opacityకి తెలుగు పదం?

1 view
Skip to first unread message

Veeven (వీవెన్)

unread,
Nov 3, 2009, 2:47:22 AM11/3/09
to తెలుగుపదం
ఓపాసిటీ అంటే ఒక పదార్ధం యొక్క కాంతినిరోధకత. అంటే పారదర్శకతకి వ్యతిరేకం.

ఏమైనా ఉంటే తెలియజేయండి.

నెనర్లు,
వీవెన్.

--
Read Telugu blogs @ koodali.org

n rahamthulla

unread,
Nov 3, 2009, 4:06:39 AM11/3/09
to telug...@googlegroups.com
మసకబారటం,మందంకావటం,చత్వారం

--- On Tue, 11/3/09, Veeven (వీవెన్) <vee...@gmail.com> wrote:

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Nov 3, 2009, 4:09:45 AM11/3/09
to telug...@googlegroups.com
దీనికి పాతపుస్తకాల్లో కిరణాభేద్యత అని వాడారు. అది ఈ కాలంలో మఱీ పొడవనిపిస్తుంది. దీనికొక మార్గముంది. సంస్కృతంలో నామవాచకాల (nouns) ని క్రియాపదాలుగా మార్చుకునే వెసులుబాటు ఉంది. దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు.

ఉదాహరణకి -
రథః అంటే తేరు
రథ్యా అంటే తేరులు ప్రయాణించగల మార్గం (motorable road).

అలాగే
కిరణం - వెలుగు
కిరణ్యం - వెలుగు ప్రయాణించగల సాధనం/ పదార్థం/ యానకం (medium)
అకిరణ్యం - వెలుగు ప్రయాణించలేనిది opaque
అకిరణ్యత - opacity అనుకుంటున్నాను.

పరీశీలించగలరు.


నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org

RK Kuppala

unread,
Nov 3, 2009, 8:30:09 AM11/3/09
to telug...@googlegroups.com
అకిరణ్యత చాలా బాగుంది!

2009/11/3 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>
Reply all
Reply to author
Forward
0 new messages