ఈ మధ్య body language కి కొందఱు దేహభాష అని వాడుతున్నారు. ఇది మక్కికి
మక్కి అనువాదంలా ఉంది. చప్పున చూసినప్పుడు దాని అర్థం సద్యఃస్ఫురణ కావడం
లేదు. ఆకాశవాసన లాంటి ఒక అర్థం పర్థం లేని సమాసంలా కనిపిస్తున్నది.
దీనికి ’హావభావాలు’ అని ఒక పదం ఇప్పటికే తెలుగులో వాడుకలో ఉంది.
దీన్నెందుకు విస్మరిస్తున్నారో తెలియదు.
అలాగే premature baby కి "నెలతక్కువ బిడ్డ" అనే వాడుక ఉంది. ఆ మాత్రం
దానికి ఏదేదో రాసి కిందా మీదా పడుతున్నారు మన పాత్రికేయులు.
అదే విధంగా Postmortem కి మన గ్రామీణులు బల్లకోత అంటారు.
ఇటువంటి వాటన్నింటినీ సందర్భానుగుణంగా పునరుద్ధరించి, ప్రసారమాధ్యమాల
(media) ద్వారా ఉద్ద్యోతించి (హైలైట్ చేసి) వాడుకోవాలి.
--- On Wed, 8/18/10, తాడేపల్లి బాలసుబ్రహ <subtad...@gmail.com> wrote:
> --
> ఈ సందేశం మీకెందుకు
> వచ్చిందంటే.. మీకు
> "తెలుగుపదం" గూగుల్
> గుంపులో సభ్యత్వం ఉంది
> కాబట్టి.
>
> * ఈ గుంపుకు జాబులు
> పంపేందుకు, ఇక్కడికి
> మెయిలు పంపండి: telug...@googlegroups.com
> * ఈ గుంపు నుండి
> వైదొలగేందుకు, ఇక్కడకు
> మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
> * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te
> వద్ద ఈ
> గుంపును చూడండి
>
శవపంచాయితీ బావుంది. కానీ దాని కంటే బల్లకోత ఎక్కువ క్ఌప్తంగా
అనిపిస్తోంది.
| శవపంచాయతీ అంటే ఐదుగురు సాక్షుల సమక్షంలో అధికారులు జరిపే శవ పరీక్ష.పోస్ట్ మార్టం ను శవపరీక్ష అంటున్నారు కోస్తాలో. --- On Mon, 8/23/10, kv ramana <kvje...@gmail.com> wrote: |
బల్ల కోత నేను మా ఊళ్ళో విన్నాను
చాల సులువైన పదం కూడా
| "శవపంచాయతీ అంటే ఐదుగురు సాక్షుల సమక్షంలో అధికారులు జరిపే శవ పరీక్ష" అని అక్షరిక అర్థం తీస్తే ఎలాగ? అయోమయం, చాకచక్యం, పరిపాటి లాంటి మాటల్ని మూలం కనుక్కొని వాడుతున్నామా? |