4,406 views
Skip to first unread message

kv ramana

unread,
Jan 14, 2012, 11:56:55 PM1/14/12
to telugupadam
ఓం
ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః 
ధ్రువం ఇంద్రశ్చాగిశ్చ రాష్ట్రం ధారతాం ధ్రువం

పై మంత్రం సరిగ్గా ఉందా? (ముఖ్యంగా ఎరుపు చేసిన అక్షరాలు సందేహం కలిగిస్తున్నాయి.)
దీని అర్థం ఏమిటి? ఏ సందర్భంలో స్మరించాలి?  మిత్రులు వివరిస్తే కృతజ్ఞుడవుతాను 
కిల్లంసెట్టి వెంకటరమణ

arka somayaji

unread,
Jan 15, 2012, 12:06:21 AM1/15/12
to telug...@googlegroups.com
"ధారయతాం! ధృవం" ! అని ఉండాలి.

2012/1/15 kv ramana <kvje...@gmail.com>

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
 
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి



--

kv ramana

unread,
Jan 15, 2012, 1:17:54 AM1/15/12
to telug...@googlegroups.com
సరే, 
ఇంద్రశ్చాగిశ్చ  సరిగా ఉందా?  ఇంద్రశ్చాగ్నిశ్చ  అవుతుందా? 

2012/1/15 arka somayaji <arkaso...@gmail.com>

ముక్కు శ్రీరాఘవకిరణ్ శర్మ

unread,
Jan 15, 2012, 1:21:17 AM1/15/12
to telug...@googlegroups.com
సరైన పాఠం ఇదండీ...

ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః
ధ్రువం త ఇన్ద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువమ్.

ధ్రువం త అన్నది సరైనదే. "తే + ఇన్ద్రః = త ఇన్ద్రః" ఔతుంది. దాదాపు ఇలాంటి ప్రయోగమే మఱొకటి: "మే + ఆవహ = మ ఆవహ".

నమస్సులతో
రాఘవుడు

arka somayaji

unread,
Jan 15, 2012, 1:26:18 AM1/15/12
to telug...@googlegroups.com
ఇంద్రశ్చాగ్నిశ్చ అనేదే సరియైనది.కారణం ఇంద్రశ్చ ,అగ్నిశ్చకాబట్టి .ఈ సమాసం నేను ముందు గమనించలేదు.కావున సరిదిద్దలేకపోయాను.

ముక్కు శ్రీరాఘవకిరణ్ శర్మ

unread,
Jan 15, 2012, 1:49:09 AM1/15/12
to telug...@googlegroups.com
నాకు తెలిసినంతలో అర్థం--

తే రాష్ట్రం ధారయతాం రాజా వరుణో దేవో బృహస్పతిః ఇన్ద్రః అగ్ని ధ్రువమ్ = నీకూ నీ రాష్ట్రమును ధరించేవారికీ చంద్రుడు, వరుణుడు, బృహస్పతి, ఇన్ద్రుడు, అగ్ని ధ్రువముగా ఉండుగాత. ఇక్కడ రాష్ట్రమంటే అనేకార్థాలు చెప్పుకోవచ్చు. రాష్ట్రమంటే నివసించే ప్రదేశమనీ, ప్రజలనీ, దేహమనీ, ఉపద్రవమనీ ... అర్థాలు చెప్పుకోవచ్చు. రాజృ = ప్రకాశించటం అనే ధాతువునుండి.

ప్రయోగం--

సుముహూర్తాలలో చంద్రాదుల అనుగ్రహం కలగాలని ఆశీరర్థకంలో.

ముక్కు శ్రీరాఘవకిరణ్ శర్మ

unread,
Jan 15, 2012, 1:52:23 AM1/15/12
to telug...@googlegroups.com
బహుశా, దేవః అన్నది సూర్యుడన్న అర్థంలో వాడినట్టున్నారు. దీవ్యతి ఇతి దేవః, ప్రకాశిస్తాడు కనుక దేవుడు అని వ్యుత్పత్తి.

kv ramana

unread,
Jan 15, 2012, 9:52:34 PM1/15/12
to telug...@googlegroups.com
సోమయాజి గారికి, శర్మ గారికి కృతజ్ఞతలు 

2012/1/15 ముక్కు శ్రీరాఘవకిరణ్ శర్మ <msrk...@gmail.com>
బహుశా, దేవః అన్నది సూర్యుడన్న అర్థంలో వాడినట్టున్నారు. దీవ్యతి ఇతి దేవః, ప్రకాశిస్తాడు కనుక దేవుడు అని వ్యుత్పత్తి.

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
 
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి

ranganath middela

unread,
Jan 16, 2012, 11:31:54 PM1/16/12
to telug...@googlegroups.com
దారయతాం అని ఉండాలి .. రాగ్నిశ్చ సరైనది..


2012/1/15 kv ramana <kvje...@gmail.com>

Arka Somayaji

unread,
Jan 20, 2012, 4:12:40 AM1/20/12
to telug...@googlegroups.com
రంగనాథ్ గారూ!యాజుష స్మార్త పూర్వ ప్రయోగ చంద్రిక పేజీ నంబరు 182 లో  మొదటి వరుస  వివాహ భాగాన్ని చూసి ఒక నిర్ధారణకు రండి! ఏది ఎలా ఉండాలో మికే అవగతమౌతుంది.

2012/1/17 ranganath middela <ranga...@gmail.com>



--
Reply all
Reply to author
Forward
0 new messages