ఉపమితం (comparative) గా ’నిమిషం’ సరైనది. కానీ సంస్కృతంలో ఈ పదానికి కాలప్రమాణం (a unit of time/ fraction of time) అనే అర్థం లేదు. ఱెప్పవేయడం అనే అర్థం మాత్రమే ఉంది. కాలప్రమాణం అనే అర్థం అక్కఱపడితే నిమేషం అనాలి. నిమేషాన్ని ఈ కాలపు వాడుకలో split second కి సమార్థకంగా చెప్పుకోవచ్చు. ఇందుకు ఉపబలకంగా అమరకోశంలో--
శ్లో|| అష్టాదశ నిమేషాస్తు కాష్ఠా త్రింశత్తు తాః కలాః |
తాస్తు త్రింశత్ క్షణస్తే తు ముహూర్తో ద్వాదశాస్త్రియామ్ |
అనే ఆకరాన్ని పరిశీలించవచ్చు.
దీని తాత్పర్యమేమంటే - పద్ధెనిమిది (అష్టాదశ) ఱెప్పపాట్ల కాలావధికి ’కాష్ఠ” అని పేరు. అటువంటివి ముప్ఫై (త్రింశత్) కాష్ఠలైతే ఆ కాలావధి ’కల’ అనబడుతుంది. అటువంటివి ముప్ఫై కలలైతే ఆ కాలావధిని ’క్షణం’ అంటారు. అటువంటి క్షణాలు పన్నెండైతే ఆ కాలావధికి ’ముహూర్తం’ అని పేరు.
దీన్ని ఆధునిక పరిభాషలో పెడితే-
కల = 8 సెకన్లు
క్షణం = 4 మినిట్స్
ఘడియ = 24 మినిట్స్ (6 క్షణాలు)
ముహూర్తం = 48 మినిట్స్ (లేక 12 క్షణాల మొత్తం)
60 ఘడియల (30 ముహూర్తాల) కాలావధి =
ఒక అహోరాత్రం (ఒక రాత్రీ, ఒక పగలూ కలిసి ఉన్న కాలావధి - 24 అవర్స్)
నెనర్లు. (Thanks)
Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.comఇట్లు భవదీయుడు
తాడేపల్లి
This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use
http://lekhini.org