౨౦౦౮ సెప్టెంబర్ ౨౭ ౨౧:౪౨ న, తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli
<subtad...@gmail.com> ఇలా రాసారు :
సంపర్కాలు అనే శుభ్రమైన మంచి పదం ఉండగా బొత్తిగా సంబంధం లేని ఏవో ఇతర పదాల్ని contacts కి సమానార్థకాలుగా భావించ యత్నించడం వివారకరం.
మీ వేగులోని మిగతా విషయాలన్నీ వదిలేని, పరిచయం అన్నదానిపై నేను స్పందిస్తున్నాను..
పరిచయం - బొత్తిగా పొసగని వాడుక.
Contactsకి పరిచయాలు అని ఎలా సూచించా(నం)మంటే
జీమెయిలు అనువాదాలకి మనక్కావలసిన సందర్భం ఇదీ:
Contact (noun)
Chambers (sense 3): an acquaintance whose influence or knowledge may prove useful, especially in business
Oxford Advanced Learner's (sense 5): a person that you know, especially sb who can be helpful to you in your work: social / personal contacts
I've made some useful contacts in journalism.
She has several contacts in New York.
తెలుగులో సబంధింత వాడుక: ఆయనకి విజయవాడలో బాగా పరిచయాలున్నాయి.
Now, I am out of contact with him.
దీన్నెలా అనువదిస్తారు ? "నాకిప్పుడు అతనితో పరిచయం లేదు" అనా ?
contact అన్న పదం సూచించే ఎన్నో అర్థాలలో ఒక్క దానికి పరిచయాలు అని వాడాం. మిగతా వాటికి దీన్నే ఎలా వాడతాం? ఒకసారి పరిచయం అంటూ ఏర్పడ్డాక ఇక లేకపోవడం ఎలా జరుగుతుంది, [...]
పైనది Oxford ప్రకారం మొదటి అర్థం:
the act of communicating with somebody, especially regularly: I don't have much contact with my uncle.
There is little contact between the two organizations.
Have you kept in contact with any of your friends from college (= do you still see them or speak or write to them)?
ఈ అర్థంలో సరైన పదం పట్టుకోవాలి. పరిచయాలు అన్నది (సంప్రదింపులు కూడా) ఈ అర్థంలో సరిపోదు.