నేను ఇదివరకు ఎక్కడో వివరించాను దాని వ్యుత్పత్తి:
కొండొక-/కొండిక అన్న దానికి కొండ్ + ఇక్క + చో అన్న మూడు పదాంశాల కలయికగా చూడవచ్చు.
కొండ- అన్నది *కొంత (konṯ-) అన్న మూల ధాతువునుండి వచ్చింది. కొందరు, కొద్దిగ, కొంచెం, కొంత, కొన్ని- ఇవ్వన్నీ ఈ ధాతువుకు చెందినవే.
ఇక్క- అంటే చోటు, స్థానము.
-చో అన్న ప్రత్యయం సందేహార్థ/సాధ్యార్థక ప్రత్యయంగా కావ్యాల్లో మనకు ప్రయోగాలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి.
వచ్చుచో, ఇచ్చుచో, కానిచో, తనయులులేనిచో మొదలైనవి కొన్ని ఉదాహరణలు.
కొండొకచో అంటే కొన్నితావులలో- occassionally అన్న అర్థంలో స్థిరపడిపోయింది.
కొండికనాడు అంటే బాల్యము; కొండికవాడు అంటే కుఱ్ఱవాడు.
సురేశ్.