నమస్కారం!

6 views
Skip to first unread message

భైరవభట్ల కామేశ్వర రావు

unread,
Sep 22, 2008, 9:32:57 AM9/22/08
to తెలుగుపదం
సభ్యులకి నమస్కారం. ఈ "తెలుగుపదం" సంకల్పాన్ని(initiative) గురించి ఈ
మధ్యనే తెలిసి, ఇందులో చేరాను.
తెలుగుపదం సైటులో ఇచ్చిన మార్గదర్శక సూత్రాలు చదివిన మీదట ఒక చిన్న
అనుమానం వచ్చింది. అందులో ఇచ్చిన రెండు సూత్రాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా
అనిపించాయి. ఆ రెండూ:
1. తెలుక్కి స్వాభావికమైన జాతీయాన్ని నుడికారాన్ని (idiom)
భ్రష్టుపట్టించకూడదు. తెలుగులో ఇమడని నిర్మాణాలు (structures)శీఘ్రంగా
పరమపదిస్తాయని మఱువరాదు.
2. మిశ్ర పద నిష్పాదన (hybrid coinage)ని ప్రోత్సహించాలి. అంటే, ఒక భాషకి
చెందిన ఉపసర్గల్నీ ప్రత్యయాల్నీ ఇంకో భాషకి చెందిన దేశి పదాలకి చేర్చి
కొత్త పదాలు పుట్టించడం. ఉదాహరణకి :- దురలవాటు. ఇందులో "దుర్" అనే ఉపసర్గ
సంస్కృతం. "అలవాటు" తేట తెలుగు పదం. ఇలాంటివే నిస్సిగ్గు, ప్రతివాడు, అతి
తిండి మొదలైనవి. ఇలాంటివి చాలా ఉన్నాయి కాని సరిపోవు. ఇవి వందలుగా వేలుగా
పెరగాలి.

నిజానికి ఉపసర్గ/ప్రత్యయాలు చేర్చి పదబంధాలనీ (సమాసాలనీ) సృష్టించడం
తెలుగుభాషకి స్వాభావికం కాదు. అయితే కొన్ని పదాలు వాడుకలోకి వచ్చి
ఇప్పుడు కృత్రిమంగా అనిపించకపోవచ్చు. ఉదాహరణకి "దురలవాటు", "నిస్సిగ్గు"
వాడుకలోకి వచ్చినా "చెడు(డ్డ) అలవాటు", "సిగ్గులేని" అన్నవి తెలుక్కి
సహజమైనవి.
అయితే, తెలుగులో క్లుప్తత తక్కువ.
అంచేత క్లుప్తతా, స్వాభావికతలలో ఏది ప్రధానం?
నా ఉద్దేశం ప్రకారం, స్వాభావికతకి ప్రాధాన్యం ఇవ్వాలి. తెలుగు ప్రయోగాలలో
(మరీ చేంతాడు వాక్యాలయితే తప్ప) కొద్దిగా ఎక్కువ అక్షరాలు(పదాలు) ఉన్నా,
వాటికే ప్రాధాన్యం ఇవ్వాలి. మరీ ముఖ్యంగా, తెలుగుభాషలో వాడుకలో ఉన్న
ప్రయోగాలని కొత్తగా క్లుప్తీకరించడానికి పూనుకోనవసరం లేదు. ఉదాహరణకి
"అందుబాటులోకి వస్తాయి" అన్నదానికి "అందుబాటిల్లుతాయి" అన్న కొత్తపదం
పెద్ద ప్రయోజనాన్ని చేకూర్చదని నా అభిప్రాయం.
కొత్తపదాలని సృష్టించేటప్పుడు కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తే మంచిదని నా
ఉద్దేశం.

సరే, నా అభిప్రాయాలతో పాటు ఒక ప్రశ్న:
"Version"కి తెలుగు పదం ఏవైనా ఉందా? ఇది Computer పరిభాషలోనే కాక,
ఇతరత్రా కూడా (ఉదాహరణకి "my version of the story") ఉపయోగించడానికి
అనువుగా ఉండాలి.

- కామేశ్వర రావు

Kiran Kumar Chava

unread,
Sep 22, 2008, 9:49:57 AM9/22/08
to telug...@googlegroups.com
I Love క్లుప్తత 

This is just my opinion.

If there క్లుప్తత  + rhythm + grammar that will be awesome. 

2008/9/22 భైరవభట్ల కామేశ్వర రావు <kame...@yahoo.com>



--
----
నెనర్లు,
కిరణ్ కుమార్ చావా
-ఒక అధ్యాయం ముగిసింది.

తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli

unread,
Sep 22, 2008, 10:08:18 AM9/22/08
to telug...@googlegroups.com
version = పాఠాంతరం

౨౦౦౮ సెప్టెంబర్ ౨౨ ౧౯:౧౯ న, Kiran Kumar Chava <chava...@gmail.com> ఇలా రాసారు :



--
నెనర్లు. (Thanks)

Yours Truly
T. Lalitha Bala Subrahmanyam

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org

Sirish Kumar Tummala

unread,
Sep 22, 2008, 10:08:56 AM9/22/08
to telug...@googlegroups.com
కూర్పు
- తుమ్మల శిరీష్ కుమార్
-----------
http://chaduvari.blogspot.com


2008/9/22 తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli <subtad...@gmail.com>

తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli

unread,
Sep 22, 2008, 10:10:31 AM9/22/08
to telug...@googlegroups.com
తెలుగు భాషకు స్వాభావికమైన నిర్మాణాలూ, మిశ్రపద నిష్పాదన - ఈ రెండూ పరస్పర విరుద్ధం కావు. మీరు కూడా పదాల్ని రూపొందించడంలోకి స్వయంగా దిగినప్పుడు మీకు ఇది అర్థమౌతుంది. మేము చెబితే అర్థం కాకపోవచ్చు.

౨౦౦౮ సెప్టెంబర్ ౨౨ ౧౯:౩౮ న, తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli <subtad...@gmail.com> ఇలా రాసారు :

భైరవభట్ల కామేశ్వర రావు

unread,
Sep 23, 2008, 2:05:41 PM9/23/08
to తెలుగుపదం
కూర్పు అంటే Edition కాదా?
పాఠాంతరం బాగానే ఉంది కాని అది అన్నిచోట్ల సరిపోతుందా అని అనుమానం.

రకరకాల అంశాల మీద ఇంగ్లీషు వ్యాసాలని తీసుకొని తెలుగులోకి అనువదించే
ప్రయత్నం చేస్తే, ఒకే పదం రక రకాల సందర్భాలలో సరిపోతుందా లేదా అన్నది
తెలుస్తుంది. ఎక్కువ తెలుగు పదాలు సృష్టించబడతాయి కూడా.
ఈ గుంపులో ఆసక్తి ఉన్నవాళ్ళొక ఎనిమిది మంది ఉన్నా, నెలకి రెండు వ్యాసాల
చొప్పున వంతులువారీగా చెయ్యవచ్చు. ఒకొక్కరూ నాలుగు నెలలకోసారి ఒక వ్యాసం
చేస్తే సరిపోతుంది. చేసిన అనువాదం గురించి ఇక్కడ చర్చించి, అవసరమనుకుంటే
ఏవైనా మార్పులు చెయ్యవచ్చు.
ఏమంటారు?

- కామేశ్వర రావు

On Sep 22, 7:08 pm, "Sirish Kumar Tummala" <sirishtumm...@gmail.com>
wrote:
> కూర్పు
> - తుమ్మల శిరీష్ కుమార్
> -----------http://chaduvari.blogspot.com
>
> 2008/9/22 తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli <
> subtadepa...@gmail.com>
>
>
>
> > version = పాఠాంతరం
>
> > ౨౦౦౮ సెప్టెంబర్ ౨౨ ౧౯:౧౯ న, Kiran Kumar Chava <chavaki...@gmail.com> ఇలా
> > రాసారు :
>
> > I Love క్లుప్తత
>
> >> This is just my opinion.
>
> >> If there క్లుప్తత  + rhythm + grammar that will be awesome.
>
> >> 2008/9/22 భైరవభట్ల కామేశ్వర రావు <kames...@yahoo.com>
> > writing in Telugu, usehttp://lekhini.org- Hide quoted text -
>
> - Show quoted text -

తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli

unread,
Sep 23, 2008, 10:10:14 PM9/23/08
to telug...@googlegroups.com
"పాఠాంతరం బాగానే ఉంది కాని అది అన్నిచోట్ల సరిపోతుందా అని అనుమానం."
ఏం చేస్తాం ? సరిపెట్టుకోవాలి.
భాష అంటే అలవాటు (Language is a matter of habit). కనుక అలవాటు చేసుకోవాలి. అంతే ! పెట్రోల్ కి చమురు అంటున్నట్లు . "నాన్య: పన్థా విద్యతేయనాయ"

నా బ్లాగులో రాసే వ్యాసాల్లో నేను వాడుతున్న కొత్త తెలుగు పదాలూ, వాటి పక్కనే బ్రాకెట్లలో సమానార్థకాలైన ఇంగ్లీషు పదాలూ ఇస్తూనే ఉన్నాను.

౨౦౦౮ సెప్టెంబర్ ౨౩ ౨౩:౩౫ న, భైరవభట్ల కామేశ్వర రావు <kame...@yahoo.com> ఇలా రాసారు :

S P

unread,
Sep 27, 2008, 11:16:35 AM9/27/08
to telug...@googlegroups.com
దశ - for - version 2.0 type of occassion
భాష్యం - for - both versions of the same story - type of occassions
అనువాదం - for - telugu version - type of occassions

ఇంకా అనువర్తన క్రమం, పరిణామ క్రమం  లాంటివి తోస్తున్నాయి.

తెలుగు లో వివిధ సందర్భాల్లో వివిధ అర్ధాల్లో వాడడానికి వేరు వేరు పదాలున్నప్పుడు అన్నిటికీ ఒకే పదం కనిపెట్టడం తెలుగును ఇంగ్లీష్ అనువాద భాషగా మాత్రమే మార్చడం లాంటిదని నా అభిప్రాయం.  అలా చెయ్యడం తెలుగు భాష యొక్క richness(?) ని తగ్గిస్తుందేమోనని నా అనుమానం.

కందర్ప కృష్ణ మోహన్

unread,
Sep 29, 2008, 3:17:40 PM9/29/08
to telug...@googlegroups.com
గుంపులో విలువైన దారాల్లో ఒకటి...
 
నెనర్లు
--
కృష్ణ మోహన్ కందర్ప
భాగ్యనగరము
http://telugutheepi.blogspot.com/
http://manikyaveena.blogspot.com/
http://idikathakadu.blogspot.com/
http://abhagyanagaram.blogspot.com/

tel.kala

unread,
Oct 2, 2008, 11:37:22 PM10/2/08
to తెలుగుపదం
నాకు తెలిసినంతవరకు కూర్పు అంటే ఎంగ్లిష్ లో కంపోజ్ అనిపిస్తుంది.
ఎడిషన్లో కూర్పుతో పాటు మార్పు చేర్పులు కూడా చేస్తారు కదా.ఓసారి పునహ్
పరిశీలిస్తారని ఆశిస్తున్నాను.
On Sep 23, 11:05 pm, భైరవభట్ల కామేశ్వర రావు <kames...@yahoo.com>
wrote:
> > > writing in Telugu, usehttp://lekhini.org-Hide quoted text -
>
> > - Show quoted text -- Hide quoted text -

Ki NaCha

unread,
Oct 3, 2008, 1:43:39 AM10/3/08
to telug...@googlegroups.com
కూర్పు అంటే editing అన్న అర్థం వాడుకలో (చలనచిత్రరంగంలో) ఇప్పటికే ఉంది. కనుక,
ఆ మాటని compose అన్న దానికే పరిమితం చెయ్యనక్కరలేదని నా అభిప్రాయం. నిజానికి
చలనచిత్రాల పరంగా editing అంటే కూడా దృశ్యాలని ఒక వరుసలో (sequenceలో) కూర్చటమే
కదా. కూర్పరి అంటే editor అన్న అర్థం కూడా వాడుకలో ఉన్నదే.

నచకి
పి.యస్.: కామేశ్వరరావు గారికి స్వాగతం! ఎలా ఉన్నారు?
P.S. to P.S.: post-signature scriptని తెలుగులో "సంతకానంతర వ్యాఖ్య (స.వ్యా.)"
అనవచ్చా? వ్యాకరణపరమైన దోషమేమీ లేదు కదా?

--------------------------------------------------
From: "tel.kala" <kala.p...@gmail.com>
Sent: Friday, October 03, 2008 09:07
To: "తెలుగుపదం" <telug...@googlegroups.com>
Subject: [తెలుగుపదం] Re: నమస్కారం!

Sirish Kumar Tummala

unread,
Oct 3, 2008, 2:53:45 AM10/3/08
to telug...@googlegroups.com
తాజా కలం అని ఒక వాడుక ఉంది కదా! అది ఈ అర్థంలో కాదా వాడేది?

- తుమ్మల శిరీష్ కుమార్
-----------
http://chaduvari.blogspot.com


2008/10/3 Ki NaCha <email4...@gmail.com>

తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli

unread,
Oct 3, 2008, 4:53:58 AM10/3/08
to telug...@googlegroups.com
P.S (Post script) కి తాజా కలం అనుకుంటా. ఇప్పుడీ రెండింటినీ ఎవరూ వాడుతున్నట్లు లేదు. పాతికేళ్ళ క్రితం పాత కథల్లోను, నవలల్లోను కనిపించేవి ఈ వాడుకలు

౨౦౦౮ అక్టోబర్ ౩ ౧౨:౨౩ న, Sirish Kumar Tummala <sirish...@gmail.com> ఇలా రాసారు :

net...@gmail.com

unread,
Oct 3, 2008, 7:31:19 AM10/3/08
to తెలుగుపదం
కలాలు వాడితే తాజా కలం ఉంటుంది. మీరు మరీను, మీకు తెలియదా, వాడేవారని,
మళ్ళీ "ట" ఎందుకట?
:)


On Oct 3, 1:53 pm, "తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli"
<subtadepa...@gmail.com> wrote:
> P.S (Post script) కి తాజా కలం అనుకుంటా. ఇప్పుడీ రెండింటినీ ఎవరూ
> వాడుతున్నట్లు లేదు. పాతికేళ్ళ క్రితం పాత కథల్లోను, నవలల్లోను కనిపించేవి ఈ
> వాడుకలు
>
> ౨౦౦౮ అక్టోబర్ ౩ ౧౨:౨౩ న, Sirish Kumar Tummala <sirishtumm...@gmail.com> ఇలా
> రాసారు :
>
> > తాజా కలం అని ఒక వాడుక ఉంది కదా! అది ఈ అర్థంలో కాదా వాడేది?
> > - తుమ్మల శిరీష్ కుమార్
> > -----------
> >http://chaduvari.blogspot.com
>
> > 2008/10/3 Ki NaCha <email4gro...@gmail.com>
>
> > కూర్పు అంటే editing అన్న అర్థం వాడుకలో (చలనచిత్రరంగంలో) ఇప్పటికే ఉంది.
> >> కనుక,
> >> ఆ మాటని compose అన్న దానికే పరిమితం చెయ్యనక్కరలేదని నా అభిప్రాయం. నిజానికి
> >> చలనచిత్రాల పరంగా editing అంటే కూడా దృశ్యాలని ఒక వరుసలో (sequenceలో)
> >> కూర్చటమే
> >> కదా. కూర్పరి అంటే editor అన్న అర్థం కూడా వాడుకలో ఉన్నదే.
>
> >> నచకి
> >> పి.యస్.: కామేశ్వరరావు గారికి స్వాగతం! ఎలా ఉన్నారు?
> >> P.S. to P.S.: post-signature scriptని తెలుగులో "సంతకానంతర వ్యాఖ్య
> >> (స.వ్యా.)"
> >> అనవచ్చా? వ్యాకరణపరమైన దోషమేమీ లేదు కదా?
>
> >> --------------------------------------------------
> >> From: "tel.kala" <kala.padm...@gmail.com>
> ...
>
> read more »
Reply all
Reply to author
Forward
0 new messages