తాడేపల్లి T.L. Bala Subrahmanyam
unread,Nov 5, 2009, 11:57:04 PM11/5/09Sign in to reply to author
Sign in to forward
You do not have permission to delete messages in this group
Either email addresses are anonymous for this group or you need the view member email addresses permission to view the original message
to తెలుగుబ్లాగు, sahi...@googlegroups.com, పుణ్యభూమి, telug...@googlegroups.com
అనుంగు నేస్తములారా !
http://scribd.com ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కవిలెల భండారణ గూడు (file storage site). అయితే ఇందులో కవిలెల కంటే ఎలక్ట్రానిక్ పుస్తకాలే జాస్తి.ఇందులో ప్రస్తుతం కొన్ని మిలియన్ల పుస్తకాలు భద్రపఱచబడ్డాయి. వాటిల్లో తెలుగుతో సహా దాదాపు అన్ని ప్రపంచభాషలకి చెందినవీ ఉన్నాయి. ఇందులో సభ్యత్వం ఉచితం. అయితే సభ్యులైన వారు మాత్రమే పుస్తకాల్ని ఈ గూట్లోకి ఎక్కించగలరు. అలాగే దించుకోగలరు కూడా. ఈ ప్రక్రియలు కూడా ఉచితమే. ఇందులోకి ఎక్కించిన పుస్తకానికి URL తో పాటు ఒక విలక్షణమైన (unique) పొందుపర్పు సంకేతావళి (Embed code) ని కూడా ఈ సైటు కేటాయిస్తుంది. ఆ సంకేతావళిని మన బ్లాగు Post Editor లోకి కాపీ చేసి పబ్లిష్ అంటే మన టపాలో యూట్యూబులాంటి తెఱ ఒకటి ఏర్పాటై సదరు పుస్తకం మన బ్లాగు పాఠకులకి అక్కడికక్కడే చదువుకునేలా దర్శనమిస్తుంది. అంటే ఆ పుస్తకం కోసం వారు URL పట్టుకుని
scribd.com కి వెళ్ళనక్కఱలేదన్నమాట.వెబ్ పుట మార్చనక్కఱలేదన్నమాట. సరిగా ఇలాంటి సేవలే అందించే యూరోపియన్ సైటు కూడా ఒకటుంది. అది
http://twidox.com అందులో కూడా సభ్యత్వం ఉచితమే.
సరే ! ఇది పాతకథే.
ఇంత గొప్ప స్క్రైబ్డ్ లోకి పుస్తకాన్ని ఎక్కించేటప్పుడు దాని వివరాల్ని ముందస్తుగా సైటులో నమోదు చెయ్యాల్సి ఉంటుంది.ఆ వివరాల్లో అది ఏ భాషకి చెందిన పుస్తకమో పేర్కొనాలి. అందునిమిత్తం ఆ సైటువారు ఒక భాషల జారుడు జాబితా (drop-down list) ఏర్పాటు చేశారు. ఆ జాబితాలో చాలా సంవత్సరాల నుంచి హిందీ, గుజరాతీ, తమిళం, కన్నడం - ఆఖరికి సంస్కృతం కూడా ఉంటున్నాయి. తెలుగు మాత్రం ఎప్పటిలాగే గల్లంతు. వాళ్ళంతవాళ్ళే తెలుసుకుని తెలుగుని జతచేర్చకపోతారా ? అని ఎదురుచూసిన నాకు ఈ రెండేళ్ళలో నిరాశా నిఃస్పృహలే ఎదురయ్యాయి. "అడగనిదీ అమ్మయినా పెట్ట"దనే సామెత గుర్తొచ్చింది.వెంటనే వారికి ఈ విషయమై వేగుపంపాను. వారు దయతోఇప్పటికి నా మొఱ ఆలకించి తెలుగుని కూడా జారుడు జాబితాలో చేర్చారు.
వారికి నేను పంపిన వేగుని, దానికి వారిచ్చిన సమాధానాన్ని ఈ టపాతో జోడించాను. అలాగే కొత్తగా స్క్రైబ్డ్ జాబితాలో చేఱిన తెలుగుభాష యొక్క తెఱపట్టుని కూడా జతచేశాను.
---------- ఫార్వర్డ్ చేసిన సందేశం ----------
పంపినవారు:
Gary <notificatio...@scribd.com>
తేది: 6 నవంబర్ 2009 6:30 am
సబ్జెక్టు: [Scribd Support Desk] Re: Include Telugu Language (ticket #29894)
కి: "తాడేపల్లి T.L. Bala Subrahmanyam" <
subtad...@gmail.com>
^^^ TEXT ABOVE THIS LINE IS ADDED TO YOUR REQUEST ^^^
|
|
|
Your request (#29894) has been deemed solved.
To review, comment and reopen the request, follow the link below: http://support.scribd.com/tickets/29894
Gary , Nov 05 05:00 pm (PST):
I sincerely apologize for the delayed response. We have now added Telugu to our All Languages list.
తాడేపల్లి T.L. Bala Subrahmanyam, Oct 02 10:25 pm (PDT):
Dear Sir,
I have noticed that the ALL LANGUAGES tab in your site does not include Telugu language in its drop-down list. I don't know why this anomaly has taken place while Telugu's neighboring languages such as Tamil and Kannada
are very much there. Telugu is the 2nd widest spoken language of India, besides being the official language of the State of Andhra Pradesh which has a population of 85 million people. Therefore I request you to kindly include
Telugu in your site.
-- నెనర్లు. (Thanks)
Yours Truly T. L. Bala Subrahmanyam http://www.tadepally.com
ఇట్లు భవదీయుడు తాడేపల్లి
This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org
| |
|
This email is a service from Scribd Support Desk | |
--
నెనర్లు. (Thanks)
Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com
ఇట్లు భవదీయుడు
తాడేపల్లి
This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use
http://lekhini.org