Default కి తెలుగుపదం?

349 views
Skip to first unread message

Veeven (వీవెన్)

unread,
Jul 11, 2007, 5:43:11 AM7/11/07
to తెలుగుపదం
default (noun)
what happens or appears if you do not make any other choice or change

default option

స్వేచ్ఛ లిసక్సులో "అప్రమేయం", "అప్రమేయాలు" అని వాడుతున్నారు.

మంచి పదమేదైనా సూచించగలరా?

--
వెబ్సైట్: http://veeven.com/ | బ్లాగు: http://veeven.wordpress.com/

నవీన్ గార్ల

unread,
Jul 11, 2007, 7:00:18 AM7/11/07
to తెలుగుపదం
ఎనిమదవ తరగతి లెక్కెల పుస్తకంలో ఇటువంటి ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్థాలు
ఉపయోగించినట్లు గుర్తు....మళ్ళీ మనం తెలుగు ఉన్నత పాఠశాల పుస్తకాలు
పట్టాల్సిందే :)

Kiran Varanasi

unread,
Jul 11, 2007, 7:39:19 AM7/11/07
to telug...@googlegroups.com
బ్రౌణ్యం ప్రకారం

ప్రమేయం : comprehensible, known for certain
అప్రమేయం : incomprehensible, inconceivable
అప్రమేయుడు : the one who is inconceivable (God)

default కి failure to act (lack of action) లేదా ఇంకా కరెక్టుగా failure to choose (lack of choosing) గా అనువాదం చెయ్యాలి.

కనుక, తేటతెలుగులో  ఎంపులేమి
సంస్కృత సమంలో  అనావరిత

తెలుగుమీడియం పాఠ్యపుస్తకాలలో ఎలా ఉందో మీరెవరైన గమనిస్తే ఇక్కడ తెలపండి.

Kiran Varanasi

unread,
Jul 11, 2007, 7:48:03 AM7/11/07
to telug...@googlegroups.com
ఎంపులోపము అని కూడా అనవచ్చేమో

కందర్ప కృష్ణ మోహన్

unread,
Jul 11, 2007, 7:49:27 AM7/11/07
to telug...@googlegroups.com
"Computers. a value that a program or operating system assumes, or a course of action that a program or operating system will take, when the user or programmer specifies no overriding value or action. " అని
 
http://dictionary.reference.com/browse/default  లో ఉన్నది దీని ప్రకారం పదం కనుక్కుందాం.



--
కృష్ణ మోహన్ కందర్ప
భాగ్యనగరము
http://telugutheepi.blogspot.com/
http://manikyaveena.blogspot.com/
http://idikathakadu.blogspot.com/

వెంకట రమణ (Venkata Ramana)

unread,
Jul 11, 2007, 7:51:22 AM7/11/07
to telug...@googlegroups.com

ఎంపులేమి నాకు నచ్చింది.
On 7/11/07, Kiran Varanasi <vak...@gmail.com> wrote:

Veeven (వీవెన్)

unread,
Jul 11, 2007, 8:08:38 AM7/11/07
to telug...@googlegroups.com
వీటిని ప్రయత్నించండి

నామవాచకంగా: If you don't specify a number of items, the default is 1.

క్రియగా: If you don't specify a number of items, it defaults to 1.

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Jul 11, 2007, 8:34:57 AM7/11/07
to తెలుగుపదం
పదాల్ని యథాతథంగా అనువదించడం ఎల్లవేళలా కుదరకపోవచ్చు.వాడుకలైనా అంతే !
ఇంగ్లీషులో default క్రియాధాతువుగా నామవాచకంగా - రెండు విధాలుగాను
వాడుతున్నారు కనుక తెలుగులో కూడా అలాగే చేద్దామని పట్టుపట్టొద్దు. ఏది
ఎలా వీలుపడితే దాన్ని అలా వాడదాం. ముఖ్యంగా default అనే పదానికి మన
"తెలుగు మనసు"లో కలుగుతున్న ప్రతిక్రియను పరిశీలించి ఆ ప్రకారంగా
సమానార్థకాన్ని రూపొందించుకోవాలి. Trust your sixth sense or instinct
more than a lexical interpretation.

Default అనేది ఆచరణాత్మకంగా చూస్తే :- వాడుకరి (user) దేన్నీ ఎంపిక
చేసుకోనప్పుడు యంత్రం/యంత్రలిపి (software) స్వతంత్రించి తీసుకునే చర్య.

మరో రకంగా చూసినప్పుడు :- ఎంపిక చేసుకోకముందే తనంతట తాను అమలుకావడానికి
సిద్ధంగా ఉన్న చర్య.

వాడుకరి చేసుకునే ఎంపికతో/ఇష్టంతో పనిలేని చర్య.

దీనికి అనపేక్షితం అనడం సమంజసం.

అనపేక్షిత అమరికలు (adj.)= default settings
అనపేక్షించుట (verb)= defaulting
అనపేక్ష (noun) = default
అనపేక్షితంగా (adv.) = by default

పరిశీలించగలరు.

Veeven (వీవెన్) Vraasenu:

కందర్ప కృష్ణ మోహన్

unread,
Jul 11, 2007, 8:39:21 AM7/11/07
to telug...@googlegroups.com
తాబాసు గారి ఎంపిక బాగుంది.
అలాగే కంప్యూటర్ కి సంబంధించి
"నియంత్రణ వ్యవస్థ ఎంపిక" అంటే బాగుందాండీ...

Prasad Charasala

unread,
Jul 11, 2007, 8:42:40 AM7/11/07
to telug...@googlegroups.com

తాడేపల్లి vs కిరణ్ ల పదసృష్టి/సూచిక చూస్తే రామారావు vs చంద్రబాబు ల పధకాల పేర్ల స్వామ్యం కనిపిస్తోంది. :)

--ప్రసాద్
http://blog.charasala.com



తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Jul 11, 2007, 8:47:09 AM7/11/07
to తెలుగుపదం
మరో విషయం. అప్రమేయం అంటే అసలు అర్థం - "కొలవడానికి వీలుపడనిది" అని.
తెలుగులో ప్రమేయం అంటే జోక్యం. వాడుకరి (user) జోక్యం లేకుండా అమలు జరిగే
చర్య కనుక అలా పేరు పెట్టి ఉంటారు.

ఇక్కడ ఒక చిన్న అయోమయాన్ని స్పష్టీకరించుకోవాలి. "అ" మరియు "నిర్/నిష్"
అనే ఉపసర్గల ఉపయోగం తెలియక చేసే ప్రయోగాలివి.

"అ" అని పదానికి ముందు చేరిస్తే "కాదు/కానిది" అని అర్థం.
జ్ఞానం కానిది = అజ్ఞానం
ప్రాచ్యుడు (తూర్పు దేశస్థుడు) కానివాడు = అప్రాచ్యుడు
సాధారణం కానిది = అసాధారణం

కాని "నిర్/నిష్" అనే ఉపసర్గల్ని "లేనిది" అనే అర్థంలో వాడతారు.
నిర్ + లజ్జగా = లజ్జ లేకుండా
నిష్ + కారణంగా = కారణం లేకుండా

ఆ దృష్టితో చూస్తే "అప్రమేయం" ఇక్కడ అర్థయుక్తంగా ఇమడదు.

ఇక "ఎంపిక లేమి"ని తీసుకుంటే - "లేమి" నామవాచకం (noun). దానికి ఇతర భాషా
భాగాల (parts of speech) రూపాలు అంటే క్రియ, విశేషణం మొ. ఇంకా
ఏర్పడినట్లు తోచదు.
Prasad Charasala Vraasenu:

> --
> Prasad
> http://blog.charasala.com

Kiran Varanasi

unread,
Jul 11, 2007, 9:02:52 AM7/11/07
to telug...@googlegroups.com
If you don't specify a number of items, the default is 1.

మీరు వస్తువుల సంఖ్య చెప్పకపోతే, ఎంపులోపిత సంఖ్య ఒకటి.
మీరు వస్తువుల సంఖ్య చెప్పకపోతే, ఎంపులోపితం ఒకటి


f you don't specify a number of items, it defaults to 1.

మీరు వస్తువుల సంఖ్య చెప్పకపోతే, ఒకటిగా ఎంపులోపితమవుతుంది.


On 7/11/07, Veeven (వీవెన్) <vee...@gmail.com > wrote:

Kiran Varanasi

unread,
Jul 11, 2007, 9:43:10 AM7/11/07
to telug...@googlegroups.com
ప్రసాద్ గారు

భలే నవ్వు తెప్పించారు :) కానీ, ఇక్కడ మనం చేస్తున్న ప్రయత్నం పోటీ కాదు, సాధ్యమైనన్ని అనువాదాలు కల్పించుదాం. మొత్తం మీద తెలుగుభాష భాగ్యపడుతుంది. అన్నింటినీ ఒకచోట పొందుపరుద్దాం. జనాలు ఏవి వాడాలో వాళ్ళే నిర్ణయించుకుంటారు.

నా దృష్టిలో అనాపేక్షితం అంటే బానే ఉంది.  ఎంపులోపితం అంటేనూ బానే ఉంది. ఎక్కువ పదాలు ఉంటే పర్యాయపదాలవలే ఉంటాయి.

రాకేశ్ ఆచంట

unread,
Jul 14, 2007, 2:11:21 AM7/14/07
to తెలుగుపదం
వీవెన్,
default అనేదానికి అసలు అర్థం 'not doing anything' అని వస్తుంది.
కంప్యుటర్ల రాక ముందు దీనిని లోను ఎగ్గొట్టడానికి వాడే వారు. ఇప్పటికి
కూడా వాడతారనుకోండి.

నా అభిప్రాయం ఎం టంటే,
తెలుగు లో అన్ని default లకు సరిపోయే టట్ట ఒక పదం వెతకడం కష్టం, time
లాగా.
కాబట్టి లోన్ ఎగ్గొట్టడానికి వేరే పదం, ఎఁవి చేయకుండుటకు వేరే పదం
వెతుక్కుంటే బాగుంటుంది.

రాకేశ్వరరావు

Kiran Varanasi

unread,
Jul 14, 2007, 4:58:30 AM7/14/07
to telug...@googlegroups.com
లోను ఎగ్గొట్టడానికి. మిలిటరీలో పని ఎగ్గొట్టడానికి  చేతలోపితం , డిఫాల్టు ఆప్షన్ అనడానికి  ఎంపులోపితం

Ramanadha Reddy Yarrapu Reddy

unread,
Jul 14, 2007, 12:14:31 PM7/14/07
to telug...@googlegroups.com
default అనేదానికి అసలు అర్థం 'not doing anything' అని వస్తుంది.
కంప్యుటర్ల రాక ముందు దీనిని లోను ఎగ్గొట్టడానికి వాడే వారు. ఇప్పటికి
కూడా వాడతారనుకోండి.
 
not doing anything తో సరిపెట్టక, not doing something that should have been done అంటే, default కి మరింత దగ్గరగా ఉండే అర్థం అవుతుందనుకుంటాను.
నా అభిప్రాయం ఎం టంటే,తెలుగు లో అన్ని default లకు సరిపోయే టట్ట ఒక పదం వెతకడం కష్టం, time లాగా. కాబట్టి లోన్ ఎగ్గొట్టడానికి వేరే పదం, ఎఁవి కుండుటకు వేరే పదం వెతుక్కుంటే బాగుంటుంది.
అప్పులు ఎగ్గొట్టడాన్ని default అంటాం కదా, ఎగ్గొట్టేవాడు defaulter. మిలిటరీలో పని ఎగ్గొట్టినా, కోర్టుకు హాజరుకాకుండా ఎగ్గొట్టినా, ఎక్కడ ఏది ఎగ్గొట్టినా defaulting అంటాం, ఎగ్గొట్టేవాడిని defaulter అంటాం (సౌజన్యం: dictionary.com). ఎగ్గొట్టడాన్ని "తప్పుపట్టి విసర్జించడం" జరుగుతుంది కనుక "అవక్షేపం" అనే పదాన్ని కూడా మనం పరిశీలించవచ్చు కదా. default = అవక్షేపం(నామవాచకం), defaulted = అవక్షిప్తం (విశేషణం), defaulter = అవక్షేపి (పుంలింగం/స్త్రీలింగం/నపుంసకలింగం అన్నింటికీ).
* Law. failure to perform an act or obligation legally required, esp. to appear in court or to plead at a time assigned. 
* Sports. failure to arrive in time for, participate in, or complete a scheduled match.
* failure to act; inaction or neglect: They lost their best client by sheer default. 
* failure to meet financial obligations.
 
ఇంతకు ముందు వీవెన్ ప్రతిపాదించిన "లేమి" అనేది కూడా కొన్ని సందర్భాల్లో default కి సమానార్థకంగా సరిపోతుందనుకుంటున్నాను - ఈ క్రింది సందర్భాలకు:
* lack; want; absence.
* to fail in fulfilling or satisfying an engagement, claim, or obligation.
 
అవక్షేపము, లేమి - ఇవి, కంప్యూటర్ పరిభాషలో వచ్చే default కి సరిపోవు. ఇది కంప్యూటర్లో వచ్చే default కి సరిపోదు. దానికి ఇంకో పదం కావాలి. దానికి ఇంకో పదం కావాలి.
* a value that a program or operating system assumes, or a course of action that a program or operating system will take, when the user or programmer specifies no overriding value or action.
లేమి,లోపించడం, కొరత లాంటివి ఇక్కడ ప్రధానం కాదు. కొరతేమీ లేదు. But, there is an inaction. ఏదో ఒకటి ఎంపిక కాబడాలి. అలా ఎంపిక కాబడినది default. లోపింపబడినది (లోపితం) కాకుండా, ఉన్న ఎన్నో అవకాశాంశముల నుండి ఎంపిక కాబడినది అనే అర్థం స్ఫురించేలాగ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం.

Kiran Varanasi

unread,
Jul 14, 2007, 12:34:35 PM7/14/07
to telug...@googlegroups.com
default (n) = సాదాపూర్పు / సాదాపూరిక (common filler) ?
default (v) = సాదాపూరించు
default (adj) = సాదాపూర్చే

Ramanadha Reddy Yarrapu Reddy

unread,
Jul 14, 2007, 12:38:52 PM7/14/07
to telug...@googlegroups.com
ఇవి బాగున్నాయి. కంప్యూటరు పరిభాషకు బాగా సరిపోవచ్చు. మిగతా మిత్రులేమంటారో ...
 
--

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Jul 14, 2007, 3:07:03 PM7/14/07
to తెలుగుపదం
రానారె గారూ

సంపూర్ణ సమానార్థకాలు అన్ని వేళలా సాధ్యం కాకపోవచ్చు. అటువంటప్పుడు
సమీపార్థకాలతో సరిపెట్టుకుందాం. భాష నిరంతర పరిణామశీలి కనుక మనం ఎంపిక
చేసినవాటి కన్నా మంచి పదాలు ప్రతిపాదన కొస్తాయని ఆశిద్దాం.

Kiran NaCha

unread,
Jul 15, 2007, 5:58:37 AM7/15/07
to telug...@googlegroups.com
నాదో బండి కంకర:
 
"Default" అన్న పదాన్ని సాధ్యమైనంతగా సార్వజనితం (గెనెరలిజె) చేస్తే నాకు కూడా సోదరుడు రానారె చెప్పినట్టు "చెయ్యవలసిన పని చెయ్యని" పరిస్థితి అనిపిస్తుంది. ఇలా చూస్తే దాదాపు అన్ని అర్థాల్లోనూ వాడదగ్గ పదంగా "అనాచర" అన్నది కనిపిస్తుంది.
 
The default choice for 'xxx' is 'yyy'. -> 'xxx' కి అనాచరము (అనాచరమైన ఎంపిక / అనాచర నిర్ణయం ) 'yyy'.
The choice defaulted to 'xxx'. OR 'xxx' is chosen by default. -> ఎంపిక 'xxx' కి అనాచరితమయ్యింది. OR అనాచరితంగా 'xxx' ఎంపిక చేయబడింది.
The loan defaulters shall be prosecuted. -> రుణ+అనాచరులు విచారింపబడుదురు. (* - దీనికి "అప్పు ఎగవేతదారులు" అన్నది ఇప్పటికే వాడుకలో ఉన్నది.)
 
సభ్యులేమంటారు?
 
నచకి

Veeven (వీవెన్)

unread,
Jul 15, 2007, 6:41:35 AM7/15/07
to telug...@googlegroups.com
On 7/15/07, Kiran NaCha <email4...@gmail.com> wrote:
నాదో బండి కంకర:
 
"Default" అన్న పదాన్ని సాధ్యమైనంతగా సార్వజనితం (గెనెరలిజె) చేస్తే నాకు కూడా సోదరుడు రానారె చెప్పినట్టు "చెయ్యవలసిన పని చెయ్యని" పరిస్థితి అనిపిస్తుంది. ఇలా చూస్తే దాదాపు అన్ని అర్థాల్లోనూ వాడదగ్గ పదంగా "అనాచర" అన్నది కనిపిస్తుంది.
 
The default choice for 'xxx' is 'yyy'. -> 'xxx' కి అనాచరము (అనాచరమైన ఎంపిక / అనాచర నిర్ణయం ) 'yyy'.
The choice defaulted to 'xxx'. OR 'xxx' is chosen by default. -> ఎంపిక 'xxx' కి అనాచరితమయ్యింది. OR అనాచరితంగా 'xxx' ఎంపిక చేయబడింది.
The loan defaulters shall be prosecuted. -> రుణ+అనాచరులు విచారింపబడుదురు. (* - దీనికి "అప్పు ఎగవేతదారులు" అన్నది ఇప్పటికే వాడుకలో ఉన్నది.)
 
సభ్యులేమంటారు?

Ramanadha Reddy Yarrapu Reddy

unread,
Jul 15, 2007, 12:14:24 PM7/15/07
to telug...@googlegroups.com
ఇది చాలాబాగుండేలా ఉంది. కొంచెం అలవాటుపడాలి. "ఒకేదెబ్బకు అన్ని పిట్టలూ"  తరహాలో అనాచరము, దాని ఇతరరూపాలూ వివిధసందర్భాలలో ఇమిడిపోయేలా అనిపిస్తున్నాయి.

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Jul 15, 2007, 1:03:56 PM7/15/07
to తెలుగుపదం
కొన్ని జాగ్రత్తలు అవసరం. వాడుకలో ఉన్న అర్థానికి వ్యతిరిక్తం కాకుండా
చూసుకోవాలి. మరో అర్థాన్నిచ్చే ఇతర వాడుక పదాల్లాగా ధ్వనించకుండా
చూసుకోవాలి. "అనాచర" బావుంది. కాది ఇది తొలి వినికిడిలో అనాచారంలా ఉంది.
యోచించండి.

రవి వైజాసత్య

unread,
Jul 15, 2007, 6:55:32 PM7/15/07
to తెలుగుపదం
ఏదైనా specify చేస్తే అది నిశ్చితం.
specify చెయ్యనిది default కాబట్టి అనిశ్చితం అంటే అందరికీ అర్ధమయ్యేలా
సులువుగా ఉంటుందేమో

Kiran NaCha

unread,
Jul 15, 2007, 8:04:56 PM7/15/07
to telug...@googlegroups.com
Default అంటే computer పరిభాషలోనే చూసినా unspecified అన్నది ప్రతిసారీ సరైన
వాడుక/ఉద్దేశము కాదు. కొన్ని పరిస్థితులలో specify చేసినా కూడా కారాణాంతరాల వలన
default ఎంపిక కావచ్చు. ఉదా: Choose a number between 1-9. (Default: 5) అని
ఉందనుకోండి. 1-9 కాక మరేది ఎన్నుకున్నా కూడా 5 ఎంపిక చేసుకుంటుంది computer.
కనుక "అనిశ్చితి" అన్నది సరైనదిగా కనపడలేదు నాకు ఇంతకు ముందు ఆలోచించినప్పుడు.

తాబా గారు అన్నట్టు "అనాచారము" అన్న పదానికి "అనాచరము" అని నేను సూచించిన
పదానికీ ఉన్న సామ్యం నాకూ పంటి కింద ఱాయి లానే అనిపించింది. "అనాచరణము"
అనవచ్చునా, తక్కిన రూపాలు ఇందాక చెప్పినట్టుగానే ఉంచి? మరో రకంగా చూస్తే మనకు
తెలుగులో ఈ మాత్రం సామ్యం ఉండి రూఢ్యర్థాలలో యే మాత్రం పోలిక లేని పదాలు చాలానే
ఉన్నాయి: శిక్ష-శిక్షణ (నైఘంటికార్థం ఒకటే కావచ్చు), కక్ష-కక్ష్య, వేరు-వేఱు
మొదలైనవి చప్పున గుర్తొచ్చిన ఉదాహరణలు. కనుక "అనాచరము" అన్నదానిని అలానూ
ఉంచేయవచ్చా?

నచకి


----- Original Message -----
From: "రవి వైజాసత్య" <vyza...@gmail.com>
To: "తెలుగుపదం" <telug...@googlegroups.com>
Sent: Sunday, July 15, 2007 17:55
Subject: [తెలుగుపదం] Re: Default కి తెలుగుపదం?

Ramanadha Reddy Yarrapu Reddy

unread,
Jul 16, 2007, 12:30:58 AM7/16/07
to telug...@googlegroups.com
 కనుక "అనాచరము" అన్నదానిని అలానూ
ఉంచేయవచ్చా?

నచకి
 
అనాచరము అనగానే తాడేపల్లిబాసుగారు చెప్పినట్టు అనాచారము అనేపదం మనసులో మెదిలింది. కానీ, సామ్యాలు మనకు సహజమే కదా అంటూ నచకి ఇచ్చిన వివరణే నేనూ అనుకుని, "అనాచరము"నకు కొంచెం అలవాటుపడాలి అన్నాను. మిత్రులు మరికొందరు స్పందించి బాగుంది-బాలేదు అనేమాటలు చెబితే బాగుంటుంది.

Kiran Kumar Chava

unread,
Jul 16, 2007, 12:52:25 AM7/16/07
to telug...@googlegroups.com
default  అన్నది ఎప్పుడూ మొదటి ఎంపిక అవుతుంది కదా, తరువాత వినియోగదారుడు మారిస్తే అది మారుతుంది, కనుక డీఫాల్టుని మొదటి ఎంపికలు అనే అర్థములో తర్జుమా చేయడానికి ప్రయత్నిస్తే?



కిరణ్ కుమార్ చావా
http://www.oremuna.com
http://flickr.com/photos/chavakiran
naa sOdi

కందర్ప కృష్ణ మోహన్

unread,
Jul 16, 2007, 8:45:29 AM7/16/07
to telug...@googlegroups.com
ముందెంపిక
పూర్వామరిక
పూర్వామరికలు

Prasad Charasala

unread,
Jul 16, 2007, 8:53:09 AM7/16/07
to telug...@googlegroups.com

default కి వున్న అన్ని అర్థాలకూ ఒకే తెలుగు పదం కావాలని ఎవరు/ఎందుకు పేచీ పెడుతున్నారు?
codingలో వున్న defaultకి "అనిశ్చితి" సరిపోతుంది. అలాగే మిగిలిన సందర్భాల్లో వాటికి తగినట్టుగా వున్న తెలుగు పదాలు ఆలోచిస్తే సరిపోతుంది. ఆగ్లంలో దానికున్న చారిత్రక లేదా మరేదో కారణం వల్ల ఒకే పదానికి అన్ని అర్థాలు వచ్చి వుండొచ్చు అలాగే మనమూ అన్ని అర్థాలూ వున్న తెలుగు పదం వెతకడం ఎందుకు?

--ప్రసాద్
http://blog.charasala.com



Reply all
Reply to author
Forward
0 new messages