Claimకి తెలుగు సమానార్ధకం

5 views
Skip to first unread message

రమణ / Ramana

unread,
Jul 1, 2009, 2:07:40 PM7/1/09
to telug...@googlegroups.com
సుధాకర్ వల్లూరి గారి సూచన మేరకు తెలుగు బ్లాగ్ లిస్ట్ లో జరిగిన చర్చని యిక్కడ కొనసాగడం కోసం forward చేస్తున్నాను.ఇప్పటి వరకు 'ప్రకటించుకొను', 'వినతి', 'చెప్పుకోవడం', 'మంజూరు చేసుకోవడం' అన్నవి సందర్భానుసారం ఉపయోగించాలన్నది జరిగిన చర్చ సారాంశం.
 
***
ఇంగ్లీషు నుంచి తెలుగులోకి అనువాదం చేసేప్పుడు claimకి తెలుగులో ఏమనాలో ఎవరైనా చెప్పగలరా?
ఉదాహరణకి ఈ సందర్భాలలో
Claim victory
False claim
Verfied the claims లాంటివి. వాజ్యం, వాదం అన్నపదాలు కొన్ని సందర్భాలలో సరిపోయినట్టనిపిస్తున్న సమానర్ధకంగా అనిపించడం లేదు.
 
తాడేపల్లిగారు,
Your response would be highly appreciated.
 
Thanks
Ramana

--------------
రమణగారూ ! మీ అభిమానానికి నెనర్లు. Claim ని ఇంగ్లీషులో కూడా ఒకే అర్థంలో వాడకపోవడం జరుగుతోంది. రకరకాల సందర్భాల్లో రకరకాల అర్థాల్లోవాడుతున్నారు. కనుక ఆ అన్ని అర్థాలకీ/ సందర్భాలకీ ఇంగ్లీషులో మాదిరే ఏకవాచకం తెలుగులో లభిస్తుందని అనుకోలేం. ఎందుకంటే ఇప్పటిదాకా లభించలేదు.
 
మీరిచ్చిన ఆంగ్ల పదబంధాల (English phrases) కి సందర్భాన్ని బట్టి సమీపార్థకాలతో సరిపుచ్చుకోవలసి ఉంటుందనుకుంటా.
 
Claim victory - విజయాన్ని ప్రకటించుకొను
False claim - తప్పుడు హక్కుల ప్రకటన
Verfied the claims - (ఇది మిక్కిలి కష్టమైన వాడుక) - వినతులను తనిఖీ చేశారు.
 
ఇంకా చాలా ఉన్నాయి.
 
His claim to fame - అతని కీర్తికారణం
His claims of pioneering the art - ఆ కళకి తానే ఆద్యుణ్ణని అతను ఆపాదించుకుంటున్న గొప్పతనం/ ఘనత
 
ఒకవేళ మీకు ఈ సమాచారం ఉపయోగకరం కాదనిపిస్తే మన్నించగలరు.
 
 --
నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి

---------------
వ్యక్తీకరణ అనేది సంస్కృత root. తెలుగు లో 'చెప్పుకోవడం' అని అనుకోవచ్చు.
 
విజయం తనదేనని చెప్పుకున్నాడు.
లేనిది ఉన్నట్టు (false claim) చెప్పుకున్నాడు.
Verified the claim - తాడేపల్లి గారు అన్నట్టు చాలా కష్టమైన వాడుక. నిజ నిర్ధారణ చేయడం అని అనుకోవచ్చు.
 
ఏది ఏమైనా ఇలాంటి చర్చలు అన్దరినీ ఆలోచింప జేస్తాయి :)
 
-కుమార్

-------------------
మంజూరు చేసుకొనుట అనుకుంట
-Kranthi Kumar

****
--
రమణ
http://swagathaalu.blogspot.com

Kiran Na.Cha.

unread,
Jul 1, 2009, 9:09:23 PM7/1/09
to telug...@googlegroups.com
Claim(s), Claimant లాంటి పదాలకి న్యాయశాస్త్రంలో ఏమైనా పదాలు ఇప్పటికే వాడుకలో ఉండవచ్చు. ఎవరైనా తెలిసినవాళ్ళు అవేంటో చెబితే సామాన్య వాడుకకు కూడా అవి సరిపోవచ్చునేమో చూడవచ్చు.
 
ఏకవాచకంగా "చెప్పొప్పు" అన్న పదం ఎలా ఉంటుంది?
 
claim (n.) = చెప్పొప్పు
claim (v.) = చెప్పొప్పుట
claimant (n.) = చెప్పొప్పుదారు
false claims = తప్పుడు చెప్పొప్పులు
verify the claims = చెప్పొప్పులు సరిచూచు/తనిఖీ చేయు
claim (v.) victory = విజయానికి చెప్పొప్పు
claim (n.) to fame = కీర్తి చెప్పొప్పు
His claims of pioneering the art = (ఆ) కళకు తానే మొదటివాడను చెప్పొప్పులు
 
పలకటం ఇబ్బందే కావచ్చు... కానీ "తప్పొప్పులు" పలికినప్పుడు "చెప్పొప్పు" కూడా పలకవచ్చనే నా నమ్మకం. అయినా... "ద్విరుక్తటకార సంధి" అని పలకగలిగే తెలుగువాళ్ళకి కష్టమేమిటి చెప్పండి! :-)
- నచకి

Subbachary Pulikonda

unread,
Jul 2, 2009, 1:21:48 AM7/2/09
to telug...@googlegroups.com
తాడేపల్లి వారి సూచన బాగుంది.
 
అవును క్లెయిమ్ అనే ఇంగ్లీషు పదం చాలా చాలా అర్థాలలో వినియోగంలో ఉంది. సందర్భాన్ని బట్టి దానికి సమానార్థక తెలుగు పదాన్ని ఎన్నుకోవాలి. కాని ఎక్కువ సందర్భాలలో  క్లెయిమ్ అనే మాటకు ఆరోపించుకోవడం అని అర్థం వస్తుంది. ఆరోపణ అనే మాటను చాలా మంది సూచించడంలేదు. claimed status అంటే ఆరోపించుకున్న స్టేటస్ అనిఅర్థం అంటే ఆ స్టేటసే యదార్థం గా లేదని. అలాగే క్లెయిమ్డ్ విక్టరీ అని అంటే విజయాన్ని ఆరోపించుకోవడం అని అర్థం అంటే నిజంగా విజయం సాధించలేదని. ఫాల్స్ క్లెయిమ్ అన్నాకూడా తప్పుగా ఆరోపించుకోవడం అనే అర్థం. ఇలా ఎక్కువ సందర్భాలలో ఆరోపణ అనే అర్థంలో ఈ పదం ఉంది. దీని ఛాయలను చాలా చూపవచ్చు. ఇంగ్లీషులో చాలా పదాలు ఇలా బహుకృత వేషాలతో ఉంటాయి.
 
పులికొండ సుబ్బాచారి.

Dravidian University
Kuppam 517425
A.P

Kiran NaCha

unread,
Jul 2, 2009, 1:52:55 AM7/2/09
to telug...@googlegroups.com

"ఆరోప"మన్న పదానికి వ్యవహారంలో వేరే అర్థం ఉన్నది కనుక తికమక కలిగించే అవకాశం చాలా ఉంది.

నచకి

2009/7/2 Subbachary Pulikonda <psubb...@gmail.com>



--
http://forthesociety.blogspot.com/
http://nachaki.spaces.msn.com/
http://kirandotc.blogspot.com/

"And somewhere there are engineers
Helping others fly faster than sound.
But, where are the engineers
Helping those who must live on the ground?"

– Young Oxfam Poster

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Jul 2, 2009, 4:53:33 AM7/2/09
to telug...@googlegroups.com
ఆపాదించుకోవడం

నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి

This mail might have been sent to you in Telugu language. If you are
unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE
(UTF-8). For writing in Telugu, use http://lekhini.org

Subbachary Pulikonda

unread,
Jul 3, 2009, 12:39:26 AM7/3/09
to telug...@googlegroups.com
ఏంలేదండి తికమక ఏంలేదు.  ఆరోపించుకోవడం అంటే  ఆపాదించుకోవడమనే అర్థం. అంటే లేనిదానిని ఆరోపించడమనే వీటి సంస్కృత ధాత్వర్థాలకు పోవద్దు. తెలుగులో వీటి వ్యవహారం ప్రకారమే  ఈ  అర్థాలు వస్తాయి. 
పులికొండ సుబ్బాచారి. 

2009/7/2 Kiran NaCha <email4...@gmail.com>



--
Prof. P.  Subbachary
Head, Department of Folklore & Tribal Studies
Dean, School of Human and Social Sciences

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Jul 14, 2009, 9:53:19 AM7/14/09
to తెలుగుపదం
చర్చ ఏమీ తేల్చకుండానే అర్ధాంతరంగా ముగిసినట్లుంది.

"చెప్పొప్పు" నిజంగా ఒక నవీన ప్రయోగం. కానీ రెండు క్రియాధాతువుల్ని
మధ్యలో ప్రత్యయమేదీ లేకుండా కలిపేయడం తెలుగుభాషా స్వభావం కాదేమోనని శంక.
కానీ ఇది కూడా ఇంకో రకంగా ఉపయోగిస్తుంది. తమిళుల్లా సరళంగా పోనిద్దామా ?
"రవాణాసంస్థ" కి వారు పోక్కువరత్తుక్కழగమ్ (రాకపోకల సంస్థ) అంటారు.

అలాగే

చెప్పుకొను/ చెప్పుకోలు చేయు = to claim
చెప్పుకోలు = Claim (n)

అంటే చాలా సందర్భాలకి నప్పుతుందేమో ఆలోచించండి.

Kiran Na.Cha.

unread,
Jul 14, 2009, 2:04:29 PM7/14/09
to telug...@googlegroups.com
"చెప్పుకోలు" అన్న పదం నాకూ మొదటగా తట్టింది. కానీ, అప్పుడు తక్కిన -కోలు పదాల
లాగానే క్రియారూపం -కొను అని వస్తుంది, అప్పుడు "చెప్పుకొను" అని వ్యవహారంలో
ఉన్న వాడుకతో తికమక వస్తుంది అనిపించి ఆ నిష్పాదన వదిలేసాను.

మీరన్నట్టు "చెప్పొచ్చు" వ్యాకరణదోషపూరితమే... నిజానికి ఈ విషయంలోనూ
"చెప్పుటొప్పు"/"చెప్పుడొప్పు" అనుకున్నాను మొదట. కానీ, అప్పుడు అదేదో
"పాదరక్షకు ఉపరిభాగం" అన్నట్టుగా అనిపించింది. (Top అన్నా "డొప్ప" అన్నా
అటువంటి అర్థమే స్ఫురిస్తుంది. అందుకని దానిని ఎవరైనా విడగొట్టబోతే తికమకకి
గురయ్యే అవకాశముంది.) అందుకని అదీ విసర్జించాను.

నచకి

--------------------------------------------------
From: "తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం" <subtad...@gmail.com>
Sent: Tuesday, July 14, 2009 08:53
To: "తెలుగుపదం" <telug...@googlegroups.com>
Subject: [తెలుగుపదం] Re: Claimకి తెలుగు సమానార్ధకం

kv ramana

unread,
Jul 15, 2009, 7:29:04 AM7/15/09
to telug...@googlegroups.com
Claimని క్లెయిం అంటే తప్పేవిటి? సంస్కృత పదాల్ని తెలుగువి అనుకోగా లేనిది ఇంగ్లిష్ మాటలతోనే ఇబ్బందా? ఉండనిస్తురు. 

2009/7/14 Kiran Na.Cha. <email4...@gmail.com>

రమణ / Ramana

unread,
Jul 15, 2009, 12:02:00 PM7/15/09
to telug...@googlegroups.com
తాడేపల్లిగారూ,

I am no expert, but the approach you are proposing is creative and could work. If we cannot find a suitable word in Telugu, searching how other Dravidian languages (Tamil, Malayalam and Kannada) resolved that word may enlighten us. After seeing your reply I looked in a English-Tamil dictionary for Claim in Tamil. Attached is that page. With my very little Tamil reading skills, it looks to me like they are saying

హక్కుచూపడం, హక్కుచెప్పడం అన్న అర్ధంలో వుపయోగించినట్టున్నారు. మీ అభిప్రాయం తెలపగలరు.
 
కృతజ్ఞతతో
రమణ.
 
2009/7/14 తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <subtad...@gmail.com>
Claim.jpg
Reply all
Reply to author
Forward
0 new messages