Virtual కి తెలుగు పదం

4 views
Skip to first unread message

Pranav Ainavolu

unread,
Aug 31, 2010, 8:43:11 AM8/31/10
to telug...@googlegroups.com
నమస్కారం!

Virtual కి తెలుగు పదం సూచించగలరు.

నెనర్లు
అయినవోలు ప్రణవ్

Aasish Pappu

unread,
Aug 31, 2010, 10:17:51 AM8/31/10
to telug...@googlegroups.com
అవాస్తవం 
2010/8/31 Pranav Ainavolu <pranav....@gmail.com>

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
 
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి



--
Aasish Pappu


Veeven (వీవెన్)

unread,
Aug 31, 2010, 10:27:48 AM8/31/10
to telug...@googlegroups.com

31 ఆగస్టు 2010 6:13 సా న, Pranav Ainavolu <pranav....@gmail.com> ఇలా రాసారు :

నమస్కారం!

Virtual కి తెలుగు పదం సూచించగలరు.

మిథ్య


Akshay Regulagedda

unread,
Aug 31, 2010, 10:46:29 AM8/31/10
to telug...@googlegroups.com

నమస్కారం!

Virtual కి తెలుగు పదం సూచించగలరు.

మిథ్య

వేమూరి గారి నిఘంటువులో మిధ్యా అని సూచించారు. :) 

మిధ్య భౌధిక శాస్త్రములో సబబుగావుండినా, కంప్యూటర్ ప్రపంచంలో 'కాల్పనీక' అంటే బాగుంటుందేమోనన్నది నా ఆలోచన. అలాగే, virtual reality అంటే కాల్పనీక వాస్తవం, virtual world అంటే కాల్పనీక ప్రపంచం అని వాడచ్చు.

అక్షయ్ 

Kanna

unread,
Aug 31, 2010, 10:40:46 AM8/31/10
to telug...@googlegroups.com
అవును మిథ్య అన్నది బాగుంది.

మిథ్యా లోకం = virtual world

Regards,

2010/8/31 Veeven (వీవెన్) <vee...@gmail.com>

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
 
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి

naga prasad

unread,
Aug 31, 2010, 11:42:30 AM8/31/10
to telug...@googlegroups.com
సాధారణంగా "మిథ్యా ప్రపంచం" అంటుంటారు.



2010/8/31 Kanna <kann...@gmail.com>

ముక్కు శ్రీరాఘవకిరణ్ శర్మ

unread,
Sep 1, 2010, 1:28:30 AM9/1/10
to telug...@googlegroups.com
భౌతికశాస్త్రంలో real image, virtual image అన్నప్పుడు ఏం వాడుతున్నారో చూస్తే సరి!!

Pranav Ainavolu

unread,
Sep 1, 2010, 8:04:57 AM9/1/10
to telug...@googlegroups.com
Virtual Operating System - కలనయంత్ర పరిభాషలో వాడుకునేందుకు ఏది బాగుందంటారు?
  1. మిధ్యా నిర్వాహకవ్యవస్థ
  2. కాల్పనిక నిర్వాహక వ్యవస్థ

2010/8/31 Veeven (వీవెన్) <vee...@gmail.com>

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Sep 1, 2010, 2:39:34 PM9/1/10
to తెలుగుపదం
ఇవేవీ వద్దని నా అభిప్రాయం. కొత్త భావాలకు ఎల్లప్పుడూ కొత్త పదాలనే
సృష్టించుకోవాలి. పాత పదాలతో సరిపుచ్చుకుందామని చూడకూడదు. అలా చూస్తే
ఉన్న ఆ పదాలకు ఇప్పటికే ఉనికిలో గల అర్థాలకు వ్యవహారహాని ఘటిల్లుతుంది.
ఉదిష్టమైన కొత్త అర్థాలేమో చప్పున స్ఫురించవు.

ఇహపోతే Virtual :- ఈ చర్చ ఇదివఱకు ఒకసారి చోటుచేసుకున్నట్లు గుర్తు.

వితథం అనే మాట ఉన్నది. వాస్తవం (వస్తురూపయుక్తం) కానిది అని దాని అర్థం.
దాన్నుంచి "వితథ్యం" అనే మాటని నిష్పాదించి అది నేను నా రచనల్లో Virtual
అనే అర్థంలో వాడుకుంటున్నాను. తథ్యము కంటే వేఱైనది అని కూడా దానికి అర్థం
చెప్పుకోవచ్చు.

పరిశీలించగలరు.

Pulikonda

unread,
Sep 2, 2010, 12:37:16 AM9/2/10
to telug...@googlegroups.com
తాడేపల్లి వారి సూచన చాలా బాగుంది. ఇలాంటి పదాలకు కొత్త పదాలను వెదకడం చాలా సమంజసం. ఆయన సూచించిన పదం కూడా బాగుంది. అయినా దీనిపైన మరింత చర్చ అవసరం. వర్చువల్ అనే పదాన్ని ఎలాంటి ప్రధాన భావానికి వాడతారని గమనిస్తే. ఒక వాస్తవానికి మరొక రూపం అని అర్థం. ఒక ఉదాహరణని ఇక్కడ చూడవచ్చు. వర్చువల్ లైబ్రరీ అని అంటే ఇక్కడ లైబ్రరీ లేదు అని అర్థం కాదు. లైబ్రరీ ఉంది. కాని సంప్రదాయంగా మనకు తెలిసిన లైబ్రరీ కాక మరొక విధమైనది అని నెట్ లోసాంకేతికంగా లభించే లైబ్రరీని వర్చువల్ లైబ్రరీ అని అంటారు. దీన్ని బట్టి ఇది అవాస్తవమైనది కాదు. కానీ అసలుది కూడా కాదు. వాస్తవమైనదానికి మరొక రూపంలో ఉన్నదాన్ని వర్చువల్ అని అంటారు. సిమ్యులేటర్ మీద విమానాన్ని నడిపి అసలు విమానాన్ని నడిపిన అనుభూతిని పొందవచ్చు. దీన్నే వర్చువల్ ఎక్స్ పీరియన్స్ అని అంటారు. ఈ దృష్ట్యా దీన్ని అధివాస్తవం అని అనివచ్చు. కాని అధివాస్తవ అనే పదం ఇప్పటికే సర్రియల్ అనే పదానికి సమానార్థకంగా వినియోగిస్తున్నాం. అందువల్ల దీనికి మరొకటి చూడవలసి ఉంది. వాస్తవానికి మరొక సమానార్థక పదం... యథార్థం. దీనికి ఒక ఉపసర్గను వేసుకొని ప్రయథార్థం అని లేక ప్రయథార్థిక అని కూడా అనే కొత్త పదాన్ని సృష్టించుకోవచ్చు. దీన్ని ఇంకా చర్చ చేద్దాం. 

భువదీయుడు 
పులికొండ సుబ్బాచారి. 


--
Prof. P.  Subbachary
Department of Folklore & Tribal Studies
Dean, School of Human and Social Sciences
Dean, Academic Affairs (Principal)
Dravidian University
Kuppam 517425
A.P

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Sep 2, 2010, 12:48:47 AM9/2/10
to తెలుగుపదం

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Sep 2, 2010, 12:57:29 AM9/2/10
to తెలుగుపదం
పులికొండ సుబ్బాచారిగారు తెలిపిన వివరాలు జ్ఞానోదయకరంగా ఉన్నాయి.
నెనర్లు.

ఇలాంటివాటికి ఏదైనా ఒక కొత్త పదం అవసరం. అది విలక్షణమై (unique) ఉండాలి.

మిథ్య లాంటి పదాల్ని ఇంగ్లీషువారు Heavily loaded terms అంటారు. అంటే
నానార్థాల బరువుతో మోతెక్కిపోయిన పదాలు అని ! మిథ్య అనేదాన్ని ఇప్పటికే
మనం ఎన్ని అర్థాల్లో వాడుతున్నామో గమనిస్తే Virtual కి ఇంకో పదం ఆవసరమని
తోస్తుంది.

మిథ్య :-

౧. ఎండమావిలాంటిది
౨. ఇహలోకంతో సంబంధం లేనిది
౩. కేవలం ఒకఱి విశ్వాసమైనటువంటిది
౪. అస్తిత్వంలో లేనిది/ భ్రాంతి/ భ్రమ
౫. pseudo-

కానీ Virtual ఇదేదీ కాదు. అంతర్జాలం రాకముందు Virtual ని సుమారుగా అనే
అర్థంలో వాడేవారు.

ఉదా :- He was virtually dead (as good as dead)

కనుక ఇప్పుడు Virtual కి మనం చెప్పుకుంటున్న అర్థం అర్వాచీనమే తప్ప
మొదట్నుంచి ఉన్నది కాదు.

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Sep 3, 2010, 9:54:35 AM9/3/10
to తెలుగుపదం
Virtual library = As good as a library
Reply all
Reply to author
Forward
0 new messages