నిఘంటువుల ఆధునికీకరణ

232 views
Skip to first unread message

ఒక అనువాదకుడు

unread,
Jun 6, 2011, 8:56:58 AM6/6/11
to తెలుగుపదం
తెలుగు భాషకు నేడు అనేక నిఘంటువులు వున్నా (ఉదా: బ్రౌన్, శంకర్ నారాయణ,
శబ్దరత్నాకరం మొ.) వాటిలోని భాష నేటి తరానికి అతీతంగా ఉండడంతో, ఆ తరువాత
ఎన్ని నిఘంటువులు వచ్చినా కూడా వాటిలో ఎల్లరినీ ఆకట్టుకునే తత్వం
లేకపోవడంతో, మన భాషను అభివృద్ది పరచటానికి ప్రభుత్వం ఎంతగా
ప్రయత్నిస్తున్నాకూడా ఫలితం లేకుండా పోతుంది అని నా అభిప్రాయం. ఈ విధంగా
పురాతన నిఘంటువులని ఆధునికీకరించి ఆన్ లైనులో ఉంచాలని సంకల్పించాను.
దీనికి మీ సహాయ సహకారాలు కోరుతున్నాను. మీ మీ పరిధిలో చేయగలిగిన అంశాలను
తెలుపగలరు. లేదా ఈ అంశంపైన మీ అభిప్రాయాలను, సూచనలను తెలుపగలరు.

svaram

unread,
Jun 6, 2011, 9:04:59 AM6/6/11
to తెలుగుపదం
నిఘంటువుల గూర్చి ఇదివరకు జరిగిన చర్చలని చూడగలరు

http://groups.google.com/group/telugupadam/search?hl=te_US&group=telugupadam&q=%E0%B0%A8%E0%B0%BF%E0%B0%98%E0%B0%82%E0%B0%9F%E0%B1%81%E0%B0%B5%E0%B1%81&qt_g=Search+this+group

short URL for the above : http://is.gd/HjQON2

అచంగ

unread,
Jun 6, 2011, 10:09:16 AM6/6/11
to తెలుగుపదం
నమస్కారము,

ఇప్పుడు నేను చెప్పబోయేది అసందర్భమైతే మన్నించ ప్రార్థన.

'నిఘంటువు - నిగంటువు' చర్చకు సంబంధించి తాడేపల్లి మరియు చావా కిరణ్
గార్ల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. (ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ,
ష, హ, క్ష) ఈ అక్షరాలు నాకు అనుభవం ఉన్నంతవరకూ సాధారణ తెలుగు ఉచ్చారణలో
కనిపించవు. అలాగే పూర్తి తెలుగు మూలపదం దేన్ని తీసుకున్నా ఇటువంటి వత్తి
పలుక వలసిన అవసరం లేకుంటానే వ్రాయవచ్చు, మాట్లాడవచ్చు.
ఉదా: అగుపించు (తెలుగు)- వీక్షించు (సంస్కృతం),

అలాగే ఈ అక్షరాలున్న పదాలు వాడాల్సి వచ్చినా జనం వాటిని సరళాక్షరాలుగా
రూపాంతరం చెందించి మాట్లాడుతారు.
ఉదా: ప్రభుతం - పెబుత్వం (గుంటూరు జిల్లా, రేపల్లె మండలం. నల్లూరు గ్రామ
వాడుక)

ఏతావాతా ఆ అక్షరాలు సంస్కృతము నుంచి సంక్రమించిన పదాలు తెలుగులో భావ,
ఉచ్చారణా దోషాలు లేకుండానే వాడుకలో ఉంచటానికి తీసుకురాబడ్డ అక్షరాలని నా
నమ్మిక. అదే సమయములో మనకి రోజువారీ కార్యక్రమాలలో అవసరమైన ప్రత్యేక
చకారం, జకారం, తేలిక ళ వంటి అక్షరాలు కనుమరుగయ్యయి. నా ఉద్దేశ్యం ప్రకారం
భాషకు వాడుకే ప్రధానం. వాడుకలో లేనప్పుడు (సాధారణంగా) అవి ఉన్నా లేకున్నా
ఒకటే.

ప్రపంచ భాషలపై సంస్కృత ప్రభావం విస్మరించలేనిది. అయినా అది ప్రస్తుతం
మృతభాషగానే పరిగణించబడుతోన్నది. అందుకు ఆ భాషలోని సంక్లిష్టత ఒక కారణం
అని నా నమ్మిక. మన భాషలో ఎటువంటి మూలము లేనప్పుడు సోదర భాషలనుంచి పదాలను
అరువుదెచ్చుకోవటం ఎంతమాత్రమూ తప్పుకాదు. అదే సమయములొ వ్రాత, ఉచ్చారణ
ఆలాగే ఉండాలనటం అంత సమంజసముగా అనిపించటములేదు.

అనువాదకుడుగారూ,
మీ ఆసక్తికి అభినందనలు. మీకు కొరుకుడు పడని సమస్యని గుంపు మీద వదలండి ఏదో
ఒక పరిష్కారం దొరక్కపోదు (గుంపు నియమాలను అనుసరించాలి సుమా). అలాగే మీ
అసలు పేరు చెప్ప మీకు ఇష్టముగాకపోతే మరేదయినా ఒక పేరు పెట్టుకుంటే గుంపు
సభ్యులకు ఒక అవగాహన ఉంటుంది ఎవరు ఎమి చెబుతున్నారనేది.

భవదీయుడు.
అచంగ.

NaChaKi (Kiran Chakravarthula)

unread,
Jun 6, 2011, 10:46:54 AM6/6/11
to telug...@googlegroups.com
అచంగ గారూ,
 
భాషావ్యాకరణాలకు వ్యవహారమే ప్రధానం కాదు. పైగా మీరు వాడిన ఉదాహరణల్లో కూడా గ్రామ్యవ్య్వహారమే కానీ సర్వత్రా అదే వ్యవహారం లేదు. ఇప్పుడు వ్యవహారంలోనే ఉన్న అక్షరాలని అత్యవసరంగా నఱికి పోగులు పెట్టాల్సిందేనన్న  దుగ్ధ, అవగాహనారాహిత్యము తప్పించి నాకు వేఱేమీ కనిపించటంలేదు మీ టపాలో. అసందర్భమైనా "ఆవు వ్యాసం" వ్రాసినట్టు కాక ఎంత సేపూ సంస్కృతాన్ని వెళ్ళగొట్టాల్సిందేనన్న భావం వదిలిపెట్టి... కాస్త పనికి వచ్చే రకంగా శ్రమిస్తే భాష బ్రతుకుతుంది. మీకు నచ్చినా నచ్చకపోయినా తెలుగులో మహాప్రాణాక్షరాలు తప్పకుండా ఉంటాయి. దయ చేసి భాషావినిర్మూలనా ఉపాయాలు తగ్గించుకుని ఆ రకంగా మీ మనసుకు మీరు సమాధానం చెప్పుకోండి. కటువుగా చెప్పినట్టు అనిపించినా సరే... అమర్యాద లేదని గ్రహిస్తే సంతోషం .
 
నచకి
 
--
 
"And somewhere there are engineers
Helping others fly faster than sound.
But, where are the engineers
Helping those who must live on the ground?"
 
– Young Oxfam Poster
-----అసలు సందేశం-----
From: అచంగ
Sent: Monday, June 06, 2011 09:09
To: తెలుగుపదం
Subject: (తెలుగుపదం) Re: నిఘంటువుల ఆధునికీకరణ
--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
 
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి

NaChaKi (Kiran Chakravarthula)

unread,
Jun 6, 2011, 11:02:37 AM6/6/11
to telug...@googlegroups.com
వాసు గారూ, నిఘంటువుల విషయంలో ఆంధ్రభారతి వారు <http://www.andhrabharati.com/dictionary/index.php>, సాహితి వారు <http://www.sahiti.org/dict/index.jsp> యిప్పటికే విస్తారమైన, ఫలవంతమైన శ్రమ చేసి ఉన్నారని గమనించగలరు. బ్రౌన్, గ్విన్ కూర్చిన నిఘంటువులు కూడా అంతర్జాలంలో ఉన్నాయి. బాలశబ్దరత్నాకరం కూడా <http://www.archive.org/details/balalashabdaratn018384mbp> వద్ద అందుబాటులో ఉంది.
 
నచకి
--
 
"And somewhere there are engineers
Helping others fly faster than sound.
But, where are the engineers
Helping those who must live on the ground?"
 
– Young Oxfam Poster
-----అసలు సందేశం-----
From: ఒక అనువాదకుడు
Sent: Monday, June 06, 2011 07:56
To: తెలుగుపదం
Subject: (తెలుగుపదం) నిఘంటువుల ఆధునికీకరణ

అచంగ

unread,
Jun 6, 2011, 11:06:46 AM6/6/11
to తెలుగుపదం
కిరణ్ చక్రవర్తుల గారూ,

సంస్కృతాన్ని తెలుగునుంచి వెళ్ళగొట్టటం అసాధ్యం. అసంభవం. అది పాలూనీళ్ళలా
కలిసిపోయిన బంధం. ఎవరైనా (నాతో సహా) అలాంటి పనికి ఎవరు పూనుకున్నా అది
అవగాహనా రాహిత్యమే. అయితే అదే సందర్భములో జనబాహుళ్యములో వాడుకలో ఉన్న
విషయాన్నే నేను ప్రస్తావించాను. ఒకసారి మీకు మీరే వీలైనన్ని తెలుగు
పదాలను ఉపయోగించి ఒక వాక్యాన్ని వ్రాసి చూడండి నేను చెప్పిన దృగ్విషయము
మీకే అర్థం అవుతుంది. వ్రాత-వాడుక ఏ భాషలో అయినా ఒకేలా ఉండటం అసాధ్యం.

అచంగ

NaChaKi (Kiran Chakravarthula)

unread,
Jun 6, 2011, 11:15:09 AM6/6/11
to telug...@googlegroups.com
శబ్దాధారమైన (phonetic) భాషలంటే వ్రాత, వాడుక ఒకేలా ఉంటాయి. అలా పలకకపోవటాన్ని
ప్రమాణంగా తీసుకుని వ్రాతను మార్చెయ్యాలనుకోవటం నిజంగా అవగాహనారాహిత్యమే
అవుతుంది. కాదని మీరెందుకు అనుకుంటున్నారో నాకు బోధపడటంలేదు. సరైన ఉచ్చారణ
నేర్పించటం అవసరం, అంతే కానీ సరిగ్గా పలకటం చేతకాని వాళ్ళ ఉచ్చారణను
ప్రామాణికంగా తీసుకుని భాషను కుదించటం సరి కాదు.

నచకి

"And somewhere there are engineers
Helping others fly faster than sound.
But, where are the engineers
Helping those who must live on the ground?"

– Young Oxfam Poster
-----అసలు సందేశం-----
From: అచంగ

Sent: Monday, June 06, 2011 10:06


To: తెలుగుపదం

Subject: Re: (తెలుగుపదం) Re: నిఘంటువుల ఆధునికీకరణ

అచంగ

--

అచంగ

unread,
Jun 6, 2011, 11:32:59 AM6/6/11
to తెలుగుపదం
కిరణ్ చక్రవర్తుల గారూ,

ఇప్పటికే ఉన్నదానిని మార్చటం కచ్చితంగా అవివేకమే. అయితే కొత్త పదాలను
సృష్టించేటప్పుడు ఈ దృగ్విషయాన్ని పరిగణలోనికి తీసుకుంటే ఆయా కొత్త
పదాలకు విస్తృతి అధికమవుతుంది. భాషకు వ్రాత ఎంత ముఖ్యమో వాడుకా అంతే
ముఖ్యము. వ్రాత-వాడుక ఒకేలా ఉంటే ఉండే సౌలభ్యాలు ఎక్కువ. అదే నా
ఉద్దేశ్యం.

శ్రీ పులికొండ సుబ్బాచారిగారు (ద్రవిడ విశ్వవిద్యాలయము తెలుగు బోధకులు)
అనేక పర్యాయాలు ఇదే విషయాన్ని గుంపు చర్చలలో ప్రస్తావించారు. జనం వాడుకని
బట్టే వ్యాకరణ సూత్రాలు వ్రాయబడ్డాయిగానీ వ్యాకరణానికి అనుగుణంగా వాడుక
పుట్టలేదని. నా వరకూ వాడుకకే ప్రాధాన్యత దానికి అనుగుణంగానే వ్రాత.

మరింతమంది పెద్దల అభిప్రాయాల కోసం వేచి చూద్దాం. ఈ విషయం ఆధునిక పద
సృష్టి, వ్యాకరణ, నిఘంటు నిర్మాణాలకు అవసరమే అని నా భావన.

అచంగ

NaChaKi (Kiran Chakravarthula)

unread,
Jun 6, 2011, 11:59:39 AM6/6/11
to తెలుగుపదం
అరుణ్ గారూ,

ఈ గుంపులో పదనిష్పాదన వాడుక సులభతరంగా ఉండేలాగునే సాగుతున్నదని నా అభిప్రాయం.
సందర్భానుసారంగా సౌలభ్యం కోసం సంస్కృత పదానికి తెలుగు పదంతో సమాసం చేసిన పదాలు
కూడా చాలానే నిష్పాదించబడ్డాయి. క్రొత్త పదాల సృష్టిలో కావాలని మహాప్రాణాలను
తీసేయటంలోని ఔచిత్యం నాకైతే బోధపడటంలేదు. ఉదాహరణకి "భ అన్న అక్షరాన్ని
యిప్పటికే ఉన్న పదాల్లో పలకగలను కానీ ఆ అక్షరం వాడిన క్రొత్త పదమైతే నేను
నేర్చుకో(లే)ను" అనటంలో నాకు మొండితనమే కానీ మఱొకటి కనిపించటంలేదు, నిజంగా!
పెద్దలేమంటారో చూద్దాం.

నచకి

"And somewhere there are engineers
Helping others fly faster than sound.
But, where are the engineers
Helping those who must live on the ground?"

– Young Oxfam Poster
-----అసలు సందేశం-----
From: అచంగ

Sent: Monday, June 06, 2011 10:32


To: తెలుగుపదం
Subject: Re: (తెలుగుపదం) Re: నిఘంటువుల ఆధునికీకరణ

కిరణ్ చక్రవర్తుల గారూ,

అచంగ

--

Kiran Kumar Chava

unread,
Jun 6, 2011, 12:01:58 PM6/6/11
to telug...@googlegroups.com
Here is my fav - http://te.wiktionary.org


Thanks and Regards,
Kiran Kumar Chava
Program Manager
Kinige.Com
The online ebook store






DISCLAIMER: The information contained in this message is intended only and solely for the addressed individual or entity indicated in this message and for the exclusive use of the said addressed individual or entity indicated in this message (or responsible for delivery of the message to such person) and may contain legally privileged and confidential information belonging to Kinige Digital Technologies Private Limited. It must not be printed, read, copied, disclosed, forwarded, distributed or used (in whatsoever manner) by any person other than the addressee. Unauthorized use, disclosure or copying is strictly prohibited and may constitute unlawful act and can possibly attract legal action, civil and/or criminal. The contents of this message need not necessarily reflect or endorse the views of Kinige Digital Technologies Private Limited on any subject matter. Any action taken or omitted to be taken based on this message is entirely at your risk and neither the originator of this message nor Kinige Digital Technologies Private Limited takes any responsibility or liability towards the same. Opinions, conclusions and any other information contained in this message that do not relate to the official business of Kinige Digital Technologies Pvt. Ltd. shall be understood as neither given nor endorsed by Kinige Digital Technologies Private Limited or any affiliate of Kinige Digital Technologies Private Limited. If you have received this message in error, you should destroy this message and may please notify the sender by e-mail. Thank you.






2011/6/6 NaChaKi (Kiran Chakravarthula) <email4...@gmail.com>

n rahamthulla

unread,
Jun 7, 2011, 1:32:50 AM6/7/11
to telug...@googlegroups.com
ఎన్నో ఆంగ్ల పదాలు మన తెలుగు ప్రజల నాలుకలపై నాట్యమాడుతూ, మన పదాలే అన్నంతగా స్థిరపడిపోయాయి. ఈ పదాలను విడిచిపెట్టి మనం తెలుగులో సంభాషణ చేయలేము. చేసినా ప్రజలకు అర్ధంగాదు. ఉర్దూ, సంస్కృత పదాలెన్నింటటినో తెలుగు తనలో కలుపుకుంది. అలాగే తెలుగు ప్రజల వాడుకలో బాగా బలపడిన, ఇక ఎవరూ పెకలించలేనంతగా పాతుకుపోయిన, ఇంగ్లీషు పదాలను మన తెలుగు డిక్షనరీలో చేర్చటం వల్ల మన భాష తప్పక బలపడుతుంది. సంస్కృత, ఉర్దూ పదాలు వేలాదిగా తెలుగులో చేరకపోయి ఉన్నట్లయితే తెలుగు భాషకీపాటి శక్తి వచ్చి ఉండేది కాదు గదా?

సెల్‌ఫోన్‌లో ఎస్సెమ్మెస్‌లు వచ్చాక.. పొడిపొడి అక్షరాలతో ఇంగ్లి ష్‌లో మెసేజ్‌లు పంపటం అందరికీ అలవాటైంది. అలాగే అన్న దానికి ఇన్నాళ్లూ వాడిన 'ఓకే' కాస్తా.. ఇప్పుడు 'కే' అయిపోయింది. టేక్ కేర్ అని చెప్పడానికి.. టీసీ అనే ఆంగ్ల అక్షరాలను టైప్ చేస్తే చాలు. ఇలా ఎస్సెమ్మెస్‌లలో వాడే సరికొత్త సంక్షిప్త పదాలు ఎన్నో.. తాజాగా మార్కెట్‌లోకి వచ్చిన 'న్యూ ఆక్స్‌ఫర్డ్ అమెరికన్ డిక్షనరీ ఆఫ్ ఇంగ్లిష్' మూడో సంచికలో చేరాయి.

బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్ అనే అర్థానిచ్చే బీఎఫ్ఎఫ్.. అలాగే టాక్ టూ యూ లేటర్ అని చెప్పే టీటీవైఎల్ వంటి సంక్షిప్త పదాలు వీటిల్లో కొన్ని. ఇటీవల ముగిసిన ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీ ల్లో ప్రేక్షకులను బాగా ప్రభావితం చేసిన నోటితో ఊదే వాయి ద్యం 'వువుజెలా' కూడా ఈ డిక్షనరీలోకి వచ్చి చేరింది.

ఇంగ్లిషు భాషలో ఇప్పుడిప్పుడే వాడుకలోకి వస్తున్న.. సోషల్ నెట్‌వర్కిం గ్ (ఒకే అభిరుచి కలిగిన వాళ్లు ఓ సమూహంగా ఏర్పడటం), లిప్‌స్టిక్ లెస్బియన్ (మహిళల్లాగా దుస్తులేసుకొనే నపుంసకులు), స్టేకాషన్ (ఇంటి దగ్గరే ఉండి సెలవులను ఎంజాయ్ చే యడం) వంటి పదాలతో పాటు.. పర్యావరణానికి సంబంధించిన కార్బన్ ఆఫ్‌సెట్టింగ్, గ్రీన్ ఆడిట్, కార్బన్ క్రెడిట్ వంటి కొ త్త కొత్త పదాలను కూడా ఈ నిఘంటువులో పొందుపరిచారు.

ప్రభుత్వ వ్యవహారాల్లో కొత్తగా దొర్లుతున్న పదాలు వాటర్‌బోర్డింగ్, ఎగ్జిట్ స్ట్రాటజీలతో పాటు సరికొత్త సాంకేతిక పదాలు క్లౌడ్ కంప్యూటింగ్, హాష్‌ట్యాగ్, ట్యాగ్ క్లౌడ్ వంటి వాటిని కూడా ఈ డిక్షనరీలో చేర్చారు. ఇలా రెండు వేలకు పైబడిన కొత్త పదాలు, పదబంధాలు, నుడికారాలు ఈ నిఘంటువులో చేరాయి.(ఆంధ్రజ్యోతి23.9.2010)
తెలుగు ప్రజల వాడుకలో బాగా బలపడిన, ఇక ఎవరూ పెకలించలేనంతగా పాతుకుపోయిన, ఇంగ్లీషు పదాలను మన తెలుగు డిక్షనరీలో చేర్చటం వల్ల మన భాష తప్పక బలపడుతుంది.తెలుగునిఘంటువును కూడా ఇలా విస్తరించుకుంటూ పోతే మనభాషకు కొత్తశక్తి వస్తుంది.తెలుగు ప్రజలకు సౌకర్యం పెరుగుతుంది.
తెలుగులో చేరిన పరభాషాపదాల జాబితా ఇక్కడ చూడండిః
తెలుగు నిఘంటువులో చేరాల్సిన ఇంగ్లీషు పదాలు
2010http://nrahamthulla3.blogspot.com/2010/08/blog-post.html

తెలుగు వారు పలికే ఉర్దూ పదాలు

http://nrahamthulla3.blogspot.com/2010/08/blog-post_29.html

--- On Mon, 6/6/11, ఒక అనువాదకుడు <vallur...@gmail.com> wrote:

kv ramana

unread,
Jun 7, 2011, 1:33:06 PM6/7/11
to telug...@googlegroups.com
వత్తక్షరాల్ని సంస్కృతాన్ని తెలుగునుంచి వెళ్ళగొట్టే సాహసం ఎవరు చేయగలరు?
మన తాతముత్తాతలు వత్తులు తీసేసిన పలుకుల్ని తద్భవాలే అన్నారా, వికృతాలే
అన్నారా - ఎంత చిన్నబుచ్చలేదు! ఆ పని మనమిప్పుడు చేయకూడదు - దోషం!
ధర(వెల), భవంతి, జంధ్యం, సయోధ్య - ఇలా వత్తులు లేనివాటికి వత్తులు
పెడుతున్నాం. వత్తులు పెట్టకపోతే మొట్టికాయలు పెట్టే తెలుగు
పంతుళ్ళున్నారు. మాటలు సంస్కృతం నుంచి వచ్చినవి అనిపించాలి. అప్పుడే
గొప్ప! ఫలసాయం, వారధి, అగ్రహారం లాంటివి సంస్కృతపదాలే అనుకునేట్లు
సృష్టించుకున్నాం. రుజువుని ఋజువని రాయడం రైటనుకుంటున్నాం.
ఆంధ్రులది దెయ్యాలభాష అనే కల్పలనలు కలిగిన దేవభాష మనకు ఆరాధ్యం. మన భాషకు
ఎన్నో పదాలను ఇచ్చిన ఉర్దూ ఇంగ్లీషులు పరభాషలు.
ఇలా ఉంది మన భాషా ప్రేమికుల వ్యవహారం.


--
కిల్లంసెట్టి వెంకటరమణ

అచంగ

unread,
Jun 7, 2011, 2:03:01 PM6/7/11
to తెలుగుపదం
రమణ గారూ,
ఆంగ్ల, ఉర్దూ భాషలు ఎంతటి పరభాషలో సంస్కృతం కూడా అంతే పరభాష తెలుగుకు. ఈ
విషయం తగు పరిశోధనల అనంతరం నిరూపించబడిన వాస్తవం. పుట్టుకతో ద్రావిడ భాష
అయిన తెలుగును దాని సహజ పరిమళాలు చెడకుండా ఉండాలంటే దాని మాతృక అయిన
ద్రావిడం(తమిళం కాదు) మూల పదాలను సంగ్రహించి పద నిష్పాదన చెయ్యటం ఒక
పద్ధతి. దేవభాష సంస్కృతమైనా మన భాష మాత్రం తెలుగు. 'జననీ జన్మభూమిశ్చ
స్వర్గాదపి గరియసి' (రామాయణములో చెప్పబడిందని చెబుతారు) అని దేవభాషలోనే
అన్నారు. అలాంటప్పుడు మన జన్మభూమికి వన్నె తెచ్చే తెలుగే మనకు గొప్పగా
ఉండాలి.

రహ్మతుల్లా గారూ,
మీరు ఉధహరించిన విషయాలు జనబాహుళ్యములో జరుగుతున్నవే. 'కబురు' అనే పదాన్ని
తీసుకుంటే ఇది తెలుగు పదమే అనుకుంటారు ఎవరైనా. ఇది 'ఖబర్' అనే ఉర్దూ/
హిందీ పదమంటే నోరెళ్ళబెడతారు. ఇలాంటివే రైలు, బస్సు, రోడ్డు, బల్బు, పైపు
వంటి పదాలు. వీటిని మనం మన భాషనుంచి తీసేయాలనుకున్నా అసాధ్యం. అలాని
చెప్పి వచ్చే ప్రతీ పదజాలాన్నీ అంగీకరిస్తూ పోతుంటే తెలుగుకు సహజంగా
ఉండాల్సిన సౌందర్యం ఉంటుందంటారా? అసలలా ఆమోదించుకుంటూ పోతుంటే కొత్త పదాల
సృష్టించవలసిన అవసరం ఏముంది? ఏదో ఒక భాషనుంచి తెచ్చుకుని డు, ము, వు, లు
చేర్చేసుకుంటే సరిపోతుంది కదా?

అచంగ

Praveen

unread,
Jun 7, 2011, 2:58:19 PM6/7/11
to telug...@googlegroups.com
ఇంత వెటకారం అవసరమా? మీకు సంస్కృత పదాలు నచ్చకపోతే వాడకండి - ఆంగ్లంనుంచి అనువాదం అవసరం లేదు అని మీరు అనుకుంటే తెలుగుపదం గుంపు మీ వాదనకు సరైన వేదిక కాదు.

ఎక్కువ సార్లు బల్లగుద్దినంత మాత్రాన ఉద్దేశ్యాలు ప్రామాణికాలు అయిపోవు. ప్రజలు మాట్లాడేదే సజీవ భాష అని కదా మీ వాదన - ద్రవిడ పదాలు మాత్రామే వాడి చెప్పండి చూద్దాం ఎంత మందికి అర్థం అవుతుందో. ఏవి సంసృత పదాలో కూడా తెలియకుండా పర భాష అని ద్వేషించడం ఎంత వరకూ న్యాయం? మీ వాక్‌స్వాతంత్ర్యాన్ని వాడుకున్నారు - సంతోషం. అందరం విన్నాం. ప్రతి చర్చలోనూ అసందర్భంగా చెప్పడం అవసరమా?

-- ప్రవీణ్

2011/6/7 kv ramana <kvje...@gmail.com>

NaChaKi (Kiran Chakravarthula)

unread,
Jun 7, 2011, 3:28:47 PM6/7/11
to telug...@googlegroups.com

రమణ గారూ,

మీ వ్యంగ్యానికి సంతోషం!

ఈ కూటమిలో bus, road వంటి పదాలను తెలుగు చెయ్యాలి అని వాదించినవాళ్ళెవఱైనా కనిపించారా? ఇప్పటికి ఉన్న పదాలని తిడుతూ కూర్చున్నారా, వాటిని పెకలించాల్సిందేనని వీలు దొఱికినప్పుడల్లా వాదిస్తున్నారా? ఆంగ్లాన్ని పాఱద్రోలమనటంలేదు. ఉన్న ఆంగ్లపదాలు స్వీకరించినా క్రొత్తవి అక్కర్లేదంటున్నారు. తెలుగు పదం దొఱికే దాకా ఆంగ్లమైనా వాడుతున్నారు. ఇక్కడ నిష్పాదించబడుతున్న పదాలను కూడా నచ్చితేనే వాడుతున్నారు, నచ్చినవాళ్ళే వాడుతున్నారు. ఉదాహరణకి, మీరు computer-ని గణిని అంటారో, సంగణకయంత్రమంటారో, కలనయంత్రమంటారో, మీకు నచ్చిన అచ్చతెలుగులో దానికో మాట కనిపెట్టుకుని వాడతారో మీ యిష్టమే కానీ నిర్బంధం లేదే? ఆంగ్లానికి ఒక పద్ధతి, సంస్కృతానికి ఒక పద్ధతి లేదు. వీలైతే అచ్చతెలుగు పదాలనే నిష్పాదించాలని అందఱూ చెబుతూనే ఉన్నారు కదా? మీకు తెలుగు పట్ల ఉన్న మిక్కిలి మక్కువతో మీరే మా లాంటి తెలుగు రాని సంస్కృతప్రియులకు చెంపపెట్టులా అద్భుతమైన పదబంధాలని సృష్టించి సంస్కరిస్తే తరించాలని ఉవ్విళ్ళూరుతున్నాను. (అవును, ఇది కూడా వ్యంగ్యమే... మీ స్థాయిలో నాకు రాదనుకోండి. అయినా ప్రయత్నలోపం లేకుండా... ఊరికే మాటలన్నట్టు యెందుకుండాలని కాస్త వ్యంగ్యం చేర్చాను.)

అన్నట్టు... వారధి అంటే నాకు అర్థమైనదైతే వారి_అధి(గమించటానికి) అని. అది మన కూటమిలో నిష్పాదించిన పదాల లాగా యెవఱో నిష్పాదించి ఉండవచ్చు. మీరు "వంతెన" అని వాడరాదని కట్టడి చేసారా యెవఱైనా? అలా చేయనంత వఱకూ మీకొచ్చిన యిబ్బంది యేమిటో నాకైతే అర్థం కావటంలేదు. కొన్ని తెలుగు పదాలని సంస్కృత పదాలుగా అనిపించేలా మార్చాం, అంతేనా మీ బాధ? బ్రిటీష్ వాళ్ళు మార్చేసిన spellingsని మీరు సంస్కరించి వాడుకుంటారా ("క" అన్న చోట c బదులు k, మొదలైనవి)? Silent lettersని తీసేసి taak అని వ్రాస్తారా talk అని వ్రాస్తున్నారా? మీ బాధంతా తెలుగు మీద సంస్కృతం నాట్యం చేస్తోందనేనా, లేక యిదో ఉద్యమంగా అన్ని భాషల విషయంలో బాధపడుతున్నారా?

నచకి

--
 
"And somewhere there are engineers
Helping others fly faster than sound.
But, where are the engineers
Helping those who must live on the ground?"
 
– Young Oxfam Poster
-----అసలు సందేశం-----
From: kv ramana
Sent: Tuesday, June 07, 2011 12:33

అచంగ

unread,
Jun 7, 2011, 3:58:43 PM6/7/11
to తెలుగుపదం
ఈ లంకెలో 'తీరము' అనే పదానికి సంబంధించిన తెలుగు- సంస్కృత పదాల
అర్థాలున్నాయి. (
http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?query=%E0%B0%A4%E0%B1%80%E0%B0%B0%E0%B0%AE%E0%B1%81&table=brown).
ఇది బ్రౌన్ నిఘంటువు.

గట్టు, ఒడ్డు అనేవి స్వచ్ఛ తెలుగు పదాలు (అధారం: బ్రౌన్ నిఘంటువు). తీరము
అనేది సంస్కృత పదం (అధారం: బ్రౌన్ నిఘంటువు).

"Hey, Don't go deep into the shore! You may fell down" ఈ ఆంగ్ల
వాక్యానికి తెలుగు అనువాదం ఎలా చెయ్యవచ్చో చూద్దాం.

ఓయ్! మరీ ఒడ్డెమ్మటికి యెల్లబాక, పడిపోతావ్. (గుంటూరు జిల్లా, రేపల్లె
మండలము, నల్లూరు గ్రామ యాస) ఈ అనువాదములో నేనెక్కడా సంస్కృత పదాలు
వాడలేదు కదా! నేనే కాదు భావ ప్రకటన విషయములో ఆ ప్రాంతములో అందరూ వాడే
వాక్యమే అది. పొరపాటున కూడా సరళమైనా సరే 'తీరము' అనే పదం బయటకి రాదు. ఈ
చర్చ మొత్తమ్మీద నేను మాట్లాడుతున్న అనువాదం ఇలాంటిది.

ఒక భాషకు అనుకూలమూ కాదు, మరో భాషకు వ్యతిరేకమూ కాదు. ఏ భాషా పదమైనా సరే
తెలుసు సొగసు చెడగొట్టేలా ఉంటే దాన్ని భరించవలసిన అవసరం లేదు. ద్రావిడ
మూల పదాలను గ్రహించటము అనేది ఒక సూచన. మీరే చెప్పినట్టు స్వీయ విచక్షణపై
అధారపడి ఎవరికి వారు కృషి చేయవచ్చు. జరిగే మార్పులను ఆపటం ఎవరి తరమూ
కాదు. అరబిక్, పర్షియన్ పదాలను కలుపుకుని హింది నుంచి ఉర్దూ వేరైనట్లు
రేపు ద్రవిడ పదాలతో ఉన్న తెలుగు వేరుగా సంస్కృత/ ఆంగ్ల పదాలతో కూడిన
తెలుగు వేరుగా వాడుకలోని రావచ్చు.

--అచంగ

NaChaKi (Kiran Chakravarthula)

unread,
Jun 7, 2011, 4:22:16 PM6/7/11
to telug...@googlegroups.com
అరుణ్ గారూ,
 
పదం, అర్థం, స్వచ్ఛం, ఆధారం, వాక్యం, అనువాదం, భావం, ప్రకటన, విషయం, ప్రాంతం, సరళం, భాష, అనుకూలం, వ్యతిరేకం, భరించు, అవసరం, మూల, గ్రహించు, సూచన, స్వీయ, విచక్షణ, కృషి - 22 సంస్కృత పదాలు... మీ టపాలో. నవ్వు
 
నచకి
 
--
 
"And somewhere there are engineers
Helping others fly faster than sound.
But, where are the engineers
Helping those who must live on the ground?"
 
– Young Oxfam Poster
-----అసలు సందేశం-----
From: అచంగ
Sent: Tuesday, June 07, 2011 14:58
To: తెలుగుపదం
Subject: Re: (తెలుగుపదం) Re: నిఘంటువుల ఆధునికీకరణ
 
wlEmoticon-smile[1].png

అచంగ

unread,
Jun 7, 2011, 4:26:03 PM6/7/11
to తెలుగుపదం
కిరణ్ గారూ,

మరో 22 సంస్కృతమో, ఆంగ్లమో మరేదో భాషా పదాలో వచ్చి స్థిరపడ్డాయనుకోండి
ఇలాగే తెలుగులో తెలుగును వెతుక్కోవాలి. అదే నా ఆవేదన. ఇప్పుడు అర్థం
అయ్యిందనుకుంటాను! :)

అచంగ

NaChaKi (Kiran Chakravarthula)

unread,
Jun 7, 2011, 4:40:35 PM6/7/11
to telug...@googlegroups.com
అవన్నీ సంస్కృతమని యెఱిగే వాడారా... తెలుగు మాటలు దొఱకలేదా? లేక నల్లూరు పల్లెలో కూడా ఈ 22 మాటలు వాడతారా? (23వది వాడారండోయ్... "గ్రామం")
 
నచకి
షరా: నా టపాలో సంస్కృతం లేదు. నోరు తెరిచి నవ్వడం
--
 
"And somewhere there are engineers
Helping others fly faster than sound.
But, where are the engineers
Helping those who must live on the ground?"
 
– Young Oxfam Poster
-----అసలు సందేశం-----
From: అచంగ
Sent: Tuesday, June 07, 2011 15:26
To: తెలుగుపదం
Subject: Re: (తెలుగుపదం) Re: నిఘంటువుల ఆధునికీకరణ
 
wlEmoticon-openmouthedsmile[1].png

అచంగ

unread,
Jun 7, 2011, 4:53:28 PM6/7/11
to తెలుగుపదం
నేను చెప్పేదీ అదే కిరణ్ గారూ, తెలిసినా సంస్కృత పదాలు వాడక తప్పని
పరిస్థితి. మీకు తెలిసి చెబితే నేను నా వ్రాత-వాడుకలో సంస్కృత పదాలు
మార్చుకోవటానికి ఎల్లవేళలా తయారు. నేనా గ్రామాన్ని వదిలి 15 సం.
ఆంధ్రదేశాన్ని వదలి 2 సం. భారతదేశాన్ని వదలి 6నెలలు ఆయింది. ప్రస్తుత
వాడకం తెలియదు. అప్పటిలో వాడేవారు.

అచంగ

NaChaKi (Kiran Chakravarthula)

unread,
Jun 7, 2011, 6:49:52 PM6/7/11
to telug...@googlegroups.com
నేను చెప్పేది అవి తెలుగు పదాలేనని, అవి మీరు మార్చుకోనక్కఱలేదని, అరుణ్ గారూ!
జర్మానిక్ భాషైన ఆంగ్లంలో జర్మానిక్ భాషలు కాని గ్రీకు, లాటిన్, ఫ్రెంచి పదాలను
విచ్చలవిడిగా కలిపేసి మాట్లాడటానికి కొంచెమయినా యిబ్బంది లేకున్నా "తెలుగులో
సంస్కృతం కలిసి కల్తీ అయిపోయింది మొఱ్ఱో!" అనటానికి మాత్రం తయారుగా యెలా ఉంటారో
నాకు అర్థం కాదు.

"నిద్రలో ఉన్నవాళ్ళని మేల్కొలపవచ్చు..." అంటారే... అదే గుర్తుకొస్తోంది.

నచకి

"And somewhere there are engineers
Helping others fly faster than sound.
But, where are the engineers
Helping those who must live on the ground?"

– Young Oxfam Poster
-----అసలు సందేశం-----
From: అచంగ

Sent: Tuesday, June 07, 2011 15:53


To: తెలుగుపదం
Subject: Re: (తెలుగుపదం) Re: నిఘంటువుల ఆధునికీకరణ

నేను చెప్పేదీ అదే కిరణ్ గారూ, తెలిసినా సంస్కృత పదాలు వాడక తప్పని

అచంగ

--

Pulikonda

unread,
Jun 7, 2011, 8:25:45 PM6/7/11
to telug...@googlegroups.com
 బాగుందండీ మీవిశ్లేషణ మీ ఆవేదన కూడా బాగుంది.
ఈ ప్రయోగాలను చాలామంది ఇంతకు ముందు చేశారు. సంస్కృతానికి రిచ్యువల్ లాంగ్వేజ్ స్టాటస్ వచ్చింది. అదేమంటే పెళ్ళిళ్ళలో చదివే సంస్కృతం మంత్రాలు పెళ్ళి చేసుకునే వారికి 99 శాతం మందికి అర్థం కావు. నూరేళ్ళు ఈమెతో హాయిగా కాపురం చేయడానికి గుర్తుగా ఈమె మెడలో తాళికడుకున్నాను అని బ్రాహ్మడు హాయిగా తెలుగులో చెప్పి పెళ్ళికొడుకును తెలుగు చెప్పమని ప్రమాణం చేయమని చెప్పవచ్చుగా. ఎవరికీ అర్థం కాని, క్వచిత్తుగా పెళ్ళి చేయించే వారికి కూడా అర్థంకాని సంస్కృత శ్లోకమే ఎందుకు చెప్పాలి అని ప్రశ్నించారు. ఇలాంటి ప్రయోగాన్ని అంటే పెండ్లి మంత్రాలు అన్నింటిని తెలుగులోని అనువాదం చేసి తెలుగులో పెండ్లిచేసేలా చేసారు, త్రిపురనేని రామస్వామి చౌదరిగారు. బ్రాహ్మణులతో పని లేకుండా వారే పెండ్లిండ్లు చేయించారు. కాని తెలుగు వాళ్ళు సంస్కృత మంత్రాలు లేకుండా పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడలేదు. అవి చదవకపోతే పెండ్లి అయినట్లు కాదని వారికి గట్టినమ్మకం ఏర్పడింది. దీన్నే భాషకు రిచ్యువల్ స్టాటస్ రావడం అని అంటారు. ఈ స్టాటస్ నే మన సంప్రదాయ పండితులు దైనందిన అవసరాలకు రాసే భాషలో కూడా ఉందని భావిస్తారు. అందుకే సంస్కృత పదాల అపభ్రంశం జరగకుండా కాపాడుతారు. దాని వల్ల తమ పాండిత్య ప్రతిభ కూడా నిలబడుతుందని భావిస్తారు. భారత దేశం అనడాన్ని బారత దేశం అని అంటే వత్తులేకుండా పలుకు తాడేం అని ఆపసోపాలు పడతారు. ఎన్నో ఇతర భాషా పదాలను తెలుగు చేసేసాం. హిందీ వాళ్లు ఇంగ్లీషు పదాలను కూడా హిందీలాగా మారుస్తారు. బాటిల్ ని వారు హిందీలాగా బోతల్ అంటారు. చైనాని చీని అని రష్యాని రూసీ అని ఇలా ఎన్నోపదాలు హిందీలాగా మార్చికాని వాడరు వారు. ఇంతెందుకు మన సోదరులు తమిళం వారు వత్తుల బాధను వదిలించుకున్నారు. మధురను వారు మదురై అని రాయడంలా ప్రతి సంస్కృత పదాన్ని వాళ్ళు తమిళ గుణం తెచ్చికాని వాడరు. పైగా అది సంస్కృత పదం కాదు తమిళ పదమే నని కొన్ని రోజుల తర్వాత బుకాయిస్తారు. అదీ భాషాభిమానం. కాని మనవాళ్ళకు ఎంత సంస్కృతానికి దగ్గరగా జరిగితే అంత పండితుల కింద లెక్క. ఇది సంప్రదాయికంగా వస్తున్న ఒక సామాజిక వర్గం చాకచక్యం, ఇదే మిగతా పండితులకు అంటుకుంటుంది. ప్రజాస్వామ్య యుగలో దీని నుండి బయట పడి మనపెళ్ళిళ్ళను మనం మన తెలుగులో చేసుకున్నుప్పుడు మన గుడులలో మనం చేసే పూజలు మనకర్థమయ్యే మన తెలుగులో చేసుకున్నప్పుడు. అసలు మన తెలుగుకు కూడా ఈ రిచ్యువల్ స్టాటస్ తెచ్చుకున్నప్పుడు మనం నిజమైన ప్రజాస్వామ్యంలో ఉన్నట్లు లెక్క. కాని తెలుగు వారి ఇంత సాహసం ఎప్పుడు చేయాలి. శుభం భూయాత్. అదుగో చూశారా మళ్ళీ సంస్కృతం.
భవదీయుడు
పులికొండ సుబ్బాచారి.

2011/6/7 kv ramana <kvje...@gmail.com>



--
Prof. P.  Subbachary
Department of Folklore & Tribal Studies
Dean, School of Human and Social Sciences
Dean, Academic Affairs (Principal)
Dravidian University
Kuppam 517425
A.P

NaChaKi (Kiran Chakravarthula)

unread,
Jun 7, 2011, 10:34:48 PM6/7/11
to telug...@googlegroups.com

అక్షరాల విషయంలో పోల్చక పోల్చక తమిళంతోనే పోల్చుకోవాలా, సుబ్బాచారి గారూ!? మహాప్రాణాలు మాత్రమే కాదు కదా, వర్గానికి ఒక అక్షరం, ఒక అనునాసికం చాలుననుకున్నారు వాళ్ళు. వ్రాత-వాడుక ఒకేలా ఉందా వాళ్ళకి? లేదే?! ఎప్పుడు క పలకాలో యెప్పుడు గ పలకాలో అర్థం కాదు. (నేను గతంలో ఒకసారి తమిళంలో "కాంతినగార్" అని చదివి బస్సుని వదిలేసుకున్నాక అర్థమైంది అది "గాంధినగర్" కి వెళ్ళే బస్సని, నేనది యెక్కవలసిందని. అంత కన్నా దారుణం "శాంతి" అన్న పదం పక్కన "ని" చేఱిస్తే "చాందిని" అవటం.) ఆ భాషీయుల భాషాభిమానాన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు సందర్భానుసారంగా, కానీ అక్షరాల విషయంలో మాత్రం తమిళంతో పోలిక వలన ఒఱిగేది యెక్కువ లేదేమోనని నా వ్యక్తిగత అభిప్రాయం.

ప్రజాస్వామ్యమంటే ప్రజలకు కావలసినది ప్రజలే నిర్ణయించుకోవటం. త్రిపురనేని వారు తెలుగు పెళ్ళిళ్ళు చేయించినా తెలుగువాళ్ళకి సంస్కృతమంత్రాలే కావలసి వచ్చాయని ఒక ప్రక్క చెబుతూనే మఱో వైపు తెలుగుకి ritual status కావలసిందేనని పట్టుబట్టడంలోని ఔచిత్యం నాకు కనపడటంలేదు.

మీ అంత భాషాచరిత్ర నాకు తెలియదు కానీ నాకు అనిపించినది చెప్పాను.

నచకి

--
http://forthesociety.blogspot.com/
http://nachaki.wordpress.com/
http://kirandotc.blogspot.com/

"And somewhere there are engineers
Helping others fly faster than sound.
But, where are the engineers
Helping those who must live on the ground?"

– Young Oxfam Poster

Kiran Kumar Chava

unread,
Jun 7, 2011, 10:40:08 PM6/7/11
to telug...@googlegroups.com
ఈ గుంపులో ఈ చర్చ రావణకాష్టంలా మండుతూనే ఉండాలా,
గుంపు పెట్టినప్పటినుండి చూస్తున్నాను -
మన శక్తియుక్తులన్నీ ఈ చర్చపైనే కేటాయిస్తున్నాము. దాని బదులుగా మరింత ఉపయోగపడే పని చేస్తే బాగుంటుంది.
రెడ్డొచ్చె మొదలెట్టులాగా , ప్రతి కొత్త వ్యక్తి రాగానే, లేదా ఉన్న వ్యక్తికే చివాలు రాగానే మళ్లా ఈ చర్చ ప్రారంభం. ఇంతా చేస్తే కొత్తగా తేల్చేది ఏమీ ఉండది. నా పార్టీ ఇది, నా వర్గం ఇది, నా ప్రేమ దీనిపైనా అని మరోసారి అందరికీ ఢంగా భజాయించి చెప్పటం తప్ప.
మూల పదాలను సృష్టించి దాని ఆధారంగా కొత్త పదాలు సృష్టించాలి అనుకున్నాము. ఆ విషయంలో మనం కృషిచేస్తే ఉపయోగం ఉంటుంది.
అలానే ప్రొడక్టివ్ పని చెయ్యకుండా ఈ గుంపులో ఇటువంటి చర్చల్లో పాల్గొనే అర్హతను తొలగించాలి. అంటే ఎవరన్నా సంస్కృతమా అని అడగంగనే నువ్వెన్ని లినక్స్ ఉపకరణాలకు తెలుగు సేత చేశావో ముందు చెప్పు అని అడగాలి.


మురళీ కృష్ణ Murali Krishna

unread,
Jun 9, 2011, 5:22:05 AM6/9/11
to telug...@googlegroups.com
కిరణ్ గారు,

నా అభిప్రాయం లొ ఈ చర్చ కూడా మంచికె .

కాని గ్రాంధికానికి్, వ్యావహారీ్కానికి మధ్య చర్చ ఆరొగ్యవంతంగా ఉండాలి.
భాషాభివృధి కి వామపక్ష భావాజాలం పనికిరాదు. అలాగే పరభాషా దూషణ కూడా పనికిరాదు.
మన ఇతిహాసాల ప్రకారం భాష శబ్దం నుండి పుట్టింది. కాబట్టి భాషకి
శబ్దమే ప్రాణ వాయువు. కనుక శబ్దం పలుకలేకపోతె అది దోషం సమర్ధనీయం కాదు.
ఒకే భాషకి ప్రాంతీయ-కుల-వర్గ భేదాలు అంటగట్టడం ఒక్క మన తెలుగు వారి లోనె కనిపిస్తుందని చెప్పడానికి చింతిస్తున్నాను.

ప్రాంతీయ-కుల-వర్గ-జాతి భేదాలు పక్కన పెట్టి భాష దాని వాడుక/ప్రయొగాన్ని, నిర్దిస్టం చేస్తే తప్ప భాష సర్వతొముఖాభివృధి చెందదు.
 


-------------------------------------------
కిరణానికి చీకటి లేదు...
సిరిమువ్వకి మౌనం లేదు.....
చిరునవ్వుకి మరణం లేదు.......
స్నేహానికి అంతం లేదు...
మరిచే స్నేహం చేయకు, చేసే స్నేహం మరవకు .

Thanks & Regards,
మురళీ కృష్ణ వేదాంతం (MURALI KRISHNA VEDANTAM)



2011/6/8 Kiran Kumar Chava <chava...@kinige.com>


--

మురళీ కృష్ణ

unread,
Jun 9, 2011, 5:26:14 AM6/9/11
to తెలుగుపదం
కిరణ్ గారు,

నా అభిప్రాయం లొ ఈ చర్చ కూడా మంచికె .

కాని గ్రాంధికానికి్, వ్యావహారీ్కానికి మధ్య చర్చ ఆరొగ్యవంతంగా ఉండాలి.


భాషాభివృధి కి వామపక్ష భావాజాలం పనికిరాదు. అలాగే పరభాషా దూషణ కూడా
పనికిరాదు.

మన ఇతిహాసాల ప్రకారం భాష శబ్దం నుండి పుట్టింది. కాబట్టి భాషకి శబ్దమే


ప్రాణ వాయువు. కనుక శబ్దం పలుకలేకపోతె అది దోషం సమర్ధనీయం కాదు.
ఒకే భాషకి ప్రాంతీయ-కుల-వర్గ భేదాలు అంటగట్టడం ఒక్క మన తెలుగు వారి లోనె
కనిపిస్తుందని చెప్పడానికి చింతిస్తున్నాను.

ప్రాంతీయ-కుల-వర్గ-జాతి భేదాలు పక్కన పెట్టి భాష దాని వాడుక/ప్రయొగాన్ని,
నిర్దిస్టం చేస్తే తప్ప భాష సర్వతొముఖాభివృధి చెందదు.

Praveen

unread,
Jun 9, 2011, 6:19:04 AM6/9/11
to telug...@googlegroups.com
నిఘంటువులు prescriptive కావచ్చు, descriptive కావచ్చు. మొదటి రకం ప్రామాణికాల సంకలనం, రెండవది వాడుక భాష సంకలనం. అంతర్జాలంలోనూ, SMS లో వాడే పదాలు Oxfordలో చేర్చారు అంటే దానర్థం అవి ప్రామాణికమైన పదాలు అని కాదు - ఈ పదాలు వ్యవహారంలో ఉన్నాయి అని. తెలుగులో ఆంగ్ల పదాలు వాడుతున్నారు అంటే అవి మంచివి అని కాదు, తెలుగు పదాలు లేక అలా చెయ్యవలసి వస్తూంది అని గుర్తించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి prescriptive పదాలు అవసరం. ఇటువంటి ప్రామాణికాలు తయారుచెయ్యాలి అంటే భాషావేత్తలు కావాలి - వాడుక భాషనుంచి స్ఫూర్తి తీసుకోవచ్చు కానీ అవి అన్నిటికీ సరిపోవు.

సంస్క్రతం వాడుతున్నారు అంటే అది కేవలం వాడుక లో సౌలభ్యం కోసమే: ధాతువులు సులువుగా దొరుకుతాయి, వాటికి తగినట్టుగా అన్ని సందర్భాల్లో వాడుకోవడానికి పటిష్టమైన వ్యాకరణ సూత్రాలున్నాయి, తెలుగులో మొదటినుంచీ కలిసిపోయి మరీ ఎబ్బెట్టుగా ఉండదు అని. ఇటువంటి లక్షణాలున్న ధాతువులు/పదాలు ఏ భాష నుంచి తెచ్చినా సంతోషమే. ఆంగ్ల పదాలో, ఉర్దూ పదాలో వాడితే తెల్లదొరలు ఏలేస్తున్నారు అని అనుకోవట్లేదు కానీ సంస్క్రతం అయితే మటుకు "పండితులు మనల్ని ఎక్కి తోక్కేస్తున్నారు" అనే వైఖరి మానుకోవాలని నా మనవి.

-- ప్రవీణ్

2011/6/9 మురళీ కృష్ణ <muralikris...@gmail.com>
--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.

 * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
 * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
 * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి

ANANDASWARUP GADDE

unread,
Jun 9, 2011, 1:59:02 PM6/9/11
to telug...@googlegroups.com
There seem to be renewed efforts to bring more dictionaries online
http://groups.yahoo.com/group/racchabanda/message/23408
From the list I see that both types, prescriptive and descriptive are
in the list. This may be an effort worth keeping track off. I have
already seen two (sort of ) descriptive ones online 'patrika
padakosam' and 'adhunika vyavaharakosam' and I think that i gave the
links earlier.

2011/6/9 Praveen <mirch...@gmail.com>:


> నిఘంటువులు prescriptive కావచ్చు, descriptive కావచ్చు. మొదటి రకం ప్రామాణికాల

> సంకలనం, రెండవది వాడుక భాష సంకలనం. > * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి:

kv ramana

unread,
Jun 9, 2011, 11:39:42 PM6/9/11
to telug...@googlegroups.com
ప్రవీణ్ గారు,
తెలుగులోకి సంస్కృత పదాల్ని దించుకోవచ్చు, ఇతర భాషాపదాల్ని కూడదు అని
వాదించే వారికోసమేనా ఈ కూడలి? అందరి ఉద్దేశాలకు చోటిస్తే బావుంటుంది.
ఏదేమైనా ఏ వాదనలకు ఇందులో తావుందో నిర్ణయించేది మీరా? అలా ఐతే అచ్చులో ఒక
పత్రిక నడిపించుకోండి. మీకు నచ్చనివాటిని తప్పించుకోవచ్చు.
ద్రవిడ పదాలు మాత్రమే అనువాదంలో చేరాలని నేననలేదు,నాకలాంటి
అభిప్రాయమూ లేదు. వాడకరుల అవసరాలని ఏ పదాలు తీర్చగలవొ వాటిని అనువాదానికి
తీసుకోవాలి అనుకుంటున్నాను. సంస్కృత పదాలొద్దని నేనడం లేదు. ఇప్పటికే
మనకున్న సంస్కృత పదాలతో సమాసం కట్టవలసిన చోట సంకృత పదాలని నియోగిస్తేనే
అందగిస్తుంది. అటువంటి చోట సంస్కృత పదమే కావాలి. ఇదే మంత్రం అన్నింట
బావుంటుందా?

రహమ్తుల్లా గారు,
మీరిచ్చిన ఉర్దూ పదాలపట్టీలో "అపరంజి" ఉంది.
ఇది ఉర్దూ నుంచి వచ్చిందా? దీని ఉర్దూ మూలం ఎలాంటిదో చెప్పగలరా? మీకు
ఉర్దూ తెలిసే వుంటుంది లేదా తెలుసుకునే ఆధారం మీకు దొరుకుతుందని
ఆశిస్తాను. ఈ ఆరోపంలో సూర్యరాయాంధ్రం రామరాజభూషణుడి వసుచరిత్రాన్ని
ఉదాహ్రించింది. అంచేత ప్రాక్రితశబ్దమో, ద్రవిడశబ్దమో మూలం అయ్యుంటుందని
అనుకున్నాను. మీరు పరిశొధించి చెప్పగలరని ఆశిస్తున్నాను.

NaChaKi (Kiran Chakravarthula)

unread,
Jun 10, 2011, 8:11:52 AM6/10/11
to telug...@googlegroups.com
<< తెలుగులోకి సంస్కృత పదాల్ని దించుకోవచ్చు, ఇతర భాషాపదాల్ని కూడదు అని వాదించే వారికోసమేనా ఈ కూడలి? అందరి ఉద్దేశాలకు చోటిస్తే బావుంటుంది.
ఏదేమైనా ఏ వాదనలకు ఇందులో తావుందో నిర్ణయించేది మీరా? అలా ఐతే అచ్చులో ఒక పత్రిక నడిపించుకోండి. మీకు నచ్చనివాటిని తప్పించుకోవచ్చు. >>
 
రమణ గారూ,
 
నేను వాదనలు పొడిగించదలచలేదు. ఈ కూడలి యెందుకోసమో ఒకసారి చావా కిరణ్ టపా చూస్తే మీకూ తెలుస్తుందని ఆశిస్తున్నాను. వెటకారానికి కూడా ఒక పద్ధతి, మేర ఉంటాయి. మీకు కావలసినది క్రొత్త పదాల నిష్పాదనే అయితే మాటమాటకీ సంస్కృతం గుఱించి వాదనలు కట్టిపెట్టి యీ కూటమి ఉద్దేశాలకి కొంచెమైనా సహాయకారిగా ఉంటే బాగుంటుంది. మీకు తెలియని పదాలకు నిష్పాదనలు అడగటము, తెలుగు మీద సంస్కృతం దండయాత్రలను యేకరువు పెట్టడము, మీ పుస్తకాల పరిచయము తప్ప నాకు మీ నుంచి యీ కూటమికి వచ్చినవి పెద్దగా కనిపించలేదు... ఈ మాట కూడా నేను వ్యక్తిగతంగా ఒకరిని అంటాననని అనుకోలేదు. మీ స్థాయికే దిగి యెదుటి వ్యక్తిని వేలితో పొడిచి చెబితే అర్థమవుతుందేమోననే యీ ప్రయత్నం. ఇంత కన్నా వాదన పొడిగించకపోతే అందఱికీ మంచిది.
 
నచకి
--
 
"And somewhere there are engineers
Helping others fly faster than sound.
But, where are the engineers
Helping those who must live on the ground?"
 
– Young Oxfam Poster
-----అసలు సందేశం-----
From: kv ramana
Sent: Thursday, June 09, 2011 22:39
Subject: Re: (తెలుగుపదం) నిఘంటువుల ఆధునికీకరణ

ANANDASWARUP GADDE

unread,
Jun 10, 2011, 10:08:40 PM6/10/11
to telug...@googlegroups.com
2011/6/10 NaChaKi (Kiran Chakravarthula) <email4...@gmail.com>:

ఈ కూడలి యెందుకోసమో ఒకసారి చావా కిరణ్ టపా చూస్తే
> మీకూ తెలుస్తుందని ఆశిస్తున్నాను.

Do you mean this?

అచంగ

unread,
Jun 11, 2011, 4:39:25 AM6/11/11
to తెలుగుపదం
కిరణ్ గారూ,

<< (నేను గతంలో ఒకసారి తమిళంలో "కాంతినగార్" అని చదివి బస్సుని


వదిలేసుకున్నాక అర్థమైంది అది "గాంధినగర్" కి వెళ్ళే బస్సని, నేనది
యెక్కవలసిందని. అంత కన్నా దారుణం "శాంతి" అన్న పదం పక్కన "ని" చేఱిస్తే
"చాందిని" అవటం.)>>

ఆయా భాషల అక్షరమాల స్థానిక అవసరాలను బట్టి ఒక రూపాన్ని సంతరించుకున్నాయి.
పరభాషీయులైన మీకు (తమిళానికి) ఆ వాడుక, ప్రయోగము తెలియకపోవచ్చు. మీరు
పడిన గందరగోళం తమిళులెవ్వరూ పడరు. అలాగే ఆయా లిపులకి నేను జడత్వం
ఆపాదించబోను. తమిళ లిపిలో సైతం శ్రీ, హ, ష, జ, క్ష వంటి అక్షరాలు సంస్కృత
ప్రభావంతో వచ్చి చేరినవే.

అలాగే తెలుగులో కూడా అన్ని అక్షరాలూ (శబ్దాలూ) చాలావరకు ఉన్నా
పరభాషీయులకి ఆయా పదాలను పలుకటం రాకపోవచ్చు. ఉదాహరణకి మా ఇంటి పేరు
'గడ్డిపాటి' అనేదాన్ని తమిళులు 'గట్టిపాడి' అని ఉచ్చరిస్తే, హిందీవాళ్ళు
'గద్దిపాతి' అని ఉచ్చరిస్తారు.

--- అచంగ

NaChaKi (Kiran Chakravarthula)

unread,
Jun 11, 2011, 4:39:47 AM6/11/11
to telug...@googlegroups.com
I mean this: “మూల పదాలను సృష్టించి దాని ఆధారంగా కొత్త పదాలు సృష్టించాలి అనుకున్నాము. ఆ విషయంలో మనం కృషిచేస్తే ఉపయోగం ఉంటుంది.
 
NaChaKi
 
-----అసలు సందేశం-----
From: ANANDASWARUP GADDE
Sent: Friday, June 10, 2011 21:08
Subject: Re: (తెలుగుపదం) నిఘంటువుల ఆధునికీకరణ
 
Reply all
Reply to author
Forward
0 new messages