Nenuu meethoo kalisi panichestaa ! udataa bhaktigaa.......

0 views
Skip to first unread message

tel.kala

unread,
Sep 28, 2008, 1:28:20 PM9/28/08
to తెలుగుపదం
తెలుగు పదానికి పాదాభి వందనం.నేను తెలుగు కళ పేరుతో బ్లాగు రాస్తున్న
పద్మకళను.మీరందరూ తల్లి భాష కోసం ఇంతగా తపిస్తోంటే నాకూ మీతో కలిసి ఆ
మహత్కార్యం లో పాలుపంచుకోవాలని ఉంది.నేను సైతం మీవెనుక పయనించి తెలుగు
పతాకం ఎగురవెయ్యడానికి సదా సంసిద్ధమని సవినయంగా
తెలియేజెసుకుంటున్నాను.
ఇక విషయానికొస్తే ఇప్పుడు నన్నేమి చెయ్యమంటారు? సైన్సు పాఠాలలోని తెలుగు
-ఇంగ్లీషు పదాలు పట్టుకొచ్చి తెలుగు పదం లో పెట్టనా? వారానికి ఒకటేమిటి?
పదొ, పదిహేనో కనీసం పెట్ట గల్ననుకుంటున్నాను... ప్రయత్నిస్తాను.

తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli

unread,
Sep 28, 2008, 9:46:44 PM9/28/08
to telug...@googlegroups.com
మీకు తోచిన విధంగా మీకు తోచిన కొత్త తెలుగు పదాల గుఱించి వ్రాయండి. వేఱే తెలుగుమీడియమ్ పుస్తకాల్లో, వ్యాసాల్లో మీకు దొరికిన తెలుగు వైజ్ఞానిక పరిభాషని వాటి ఆంగ్ల సమార్థకాలతో ఇక్కడ మాకు పరిచయం చెయ్యండి.

కాని ఇది పైకి కనిపిస్తున్నంత glamorous పని కాదు. చాలా ఇబ్బందులున్నాయి. మన తెలుగువాళ్ళకి ఏ కొత్త విషయమైనా ఆగర్భశత్రువు. ఏ పదమైనా వాడమని అంత తొందఱగా వాళ్ళని ఒప్పించలేం. అగ్గించేవారి కన్నా తగ్గించేవారెక్కువ. అందుకు సిద్ధపడే ఈ సేవ చేయాలి.
 
౨౦౦౮ సెప్టెంబర్ ౨౮ ౨౨:౫౮ న, tel.kala <kala.p...@gmail.com> ఇలా రాసారు :



--
నెనర్లు. (Thanks)

Yours Truly
T. Lalitha Bala Subrahmanyam

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org

వల్లూరి

unread,
Oct 10, 2008, 12:48:59 PM10/10/08
to తెలుగుపదం
"తల్లి భాష" అన్నా పద ప్రయోగం అంతగానప్పినట్లు లేదు. ఎంచక్కగా "మాతృభాష"
అనండి చాలు, సంసృతాన్ధ్రమిలితమైనా అందంగా, అర్ధవంతముగా వుంటుంది.

tel.kala

unread,
Oct 20, 2008, 9:53:05 PM10/20/08
to తెలుగుపదం
మీరన్నది నిజమే అనిపిస్తుంది. అనుకోకుండా వచ్చింది ఆ వాడుక. మాతృ భాష
అంటేనే బాగుంది.అలాగే వాడతాను.
Reply all
Reply to author
Forward
0 new messages