--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుపదం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugupadam...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
రాయల సోదరులైన తిరుమలరాయలు తనపై కవిత చెప్పుమని అష్టదిగ్గజములని అర్ధింపగా, అందవిహీనుడు, ఒంటి కన్ను వాడైన తిరుమలరాయల గూర్చి యేమి కవిత్వం చెప్పాలి అని సంశయంలో ఉండగా, రామకృష్ణ కవి ఇలా స్తుతించాడు.
అన్నాతి గూడ హరుడవె
అన్నాతిని గూడనప్పుడసురగురుడవే!
అన్నా తిరుమలరాయా
కన్నొక్కటి లేదు కాని కౌరవపతివే!||
(భార్యతో ఉన్నపుడు నీవు హరుడవు, భార్య ప్రక్కన లేనపుడు రాక్షసగురువైన
శుక్రాచార్యుడవు, అన్నా తిరుమలరాయా, నీకు ఇంకో కన్ను లేనిచో కురుపతి
దృతరాష్టుడివి)
<< కన్నొక్కటి లేదు కాని కౌరవపతివే
>>
చివఱి పాదానికి పాఠాంతరాలతో మీరు తికమక పడినట్టున్నారు, శంకరయ్య మాస్టారూ: "కన్నొక్కటి గలదు/మిగిలె కాని కౌరవపతివే" లేదా "కన్నొక్కటి లేదు గాని (కం)కాంతుడ గావే!" ("ఒక కన్ను యెక్కువ ఉంది కానీ అదీ లేకుంటే ధృతరాష్ట్రుడంతటి వాడివయ్యేవాడివి!" లేదా "ఒకటే కన్నుంది కానీ రెండోది కూడా ఉంటే మన్మథుడివే!")
భవదీయుడు,
నచకి
రాయల సోదరులైన తిరుమలరాయలు తనపై కవిత చెప్పుమని అష్టదిగ్గజములని అర్ధింపగా, అందవిహీనుడు, ఒంటి కన్ను వాడైన తిరుమలరాయల గూర్చి యేమి కవిత్వం చెప్పాలి అని సంశయంలో ఉండగా, రామకృష్ణ కవి ఇలా స్తుతించాడు.
అన్నాతి గూడ హరుడవె
అన్నాతిని గూడనప్పుడసురగురుడవే!
అన్నా
తిరుమలరాయా
కన్నొక్కటి లేదు కాని కౌరవపతివే!||
(భార్యతో ఉన్నపుడు నీవు
హరుడవు, భార్య ప్రక్కన లేనపుడు రాక్షసగురువైన శుక్రాచార్యుడవు, అన్నా తిరుమలరాయా,
నీకు ఇంకో కన్ను లేనిచో కురుపతి దృతరాష్టుడివి)
2013/3/20 K V Ramana <kvje...@gmail.com>
చాల కాలం క్రితం చాటువొకటి విన్నాను. పద్యం గుర్తు రావడం లేదు.రాయలవారి కొలువులో రాజబంధు వొకడు తనని స్తుతించమని తెనాలి రామకృష్ణుణ్ణి అడుగుతాడు. ఆ రాజబంధువుకి ఒకకన్ను లేదు.- నీ భార్య కళ్ళతో కలిపితే నువ్వు త్రినేత్రుడివి, కలపక పోయినా శుక్రాచార్యుడికి సముడవు, ఆ ఒక్క కన్నూ లేకపోతే - "......అన్నా తిరుమలరాయా, కన్నొక్కటి కలదు కాని కౌరవపతివే" - అని ఓ కందం విసురుతాడు తెనాలి రామకృష్ణ. పచ్యంలో మీది పాదాలు గుర్తులేవు. మిత్రులకు తెలిసుంటే ఈ పద్యం ఉదాహరిస్తారా?
--
Killamsetty VenkataRamana
mob 09937668415
--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుపదం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to mailto:telugupadam%2Bunsu...@googlegroups.com.