కంఠసర్పి

534 views
Skip to first unread message

TVBHASCAR

unread,
Sep 25, 2011, 5:52:21 AM9/25/11
to తెలుగుపదం
డిఫ్తీరియా కి తెలుగు కంఠసర్పి ------------- ఈనాడు వారి కొత్త పదం...

Kiran Kumar Chava

unread,
Sep 25, 2011, 10:35:57 PM9/25/11
to telug...@googlegroups.com
బాగుంది.

ఏమన్నా పాత పదాలు వాడుకలో ఉన్నాయా , ఆయుర్వేదంలోగాని, తెలుగు మీడియం పుస్తకాల్లో గాని ?


2011/9/25 TVBHASCAR <tvbh...@gmail.com>
డిఫ్తీరియా కి తెలుగు   కంఠసర్పి ------------- ఈనాడు వారి కొత్త పదం...

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.

 * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
 * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
 * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి



--
----
~Kiran Kumar Chava

రమణా రావు ముద్దు

unread,
Sep 26, 2011, 12:28:11 AM9/26/11
to telug...@googlegroups.com
ఉఇన్నాయండీ ,ఉదాహరణకి-మశూచి
==smallpox.విషూచి=లిష్typhoid,కుష్ఠు=leprosy ఇంకా చాలా
ఉన్నాయి.కావాలంటే నేను రచించిన ఇంగ్లిష్-తెలుగు వైద్యనిఘంటువు (
english-telugu medical dictionary,published by PARASmedicalbook
publishers)చూడండి .అందులో ఇంగ్లీషు మెడికల్ పదాలు చాలావాటికి తెలుగు
అర్థం,పదాలు దొరకుతాయి. DR .M.V.RAMANARAO.M.S.D.O.

2011/9/26 Kiran Kumar Chava <chava...@gmail.com>:

Kiran Kumar Chava

unread,
Sep 26, 2011, 1:02:39 AM9/26/11
to telug...@googlegroups.com
నా ప్రశ్న ఈ డిఫ్తీరియాకు తెలుగు పదాలు గతంలో ఏమన్నా వాడారా అని.



2011/9/26 రమణా రావు ముద్దు <ramanar...@gmail.com>

narayana sarma

unread,
Sep 26, 2011, 9:11:34 AM9/26/11
to telug...@googlegroups.com
కోరింతదగ్గు?
తెలుగులో అన్నీ నేర్చుకోవచ్చు... ఇంగ్లీషుకూడా!

kv ramana

unread,
Sep 26, 2011, 11:23:55 PM9/26/11
to telug...@googlegroups.com
కంఠసర్పి అనకూడదు, గొంతుసర్పి అనొచ్చు - కంఠం సంస్కృత పదం, సర్పి తెలుగు పదం. దేశజం ముందు  తత్సమ విశేషణం చేర్చడం బాగోదు.
డిఫ్తీరియాకు కంఠవాతం, కంఠరోహిణి అంటారని ఒక వైద్య నిఘంటువులో ఉంది -
Neelkamal Encyclopedic Medical Dictionary (English-Telugu) - Prof Dr O A Sarma
2011/9/26 narayana sarma <saman...@gmail.com>

కోరింతదగ్గు వేరు - ఇంగ్లీషులో ఏమంటారో - ఊఫింగ్ కాఫ్ లాంటిదేదో ఉంది.

--   కిల్లంసెట్టి వెంకటరమణ

రమణా రావు ముద్దు

unread,
Sep 27, 2011, 4:04:49 AM9/27/11
to telug...@googlegroups.com
నా జవాబు1.diphtheriaకి కంఠసర్పి అని ముందు నుంచీ వాడుక లో
ఉన్నదే.కంఠవాతం అని కూడ ఉన్నది.వ్యాకరణం మాత్రమే కాదుకదా. లొకవ్యవహారం
కూడా తీసుకోవాలి.2.కోరింత దగ్గు అంటే perTussis or whooping cough ఈ
రెంటికీ ధనుర్వాతంకీ (tetanus) కీ కలిపి నివారణ కోసం DPT VACCINEఇంజక్షన్
పిల్లలకు ఇస్తారు.దీనితోబాటు పొలియో చుక్కలు కూడా వేస్తారు.
Dr.M,V.Ramanarao

2011/9/27 kv ramana <kvje...@gmail.com>:

ముక్కు శ్రీరాఘవకిరణ్ శర్మ

unread,
Sep 27, 2011, 12:41:39 PM9/27/11
to telug...@googlegroups.com
సర్పి సంస్కృతమే అనుకుంటానండీ. కంఠసర్పి అనటంలో దోషం లేదని నా అనుకోలు.

నమస్సులతో
రాఘవుడు

kv ramana

unread,
Sep 27, 2011, 11:13:40 PM9/27/11
to telug...@googlegroups.com
నిజమే.  లోకవ్యవహరంలో తీసుకోవడం అవసరం. ముద్దు గారి ఇచ్చిన సమాచారంకి నెనర్లు.

శర్మ గారు, సర్పి అన్న సంస్కృత పదానికి గల అర్థం వేరు. ఈ సందర్భంలో వచ్చిన సర్పి తెలుగు మాట.

NaChaKi (Kiran Chakravarthula)

unread,
Sep 28, 2011, 12:28:21 AM9/28/11
to telug...@googlegroups.com

http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?query=sarpi&table=brown  -> బ్రౌణ్యం ప్రకారం "సర్పి" సంస్కృతమే! (అచ్చతెలుగులో సంయుక్తాక్షరాలున్న పదాలు చాలా తక్కువ. వాడుకలో కూర్చు, తీర్చు, మార్చు లాంటివి ఉన్నాయి కానీ అవి అచ్చంగా సంయుక్తాక్షరపదాలు కాదు.)

నచకి

రమణా రావు ముద్దు

unread,
Sep 27, 2011, 10:10:44 PM9/27/11
to telug...@googlegroups.com
రాఘవుడుగారూ.సర్పి శబ్దరత్నాకరంలోలేదు.కాని,నేననేది,ఆపదం,అచ్చతెనుగు ఐనా
సంస్కృతం ఐనా లోకవ్యవహారంలోఉన్నదాన్ని స్వీకరించవచ్చును.నమస్తే.రమణారావు
రాఘవుడుగారూ.సర్పి శబ్దరత్నాకరంలోలేదు.కాని,నేననేది,ఆపదం,అచ్చతెనుగు ఐనా
సంస్కృతం ఐనా లోకవ్యవహారంలోఉన్నదాన్ని స్వీకరించవచ్చును.నమస్తే.రమణారావు

2011/9/27 ముక్కు శ్రీరాఘవకిరణ్ శర్మ <msrk...@gmail.com>:


> సర్పి సంస్కృతమే అనుకుంటానండీ. కంఠసర్పి అనటంలో దోషం లేదని నా అనుకోలు.
> నమస్సులతో
> రాఘవుడు
>

ANANDASWARUP GADDE

unread,
Sep 28, 2011, 2:23:17 AM9/28/11
to telug...@googlegroups.com
2011/9/28 రమణా రావు ముద్దు <ramanar...@gmail.com>:

>  రాఘవుడుగారూ.సర్పి శబ్దరత్నాకరంలోలేదు.కాని,నేననేది,ఆపదం,అచ్చతెనుగు ఐనా
> సంస్కృతం ఐనా లోకవ్యవహారంలోఉన్నదాన్ని స్వీకరించవచ్చును.నమస్తే.రమణారావు

From http://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B0%BF
"సర్పి (Herpes) ఒక రకమైన వైరల్ వ్యాధి. ఇది హెర్పిస్ సింప్లెక్స్
(Herpes simplex) వైరస్ మూలంగా సంక్రమిస్తుంది."
From Sankaranarayana dictionary:
Diphtheria :అంటురోగమువల్ల కలిగే అంగుడువాపు.
చాలా చోట్ల సర్పి అంటే హెర్ప్స్ (hepes) అనే ఉంది
diphtheria కి ఇంతకంటే ఏమీ కనపడలేదు

ANANDASWARUP GADDE

unread,
Sep 28, 2011, 2:37:48 AM9/28/11
to telug...@googlegroups.com
2011/9/28 ANANDASWARUP GADDE <ananda...@gmail.com>:

> చాలా చోట్ల సర్పి అంటే హెర్ప్స్ (hepes) అనే ఉంది
> diphtheria కి ఇంతకంటే ఏమీ కనపడలేదు
>

OOPS: see http://te.wiktionary.org/wiki/%E0%B0%95%E0%B0%82%E0%B0%A0%E0%B0%B8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B0%BF
కంఠసర్పి ఇంగ్లీషు: diphtheria

kv ramana

unread,
Sep 28, 2011, 9:41:13 PM9/28/11
to telug...@googlegroups.com
నచకి గారు,
లోకవ్యవహారంలో ఉన్నదాన్ని నేనూ కాదనను.
సర్పి కూడా అచ్చంగా సంయుక్తాక్షరాలు గలది అనుకోవడం ఎలా? కూర్పు తీర్పు మార్పుల లాగే సర్పి కూడా మారి ఉండదా? 
సర్పి రోగలక్షణంగా సంస్కృతంలో కనపడదు. బ్రౌణ్యం నేను చూళ్ళేదు. తత్సమం అనడం పొరబాటే అయ్యుండాలి.

-  కిల్లంసెట్టి వెంకటరమణ

రాజేంద్రకుమార్ దేవరపల్లి

unread,
Sep 30, 2011, 11:46:00 PM9/30/11
to తెలుగుపదం
కంఠసర్పి వ్యాధి గురించి తాజా ప్రస్తావన
http://sakshi.com/main/FullStory.aspx?catid=241268&Categoryid=3&subcatid=17

Pulikonda

unread,
Oct 2, 2011, 11:33:06 PM10/2/11
to telug...@googlegroups.com
కంఠ సర్పి గురించి చాలా మంది పొరబడుతున్నారు. ఇది డిఫ్తీరియాకు సమానం కాదు. 
సర్పి అంటే చర్మం మీద వచ్చే చర్మసంబంధ వ్యాధి ఇది కంఠం  మీదే కాక వీపు మీద కూడా రావచ్చు. దీనికి కూడా ఆయుర్వేదంలో మంచి మందు ఉంది. 
నాకు చిన్న తనంలో పొట్ట మీద సర్పి వచ్చింది. ఇది దద్దులు దద్దులుగా ఉంటుంది ఎర్రగా ఉంటుంది. దీనికి అప్పుడు ఆకుపసరులు వాడి నయం చేసారు. ఇక డిఫ్తీరియా అంటే కంఠంలోపల వచ్చే వ్యాధి. 
ఇది వాపులాగానూ ఉండి శ్వాస ఆగిపోవచ్చు. దీన్ని మా  ప్రాంతంలో కంఠసంధి అని అంటారు. నా మొదటి తమ్ముడు ఈ కంఠ సంధివ్యాధితో అతని ఆరో ఏట మరణించాడు. అప్పుడు దీన్ని గురించి మా ఆయుర్వందం వైద్యుడు బాగా అనుకోవడం విన్నాను. కాబట్టి డిఫ్తీరియా కంఠసర్పి కాదు కంఠసంధి. ఇది ఖమ్మం జిల్లాలో  అంటే  నా ప్రాంతంలో ఉన్న వ్యవవహారం. 
మిత్రులూ మరించ చర్చిద్దాం. 
భవదీయుడు
పులికొండ సుబ్బాచారి

2011/10/1 రాజేంద్రకుమార్ దేవరపల్లి <devarapalli....@gmail.com>
--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.

 * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
 * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
 * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి



--
Prof. P.  Subbachary
Department of Folklore & Tribal Studies
Dean, School of Human and Social Sciences
Dean, Academic Affairs (Principal)
Dravidian University
Kuppam 517425
A.P

Sirish Kumar Tummala

unread,
Oct 2, 2011, 11:45:12 PM10/2/11
to telug...@googlegroups.com
ఈ చర్మవ్యాధినే కాబోలు మా వైపు ’సలిపిరి’ అంటారు.

- తుమ్మల శిరీష్ కుమార్
-----------
నా బ్లాగు: http://chaduvari.blogspot.com
బ్లాగులన్నీ: http://koodali.org, http://jalleda.com


2011/10/3 Pulikonda <psubb...@gmail.com>

ramanarao muddu

unread,
May 13, 2014, 11:04:40 AM5/13/14
to telug...@googlegroups.com

 సర్పి అనే జబ్బు చర్మం మీద వచ్చేదే.కాని diphtheriaకి కంఠసర్పి అనే అనంటారు.ఇంగ్లిష్-తెలుగు మెడికల్ నిఘంటువులో కూడా అలాగే పేర్కొన్నారు.

K V Ramana

unread,
May 14, 2014, 6:37:14 AM5/14/14
to telug...@googlegroups.com
diphtheriaకి కంఠవాతము, కంఠరోహిణి అనవచ్చని డా. ఓ ఏ శర్మగారి మెడికల్
డిక్‌షనరీలో ఉంది.
> --
> You received this message because you are subscribed to the Google Groups
> "తెలుగుపదం" group.
> To unsubscribe from this group and stop receiving emails from it, send an
> email to telugupadam...@googlegroups.com.
> For more options, visit https://groups.google.com/d/optout.
>


--
Killamsetty VenkataRamana
mob 09937668415
Reply all
Reply to author
Forward
0 new messages