ఈ పదాలకు అర్ధాలు తెలుపగలరు

500 views
Skip to first unread message

వెంకటరమణ

unread,
Nov 16, 2009, 3:26:35 AM11/16/09
to తెలుగుపదం
అందరికీ నమస్కారం,
ఈ క్రింది పదాలకు అర్ధాలు తెలుపగలరు.
1. శ్వసితం
2. ప్రదోషం
3. వళులు
4. జరా
5. చెల్వారి
6. ఘూర్ణిల్లు
7. నికృంతన
8. విధురహిత
9. నిషద్వర
10. వికీర్ణము
11. శర్కర
12. సక్కర
13. కహళీ
14. మంజూష
15. నిచోళచ్ఛన్న
16. కశ్మలం
17. సృగాలాలు
18. కవోష్ట
19. కాదంబరీ
20. నిబిడము
21. ఆయతము
22. చతుష్కృతి
23. కాకలీ
24. నిషాదము
25. తప్త
26. ప్రిదిలి
27. లోలిత
28. బదనిక
29. ధ్వాంత
30. ముఖసీధువు
31. సౌదామిని
32. వీవనలు
33. విదృమ
34. శతహ్రద
35. వైశ్వానర
36. నిస్తుషితం
37. స్నాతము

భవదీయుడు
-- రమణ

Kiran Kumar Chava

unread,
Nov 16, 2009, 3:57:28 AM11/16/09
to telug...@googlegroups.com
మీరు హైదరాబాద్ వాస్తవ్యులు అయితే అర్జంటుగా ఒక నిఘంటువు కొనుక్కోగలరు :)
----
నెనర్లు,
కిరణ్ కుమార్ చావా
http://te.chavakiran.com/blog
http://en.chavakiran.com/blog
http://abbigaadu.com
http://tolireyi.com




2009/11/16 వెంకటరమణ <venkat....@gmail.com>

Veeven (వీవెన్)

unread,
Nov 16, 2009, 4:21:04 AM11/16/09
to telug...@googlegroups.com

16 నవంబర్ 2009 1:56 pm న, వెంకటరమణ <venkat....@gmail.com> ఇలా రాసారు :

అందరికీ నమస్కారం,
ఈ క్రింది పదాలకు అర్ధాలు తెలుపగలరు.

ఇక్కడ వెతికి చూడండి: http://dsal.uchicago.edu/dictionaries/brown/

ముకారాంత పదాలతో వెతకండి. ఉ.దా. శ్వసితం గురించి వెతకడానికి శ్వసితము అని వెతకండి.

ఇట్లు,
వీవెన్.
--
Read Telugu blogs @ koodali.org

వెంకట్

unread,
Nov 16, 2009, 5:10:31 AM11/16/09
to telug...@googlegroups.com
వీవెన్ గారు,
 మీరు చెప్పిన లంకె ఉంది.  కానీ ఉన్నదున్నట్లు వెతకటంతో దొరకలేదు. మీ సూచన పనిచేస్తోంది. ధన్యవాదాలు.
కిరణ్ గారు, 
అవునండీ కొనాలి. :)
 
ఇట్లు
-- రమణ

2009/11/16 Veeven (వీవెన్) <vee...@gmail.com>

ANANDASWARUP GADDE

unread,
Nov 16, 2009, 7:33:44 AM11/16/09
to telug...@googlegroups.com
'వీవనలు ' బదులు 'వీవన ' చూడండి. కనపడనవి గూగులమ్మలో ప్రయత్నించవచ్చు.
కొన్నిటికి రెండూ పనిచెయ్యటం లేదు. 'శిలా లోలిత ' అనేపుస్తకం ఉంది కాని
లోలిత అర్థం తెలియటంలేదు

2009/11/16 వెంకట్ <venkat....@gmail.com>:


> వీవెన్ గారు,
>  మీరు చెప్పిన లంకె ఉంది.  కానీ ఉన్నదున్నట్లు వెతకటంతో దొరకలేదు. మీ సూచన
> పనిచేస్తోంది. ధన్యవాదాలు.

>  * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
> గుంపును చూడండి
> -~----------~----~----~----~------~----~------~--~---
>
>

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Nov 16, 2009, 7:57:06 AM11/16/09
to telug...@googlegroups.com
వ్యాకరణపరంగా వీవెన సరైనది.


నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org

ANANDASWARUP GADDE

unread,
Nov 16, 2009, 3:57:18 PM11/16/09
to telug...@googlegroups.com
2009/11/16 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>:

> వ్యాకరణపరంగా వీవెన సరైనది.
>
కావచ్చు. మూలం నుంచి మార్చే నియమాలు నాకు గుర్తులేవు. బ్రౌను
Telugu-EnglishDictionary చ్హూస్తే కొంచెం తేడాతో వాదారు వీవన అంటే
విసనకర్ర (fan) అనీ, వీవెన అంటే సూరటి (whisk with a round end to drive
away flies etc) అనీ. కాని ఆన్లైను (Online)నిఘంటువులో రెండూ ఒకటే
అన్నట్లుగా చెప్పారు.
Thanks.
Swarup

Dr.R.P.Sharma

unread,
Nov 18, 2009, 8:34:35 AM11/18/09
to తెలుగుపదం
తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యంగారికి నమస్కారములు.
మీరు తెలిపిన "వ్యాకరణపరంగా వీవెన సరైనది. " అనే మాటలు నాలో కొంత ఆలోచన
రేకెత్తించినవి. నాకు తోచిన విషయాలను ఇక్కడ తెలుపదలచుకున్నాను.
ప్రయోగాలు:-
1. వీవన అనే పదానికి శబ్దరత్నాకరకారుడు కళాపూర్ణోదయప్రయోగాన్నీ
తెలిపాడు.వీవెన అనే మాటనే తెలుపలేదు.
(సీ. ధ్వజము వాహనము వీవనయు నాదిగ
బెక్కు రూపులై గరుడుడారూఢి గొల్వ..కళా.౮)
2. పర్యాయపదనిఘంటువులోనూ 2351 వద్ద కేవలం వీవన ఒక్కటే పేర్కొనబడింది.
వీవెన ప్రసక్తి లేదు.
3. Dravidian Etimological dictionary లోనూ 4479 వద్ద కేవలం వీవన
పేర్కొనబడింది.వీవెన ప్రసక్తి లేదు.
4. తెలుగు దేశ్యవ్యుత్పత్తి నిఘంటువు లోనూ 2194 వీవన ఒక్కటే
పేర్కొనబడింది. వీవెన ప్రసక్తి లేదు
5. బ్రౌణ్యనిఘంటువులోనూ (వీవెన vīvana.) అని ఉంది. అక్కడ కూడా తెలుగు
లిపిలోని రూపానికీ ధ్వనిలిపి రూపానికీ భేదం ఉంది. ఇక తెలుగు పదాల
విషయంలో బ్రౌణ్యం పరమప్రమాణం కాదేమో?
వ్యాకరణ పరంగా :-
1.తెలుగులో ‘-ఎన’అనే కృత్పత్యయం ఉంది. "ఈర్చు, ఉబ్బు, కందు, దువ్వు,
వడ్డించులకు -ఎన అనే ప్రత్యయం చేరుతుంది. (ప్రౌఢవ్యాకరణం -కృదంతప్రకరణం
3) - వ్యాకరణపదకోశం.
ఈ సూత్రంతో ఈర్పెన,ఉప్పెన, కందెన, దువ్వెన, వడ్డెన(వడ్డన) అనే రూపాలు
సాధించవచ్చు. ఇది ఆకృతిగణం కూడా కాదు. అని చెప్పి వేరే పదాలు రావని
కాదనుకొండి. కాబట్టి "వీవెన" అనేరూపం కాదేమోనండీ!
2. -అన అనే కృత్ ప్రత్యయం ప్రసిద్ధ వ్యాకరణాల్లో లేకున్నా దానిని
పేర్కొన్నవారున్నారు.
ఉదా:- మన్నన, విత్తన(ము)... (వివరాలకు నా పరిశోధనాగ్రంథం
‘శ్రీమదాంధ్రమహాభాగవతంలో కృత్తద్ధితప్రయోగాలు’చూడండి.)
3. వీచు (1179 Telugu verbal basis)అనే క్రియాపదంపై ‘-అన’ అనే
కృత్ప్రత్యయం చేరగా సిద్ధమైన రూపం "వీవన". వీచునది వీవన. దీనిచే వీచబడును
అని కరణార్థం.
సందేహావకాశం:-
తాబాసు అంతటి పండితునితో సెబాసు అనిపించుకొన్న మన "వీవెనుడిని" అందరమూ
సెబాస్ అందాం. ఎంతైనా వారి టెక్కునిక్కులు గొప్పవే. రోజూ వారి పేరు
(వీవెన్) చూసే కదా "వ్యాకరణపరంగా వీవెన సరైనది. " అని తాబాసుగారు
కితాబునిచ్చారు?
సారాంశం:-
వీవన అనేదే సరైన పదం. వీవెన అనే ప్రయోగం లేదు.
నమస్కారములతో-
బుధజనవిధేయుడు -
రామక పాండురంగశర్మ.
-----------------------------------------------------------------------
పైన పేర్కొన్న పుస్తకాల్లో నా సిద్ధాంతగ్రంథం,వ్యాకరణపదకోశం,
ప్రౌఢవ్యాకరణం,శబ్దరత్నాకరం,పర్యాయపదనిఘంటువు...మరియు అనేక పుస్తకాలు
మీకు Online లో చదువుకోవడానికిగాని, ఉచితంగానే PDF లో దిగుమతి
చేసుకునేందుకుగానీ
http://teluguthesis.com లో లభిస్తాయి.

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Nov 18, 2009, 12:16:50 PM11/18/09
to telug...@googlegroups.com

1.తెలుగులో ‘-ఎన’అనే కృత్పత్యయం ఉంది. "ఈర్చు, ఉబ్బు, కందు, దువ్వు,
వడ్డించులకు -ఎన అనే ప్రత్యయం చేరుతుంది. (ప్రౌఢవ్యాకరణం -కృదంతప్రకరణం
3) - వ్యాకరణపదకోశం.
ఈ సూత్రంతో ఈర్పెన,ఉప్పెన, కందెన, దువ్వెన, వడ్డెన(వడ్డన) అనే రూపాలు
సాధించవచ్చు. ఇది ఆకృతిగణం కూడా కాదు. అని చెప్పి వేరే పదాలు రావని
కాదనుకొండి. కాబట్టి "వీవెన" అనేరూపం కాదేమోనండీ!

వీచు + ఎన = వీవెన వ్యాకరణపరంగా సాధ్యం కావచ్చునని మీరే సూచిస్తున్నారు. కనుక నేను చర్చనింక సాగదీయను.

మన కావ్యప్రయోగాలు తాళపత్ర లిఖితప్రతులనుంచి ముద్రితప్రతుల్లోకి ఎక్కినటువంటివి. ముద్రణయుగంలోకి ప్రవేశించి 190 సంవత్సరాలైపోతూండడం వల్ల తాళపత్రాల్లో ఉన్న గుణితపద్ధతి మనకి తెలియదు. ఒక విషయం మాత్రం అనుకుంటున్నాను. మన పూర్వీకుల్లో చాలామందికి సంస్కృతాభిమానం అతివేలం. పిచ్చి అన్నా అతిశయోక్తి కాదు. అందువల్ల తెలుగుపదాల్ని కూడా సంస్కృత గుణితాలతోను, పలుకుబడితోను వ్రాసే అలవాటు కొంతమందికి ఉండేది. హ్రస్వవక్రాలు సంస్కృతంలో లేవు. అందుచేత వాటి ధ్వని ఉన్న పదాల్ని అనాగరికంగా పరిగణించి లేనిదీర్ఘవక్రాలతో పదాల్ని కల్పించిన సందర్భాలున్నాయి. ఉదాహరణకి - ఒడ్డాణం (ఒడినాణెం) అనే దేశిపదాన్ని ఓఢ్యాణమ్ అని సంస్కృతీకరించారు. అందుచేత లేఖకులు దేశిపదాలని సంస్కృత గుణింతాలతో రూపాంతరం చెందించి ఉండొచ్చు. అంతేగాని వీవెన లేదని కాదు, అది తప్పనీ కాదు. పదగుణితాన్ని మారిస్తే పదచరిత్రే మారిపోతుందనే తెలివిడి మిక్కిలి ఆధునికమైనది. భాషాశాస్త్రం బాగా అభివృద్ధి చెందాక అందఱూ గ్రహించినది. ఆ తెలివిడి మన పూర్వీకులకి లేదు.        
 

ANANDASWARUP GADDE

unread,
Nov 18, 2009, 5:13:52 PM11/18/09
to telug...@googlegroups.com
2009/11/19 Dr.R.P.Sharma <rpandura...@gmail.com>:

ఇక తెలుగు పదాల
> విషయంలో బ్రౌణ్యం పరమప్రమాణం కాదేమో?
ఫాండురంగ శర్మ గారు, తాడేపల్లి గారు,
చర్చ చాలా బాగుంది. శర్మ గారు మీరు చెప్పినట్లే దేవులపల్లి రామానుజ రావు
గారు అన్నారు:
In the foreword to Telugu-English 1852 Dictionary republished by
Telugu Sahitya Akademi in 1966
" Though it does not conform, in some respects, to the modern
scientific norms of Lexicography, the Dictionary, even today, is
recognized to be a valuable asset...In response to the incessant
demands from the literary public, the Andhra Pradesh Sahitya Akademi
undertook the reprint of the Brown's Dictionaru Telugu-English". Brown
himself has the heading: "A Dictionary Telugu and English, explaining
the colloquial style used in business and poetic dialect with
explanations in Engish and in Telugu".

పైన తప్పు రాశాను. సూరటి కాదు సురటి
సురటి (p. 1350) [ suraṭi ] suraṭi. [Skt.] n. The name of a certain
tune. రాగవిశేషము. సురటి or సురటీ. [Tel. సుర+అంటు.] n. A round fan.
వట్రువనిసనకర్ర. A whisk for brushing away files, చామరము, కుంచె.
"పువ్వుసురటీని విసరుచుభోజనంబు కాంతసేయించె." T. iii. 19.
సురటిపట్టతీగెలు suraṭi-paṭṭa-tīgelu. n. A drug used in dyeing pink.
చాయతీగెలు.


> -----------------------------------------------------------------------
> పైన పేర్కొన్న పుస్తకాల్లో నా సిద్ధాంతగ్రంథం,వ్యాకరణపదకోశం,
> ప్రౌఢవ్యాకరణం,శబ్దరత్నాకరం,పర్యాయపదనిఘంటువు...మరియు అనేక పుస్తకాలు
> మీకు Online లో చదువుకోవడానికిగాని, ఉచితంగానే PDF లో దిగుమతి
> చేసుకునేందుకుగానీ
> http://teluguthesis.com  లో లభిస్తాయి.

Thanks

Kiran Chakravarthula (NaChaKi)

unread,
Nov 18, 2009, 6:29:34 PM11/18/09
to telug...@googlegroups.com

"దీవన" అన్న పదం విషయంలోనూ ఇవే సూత్రాలు, ప్రమాణాలు, పరిణామాలు వర్తిస్తాయేమోనని నా ఊహ. నేను ఆ పదాన్ని కూడా కాలం పాటు "దీవెన" అనే చదివాను... తరువాతెప్పుడో మా అమ్మగారు చెప్పారు "దీవన" సరైన రూపమని. దీనికీ, ఇక్కడ జరుగుతున్న చర్చకి సంబంధమున్నదని తోచి వ్రాస్తున్నాను. తప్పైతే పెద్దలు దిద్దగలరు.

విధేయుడు,
నచకి

2009/11/18 ANANDASWARUP GADDE <ananda...@gmail.com>
http://nachaki.spaces.msn.com/
http://kirandotc.blogspot.com/

"And somewhere there are engineers
Helping others fly faster than sound.
But, where are the engineers
Helping those who must live on the ground?"

– Young Oxfam Poster

Sirish Kumar Tummala

unread,
Nov 18, 2009, 9:52:59 PM11/18/09
to telug...@googlegroups.com
మంచి చర్చ. ఈ సందర్భంగా 'ఎన' ప్రత్యయంతో గతంలో తాడేపల్లిగారు సృష్టించిన ఒక పదం గుర్తుకు వస్తోంది. స్క్రూడ్రైవరును 'తిప్పెన' అని అన్నారు. స్క్రూ డ్రైవరు తిప్పేది కావడంతో 'తిప్పు' కు 'ఎన' ప్రత్యయం చేరి, తిప్పెన అయింది.

- తుమ్మల శిరీష్ కుమార్
-----------
నా బ్లాగు: http://chaduvari.blogspot.com
బ్లాగులన్నీ: http://koodali.org, http://jalleda.com


2009/11/19 Kiran Chakravarthula (NaChaKi) <email4...@gmail.com>

Sirish Kumar Tummala

unread,
Nov 18, 2009, 9:58:03 PM11/18/09
to telug...@googlegroups.com
ఒక సవరణ.. ఇప్పుడే వెనక్కు పోయి చూసాను, ఆ మాటను ఒక చిన్నపాప కనిపెట్టింది. దువ్వుకొనేది దువ్వెన కాబట్టి, తిప్పెది తిప్పెన అని వాడిందట. అది చరసాల ప్రసాదు గారు గుంపులో చెప్పారు.



- తుమ్మల శిరీష్ కుమార్
-----------
నా బ్లాగు: http://chaduvari.blogspot.com
బ్లాగులన్నీ: http://koodali.org, http://jalleda.com


2009/11/19 Sirish Kumar Tummala <sirish...@gmail.com>

Kiran Kumar Chava

unread,
Nov 18, 2009, 10:19:42 PM11/18/09
to telug...@googlegroups.com
ఆ పాప మన హైదరాబాద్ తెలుగు మోహన్ గారి కుమార్తె. నాలుగు వర్షముల వయస్సు అనుకుంటాను తిప్పెన అని వాడినప్పుడు.


----
నెనర్లు,
కిరణ్ కుమార్ చావా
http://te.chavakiran.com/blog
http://en.chavakiran.com/blog
http://abbigaadu.com
http://tolireyi.com




తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Nov 18, 2009, 11:11:38 PM11/18/09
to telug...@googlegroups.com
దీవెన సరైనది.

తిప్పెన అనే పదాన్ని కల్పించిన  ఆ చిన్నారి పాపకు నెనరులు మఱియు శుభాశీస్సులు.

తెలుగులో మూడు లేదా అంతకంటే ఎక్కువ అక్షరాలు గల దేశిపదాలకి సంస్కృతపదాలకి మాదిరే ఒక వ్యుత్పత్తి ఉంటుంది. అంటే వాటి చరిత్రని వ్యాకరణపరంగా గానీ, భాషాశాస్త్రపరంగా గానీ  సాధించవచ్చునన్నమాట. సదృశంగా (ఒకేలా) ధ్వనించే పదాలకి సదృశమైన చరిత్ర, సదృశమైన అర్థమూ ఉంటాయి. ప్రయోగశరణం వ్యాకరణమ్ కాబట్టి ఆ Analogy (పోలిక) మీదనే ఆధారపడి అలాంటి రూపాలన్నింటినీ అనుసంధానిస్తూ వ్యాకరణ సూత్రాలు నిర్మించబడ్డాయి. ఆకృతిగణమైనా కాకపోయినా, నిపతించినా, నిపతించకపోయినా ఎన ప్రత్యయం ఉన్న అన్ని పదాల్నీ ఒకే దృష్టితో చూడాల్సి ఉంది.ఎందుకంటే ఇవి వైయాకరణులు పుట్టకముందునుంచి ఉన్న రూపాలు.

ఉదా:-

తుఱిమెన
కందెన
వంతెన
గొల్లెన (గుడారము)
వాసెన
నిచ్చెన
బొక్కెన (బక్కెట్/ బాల్చీ)
మొ||

ఇప్పుడు వీవెనని వీవనగా వ్రాసుకోవడం ద్వారా జఱిగేది ప్రాచీనమైన ’ఎన’ ప్రత్యయాన్ని భాషలోంచి తొలగించడం. దానికీ దానితో సదృశమైన ఇతర దేశిపదాలకీ ఉన్న నైరుక్తిక సంబంధం (etymological relation) తెగిపోవడం. కనుక పూర్వలేఖకులూ, నైఘంటికులూ (lexicographers) ఆ విషయంలో ఏం చేసినప్పటికీ మనం వీవెన ని పునరుద్ధరించడం అవసరమనిపిస్తున్నది.

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Nov 18, 2009, 11:27:34 PM11/18/09
to telug...@googlegroups.com
ఎన ప్రత్యయం లాంటిదే అలి/అళి

ఎత్తలి - సాధనం
కొడవలి
కూడలి
బాణలి
మొ||

ఇది ప్రస్తుతం తమిళంలో క్రియాధాతువుల చివఱ అల్ అనే భావార్థక ప్రత్యయంగా ఉంది.
Reply all
Reply to author
Forward
0 new messages