డైరీకి.. తెలుగుపదం ‘నిత్యలేఖిని’

11 views
Skip to first unread message

adi narayana

unread,
May 5, 2012, 1:45:56 AM5/5/12
to తెలుగుపదం
తెలుగుపదం వారి కృషికి అభినందనలు. ఎందుకంటే రేపో మాపో చనిపోయే తెలుగుకు
మీరు కొత్త ఊపిరిలూదుతున్నారు. కనుక, మీకు ధన్యవాదములు. డైరీకి తెలుగుపదం
చెప్పమన్నారు. దైనందిని అనే పదం ఆల్రెడీ వుందన్నారు. గమనించారో లేదో.
అలాగే నా సూచన.. నిత్యలేఖిని. నిత్యలేఖిని బావుందేమో చూడగలరు.
ఇట్లు
ఆది, తెలుగుశాల

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
May 5, 2012, 2:21:56 AM5/5/12
to telug...@googlegroups.com
లేఖిని ఎల్లప్పుడూ వ్రాసే సాధనాన్నే సూచిస్తుంది, స్ఫురింపజేస్తుంది. అంటే కలం, పెన్సిల్ మొదలైనవాటిని. 

ఱేపో మాపో తెలుగు చనిపోతుందనే ఈ దుష్ప్రచారం ఎవఱు ఎందుకు మొదలుపెట్టారో తెలీదు. కాస్తో కూస్తో తెలుగు కోసం చిత్తశుద్ధితో ఆలోచించేవాళ్ళని కూడా ఈ ప్రచారంతో మార్చేస్తున్నారు. చనిపోవడానికి అదేమీ జీవి కాదు కదా. మనమంతా బతికుండగా తెలుగెలా చనిపోతుంది ? ఎనిమిదికోట్లమంది మాట్లాడే భాష చనిపోవడం ఎక్కడా వినలేదు, కనలేదు. ఆసియాలో మొదటి ర్యాంకుల్లో, ప్రపంచంలో మొదటి 15 ర్యాంకుల్లో ఉన్న భాష ఎలా చనిపోతుంది ? హిందీ తరువాత అత్యధికమైన మీడియా విస్తరణ కలిగిన భాష, ఏడాదికి 93 లక్షలమంది పిల్లలు అభ్యసిస్తున్న భాష , రోజూ 40 లక్షల దినపత్రికల ప్రతులు ముద్రితమయ్యే భాష ఎలా చనిపోతుంది ? దయ చేసి ఇలాంటి అవాస్తవిక, అశుభ, అవాచ్య భావాల్ని వ్యాపింపజేసి అసలే హోప్ లెస్ గా చెడిపోయి ఉన్న మన తెలుగువాళ్ళని మఱింత చెడగొట్టవద్దని ప్రార్థన. 


నెనర్లు. (Thanks)

 

Yours Truly

 T. L. Bala Subrahmanyam

http://hi.girgit.chitthajagat.in/tadepalli.wordpress.com 
--  

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి 

You may kindly ignore this mail if you are not the intended recipient. Sorry very much for the inconvenience caused if any. 


This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org or download Baraha software from http://baraha.com

Adi Narayana

unread,
May 7, 2012, 3:39:03 AM5/7/12
to telug...@googlegroups.com
ఆర్యా!
 
 
మీయొక్క తెలుగుభాషాభిమానానికి ధన్యుడ్ని.
 
లేఖిని అనే పదం రాసే సాధనాన్ని సూచిస్తుందన్నారు. మరి లేఖ మాటేవిటి? లేఖలోంచి నేను ఈ పదం రాసాను. రోజూ మనకు మనం రాసుకునే లేఖే డైరీ. ఆ లేఖలు, రాసిన వారి మరణానంతరం విశేష సమాచారాన్ని అందిస్తాయి. కనుక లేఖ శబ్ధాన్ని నేను మీ ముందుకు తెచ్చాను.
 
 
నేను తెలుగు అంతరించిపోతుందన్న మాట ఏ ఊతపదం కిందో, తెలిసో తెలియకో అనలేదు. ఐక్యరాజ్యసమితి వారు విడుదల చేసిన కొన్ని లెక్కల ప్రకారమే అన్నాను. వచ్చే 50ఏళ్లలో తెలుగు భాష వినియోగం మీద ఐక్యరాజ్య సమితి చేసిన సర్వేల ఆధారంగానే ఈ మాట పుట్టింది. మీరు డైరీకి నిత్యలేఖిని అన్న పదం వాడుకలోకి తేవచ్చో లేదో అన్న మాట మరిచి మీరు భాషాభిమానం చూపిన విధం కూడా నన్ను ఆకట్టుకుంది. ఎందుకంటే ఆధారాల ప్రకారం తెలుగు భాష చావు పుట్టుకల మాటకే వస్తే ఈ రోజుల్లో అమల్లో వున్న విద్యావిధానం అనుసరించి ఆ భాష అంత ఆరోగ్యకరమైన వాతావరణంలో లేదు. ఎనీహౌ ఇలాంటి చర్చలు భాషకు ఎప్పటికీ మేలు చేస్తాయని భావిస్తూ ఇలా రాస్తున్నాను.
కనుక గమనించగలరు.
ఇట్లు
మీ
భవదీయ.
ఆది.

2012/5/5 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
 
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి

Kiran Kumar Chava

unread,
May 7, 2012, 3:53:18 AM5/7/12
to telug...@googlegroups.com
>> నేను తెలుగు అంతరించిపోతుందన్న మాట ఏ ఊతపదం కిందో, తెలిసో తెలియకో అనలేదు. ఐక్యరాజ్యసమితి వారు విడుదల చేసిన కొన్ని లెక్కల ప్రకారమే అన్నాను. వచ్చే 50ఏళ్లలో తెలుగు భాష వినియోగం మీద ఐక్యరాజ్య సమితి చేసిన సర్వేల ఆధారంగానే ఈ మాట పుట్టింది. 

It is a myth.

Refer to the discussion and UNESCO report link given at http://groups.yahoo.com/group/racchabanda/message/24192

As this FUD (http://en.wikipedia.org/wiki/Fear,_uncertainty_and_doubt ) is not helping us, may be we should stop it :-)

Thanks and Regards,
Kiran Kumar Chava


2012/5/7 Adi Narayana <audi...@gmail.com>



--
----
~Kiran Kumar Chava

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
May 7, 2012, 5:42:35 AM5/7/12
to telug...@googlegroups.com
ఆర్యా ! మీ సమాధానానికి నెనర్లు.

ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి అని ఉదాహరించడం కూడా తఱచుగా విన్నాను. కానీ ఎంత వెతికినా ఐక్యరాజ్యసమితి ఈ మాట ఎప్పుడు చెప్పిందో ఎక్కడా సోర్సు దొరకలేదు గత 5 ఏళ్ళబట్టి ! అసలు తెలుగుసమాజం మధ్య సాక్షాత్తూ స్వయంగా నివసిస్తున్నవాళ్ళం మనం. మనకెప్పుడైనా అనిపించిందా తెలుగుభాష త్వరలో నశిస్తుందని ? ఒకవేళ అలాంటి సర్వే ఏదైనా నిజంగా ఉందనుకుంటే, అది ఇక్కడ ఎవఱు ఎవఱిని అడిగారు ? ఎక్కడ ఏ జిల్లాలో ఏ సర్వే శాంపుల్ తీసుకున్నారు ? ఏ ప్రాతిపదిక మీద ఈ conclusion కి వచ్చారు ? ఏంటి వాళ్ళ రిసర్చ్ మెథడాలజీ ? రిసర్చిలూ, సర్వేలూ ప్రస్తుత స్థితిని మాత్రమే చెబుతాయి. భవిష్యత్తుని మునువల్కడానికి అవేమీ జ్యోతిశ్శాస్త్రాలు కావు. క్షేత్రస్థితిగతుల (Ground situation) తో సంబంధం లేకుండా ఎవఱో ఎక్కడో న్యూయార్కులో కూర్చుని ఏదో స్టేట్  మెంట్ ఇస్తే దాన్ని ఒక పాత్రికేయ మూర్ఖుడు మూర్ఖంగా ప్రచురిస్తే ఇహ అందఱం ఇంగితజ్ఞానానికి తలుపులేసుకొని అంతే మూర్ఖంగా నమ్మేసేయాలా ? ఇలా ఎవడు చెబితే అదల్లా గుడ్డెద్దు చేలో పడ్డట్లు నమ్మేయడానికి ఇదేమైనా 21వ శతాబ్దమా ?మఱొకటా ? ఆలోచించండి.

ప్రపంచంలో stateless languages ఉన్నాయి, ఉర్దూ, యిద్దిష్ మొదలైనవి. లిపి లేని భాషలున్నాయి. State ఉండీ ఏ విధమైన పోషణకీ నోచుకోని భాషలున్నాయి, కాశ్మీరీలాంటివి. (కాశ్మీరీని అణగదొక్కిన విధానం గుఱించి చదివితే కళ్ళవెంట నీళ్ళొస్తాయి సున్నితహృదయులకి. కానీ కాశ్మీరీ భాష ఇప్పటికీ నిక్షేపంలా జీవించే ఉంది) వాటన్నింటికీ లేని నాశనం తెలుగు ఒక్కదానికే వస్తుందా ? దీని వెనక తెలుగుజాతిశత్రువుల కుట్ర కనిపిస్తోంది నాకు. అయితే మన వాస్తవ భాషాశత్రువులు మన మధ్యనే ఉన్నారు, బయట లేరు.  

నెహ్రూ మంత్రివర్గంలో పనిచేసిన కృష్ణమేనోన్ ఒకసారి అన్నారు : "ఇండియాలో Printed word కు ఉన్న విలువ చాలా ఎక్కువ. ఎంతటి పచ్చి అబద్ధాన్నైనా అచ్చులో చదివితే జనం నమ్మేస్తారు" అని ! ఆయన ఈ మాట అని 50 ఏళ్ళు దాటింది. అయినా మన పరిస్థితి మారకపోవడం విచారకరం. 

--

రమణా రావు ముద్దు

unread,
May 7, 2012, 1:36:25 PM5/7/12
to telug...@googlegroups.com

 U,N,E.S.C.O.ఒక సర్వే ఆధారంగా చెప్పినట్లు జ్ఞాపకం.30%కన్నా ఎక్కువ విద్యార్థులు మాతృభాష చదవకపోతే ఆ భాష అంతరించిపోయే ప్రమాదముందని ,అట్టి భాషల్లో తెలుగు కూడా ఒకటని చెప్పింది.తెలుగు 2వ భాషగా తీసుకోకుండా ఏ హిందీయో ,సంస్కృతమో చాలమంది మనరాష్ట్రంలో తీసుకొంటున్నరన్నసంగతి తెలిసిందే.కొన్ని ఇతర భారతీయ భాషలవారు కూడా ఇలాగే,ఆందోళన చెందుతున్నారు.ముఖ్యంగా యువతరం  లో చాలా మంది తెలుగు సరిగా మాట్లాడ లేకపోతున్నారు.anyway  దీనిని హెచ్చరిక కింద భావించి మనం,ప్రభుత్వం ,జాగ్రతలు తీసుకొని  తగిన చర్యలు తీసుకొంటే మంచిదే కదా .వెంటనే ప్రమాదం లేదుకాని ఉదాసీనం,నిర్లక్ష్యం ,వహిస్తే భవిస్యత్తులో ఈ  ప్రమాదం ఉండే అవకాశం ఉంది కాబట్టి కొందరు ఈ విషయానికి ప్రాముఖ్యం ఇస్తున్నారనుకొంటాను.మనమంతా నిత్య వ్యవహారంలో తెలుగుకు ప్రధాన్యం ఇస్తే భాష వృద్ధిపొందుతుంది. 

2012/5/7 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
May 7, 2012, 11:59:03 PM5/7/12
to telug...@googlegroups.com
భాష మనుగడకీ, చదువుకూ సంబంధం లేదని నా అభిప్రాయం. సదరు యునెస్కో ఉద్ఘాటనకు ఏ విధమైన పూర్వానుభవమూ, చారిత్రిక ప్రాతిపదికా లేదు. యథేచ్ఛగా చేసిన ఊహాగానం మాత్రమే ఉంది. కనుక అది శాస్త్రీయం కాదు. ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాలవారు కేవలం గత 50 ఏళ్ళుగా మాత్రమే విస్తారంగా చదువుకోవడం మొదలుపెట్టారు. అంతకుముందు తమ మాతృభాష చదవలేనివారే సమాజంలో నూటికి 90 శాతం మంది ఉండేవారు. తెలుగువాళ్ళ పరిస్థితి కూడా మొన్నమొన్నటి దాకా అంతే. ఇక్కడ అగ్రకులాల్లో కొంతమందికి తప్ప ఇంకెవఱికీ చదువు రాదు. మఱి వేలాది సంవత్సరాలుగా చదువుకోకపోయినా వారి భాషలు అప్పటిదాకా బతికే ఉన్నాయిగా ? జనం వేఱే భాషల్ని విద్య ద్వారా చదువుకున్నంతమాత్రాన ఆయా భాషల్లోకి కన్వర్ట్ అయిపోరు. ఆ మాటకొస్తే నిజామ్ కాలంలో తెలుగు ఒక ఆధికారిక నిషిద్ధభాషగా కొన్ని దశాబ్దాల పాటు కొనసాగింది. అప్పట్లో అందఱూ ఉర్దూమీడియంలోనే చదువుకున్నారు. అంతమాత్రాన తెలంగాణలో తెలుగు చచ్చిపోలేదు కదా ?

ఏదేమైనా ఈ ప్రచారం పూర్తిగా వాస్తవవిరుద్ధం కనుక, అశాస్త్రీయం కనుక, ఈ జోస్యాలకి ఏ విధమైన ప్రాతిపదికా లేదు గనుక వీటిని ఖండించడం ప్రతితెలుగువాడికీ విధ్యుక్త కర్తవ్యం. ఎలాగూ చచ్చేదానికి మనం చేసేదేంటిలే అనే ధోరణిని ఇది పెంపొందిస్తుంది. మనమంతా బతికుండగా మన భాష ఎలా చనిపోతుంది ? 

రమణా రావు ముద్దు

unread,
May 8, 2012, 3:49:17 AM5/8/12
to telug...@googlegroups.com

 మీరు నేను వ్రాసినది సరిగా అర్థం చేసుకో లేదు.U.N.E.S.C.O.వారి  సర్వే వేదవాక్కుగా తీసుకోనవసరం లేదు .panic button నొక్కనవసరం లేదు.అది ప్రమాద సూచికగా మాత్రం తీసుకొని ప్రజలూ, ప్రభుత్వమూ తగిన చర్యలు చేపట్టాలన్నదే నా అభిప్రాయం.ఇంతకు పూర్వం 90%చదువులేనప్పుడు మాతృభాషలోనే మాట్లాడటం లో విశేషమేముంది.?90%చదువుకొంటున్న నేటి పరిస్థితి లో మాతృభాషను నిర్లక్ష్యం చేస్తే కొన్నాళ్ళకి ఏమవుతుంది?
  ఇస్లాం పుట్టాక అరబ్బులు ఈజిప్టు మొదలైన అనేక దేశాల్ని జయించాక అంతకు ముందు అక్కడవున్న భాషలన్నీ అంతరించిపోయి అరబ్బీయే వాళ్ళందరి జాతీయభాష అయింది.అలాగే లాటిన్ అమెరికా దేశాలన్నిటిలో స్థానిక భాషలు అంతరించి విజేతలైన స్పానిష్ వారి భాష జాతీయభాష ఐనది. 
  ఐతే మన తెలుగు ,ఇతర ప్రధాన భారతీయ భాషలు లిపి,మంచి సాహిత్య సంప్రదాయం కలిగి ,కోట్లాది ప్రజలు మాట్లాడుతున్నారు కాబట్టి అలా జరగకపోవచ్చును.అందువల్ల ఇది హెచ్చరికగానే స్వీకరించి భాషను కాపాడుకొవడం విజ్ఞతాలక్షణం.ఉదాసీనత పనికి రాదు.దానికి తీసుకోవలసిన చర్యలు తెలిసినవే కాబట్టి మళ్ళీ ఇక్కడ వ్రాయడం లేదు.    

2012/5/8 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>

Adi Narayana

unread,
May 8, 2012, 3:49:48 AM5/8/12
to telug...@googlegroups.com
తెలుగు భాషకు మరణం లేదు అనడానికి మీ దగ్గరున్న సాక్ష్యాధారాలు చూస్తుంటే చాలా ధైర్యమేస్తోంది. తాడేపల్లి గారూ! భాషపై మీకున్న ఆర్తికి కోటి దండాలు. చదువుకూ, భాష మనుగడకూ సంబంధం లేదనడం కూడా కరెక్టే. కానీ అది అంత గొప్ప ఆరోగ్యకరమైన విషయం కాదన్న మాటనైతే కొట్టి వేయలేరుగా. చదువుకూ, భాషకూ సంబంధం లేకుంటే కొన్ని కొన్ని పదాలు అంతగా వారికి తెలియక పోవచ్చు. ఉదాహరణకు భవిష్యత్ రోజుల్లో ఈ చదువు చదువుకున్న వ్యక్తికి సంబంధం అనే మాట తెలుగులో రాయడం తెలియక పోవడం వల్ల దాన్ని తనకు తెలిసిన రిలేషన్ అనే మాటనే ఎక్కువగా రాస్తూ వస్తారు. తెలుగులోని సంపూర్ణమైన పదాలు తెలియడానికి చదువు ఎంతో ముఖ్యం. అలాంటి చదువు సహకారం లేకుండానే మీరు మీ పిల్లలకు నేర్పినట్టు, భాష నేర్పించే వాళ్లు తరిగిపోతూ వస్తున్నారు సొసైటీలో. అసలు దారుణమైన విషయమేంటంటే లాభం లేని దాన్ని ఎంత మాతృసమానమైందైనా దాన్ని విసర్జిస్తున్నారు మనవాళ్లు. అంతెందుకండీ ఇక ఈ తల్లితో అవసరం లేదని తల్లినే తన్ని తగలేసి బతికుండగానే కాటికి పంపుతున్న సమాజంలో వున్నాం మనం. నిర్భందంగా భాష నేర్చుకునే పరిస్థితే లేకుంటే వచ్చే రోజుల్లో ఆ భాష పరిస్థితి ఏమిటి? మీరు కావాలంటే మీ చుట్టు పక్కల తరచి చూడండీ.. ‘‘అమ్మ అంటే ఏంటి మమ్మీ?’’ అనడిగే బుజ్జి బడుద్దాయిలు కనిపిస్తారు. పిల్లలను మాతృభాష మాట్లాడితే దండించే యుగంలో వుంది మన కాన్వెంట్ విద్య. ఈ పరిస్థితుల్లో కేవలం మీకున్న నిబద్ధత ఆధారంగా మాత్రమే, మన భాషకేం కాదని తెగ భరోసా  ఇచ్చేస్తున్నారు. తెలుగు భాష మనుగడ సంపూర్ణంగా ఉండాలని మీకన్నా మేం ఎక్కువ అనుకుంటున్నాం కాబట్టి ఇలా రాయడానికి ముందుకొస్తున్నాం. మీరు ఈ కోణంలో కూడా ఆలోచించాలి. ఒక విషయం గుర్తుంచుకోండి. నెగిటివ్ గా ఆలోచించడం ఆ విషయానికి మంచి పాజిటివ్ నెస్ ను ఇస్తుంది. స్కూటర్లో వెళ్తుంటే కిందపడి దెబ్బ తగులుతుందని అనుకోబట్టే కదా  అంత కన్నా బెటర్ ఆప్షన్ గురించి అన్వేషణ మొదలౌతుంది? ఏమంటారు. ఆవేశపడకుండా ఆలోచించండి.

2012/5/8 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
May 8, 2012, 5:33:50 AM5/8/12
to telug...@googlegroups.com
మీరు చెప్పిన సమకాలీన అంశాల్ని  కొట్టిపారేయడం లేదు. కానీ అంతమాత్రాన భాష చనిపోదని నా అభిప్రాయం. విదేశీ ప్రభావాల మూలాన భాష మారొచ్చు. కానీ పూర్తిగా చనిపోదు. ఒక పదం బదులు ఇంకో పదం వాడేవాడు కూడా తెలుగు మాట్లాడుతూనే ఉంటాడు, అది ఎంత చచ్చుతెలుగైనా ! మీరన్నట్లు ఈ పరిస్థితిని మానవప్రయత్నంతో మార్చడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి - అన్ని బళ్ళలోనూ తెలుగుని ఒక నిర్బంధ బోధనాంశంగా చేయడం ద్వారా ! కానీ ఆ పని చేయకుండా మనవాళ్ళు "ఏకంగా తెలుగు చనిపోతుం"దనే ప్రచారం మొదలుపెట్టారు. ఇహ తెలుగు చనిపోతే మన మీదున్న అన్ని  దేశభక్తోచిత కర్తవ్యాల భారమూ తీఱిపోతుందన్నట్లు ! అమ్మ చచ్చిపోతే ఆవిడ తిండిఖర్చూ, మందుల ఖర్చూ మిగుల్తాయన్నట్లు ! తెలుగంత కాకపోయినా కాస్తో కూస్తో తెలుగులాంటి ఇబ్బందిలోనే ఉన్నాయి ఇతర భారతీయ భాషలు కూడా. కానీ ఇలా భాష చనిపోతుందనే ప్రచారం అక్కడ జఱగడం లేదు. కానీ మన దగ్గఱ జఱుగుతోంది. కారణం - ఇక్కడి ప్రజల మనస్తత్త్వం ఇలాంటి దుర్మార్గ ఫాంటసీలకి అనుగుణంగా కొన్ని దశాబ్దాలుగా ట్యూన్ చేయబడింది ఒకానొక పార్టీ పరిపాలనలో ! మన భాషకి సంబంధించినంత వఱకూ వీళ్ళు మఱో నిజాములు, మఱో బ్రిటీషర్లు. 

Akshay Regulagedda

unread,
May 8, 2012, 7:22:17 AM5/8/12
to telug...@googlegroups.com

U,N,E.S.C.O.ఒక సర్వే ఆధారంగా చెప్పినట్లు జ్ఞాపకం.30%కన్నా ఎక్కువ విద్యార్థులు మాతృభాష చదవకపోతే ఆ భాష అంతరించిపోయే ప్రమాదముందని ,అట్టి భాషల్లో తెలుగు కూడా ఒకటని చెప్పింది.

ప్రపంచ భాషల పరిరక్షణ పై వారు ప్రచురించిన స్వేత పత్రాన్ని మనం సులభంగా గూగిలించచ్చు, ఓపిక వీలు ఉంటే చదవచ్చు కూడా.

నేను ఆ పత్రాన్ని పూర్తిగా చదివాను. " 30%కన్నా ఎక్కువ విద్యార్థులు మాతృభాష చదవకపోతే ఆ భాష అంతరించిపోతుంది" అని ఎక్కడా రాయక పోడమే కాదు, తెలుగుకి ఆ పరిస్తితి ఉన్నది అని ఎక్కడా పేర్కొనలేదు కూడా. ఆ మాటకొస్తే, తెలుగు గురించి ఎక్కడా ఏ రూపములో, ఏ విధంగానైనా వారు ప్రస్తావించలేదు. 

మాటకొస్తే, వారి అభిప్రాయంలో,

No single factor is sufficient to assess the state of a community’s language. However, taken together, these nine factors can determine the viability of a language, its function in society and the type of measures required for its maintenance or revitalization. (emphasis mine)
 
 I repeat: no. single. factor. 
 
తెలుగు 2వ భాషగా తీసుకోకుండా ఏ హిందీయో ,సంస్కృతమో చాలమంది మనరాష్ట్రంలో తీసుకొంటున్నరన్నసంగతి తెలిసిందే.కొన్ని ఇతర భారతీయ భాషలవారు కూడా ఇలాగే,ఆందోళన చెందుతున్నారు.ముఖ్యంగా యువతరం  లో చాలా మంది తెలుగు సరిగా మాట్లాడ లేకపోతున్నారు.

ఇక్కడ గణాంక విశ్లేషణ (statistical analysis) చాలా అవసరం. తెలుగుని మాతృ భాషగా భావించే విద్యార్థులు ఎంత మందో కొత్త surveyలు లేకుండా తెలుసుకోవడం అసాధ్యం. ఆ గణాంకం మాట పక్కన పెట్టితే, ఈ క్రింది ప్రశ్నలకు జవాబు తెలిస్తే మన విశ్లేషణ ఇంకా మెరుగుపడగలదు:

1) ఏటేటా, ఎంత మంది SSC పరీక్షలను ఇస్తున్నారు? వారిలో తెలుగు మాధ్యములో ఇస్తున్న వారు ఎంతమంది?
2) ఇంగ్లీషు మాధ్యమంలో చదివేవారిలో ఎంత మంది తెలుగుని second languageగా తీసుకుంటున్నారు?
3) అలాగే, cbse, icseలలో చదివేవారిలో ఎంత మంది తెలుగు చదువుతున్నారు?
4) పొరుగు రాష్ట్రాలైన తమిళ నాడు, కర్ణాటక, ఒరిస్సాలలో పదవ తరగతిలో తెలుగు చదువుకునే వారు ఎంత మంది?

ఈ గణాంకాలు గుగుల్ కి దూరంగా ఉన్నట్టు ఉన్నాయి, నాకు సులభంగా అందలేదు. (ఇంకా వెతికితే దొరకచ్చు, ఆసక్తి ఉన్న వారు RTI దరఖాస్తులతో తెలుసుకోవచ్చు) ఇవన్నీ objective ప్రశ్నలు, వీటికి జవాబులు లేకుండా తెలుగు భాష యొక్క భవిష్యత్తు గురించి మనం స్పష్టంగా ఆలోచించలేము.
--
Akshay Regulagedda | రేగులగెడ్డ అక్షయ్
తెలుగుదేల యెన్న దేశంబు తెలుగేను.
Reply all
Reply to author
Forward
0 new messages