Currency ని తెలుగులో ఏమందాం

2 views
Skip to first unread message

చక్రవర్తి

unread,
Dec 7, 2009, 3:22:57 AM12/7/09
to తెలుగుపదం
నమస్కారం,

Currency ని తెలుగులో ఏమంటారో నాకు తోచటం లేదు, కొంచం సహాయం చెయ్యగలరు.

డబ్బు అందామా అంటే అది Money అవుతుంది.. మరి ఈ కరన్సీ ని ఏమనలో అర్దం
కావటం లేదు. సహాయం చెయ్యగలరు

చదివినందులకు నెనరులు

Kiran Kumar Chava

unread,
Dec 7, 2009, 3:23:52 AM12/7/09
to telug...@googlegroups.com
నగదు

----
నెనర్లు,
కిరణ్ కుమార్ చావా
http://te.chavakiran.com/blog
http://en.chavakiran.com/blog
http://abbigaadu.com
http://tolireyi.com




2009/12/7 చక్రవర్తి <var...@gmail.com>

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Dec 7, 2009, 3:42:04 AM12/7/09
to telug...@googlegroups.com
నేను చాలాకాలం నుంచి నాణెకం అని వాడుతున్నాను.

నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org

Sirish Kumar Tummala

unread,
Dec 7, 2009, 4:03:05 AM12/7/09
to telug...@googlegroups.com
ద్రవ్యం?
- తుమ్మల శిరీష్ కుమార్
-----------
నా బ్లాగు: http://chaduvari.blogspot.com
బ్లాగులన్నీ: http://koodali.org, http://jalleda.com


2009/12/7 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Dec 7, 2009, 4:08:19 AM12/7/09
to telug...@googlegroups.com
పూజాద్రవ్యాలూ, రసాయన ద్రవ్యాలూ, సుగంధద్రవ్యాలూ అన్నీ ద్రవ్యాలే కదా ? ఏదైనా విలక్షణశబ్దం (unique word) అవసరమవుతుంది.

నాణెకం బాలేదంటారా ? దీన్ని నాణెం నుంచి నిష్పాదించాను.

narayana sarma

unread,
Dec 7, 2009, 6:02:21 AM12/7/09
to telug...@googlegroups.com
రొక్కం?

2009/12/7 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>:

--
తెలుగులో అన్నీ నేర్చుకోవచ్చు... ఇంగ్లీషుకూడా!

Veeven (వీవెన్)

unread,
Dec 7, 2009, 6:15:48 AM12/7/09
to telug...@googlegroups.com
నగదు మరియు రొక్కం అన్నవి క్యాష్ అన్న పదానికి సమానార్థకాలుగా ఉన్నాయి.

తెలుగు మాధ్యమంలో వాణిజ్య మరియు అర్థ శాస్త్రాలు చదివిన వారికి కరెన్సీకి ప్రత్యామ్నాయంగా "ద్రవ్యం" లేదా "మారక ద్రవ్యం" అన్నవి పరిచయమే.
 
తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>:
నేను చాలాకాలం నుంచి నాణెకం అని వాడుతున్నాను. నాణెకం బాలేదంటారా ? దీన్ని నాణెం నుంచి నిష్పాదించాను.

నాణెకం బాగుంది.

--
Read Telugu blogs @ koodali.org

Aasish Pappu

unread,
Dec 7, 2009, 8:00:21 AM12/7/09
to telug...@googlegroups.com
నాణెకం బాలేదు. పైసా/ పైసలు.. జనానికి తెలిసిన పదాలు.

7 డిసెంబర్ 2009 6:15 am న, Veeven (వీవెన్) <vee...@gmail.com> ఇలా రాసారు :



--
Aasish Kumar Pappu


తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Dec 7, 2009, 12:11:15 PM12/7/09
to telug...@googlegroups.com
వ్యక్తిగతంగా నాకు నాణెకం నచ్చింది. నా రచనల్లో దాని వాడకాన్ని యథాపూర్వంగా కొనసాగిస్తున్నాను. నాకు తెలిసి నాణెకానికి సరైన, ఆమోదయోగ్యమైన ప్రత్యామ్నాయ వాడుకలూ, పదాలూ లేవు.

ranganath middela

unread,
Dec 8, 2009, 9:04:12 AM12/8/09
to telug...@googlegroups.com
కరెన్సీ అన్న పదానికి ద్రవ్యం అనేది సమానార్ధం 
2009/12/7 చక్రవర్తి <var...@gmail.com>
నమస్కారం,

kv ramana

unread,
Dec 8, 2009, 9:32:28 AM12/8/09
to telug...@googlegroups.com
కరెన్సీ అర్థం చలామణి కాదా?

2009/12/8 ranganath middela <ranga...@gmail.com>

padma kala

unread,
Dec 8, 2009, 12:44:49 PM12/8/09
to telug...@googlegroups.com
చలామణీ అనే పదం ఆంగ్ల భాషలో rotation  అనే పదానికి సరిసమానము కదా !

8 డిసెంబర్ 2009 8:02 pm న, kv ramana <kvje...@gmail.com> ఇలా రాసారు :

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Dec 8, 2009, 12:48:45 PM12/8/09
to telug...@googlegroups.com
చెలామణి - circulation

padma kala

unread,
Dec 8, 2009, 12:49:09 PM12/8/09
to telug...@googlegroups.com
కానీ నా అభిప్రాయంలో కరెంట్ అన్న ప్రాతిపదిక పై కరెన్సీ ఏర్పడి ఉండవచ్చు. దీన్ని బట్టి చేతులు మారే స్వభావం కలది, వాడుకలో ఉన్నది, కదలిక లేక మార్పిడి లక్షణం , చలనం గల స్వభావం కల మారక సాధనం లెదా ద్రవ్యం.
ఈవిషయాన్ని దృష్టి లో ఉంచుకుని పదాన్ని నిర్ణయించవలసిందిగా విఙ్ఞులకు మనవి.
నమస్కారములతో
తెలుగుకళ
పద్మకళ

8 డిసెంబర్ 2009 11:14 pm న, padma kala <kala.p...@gmail.com> ఇలా రాసారు :

padma kala

unread,
Dec 8, 2009, 12:54:25 PM12/8/09
to telug...@googlegroups.com
rotation
circulation
వ్యాప్తి
వాడుక
చెలామణి
విస్తరణ


కొంచెం confusion గా ఉంది.

ఎందుకంటే
లక్ష circulation  మా పెపర్ కి అంటే
లక్ష చెలామణీ కాదు కదా
వాడుకో వినియోగమో, లేదా విస్తరణో అయ్యుండాలి కదా
దయ ఉంచి నా సందేహానివృత్తి చేయవలసిందిగా మనవి



8 డిసెంబర్ 2009 11:18 pm న, తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com> ఇలా రాసారు :

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Dec 8, 2009, 1:22:41 PM12/8/09
to telug...@googlegroups.com
అలా మాట్లాడ్డం వాడుకలో లేదు కనుక అలా అనిపిస్తుంది. ఎందుకంటే సర్కులేషన్ కి మనం తెలుగు పదమేదీ వాడ్డం లేదు. సర్కులేషన్ అని యథాతథంగా ఆంగ్లపదమే వాడుతున్నాం, ఇప్పటివఱకు.

డబ్బుకి సంబంధించినంత వఱకు సర్కులేషన్ కి చెలామణి సరైన పదమే. అయితే ఒక భాషలో ఒక పదాన్ని ఎన్ని సందర్భాలో/ అర్థాల్లో వాడతారో వేఱే భాషలో దాని సమానార్థక పదాన్ని సరిగ్గా అవే సందర్భాల్లో/ అర్థాల్లో వాడ్డం జఱగదు. పదవాడుకల పద్ధతి భాషభాషకీ భేదిస్తుంది.

kv ramana

unread,
Dec 11, 2009, 8:35:40 AM12/11/09
to telug...@googlegroups.com
ఏ పదానికి సరిగ్గా మరోటి పర్యాయపదం కాలేదు. కరెన్సీ అంటే ఒక దేశం చలామణిలో ఉన్న డబ్బు. సరిపోయే పదం సృష్టించి దాన్ని వాడుకలోకి తేవడం కష్టం. సర్క్యులేషన్ లాగ కరెన్సీ కూడా వాడవలసి వస్తోంది. అలాగే యూనిట్ కూడా.  
వార్తా పత్రికలు ఇలాంటి సేవ చేస్తుండేవి. ఇప్పుడవి తెలుగు పదజాలం పెరగడానికి ఏమీ కృషి చేయడం లేదు. 
2009/12/8 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>
--~--~---------~--~----~------------~-------~--~----~
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.

 * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
 * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
 * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి
-~----------~----~----~----~------~----~------~--~---


తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Dec 11, 2009, 8:44:44 AM12/11/09
to telug...@googlegroups.com
కొత్తపదాలు వాడుకలోకి వెంటనే వచ్చేయాలని తొందఱపడకూడదు. ఏ పదాలైనా ప్రాచుర్యం పొందడానికి కనీసం ఒక తరం (25 - 30 సంవత్సరాలు) తీసుకుంటుంది.Unit కి నా రచనల్లో మానకం అని వాడుకుంటున్నాను.

ఈ సందర్భంగా నేనొక కవితాపాదం రాసుకున్నాను.

"దివిలో వివాహాల కిలలో వధూవరులు
కవిలోని భావాలకుంటారు చదువరులు."

అలాగే పదాలకీ ఉంటారు. సాధారణంగా సమకాలీనులకి జనం విలువివ్వడం అఱుదు. వారి పదాలక్కూడా ! వందమందిలో ఎనభైమందికి నచ్చకపోయినా ఆ మిగిలిన ఇఱవైమంది చాలు. వారి వల్లనే మన కొత్త పదాలు ప్రచారంలోకి వస్తాయి. 

kv ramana

unread,
Dec 11, 2009, 9:29:17 AM12/11/09
to telug...@googlegroups.com
కవిత బావుంది

2009/12/11 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>
--

Chandu

unread,
Dec 11, 2009, 12:05:50 PM12/11/09
to తెలుగుపదం
Unit కు తెలుగులో ’ప్రమాణం’ అన్న పదం వాడుకలో ఉంది. మేం చదువుకున్నప్పుడు
భౌతిక శాస్త్ర్రంలో ’ప్రమాణాలు - మితులు’ అన్న పాఠం ఉండేది. Units and
Dimensions అన్నమాట.

భవదీయుడు,
చంద్ర మోహన్

On Dec 11, 6:44 pm, తాడేపల్లి T.L. Bala Subrahmanyam

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Dec 11, 2009, 12:12:53 PM12/11/09
to telug...@googlegroups.com
Unit కి ప్రమాణం అని వాడారని తెలుసు. కానీ దాన్ని మఱీ ఎక్కువ అర్థాలలో వాడడం వల్ల అయోమయం ఏర్పడుతోందని గమనించి దాని వ్యుత్పత్తి నుంచే వేఱే పదరూపాన్ని నిష్పాదించాను.

kv ramana

unread,
Dec 13, 2009, 9:20:36 AM12/13/09
to telug...@googlegroups.com
ఒకట్లు, పదులు, వందలు స్థానాల్లో ఒకట్లకు యూనిట్స్ అంటారు - ఒకట్లకి మిగతా సందర్భాల్ల్లో యూనిట్కి  ఒరియాలో ఎకక శబ్దాన్ని వాడుతున్నారు. ఏకకం అనడం మనకు కుదురుతుందా?  విద్యుత్తు వినియోగంలో యూనిట్ల లెక్క ఉంది.  industrial units ని ఏమనాలి?  

2009/12/11 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>
--

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Dec 13, 2009, 10:30:08 AM12/13/09
to telug...@googlegroups.com
ఏకకం వాస్తవ తెలుగు ఉచ్చారణలో ఏక్కం అని అపభ్రంశం పాలయ్యే అవకాశం ఉంది. ఒరియాలో వాడుతున్నారంటే వాళ్ళు దాన్ని ఏకక్ అని పలుకుతారు కనుక సమస్య లేదు. లేకపోతే ఏకాంగం అనొచ్చు.

industrial units - ఇలాంటివాటిని సందర్భానుగుణంగా అనువదించుకోవాల్సి ఉంటుంది.
పారిశ్రామిక ఏకాంగం.

kv ramana

unread,
Dec 14, 2009, 8:49:27 AM12/14/09
to telug...@googlegroups.com
industrial units - పారిశ్రామిక ఏకాంగం. బావుంది.

2009/12/13 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>
--

sudhakar valluri

unread,
Dec 14, 2009, 9:06:43 AM12/14/09
to telug...@googlegroups.com
industrial units - బహువచనము కదా!  మరి,  పారిశ్రామిక ఏకాంగం  ?.

2009/12/14 kv ramana <kvje...@gmail.com>

industrial units - పారిశ్రామిక ఏకాంగం. బావుంది.

2009/12/13 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>
ఏకకం వాస్తవ తెలుగు ఉచ్చారణలో ఏక్కం అని అపభ్రంశం పాలయ్యే అవకాశం ఉంది. ఒరియాలో వాడుతున్నారంటే వాళ్ళు దాన్ని ఏకక్ అని పలుకుతారు కనుక సమస్య లేదు. లేకపోతే ఏకాంగం అనొచ్చు.

industrial units - ఇలాంటివాటిని సందర్భానుగుణంగా అనువదించుకోవాల్సి ఉంటుంది.
పారిశ్రామిక ఏకాంగం.

నెనర్లు. (Thanks)
Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com
ఇట్లు భవదీయుడు
తాడేపల్లి

--
అభినందనలతో..
వల్లూరి సుధాకర్

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Dec 14, 2009, 9:10:51 AM12/14/09
to telug...@googlegroups.com
Industrial units = పారిశ్రామిక ఏకాంగాలు అనుకోవచ్చు.
నేనింతకుముందు సరిగా అనువదించలేదు.
ప్రమాదో ధీమతామపి. :)



నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



kv ramana

unread,
Dec 14, 2009, 9:21:29 AM12/14/09
to telug...@googlegroups.com

  పారిశ్రామిక ఏకాంగాలు అవుతుంది. 
2009/12/14 sudhakar valluri <vsk...@gmail.com>
Reply all
Reply to author
Forward
0 new messages