాలు బాగానే ఉన్నయ్యి కాని సాంకేతిక
పదాలకి కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలేమో. ప్రభుత్వం ప్రచ్రురించే పాఠశాల
పుస్తకాలలో కూడా వాడుతారు కదా?

2009/11/2 ANANDASWARUP GADDE <ananda...@gmail.com>:

Reply all
Reply to author
Forward
0 new messages