తెలుగులో మాటలను చేయడం గురించి

65 views
Skip to first unread message

Kodanda Ramaiah Parupally

unread,
May 29, 2017, 3:28:57 AM5/29/17
to telug...@googlegroups.com
అయ్యా,
రామోజీ రావు గారికి జేజేలు!
22వ తేది ఈనాడు హైదరాబాద్ పుట 12లో 'కలల కొలువుల మేలుకొలుపు' అని awakening [call] for dream jobs కు మారుగా వాడారు. అంతకు ముందు admissionsకు చేరికలు అని వాడారు. ఇవన్నీ తేట తెలుగులో ఉండటాన్ని పరికించండి.
ఒక భాష సజీవమైనదిగా బ్రతక గలగటానికి కావలసిన లక్షణాలు అందులో కొత్త మాటలని చేయటానికి వీలుండటం, అలా చేస్తూ ఉండటం.
కొంత మంది ఆంగ్ల మాటలను అలానే వాడి జనానికి కూడ అలవాటు చేస్తారు. తరువాత మంది మాటలు అయిపోయాయి, వాటిని ఎందుకు మార్చాలి అని అంటారు. మరి కొంత మంది కొత్త మాటల అవసరం వచ్చినప్పుడల్లా సంస్క్రుత వేళ్ళ నుంచి చేస్తారు. ఇవన్నీ స్వాభిమానం లేని పనులు, సిగ్గు లేని పనులు అని అనుకోని ఊరుకొంటే, మనం సమస్యను సరిగా చూడక మోసపోయినట్లే.
ఈ ధోరణి వెనుక ఉన్న అసలు కుట్ర: 'తెలుగు- పైచదువులకు, దేవుని పూజకు, ప్రభుత్వ కార్యాలయాలకు, న్యాయస్థానాల మరియు శాసన సభల కార్యక్రమాలకు, కొత్త శాస్త్రాల చదువు మరియు పరిశోధనకు, ఉద్యోగాలకు పనికి రాని చెత్త భాష అని నిరూపించడం.' అలా దానిని పనికి రాని భాష అని ఆచరణలో చెప్పి నెమ్మదిగా వాడకాన్ని తగ్గిస్తూ పోతే, కనుమరుగు అయిపోతుంది. అప్పుడు తెలుగు స్థానంలో ఆంగ్లాన్ని తేవాలని కొంత మంది, సంస్క్రుతం వచ్చేస్తుందిలే అని కొంత మంది, తమిళాన్ని తేవచ్చు అని కొంత మంది [వీరికి కోట్ల మంది తెలుగు వారిని తమిళనాడులో, సింహళంలో, మలేషియా, మారిషస్ వగైరాల్లో విజయవంతంగా చంపిన నిజమైన అనుభవం ఉంది.], హిందీని రుద్దాల్సిందే అని కొంత మంది పాటు పడుతున్నారు.
తెలుగు భాష, సంస్కృతి, జాతి మీద అభిమానం ఉన్న వారందరు ఈ ముప్పును గమనించి సరి అయిన చర్యలను ఇప్పటి నుంచే చేపట్టాలి.

తెలుగు నుడి ఊడిగంలో మీ అనుగరి(అభిమాని),
పారుపల్లి కోదండ రామయ్య, ఊరట మించు వంచ మరవరి. 9505298565

Reply all
Reply to author
Forward
0 new messages