1996లో మొదటిసారి తెలుగులో కంప్యూటర్ సాహిత్యాన్ని ప్రారంభించినప్పటి
నుండి ఇలా తోచిన పేర్లని ప్రయోగించదలిచినట్టయితే ఇప్పటికి గందరగోళం
సృష్టించి ఉండగలిగే వాడిని. అప్పట్లో నా లక్ష్యం పదాలు ఏవైనా ఈజీగా
అర్థమవడం. దురదృష్డవశాత్తు ఈ మధ్య ఇలాంటివి అధికమయ్యాయి. మరో విషయం గత 15
సంవత్సరాలుగా ప్రచురణారంగంలో సంపాదకునిగా ఉంటూ వేలాది మంది పాఠకుల నాడిని
గమనిస్తూ అర్ణం చేసుకున్నది.. అధికశాతం యువతరానికి తెలుగు చదవడం రాదు.
ఇంగ్లీషులో పత్రిక తీసుకురమ్మని అడిగేవారు ఎంతమందో! ఈ నేపధ్యంలో కొత్త
పదాలతో కాస్తో కూస్తో పఠనాసక్తి కలిగిన వారినీ బేజారెక్కించడం ఎంతవరకూ
సబబు?
వాదోపవాదాలు నాకు వ్యక్తిగతంగా నచ్చకపోవడం వల్ల నా ఈ అభిప్రాయాన్ని
ఇన్నాళ్లూ అణిచివేసుకున్నాను. నా అభిప్రాయంలో పస ఉందనిపించినా
విబేధించినా ఒక సంపాదకునిగా 15 ఏళ్ల నా అనుభవంతో గ్రహించిన వాస్తవాలు
తప్పు మాత్రం కావు. అర్థం పర్థం లేని పదాలతో టెక్నాలజీ చేదుగానే
తోస్తుంది.. సామాన్యులకు!
ఇక్కడ నాకు తెలుగు భాషపై అపారమైన గౌరవం ఉంది. కానీ భాషారక్షణ పేరుతో
ఇప్పటికే పండితపామరులకు ఆంగ్లంలో ఉన్నా చాలా సులభంగా అర్థమవుతూ ఉన్న
ఇంటర్నెట్, స్క్ర్రీన్, విండో, లాప్ టాప్, మై డాక్యుమెంట్స్ వంటి పదాలను
"నా దస్త్రాలు, తెర, అంతర్జాలం" అని గ్రాంధికత మేళవించి మార్చి పారేస్తే
తెలుగులో కంప్యూటింగ్ విస్తరించడం మాట దేముడెరుగు.. ఈ పదాలు చూసి
తెలుగంటేనే భయపడిపోతారు. ఒక్క విషయం గమనిస్తే "అంతర్జాలం" వంటి కొన్ని
పదాలను ప్రసారమాధ్యమాలూ అనుసరిస్తున్నా ఇలాంటి పదాలను సమర్థించేవారూ, అదే
పనిగా తోచిన పదాలను ఓ పరిమిత సముదాయంలో చర్చలు జరిపి ఇష్టానుసారం
వాడుకలోకి తీసుకురావడానికి ప్రయత్నించేవారూ.. తమ మిత్రులతో గానీ,
ఆత్మీయులతో గానీ ముచ్చటించేటప్పుడు.. "నా దస్త్రాలు, తెర, అంతర్జాలం" అనే
పదాలను ఉచ్ఛరిస్తున్నారా? నేను ప్రశ్నించేది ఈ పదాలు తెలిసి అర్ణమయ్యే
కొద్దిమంది మిత్రులతో సంభాషణల్లో కాదు.. తాము ఎక్కడ తిరిగినా, కొత్త వారు
ఎవరు కలిసినా ఈ క్లిష్టమైన పదాలు నిర్మొహమాటంగా వాడగలుగుతున్నారా?
కొండొకచో వాడితే ఈ వింత పదాలు విని అవతలి వారి హావభావాలు సవ్యంగా
ఉంటున్నాయా? వినే వారికే రుచించనప్పుడు అర్థం కాని పదాలతో టెక్నాలజీని
సామాన్యులకు దూరం చేయడం సరైనదేనా?
నా మనోగతాన్ని ఎవరినో విమర్శించడానికి ఉద్దేశించబడినదిగా సంకుచితంగా
స్వీకరిస్తే నవ్వి నిమ్మకుండడం తప్ప నేనేం చేయలేను. కానీ గత 15
సంవత్సరాలుగా అందరిలా వేలకు వేలు జీతాలు వచ్చే ఉద్యోగాలకు నన్ను నేను
అర్పించుకోకుండా తెలుగు వారికి వీలైన అన్ని మార్గాల్లో టెక్నాలజీని
సరళంగా అందించండం కోసం చిత్తశుద్థిగా అతితక్కువ జీతాలు వచ్చే రంగమైనా
పత్రికారంగంలోనే కొనసాగుతూ తెలుగు సాంకేతిక రంగానికి అంకితమైపోయిన
వ్యక్తిగా ఇలాంటి పోకడలపై నా గళం ఇప్పటికైనా విప్పడం అవసరమనిపించి ఇది
రాశాను.
మణికట్టు ఆపరేషన్ వల్ల ఇది టైప్ చేయడానికే గంట వరకూ పట్టింది. కాబట్టి
మీకెవరికైనా భిన్నాభిప్రాయాలు ఉన్నా వివరంగా చర్చించలేను. అంతగా దీనిపై
మాట్లాడదలిస్తే 9000239948 అనే నా ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి,
మాట్లాడవచ్చు.
--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి
మనం ఇప్పుడు వాడుతున్న తెలుగు చాలావఱకు మన ప్రాచీనులకు (ఈ అర్థంలో)
తెలియదు. ఇంగ్లీషుభాషతో పోటీపడే ప్రక్రియలో భాగంగా గత వందా ఇఱవయ్యేళ్ళుగా
మనం ఈ తెలుగుకి కొత్త పదాలు కల్పించుకుంటూ వాటిని వ్యావహారికంలోకి
జతచేర్చుకుంటూ ఈ స్థాయికి అభివృద్ధి చేశాం. ఇంగ్లీషుపదాలు చాలుననీ,
వాటికి తెలుగు సమార్థకాల్ని సృష్టించాల్సిన అవసరం లేదనీ మన
ముందుతరాలవాళ్ళు అనుకుని ఉంటే ఈపాటికి తెలుగుభాష యావత్తూ మరణించి ఉండేది.
ఎందుకంటే ఆంగ్లపదాల్ని అనువదించకుండా అలాగే వాడితే భాషలో ఏ వాక్యంలోనూ
తెలుగు ఉండదు. అలాంటి తెలుగు మాట్లాడడం కన్నా ఇంగ్లీషు మాట్లాడడమే
సులభంగా ఉంటుంది. కనుక జనం తెలుగుని పూర్తిగా వదిలేస్తారు. స్వకీయత
(ఒరిజినాలిటీ) లేని భాష ఎవఱికీ అవసరం లేదు.
సాంకేతిక విద్యలో తెలుగుకు స్థానం లేదు. మన ఎంజినీరింగ్ కళాశాలల్లో
పాఠాలన్నీ ఇంగ్లీషులోనే జఱుగుతాయి. కనుక ఆ సాంకేతిక పదాలకు తెలుగు
సమార్థకాల్ని సృజించాల్సిన ఆవశ్యకత వారికి లేదు. కానీ అవే సబ్జెక్టుల్ని
తెలుగులో చెప్పాల్సివస్తే తెలుగుపదాలు కావాలి. అర్థం కావడం అనేది ఒక
కాలానుగతమైన ప్రక్రియ. పుడుతూనే మనకు ఏదీ అర్థం కాదు. అందఱికీ అర్థం
అవుతాయని చెబుతున్న ఇంగ్లీషు పదాలు కూడా శిక్షణా ప్రక్రియలో
నేర్చుకున్నవే. పుడుతూనే నేర్చుకున్నవి కావు. మన పదజాల పరిజ్ఞానం వయసుతో
పాటు పెఱుగుతూ పోతుంది. ఆ పెఱిగే పదజాలంలో తెలుగు ఎందుకు ఉండకూడదు ?
ఇంగ్లీషు పదాల పరిజ్ఞానాన్ని మాత్రమే ఎందుకు పెంచుకోవాలి ?
ఇక్కడ టెక్నాలజీ గుఱించి మాట్లాడుతున్నాం, మనం టెక్నాలజీ మనుషులం కనుక.
కానీ ఒక వైద్యుడు, ఒక రసాయనవేత్త, ఒక అణువిజ్ఞాని - వీళ్ళందఱూ కూడా
తెలుగుపదాలకు వ్యతిరేకంగా సరిగ్గా ఇదే వాదాన్ని లేవదీయగలరు.
కాబట్టి సారాంశరూపంగా ఏమవుతుందంటే -
౧. తెలుగులో ఏ శాస్త్రానికి సంబంధించీ, ఏ విధమైన సాంకేతిక పదజాలమూ
ఉండకూడదు. డు,ము,వు.ల్లాంటివి మాత్రమే ఉండాలి. ఇంగ్లీషుని తెలుగులిపిలో
వ్రాస్తే అదే తెలుగు.
౨. ఉన్నా అది అందఱికీ అర్థం కాకూడదు. (ఎందుకంటే వాళ్ళకు ఏది అర్థం కావాలో
ఏది కాకూడదో మనం ముందే నిర్ణయించేశాం. అంతకు మించి వాళ్ళకు ఇంకేమీ అర్థం
కాకూడదు)
౩. తెలుగులో సాంకేతిక పదజాలాన్ని ప్రచారం చేయకూడదు (ఎందుకంటే మేము
ఇదివఱకే ఒక విధమైన ఇంగ్లీషు పదజాలాన్ని ప్రచారం చేసేశాం. దానికి మీరు
అడ్డం రావద్దు)
౪. కాబట్టి తెలుగులో సాంకేతిక శాస్త్రాలేవీ వద్దు. అవన్నీ ఇంగ్లీషులోనే
ఉండాలి.
౫. ఆ విధంగా తెలుగులో సాంకేతికపదాలూ, సాంకేతిక పదాలూ లేకుండా చేస్తాం
కనుక తెలుగు పొట్టపోసుకోవడానికి పనికి రాదు. పోనివ్వండి. మాకు
ఇంగ్లీషుంది.
౬. తెలుగు మనకు పొట్టపోసుకోవడానికి పనికిరాదు కనుక మనం అసలు అది
మాట్లాడొద్దు. చావనివ్వండి వెధవ తెలుగు, పోతే నష్టమేముంది ?
ఇంత కథ ఉంది.
ఏది దేనికి దారితీస్తుందో, (దారితీసిందో) గమనించండి !
వ్యావహారికానికి అర్థం తెలుగుభాషని చంపడం కాదు. జనానికి అర్థం కావడమంటే
కొత్తపదాల్ని సృష్టించకూడదని కాదు. అర్థమవుతున్న భాషలో కొత్తపదాల్ని
మిశ్రమం చేయడమని !
సార్ ! మీరు టెక్నాలజీ వ్యక్తీకరణల్లోనే కాక మామూలు తెలుగు సంభాషణల్లో
కూడా తెలుగు పదాలు ఎక్కువ వాడరు. ఏకకాలంలో రెండు పడవల మీద కాళ్ళు
పెట్టలేని మీ వ్యక్తిగత కష్టాన్ని, మీ ప్రొఫెషనల్ ఇబ్బందుల్నీ నేను అర్థం
చేసుకోగలను. కానీ తెలుగు పదాలు కనిపెడితే వాడడానికి చాలామంది కాచుక్కూచు
నున్నారు. తెలుగు ప్రాచుర్యాన్ని, తెలుగువాళ్ళ భాషాభిమానాన్ని మనం తక్కువ
అంచనా వేయడం సరికాదు. మీరు ప్రస్తావించిన "సామాన్యులు" బాల్యమాదిగా
ఇంగ్లీషు మీడియం ఎంజినీరింగ్ కళాశాలల ఉత్పత్తులు. వాళ్ళ గుఱించి
ఆలోచించడం మానేద్దాం. ఎందుకంటే వాళ్ళు మన గుఱించి ఆలోచించరు. కారణం -
వారంతా ఫక్తు వృత్తివ్యాసంగపరులు. ఆర్థిక జీవులు. వారికిది ముఖ్యం కాదు.
మనం సువిశాల తెలుగువాళ్ళని దృష్టిలో పెట్టుకుందాం. తెలుగుజాతినీ,
తెలుగుభాష యొక్క సుదూర భవిష్యత్తునీ దృష్టిలో పెట్టుకుని పనిచేద్దాం. మన
సాంకేతిక అవసరాల్నీ, సాంస్కృతిక అవసరాల్నీ తగుపాళ్ళలో సమన్వయించుకుంటూ
ముందుకు సాగాలి. ఏదో ఒకదానికే అతివేల ప్రాధాన్యం ఇవ్వడం
సత్ఫలితాలివ్వకపోవచ్చు.
అందరికీ అలవాటైన సాంకేతిక పదాలను కూడా తెలుగులో ఇంటర్నెట్ ని "అంతర్జాలం"
On Jun 12, 12:10 pm, తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం
తాడేపల్లి గారు.. పెద్దలు మీరంటే నాకు అపారమైన గౌరవం. ఒక్క విషయం సూటిగా
చెప్పండి.. మీరూ, నేనూ, మనందరం మాట్లాడుతూ పోతే ఏ పదమైనా ప్రాచుర్యం
చెందుతుంది, ఒప్పుకుంటాను. సరే రోజువారీ మీరు మర్చిపోకుండా ఇంటా. బయటా
కొత్త సాంకేతిక పదాల్ని విస్మరించకుండా వాడుతూనే ఉన్నారా? అంటే ctc వంటి
కంప్యూటర్ షాపింగ్ కాంప్లెక్స్ లకు వెళ్లి "గట్టిపళ్లెం" కొత్తది కావాలని
అడగగలుగుతున్నారా?
ఇంకా వివరంగా టైప్ చేయలేను.. ఫోన్ చేస్తే మాట్లాడగలను.
గిరిధర్ గారు నా అభిప్రాయంలో తెలుగు భాష మీద న్యూనత కన్పిస్తే నేనేమీ
చేయలేను.. పోర్టబుల్ హార్డ్ డిస్క్ ని తీసుకురమ్మని చెప్పాలంటే "పంపక
సులభ గట్టిపళ్లెం" అని కష్టపడి ప్రతీచోటా మాట్లాడడానికి మనం సిద్ణమా?
టెక్నాలజీ నేర్చుకునే తపన ఉన్న వారి దృష్టి విషయ సరళత మీద ఉంటుంది గానీ
భాషాగాఢత మీద కాదు. టెక్నాలజీనీ, భాషనీ వేరుచేసి ఆలోచించి చూడండి, నా
భావం అర్థమవుతుంది.
On Jun 12, 11:58 am, తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం
On Jun 12, 11:35 am, Lanka Giridhar (లంక గిరిధర్)
<giridhar.la...@gmail.com> wrote:
> శ్రీధర్ గారు,
> మీరు చెప్పిన దాంట్లో నిజము లేకపోలేదు, కానీ సాంకేతిక పరిజ్ఙానార్జన పేరున
> భాషను న్యూనపఱచుకోవడం సబబుకాదు.
> గిరి
>
> 2011/6/12 నల్లమోతు శ్రీధర్ <sridharc...@gmail.com>
> > * మరిన్ని విషయాలకై,http://groups.google.com/group/telugupadam?hl=teవద్ద
--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
అనువాదం పేరిట పదాలను "నిష్పాదించడం" వలన కూడలిలో ఉన్న పండితుల అభిరుచి
తృప్తి చెందడమే గాక మిగతా తెలుగు ప్రపంచానికి ఉపయోగపడితే సంతొషం.
--
కిల్లంసెట్టి వెంకటరమణ
మీరు తెలుగు భాషా సేవకులుగా.. మీరు సృష్టించిన
గట్టిపళ్ళెం(HDD), జాలగూడు, విహారిణి, నియంత్రణా వ్యవస్థ
(O.S),క్రమకర్తలు(Programmers),ఖతి (Font),సంగణకం(Computer),
విశ్వవ్యాప్త వలయం(World Wide Web), మృదులాంతకం (Software),"పంపక సులభ
కవిలె (PDF)"అలాగే సంప్రకారం (Format)
పదాలను వాడుతున్నారా? బ్లాగుల్లో కాదు నిజజీవితంలో! దీనికి నిజాయితీగా
సమాధానం చెప్పాకే విశ్లేషణ చేయండి, ధన్యవాదాలు, శెలవు.
శ్రీధర్ గారూ అందరినీ చెప్పమన్నారు కనుక నా అభిప్రాయానికి విలువ ఉన్నా లేకపోయినా నేను చెప్తే ఏమనుకోవద్దు. నావరకైతే నేను వీటిని సామాన్యమైన సంభాషణలో వాడలేదు, వాడినా అది నాకే ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. నేను ఆంధ్రదేశంలో ఉండకపోవడం దానికి కారణం కాదు. ఒకవేళ ఉన్నాకానీ నేను నా దైనందిన జీవితంలో ఇలాంటి మాటలని ఇంట్లో వాళ్ళతో, చుట్టుపక్కలవాళ్ళతో మాట్లాడితే నాకేమైనా మతి తప్పిందేమో అని వాళ్ళు అనుకుంటారేమో తెలియదు. ఇంక దుకాణాల్లో వాడే పనే లేదు. అదీకాక అటువంటి వాడిక అదేదో తెచ్చిపెట్టుకున్నట్టుగా నాకు నా మాతృభాష ఉన్న అభిమానాన్ని ప్రదర్శించుకుంటున్నట్టుగా ఉంటుందని నా అభిప్రాయం. మాతృభాషాభిమానం ఉండటం మంచిదే. అది అందరికీ ఉంటుంది కానీ ఈ కంప్యూటర్లని, ఈ కంపుటర్ పదజాలాలనీ కనిపెట్టినవారు తెలుగువారే కనుక అయి ఉంటే వాటిని నేను తప్పక పాటించేదాన్నే. కానీ ఆ యంత్రాలని కనిపెట్టడంలో తెలుగువాళ్ళకి ఏ పాత్రా లేదు కనుక అది కూడా అరువు తెచ్చుకోవడమే కదా! మాతృభాషమీద ప్రేమ ఉండటం మంచిది కాదని ఎవరు చెప్పరు కానీ ఇటువంటి పదాలని వాడితే మాత్రమే అది మనకి ఉన్న భాషాభిమానానికి కొలమానం అవుతుందంటే నేను అంగీకరించను. అది నాకు కొంతమట్టుకు చాదస్తంగా కనపడుతుంది.
మామూలు తెలుగు పదాలనే ఈ తెలుగు బ్లోగు లోకంలో కొంతమంది ఆంగ్ల పదాలు లేకుండా రాయలేకపోతున్నప్పుడు, ఈ Technical terminology ని తెలిగీకిరించినంత మాత్రాన్న అది మన మాతృభాష మీద మనకి ఉన్న ప్రేమని దృష్టాంతపరచదనీ లేక వెల్లడిపరచదనీ నా అభిప్రాయం. ఆ ప్రేమని ఆ అభిమానాన్ని కనపరచడానికి ఇతర ఎన్నో మార్గాలు ఉన్నాయి.
నేను ఈ చర్చలో పాలొగొనడానికి అర్హురాలినో కాదో నాకు తెలియదు. కానీ ఇలా రాయడం వల్ల ఎవరిని నొప్పించినా క్షంతవ్యురాలిని.
--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి
అందరికీ అలవాటైన సాంకేతిక పదాలను కూడా తెలుగులో ఇంటర్నెట్ ని "అంతర్జాలం" అనీ, ఆండ్రాయిడ్ టాబ్లెట్ వంటి వాటిని "పలక"లనీ కొత్త పదాలనూ ఆవిష్కరించేసి…
అంతర్జాలం అన్న పదాన్ని చూసినప్పుడల్లా "మార్జాలం (పిల్లి)", పలక అనగానే బడి పలక గుర్తొస్తాయి.
కొత్త తెలుగు సాంకేతిక పదాల అన్వేషణ కన్నా ఇప్పటికే వాడుకలో ఉన్న అనేక సాధారణ తెలుగు పదాలు మరుగునపడిపోతున్నాయి. వాటిపై దృష్టి పెట్టడం చాలా అవసరం.
1996లో మొదటిసారి తెలుగులో కంప్యూటర్ సాహిత్యాన్ని ప్రారంభించినప్పటి నుండి ఇలా తోచిన పేర్లని ప్రయోగించదలిచినట్టయితే ఇప్పటికి గందరగోళం సృష్టించి ఉండగలిగే వాడిని. అప్పట్లో నా లక్ష్యం పదాలు ఏవైనా ఈజీగా అర్థమవడం.
అధికశాతం యువతరానికి తెలుగు చదవడం రాదు. ఇంగ్లీషులో పత్రిక తీసుకురమ్మని అడిగేవారు ఎంతమందో!
ఈ నేపధ్యంలో కొత్త పదాలతో కాస్తో కూస్తో పఠనాసక్తి కలిగిన వారినీ బేజారెక్కించడం ఎంతవరకూ సబబు?
ఇక్కడ నాకు తెలుగు భాషపై అపారమైన గౌరవం ఉంది. కానీ భాషారక్షణ పేరుతో ఇప్పటికే పండితపామరులకు ఆంగ్లంలో ఉన్నా చాలా సులభంగా అర్థమవుతూ ఉన్న ఇంటర్నెట్, స్క్ర్రీన్, విండో, లాప్ టాప్, మై డాక్యుమెంట్స్ వంటి పదాలను "నా దస్త్రాలు, తెర, అంతర్జాలం" అని గ్రాంధికత మేళవించి మార్చి పారేస్తే తెలుగులో కంప్యూటింగ్ విస్తరించడం మాట దేముడెరుగు.. ఈ పదాలు చూసి తెలుగంటేనే భయపడిపోతారు.
ఒక్క విషయం గమనిస్తే "అంతర్జాలం" వంటి కొన్ని పదాలను ప్రసారమాధ్యమాలూ అనుసరిస్తున్నా ఇలాంటి పదాలను సమర్థించేవారూ, అదే పనిగా తోచిన పదాలను ఓ పరిమిత సముదాయంలో చర్చలు జరిపి ఇష్టానుసారం వాడుకలోకి తీసుకురావడానికి ప్రయత్నించేవారూ..
తమ మిత్రులతో గానీ, ఆత్మీయులతో గానీ ముచ్చటించేటప్పుడు.. "నా దస్త్రాలు, తెర, అంతర్జాలం" అనే పదాలను ఉచ్ఛరిస్తున్నారా? నేను ప్రశ్నించేది ఈ పదాలు తెలిసి అర్ణమయ్యే కొద్దిమంది మిత్రులతో సంభాషణల్లో కాదు.. తాము ఎక్కడ తిరిగినా, కొత్త వారు ఎవరు కలిసినా ఈ క్లిష్టమైన పదాలు నిర్మొహమాటంగా వాడగలుగుతున్నారా? కొండొకచో వాడితే ఈ వింత పదాలు విని అవతలి వారి హావభావాలు సవ్యంగా ఉంటున్నాయా?
వినే వారికే రుచించనప్పుడు అర్థం కాని పదాలతో టెక్నాలజీని సామాన్యులకు దూరం చేయడం సరైనదేనా?
తెలుగు సాంకేతిక రంగానికి అంకితమైపోయిన వ్యక్తిగా ఇలాంటి పోకడలపై నా గళం ఇప్పటికైనా విప్పడం అవసరమనిపించి ఇది రాశాను.
కాన్పూర్ లో computer ని అందరం డబ్బా అంటాం. (తెలుగు/హిందీ పదమే అందరికీ
అర్థమవుతుంది, ఇంగ్లీష్ కాదు)
ఇక్కడ తెలుగు వాళ్ళం (inter)net ని వల అని
lappy ని ఒళ్ళో పిల్ల అని అంటున్నం; ఎవఱూ నవ్వట్లేదు
మేము తెలుగు బ్లాగులు రాయటం లేదు ;)
ఏతావాతా ఈ చర్చ వలన ఓ మంచి విషయం వెలుగులోనికి వచ్చింది.
" తెలుగులో కొత్త పదాలు కనిపెట్టే ప్రక్రియ ప్రజల శల్యపరీక్షలకు నిలబడేంత
నాణ్యంగా ఉండాలి. ఆ పరీక్షలకు విస్తృతమైన వేదిక (ప్రచార సాధనాల అండ)
అవసరం ఉంది"
----అచంగ
శ్రీదర్ గారి భావాలు technology ని సామాన్యుడికి కూడా అందజేయడం మాత్రమే
కాని తెలుగును కించపరచడానికి కాదు, పైగా ఆయన పత్రికలో కూడా తెలుగు పదం
అనే కాలమ్ విడిగా వుండి దానిలో ఒక తెలుగు పదం కూడా చేరుస్తారు.
శ్రీధర్ గారి లాంటి పెద్దవారు ఈ గుంపులో ఇలా రాస్తే దీనిని వేరేగా అర్ధం
చేసుకుని తెలుగు మీద ఆసక్తీని తగ్గించుకునేవారు లేకపోలేదు. కానీ అలా ఏ
మాత్రం జరగకూడదు.
ఇప్పుడు వున్న యువత అంతా ఇంగ్లష్ మీడియంలోనే చదవడం వల్ల వారికి తెలుగు
సరిగా రాక, ఇంగ్లిష్ సరిగా అర్ధం కాక ఏదోలాగా బట్టీ పట్టీ పాసవుతున్నారు.
నాకు తెలిసి అలాంటి వారు మాత్రమే పత్రికను ఇంగ్లిష్‌లో తెమ్మంటారు.
అలాంటి వారు నాకు తెలిసి ఓ 20 to 30% మాత్రమే వుంటారు. మిగతా వారంతా
పత్రికను తెలుగులో చదవాలని కోరుకుంటున్నవారే, అంతెందుకు నేను కూడా
తెలుగులో వుండాలనే కోరుకుంటాను.
కె.కిరణ్‌కుమార్ గారు నాకు మంచి గురువు. ఆయన తెలుగులో రాసిన "సి
నేర్చుకుందాం" అనే పుస్తకం నాకు దొరకకపోయింటే ఇప్పుడు కంప్యూటర్ అంటేనే
భయపడే స్ధితిలో వుండేవాడిని. అందులో ఆయన చాలా తెలుగు పదాలు వాడారు.
ఇప్పుడు నాకు కంప్యూటర్ షాపు వుంది.
ఇప్పుడున్న సమస్య సామాన్యుడికి సైతం కంప్యూటర్‌ని తెలియజేయడం, దీనికీ
ఓకటే పరిష్కారం, కంప్యూటర్లని తెలుగులో వాడటం, start button నుంచి
shutdown అయ్యే వరకు అంతా ఇంగ్లిష్‌లోనే వుంటే ఖచ్చితంగా సామాన్యడు దీని
జోలికి రాడు. లైనక్స్‌లో తెలుగును జొప్పించే ప్రయత్నం ఇంకా అభివృద్ధి
దశలోనే వుంది. లైనక్స్ మెత్తం తెలుగులోనే వచ్చే సమయం ఇంకెతో దూరంలో లేదు.
ఆనాడు తెలుగు న్యూస్ పేపర్ చదివే ప్రతి ఒక్కరూ కంప్యూటర్‌ని కూడా
ఉపయోగించడం మెదలు పడతారు. దాని కోసం మనం ఎంతో కృషి చేయాలి, వీలైనన్నీ
కొత్త పదాలకి తెలుగు పదాలు కన్నుక్కోవాలి, అప్పుడు మాత్రమే సామాన్యులకి
కంప్యూటర్ చేరువవుతుంది.
అందరికీ అలవాటైన సాంకేతిక పదాలను కూడా తెలుగులో ఇంటర్నెట్ ని "అంతర్జాలం"
అనీ, ఆండ్రాయిడ్ టాబ్లెట్ వంటి వాటిని "పలక"లనీ కొత్త పదాలనూ
ఆవిష్కరించేసి… అసలే అంత ఈజీగా వంటబట్టని టెక్నాలజీని మరింత క్లిష్టం
చేయడం హాస్యాస్పదం.
ధన్యవాదాలు
అర్జున
కొత్త తెలుగు సాంకేతిక పదాల అన్వేషణ కన్నా ఇప్పటికే వాడుకలో ఉన్న అనేక సాధారణ తెలుగు పదాలు మరుగునపడిపోతున్నాయి. వాటిపై దృష్టి పెట్టడం చాలా అవసరం.
ఈ రెండూ వేర్వేరు అంశాలు. తెలుగుపదం గుంపు పారిభాషిక తెలుగు పదాలపై దృష్టి సారించింది. ఈ ప్రక్రియ చాలా అవసరమని వ్యక్తిగతంగా నేను నమ్ముతాను. ఈ ప్రక్రియ పరిశోధన, కొత్త విషయాలను ప్రయత్నించి చూడడం. అది దీర్ఘకాలంలో భాషని సుసంపన్నం చేస్తుందే కానీ పరిమితం చేయదు.
మరుగున పడిపోతున్న తెలుగు పదాలను వ్యాప్తి లోనికి తీసుకురావడానికి కృషి తప్పనిసరిగా అవసరం. దాన్నెవరూ కాదనరు. దానికై మరో గుంపు మొదలుపెట్టవచ్చు కూడా.