Restoreకి తెలుగు పదం?

87 views
Skip to first unread message

వీవెన్

unread,
May 21, 2013, 9:23:47 AM5/21/13
to తెలుగుపదం
రీస్టోరు అన్న పదానికి నామవాచకంగా పునరుద్ధరణ క్రియగా పునరుద్ధరించు అని ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.

* http://telugupadam.org/restore
* http://www.andhrabharati.com/dictionary/index.php?w=restore

మరేమైనా తేలిక పదాలను (తెలుగు మూల పదాలతో) కాయించవచ్చా?


ఇట్లు,
వీవెన్.


Suresh Kolichala

unread,
May 21, 2013, 10:14:19 AM5/21/13
to telug...@googlegroups.com
We cannot coin new Telugu words haphazardly, without a well-defined methodology providing the guidelines for reassigning new semantics to some of the older words.

Furthermore, we cannot just find a Telugu word for restore without thinking about the Telugu equivalents for the other related words in English (and the semantic distinctions among them) such as:

store, rebuild, recall, recondition, reconstitute, reconstruct, recover, redeem, reerect, reestablish, refresh, refurbish, rehabilitate, reimpose, reinforce, reinstate, reintroduce, rejuvenate, renew, renovate, repair, replace, rescue, retouch, revitalize, revive, revivify, update

That means it has to be taken up as a comprehensive and unitary effort, hopefully by a body of language experts. Any ad-hoc translations will remain just that, ad hoc.

Regards,
Suresh.

2013/5/21 వీవెన్ <vee...@gmail.com>

--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుపదం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugupadam...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
 
 

Pulikonda

unread,
May 21, 2013, 10:49:07 AM5/21/13
to telug...@googlegroups.com
వీవెన్ గారూ రిస్టోర్ అనే ఆంగ్లపదం చాలా సందర్భాలలో చాలా అర్థాలలో వినియోగడుతుంది. కాబట్టి మనం చేసే అనువాదం కూడా ఆ సందర్భాన్ని బట్టి చేయాలి. కంప్యూటర్ పరిభాషకు సంబంధించి ఎక్కడి అవసరానికి దీని అనువాదం కావాలనుకుంటున్నారో చెబితే వెంటనే దీని తెలుగు పదం గురింి మాట్లాడవచ్చు. ఉంటా. 
సుబ్బాచారి పులికొండ. 
--
Prof. P.  Subbachary
Head, Department of Folklore and Tribal Studies
Director
Internal Quality Assurance Cell (IQAC)
Dravidian University
Kuppam 517425
A.P

వీవెన్

unread,
May 21, 2013, 11:02:11 AM5/21/13
to తెలుగుపదం

21 మే 2013 8:19 PM న, Pulikonda <psubb...@gmail.com> ఇలా రాసారు :

వీవెన్ గారూ రిస్టోర్ అనే ఆంగ్లపదం చాలా సందర్భాలలో చాలా అర్థాలలో వినియోగడుతుంది. కాబట్టి మనం చేసే అనువాదం కూడా ఆ సందర్భాన్ని బట్టి చేయాలి. కంప్యూటర్ పరిభాషకు సంబంధించి ఎక్కడి అవసరానికి దీని అనువాదం కావాలనుకుంటున్నారో చెబితే వెంటనే దీని తెలుగు పదం గురింి మాట్లాడవచ్చు. ఉంటా.

To bring something back to a previous condition or state సందర్భంలో కావాలండి. ఆ సంథింగ్ అన్నది మన కంప్యూటర్లో డాటా అయివుండొచ్చు లేదా ఒకానొక సమయంలో ఒక ప్రోగ్రామ్ నడిచే స్థితి (సెషన్) కావచ్చు లేదా ఒక అప్లికేషనులో మనం ఎంచుకున్న వివిధ అమరికలు కావచ్చు.

Pulikonda

unread,
May 21, 2013, 11:08:13 AM5/21/13
to telug...@googlegroups.com
సరిగ్గా దీనకి సరిపోయే కొన్ని సమాసాలు సూచిస్తున్నాను. 
1. ప్రాక్ స్థితీకరణ, 2. పూర్వస్థితీకరణ, 3. యథాకరణం. 4. మునుపటికిరావించు. ఇందులో చివరిది అచ్చతెలుగు క్రియ మిగతావి సంస్కృత అంటే తత్సమ సమాసాలు. 
మనవీలును బట్టి వీటిని ఎంపిక చేసుకోవచ్చు. దీనిపైన ఇంకా చర్చ చేద్దాం. 
సుబ్బాచారి పులికొండ. 

2013/5/21 వీవెన్ <vee...@gmail.com>

--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుపదం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugupadam...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
 
 

n rahamthulla

unread,
May 21, 2013, 12:47:44 PM5/21/13
to telug...@googlegroups.com

తిరిగి కట్టు,తిరగకట్టు.నిలబెట్టు,లేపు,ఎనకటికితెచ్చు,....లాంటి మాటలు నయం.వాడుతూ ఉంటే అవే స్థిరపడిపోతాయి.

From: Pulikonda <psubb...@gmail.com>
To: telug...@googlegroups.com
Sent: Tuesday, May 21, 2013 8:38 PM
Subject: Re: (తెలుగుపదం) Restoreకి తెలుగు పదం?
తిరగ్

Pulikonda

unread,
May 21, 2013, 7:42:57 PM5/21/13
to telug...@googlegroups.com
రహమతుల్లా గారూ మంచి సూచనలే
తిరిగి కట్టు అంటే విడిన మూటను తిరిగి కట్టడం అనే అర్థం వస్తుంది.  తిరగ కట్టు కూడా ఆలాంటిదే. నిలబెట్టు అంటే పూర్తిగా భిన్నమైన  అర్థం వస్తుంది ఇది ఇక్కడ అసలు కుదరదు. పడిపోయినదాన్ని లేదా చెడిపోయిన దాన్ని ఏదో చేసి నిలబెట్టినట్లు అవుతుంది.  
వీటన్నింటిలో ఎనకటికి తెచ్చు. అనేది బాగుంది. కాని కంప్యూటర్ వినియోగంలో ఇది అన్ని సందర్భాలకు సరిపోదేమో. 
ఇంకా కొన్ని తెలుగు పదబంధాలు చేయవచ్చు. ఉదాఛ

మునుపటికితెచ్చు అనే అర్థంలో దీన్ని మునుదెచ్చు అని అనవచ్చు. 
లేదా వెనుకటికి తెచ్చు అనే అర్థంలో దీన్ని వెనుదెచ్చు అని అనవచ్చు.  
వెను దెచ్చు అంటే వెనుకటిగా ఉన్న స్థితికి పూర్తిగా తెచ్చు అని అర్థం బాగా వస్తుంది. 

తెలుగు సమాసం వాడదలచుకుంటే వెనుదెచ్చు అనేది
తత్సమం వాడదలచుకుంటే యథాపూర్వీకరణం అనేది మరీ బాగుంటుంది. 

చర్చిద్దాం. 
సుబ్బాచారి పులికొండ. 

2013/5/21 n rahamthulla <nraham...@yahoo.com>

Akshay Regulagedda

unread,
May 21, 2013, 10:41:15 PM5/21/13
to telug...@googlegroups.com
సభా సభ్యులకు నమస్కారం.

ఇంగ్లీషులో కంప్యూటర్ సంబంధిత పదాలు చాలా metaphoricalగా ఉంటాయి అన్నది నా అభిప్రాయం. restore పదానికి సరి అయిన వ్యుత్పత్తి (etymology?) తెలియదు కానీ, restore లాగానే, icon, client, server వంటి పదాలు యూరోప్ మధ్య యుగ చరిత్ర గాధల నుంచి వచ్చాయి. అలాగే, restore అన్న పదం కూడా "restoring a king to his throne" అన్న context నుంచి వచ్చిందని నాకు ఎప్పుడూ అనిపిస్తుంది. ఈ విధంగా చూస్తే, "నిలబెట్టు" కూడా సందర్భోచితంగా ఉందన్నది నా అభిప్రాయం. 

ఏది ఏమన్నా, మునుదెచ్చు అన్న పదము చాలా సబబుగా ఉందని అనిపిస్తోంది. తత్సమ సమాసాల కంటే దేశ్య  పదాలకే ఈ మధ్య నేను ఎక్కువ మగ్గు చూపిస్తున్నాను. యాభై యేళ్శగా హిందీలో కేంద్ర అధికార భాషా సంఘం చేపట్టుతున్న సాహసకృత్యాలను మనము తలపెట్ట కుండా ఉంటే మంచిది! :) 

అక్షయ్ 

2013/5/22 Pulikonda <psubb...@gmail.com>



--
Akshay Regulagedda | రేగులగెడ్డ అక్షయ్
తెలుగుదేల యెన్న దేశంబు తెలుగేను.

Vasu Valluri

unread,
May 21, 2013, 10:56:30 PM5/21/13
to telug...@googlegroups.com

Restore -    .  పునఃస్థాపించు
వాసు

pavan mvs

unread,
May 21, 2013, 11:34:49 PM5/21/13
to telug...@googlegroups.com
Restore - మునుదెచ్చు అనే పదం చాలా బావుంది..దానినే వాడుదాం..


2013/5/22 Vasu Valluri <vallur...@gmail.com>



--
అమ్మ నేర్పిన తీయని భాష తెలుగు.తెలుగు మాట్లాడడం మరచిన వాడు అమ్మని కుడా మరచినట్లే
తెలుగు లో మాట్లడదాం.అమ్మ నేర్పిన కమ్మదనాన్ని ఆస్వాదిద్దాం.
                                                                        ..పవను..
                                                                  ...నేను 'తెలుగు' వాడిని...

K V Ramana

unread,
May 22, 2013, 1:16:23 AM5/22/13
to telug...@googlegroups.com
రిస్టోర్ - మారుకుదుర్చడం, మారుకుదుర్పు లాంటిదేదైనా పరిశీలించండి.

On 22/05/2013, pavan mvs <sumapava...@gmail.com> wrote:
> Restore - మునుదెచ్చు అనే పదం చాలా బావుంది..దానినే వాడుదాం..
>
>
> 2013/5/22 Vasu Valluri <vallur...@gmail.com>
>
>> Restore - . పునఃస్థాపించు
>> వాసు
>> On 22 May 2013 08:11, "Akshay Regulagedda" <akshay.re...@gmail.com>
>> wrote:
>>
>>> సభా సభ్యులకు నమస్కారం.
>>>
>>> ఇంగ్లీషులో కంప్యూటర్ సంబంధిత పదాలు చాలా metaphoricalగా ఉంటాయి అన్నది నా
>>> అభిప్రాయం. restore పదానికి సరి అయిన వ్యుత్పత్తి (etymology?) తెలియదు
>>> కానీ, restore లాగానే, icon, client, server వంటి పదాలు యూరోప్ మధ్య యుగ
>>> చరిత్ర గాధల నుంచి వచ్చాయి. అలాగే, restore అన్న పదం కూడా "restoring a
>>> king
>>> to his throne" అన్న context నుంచి వచ్చిందని నాకు ఎప్పుడూ అనిపిస్తుంది. ఈ
>>> విధంగా చూస్తే, "నిలబెట్టు" కూడా సందర్భోచితంగా ఉందన్నది నా అభిప్రాయం.
>>>
>>> ఏది ఏమన్నా, మునుదెచ్చు అన్న పదము చాలా సబబుగా ఉందని అనిపిస్తోంది. తత్సమ
>>> సమాసాల కంటే దేశ్య పదాలకే ఈ మధ్య నేను ఎక్కువ మగ్గు చూపిస్తున్నాను. యాభై
>>> యేళ్శగా హిందీలో కేంద్ర అధికార భాషా సంఘం చేపట్టుతున్న
>>> సాహసకృత్యాల<http://www.outlookindia.com/article.aspx?279454>ను
>>> మనము తలపెట్ట కుండా ఉంటే మంచిది! :)
>>>
>>> అక్షయ్
>>>
>>> 2013/5/22 Pulikonda <psubb...@gmail.com>
>>>
>>>> రహమతుల్లా గారూ మంచి సూచనలే
>>>> తిరిగి కట్టు అంటే విడిన మూటను తిరిగి కట్టడం అనే అర్థం వస్తుంది. తిరగ
>>>> కట్టు కూడా ఆలాంటిదే. నిలబెట్టు అంటే పూర్తిగా భిన్నమైన అర్థం వస్తుంది
>>>> ఇది
>>>> ఇక్కడ అసలు కుదరదు. పడిపోయినదాన్ని లేదా చెడిపోయిన దాన్ని ఏదో చేసి
>>>> నిలబెట్టినట్లు అవుతుంది.
>>>> వీటన్నింటిలో ఎనకటికి తెచ్చు. అనేది బాగుంది. కాని కంప్యూటర్ వినియోగంలో
>>>> ఇది అన్ని సందర్భాలకు సరిపోదేమో.
>>>> ఇంకా కొన్ని తెలుగు పదబంధాలు చేయవచ్చు. ఉదాఛ
>>>>
>>>> మునుపటికితెచ్చు అనే అర్థంలో దీన్ని మునుదెచ్చు అని అనవచ్చు.
>>>> లేదా వెనుకటికి తెచ్చు అనే అర్థంలో దీన్ని వెనుదెచ్చు అని అనవచ్చు.
>>>> వెను దెచ్చు అంటే వెనుకటిగా ఉన్న స్థితికి పూర్తిగా తెచ్చు అని అర్థం బాగా
>>>> వస్తుంది.
>>>>
>>>> తెలుగు సమాసం వాడదలచుకుంటే వెనుదెచ్చు అనేది
>>>> తత్సమం వాడదలచుకుంటే యథాపూర్వీకరణం అనేది మరీ బాగుంటుంది.
>>>>
>>>> చర్చిద్దాం.
>>>> సుబ్బాచారి పులికొండ.
>>>>
>>>> 2013/5/21 n rahamthulla <nraham...@yahoo.com>
>>>>
>>>>>
>>>>> తిరిగి కట్టు,తిరగకట్టు.నిలబెట్టు,లేపు,ఎనకటికితెచ్చు,....లాంటి మాటలు
>>>>> నయం.వాడుతూ ఉంటే అవే స్థిరపడిపోతాయి.
>>>>> ------------------------------
>>>>> *From:* Pulikonda <psubb...@gmail.com>
>>>>> *To:* telug...@googlegroups.com
>>>>> *Sent:* Tuesday, May 21, 2013 8:38 PM
>>>>> *Subject:* Re: (తెలుగుపదం) Restoreకి తెలుగు పదం?
>>> Akshay *Regulagedda* | *రేగులగెడ్డ* అక్షయ్
>>> తెలుగుదేల యెన్న దేశంబు తెలుగేను.
>>> Microblog <http://metamutator.tumblr.com/> |
>>> సూక్ష్మబ్లాగు<http://metamutator.tumblr.com/>
>>>
>>> --
>>> You received this message because you are subscribed to the Google
>>> Groups
>>> "తెలుగుపదం" group.
>>> To unsubscribe from this group and stop receiving emails from it, send
>>> an
>>> email to telugupadam...@googlegroups.com.
>>> For more options, visit https://groups.google.com/groups/opt_out.
>>>
>>>
>>>
>> --
>> You received this message because you are subscribed to the Google Groups
>> "తెలుగుపదం" group.
>> To unsubscribe from this group and stop receiving emails from it, send an
>> email to telugupadam...@googlegroups.com.
>> For more options, visit https://groups.google.com/groups/opt_out.
>>
>>
>>
>
>
>
> --
> *అమ్మ నేర్పిన తీయని భాష తెలుగు.తెలుగు మాట్లాడడం మరచిన వాడు అమ్మని కుడా
> మరచినట్లే
> తెలుగు లో మాట్లడదాం.అమ్మ నేర్పిన కమ్మదనాన్ని ఆస్వాదిద్దాం.
>
> ..పవను..
> ...నేను
> 'తెలుగు' వాడిని...
> *
>
> --
> You received this message because you are subscribed to the Google Groups
> "తెలుగుపదం" group.
> To unsubscribe from this group and stop receiving emails from it, send an
> email to telugupadam...@googlegroups.com.
> For more options, visit https://groups.google.com/groups/opt_out.
>
>
>


--
Killamsetty VenkataRamana
mob 09937668415

Arun Gaddipati (అచంగ)

unread,
May 22, 2013, 4:21:09 AM5/22/13
to telug...@googlegroups.com
పులికొండ గారూ,
మునుదెచ్చు/మ్ము = undo
వెనుదెచ్చు/మ్ము = redo  అనే పదాలకు బావుంటాయని నా అభిప్రాయం. (ఇది ఆయా సంధర్భాలకు చక్కగా నప్పుతుంది, దేశ్యాలూనూ)

ఇట్లు,
అరుణ్ గడ్డిపాటి (అచంగ), యమ్మెస్సీ.,
ప్రెస్టన్, యునైటెడ్ కింగ్‌డమ్,
బ్లాగు (తెలుగు): కృష్ణవేణీతీరం.

Regards,
Arun Gaddipati (Achamga), MSc.,
Preston, United Kingdom,  
Blog (Telugu): Krishnaveniteeram.

Note: Information conveyed via this email may be confidential and strictly not to be used for any commercial purposes without consent. There is no guarantee that the files sent via this email if any are virus/malware free.


2013/5/22 K V Ramana <kvje...@gmail.com>

Vasu Valluri

unread,
May 22, 2013, 5:14:55 AM5/22/13
to telug...@googlegroups.com

యథతథం

devi దేవి

unread,
May 22, 2013, 11:10:17 AM5/22/13
to telug...@googlegroups.com
మును రూపం.
మునుపటి


22 మే 2013 2:44 PM న, Vasu Valluri <vallur...@gmail.com> ఇలా రాసారు :

Sunny D

unread,
May 22, 2013, 12:40:49 PM5/22/13
to telug...@googlegroups.com
యధాతధం (as it is) / యధాస్థితి (original state) / పూర్వస్థితి (previous state) 

సునీల్


2013/5/22 devi దేవి <devi...@gmail.com>

pavan mvs

unread,
May 26, 2013, 3:01:48 AM5/26/13
to telug...@googlegroups.com
అరుణ్ గడ్డిపాటి గారూ సూచించిన పదాలు వాడుకకు సరిపోతాయి అని అభిప్రాయం. ఇక్కడ మనం సూచించవలసినది అచ్చ తెలుగు పదాలే అన్న విషయం సభ్యులు మరువకూడదు.


2013/5/22 Arun Gaddipati (అచంగ) <mail2a...@gmail.com>

Kiran Kumar Chava

unread,
May 27, 2013, 12:01:19 AM5/27/13
to telug...@googlegroups.com
అచ్చ తెలుగు పదాలే చూపించాలన్న నియమేమీ లేదు, నాకు తెలిసినంత వరకూ....

2013/5/26 pavan mvs <sumapava...@gmail.com>



--
----
~Kiran Kumar Chava

K V Ramana

unread,
May 27, 2013, 3:10:01 AM5/27/13
to telugupadam
చేర్చేపదాలు భాషలో ఇమిడిపోయేట్టుగా ఉండాలి, సామాన్యుడికి భావం స్ఫురించాలి. అలాకాని ప్రయత్నం వృథా. అచ్చతెలుగుమాటలు కావాలనుకోవడం సుళువుగా బోధపడతాయనే. సంస్కృతంవైనా తెలుగువైనా తెలుగువాడికి పరిచితమైనవైతే మేలు. సంస్కృతపదాలైతే మిగతా భాషలవాళ్ళు వాడే పదాలను తీసుకోవడం వలన లాభం ఉంటుంది. అంతర్జాలం అన్నమాట (ప్రత్యయం వేరైనా) ఇప్పడందరినీ ఒప్పించే మాటయింది. కుదురుతున్నప్పుడు సంస్కృతాన్ని దూరం చెయ్యనక్కరలేదు. అలాని పిల్లికి మార్జాలమని అర్థం చెప్పకూడదు.


2013/5/27 Kiran Kumar Chava <chava...@gmail.com>
Reply all
Reply to author
Forward
0 new messages