మనం క్రీస్తుపూర్వం, మరియు క్రీస్తుశకం అని ఎందుకు అంటాం ?

167 views
Skip to first unread message

Jayanth Varma B

unread,
Mar 30, 2016, 5:21:08 AM3/30/16
to తెలుగుపదం
నేను ఈ ఫోరముకి కుంచెం కొత్త. ఈ పత్రము సరియాయిన పద్ధతిలో రాయక పోతే క్షమింక్షంది.

నా అనుమానం ఏమిటంటే మనం క్రీస్తుపూర్వం, క్రీస్తుశకం అనే పాశ్చాత్య దేశాల కాల పద్దతి ఎందుకు వాడుతాం ? కేవలం ఇదే కాదు, మనం వాడే క్యాలెండర్లు కుడా పాశ్చాత్య దేశం వాళ్ళు చేసినవే. మనకి మన పంచాంగం వుంది కదా !

పంచాంగంలో కాలాన్ని కొలువుటకు పద్ధతులు ఉన్నాయి. మన ఈ సమయం కొలిచే పద్దతులు సరైనవే అని మన పండితులే కాక బయటవారు కూడా అంటారు. ఇలా మనకు సొంత ప్రక్రియలు ఉన్నప్పటికీ పాశ్చాతదేశంలో ఎవరో చేసిన ఈ క్రీస్తుపూర్వం, క్రీస్తుశకాలు మనకు అవసరమా ? అసలు మనం ఇవి వాడుటకు కారణాలు ఏంటి ?

నేను విన్నది ఏమిటంటే క్రీస్తుపూర్వం, క్రీస్తుశకాలు క్రీస్తును పొగుడుటకు అతని జన్మమును ఆధారంగా చేసుకుని సృష్టించినవి. కాని దానిలోనూ ౪-౬ సంవత్సరముల తప్పిదము ఉన్నదంట. అయినా ఇది ప్రథమంగా వెస్ట్ దేశాలకోసం  సృష్టించిన పద్ధతి. వీటితో పోలిస్తే శాస్త్రీయంగా మనవే మేలు అని వేరే దేశాల శాస్త్రవేత్తలు పొగిడిన సాందర్బాలు ఉన్నాయి. అలాంటప్పుడు మనము వీటిని వాడుట అవసరమా ?  మనం ఒక పద్ధతి వాడితే అది మన చరిత్రకు  లేదా మన పరిస్థితులకు లేదా కనీసం మన వాతావరణానికి అనువుగా ఉండాలి కదా. అయినా ఏ పుస్తకాలు చుసిన ఎవరి నోట వినినా ఈ క్రీస్తుపూర్వం, క్రీస్తుశకాలే. ఎందుకని ఇలా ? దయచేసి ఎవరైనా చెప్పండి.

బాలాజీ మారిశెట్టి

unread,
Mar 31, 2016, 1:44:26 AM3/31/16
to తెలుగుపదం
కాలాన్ని కొలవడానికి/చెప్పడానికి ఎప్పుడూ ఒక reference point కావాలి. పాశ్చాత్యులు దానికోసం వాని నమ్మకం ప్రకారం క్రీస్తు జన్మదినాన్ని లెక్కించి, దానిని reference point గా వాడుకున్నారు. ఈ కాల మానాన్ని గ్రెగరియన్ లేదా క్రిస్టియన్ క్యాలెండర్ అంటారు.
ఈ ఒక్క క్యాలెండరే కాకుండా ప్రపంచంలోని ప్రతి ప్రాంతం వారికి వారు అనుసరించే ఒక కాలమానం(calendar) ఉంది. (ఉదా: చైనీస్ క్యాలెండర్, హిందూ క్యాలెండర్, ఇస్లామిక్ క్యాలెండర్.) పూర్వకాలంలో ఒక ప్రాంతం, మరొక ప్రాంతం వారి మధ్య పెద్దగా సంబంధాలు లేని కాలంలో, ఇలా ఎవరి క్యాలెండర్లు వారు వాడుకుంటూ ఉండేవారు. అయితే ఈ ఆధునిక యుగంలో, దూర ప్రాంతపు ప్రజల మధ్య పరిచయాలు, రాకపోకలు, సంబంధాలు బాగా పెరిగిన తరుణంలో అందరికీ తెలిసిన ఒక ప్రామాణిక(standard) క్యాలెండర్ అవసరం ఉంది. పాశ్చాత్యులు దాదాపు ఈ ప్రపంచాన్ని అంతా ఒకానొక సమయంలో పాలించటం చేత, వారు ఉపయోగించే గ్రెగరియన్ క్యాలెండర్ అందరికీ పరిచయం అయ్యింది. ఆ క్యాలెండర్‌నే ఇప్పుడు ప్రపంచమంతటా వాడుతున్నారు. అన్ని ప్రాంతాల వారు, అన్ని మతాల వారు ఇప్పుడు వాడుతున్నారు గనుక క్రైస్తవ మతానికి సంబంధించిన BC(Before Christ), AD(Anno Domini) అని వాడటం సబబు కాదని, ఇప్పుడు BC కి బదులుగా BCE(Before Common Era) అని, AD కి బదులుగా CE(Common Era) అని వాడుతున్నారు. వికిపీడియాలో మీరు ఈ వాడుకని చూడవచ్చు. అయితే మన తెలుగులో మాత్రం ఇప్పటికి క్రీస్తుపూర్వం, క్రీస్తుశకం అనే అంటున్నాం.
CE ని ఆధునిక యుగం(ఆయు) అని మరియు BCE ని పూర్వ యుగం(పూయు) అని మన తెలుగులో వాడటం మొదలు పెట్టొచ్చేమో.

Ranganadh Nagubandi

unread,
Mar 31, 2016, 1:44:42 AM3/31/16
to telug...@googlegroups.com, 0...@gmail.com

We were defeated by West, and Invaders and Macaulay destroyed our educational system ,
naturally replaced it in their perspective.       So is the fate of  most part of the East ,and world is in need of single time concepts at that time, and Western ideas were conveniently placed upon all of us.

Ranga nadh

--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుపదం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugupadam...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.

Akshay Regulagedda

unread,
Mar 31, 2016, 3:43:04 AM3/31/16
to telug...@googlegroups.com

అని మీరు తెలుగు గుంపు అయినా, తెలుగులో కాక, ఇంగ్లీషులో వ్రాయడం గమానార్హం. J

 

ఇక విషయానికి వస్తే:

·       Calendar, కాలమానం etc: క్యాలండర్ కి తెలుగు పదం కాలమానం కాదు. నిఘంటువులో కాలమానంఅనే పదానికి కొలతఅనే అర్థం ఇచ్చారు. తె-వికీ తదితర ప్రదేశాలలో అదే పదాన్ని ‘time-zone’ అనే అర్థంతో వాడారు. ఇంకో చోట time-zoneని కాల మండలం లేక సమయ ప్రాంతం అని వ్రాశారు. ఈ విషయంపై కాస్త ఏకాభిప్రాయం ఉండడం మంచిది; కాలమానం పదాన్ని నిఘంటువు అర్థానికి వదిలేసి, time-zone ని కాలమండలం అని పిలిస్తే బాగుంటుంది. క్యాలండర్ అనే పదానికి సరి అయిన తెలుగు పదం పంచాంగం.

·       Eras: “Era” అంటే యుగం కాదు, Era అంటే శకం.
భారతీయ క్యాలండర్లలో ఎన్నో శకాలు ఉన్నాయి. శాక శకాన్ని ఎవరో ఇందాకే ప్రస్తావించారు
; ఆధునిక శాకా శకమే కాకుండా, విక్రమ శకం, కొల్లం శకం, బెంగాలీ సన్, కాలీ శకాలు కూడా ఉన్నాయి. ఈ కింది పట్టికలో చూడవచ్చు.

శకం

మొదలు (‘zero year’)

వాడే క్యాలెండర్

శాక శకం

78 CE

జాతీయక్యాలెండర్

కొల్లం

824 CE

మలాయాళీ క్యాలెండర్

కాలీ

3101 BCE

దేశ వ్యాప్తం

బెంగాలీ సన్

963 + 1556 CE మొదలు సూర్యమాన సంవత్సరాలు

బెంగాల్

విక్రమ శకం

57 CE

దేశ వ్యాప్తం

 

·       Common Era(CE) vs Anna Domini (AD): AD/ BC – క్రీ.శ, క్రీ.పూ బదులు Common Era, Before Common Eraల తెలుగు అనువాదం వాడవచ్చని అన్నారు. నేనూ ఏకీభవిస్తున్నాను; యేసు క్రీస్తు జననం క్రీశ 1లో అయ్యిందని ఏ విధమైన చారిత్రక ఆధారాలు లేవు కాబట్టి నిజానికి Common Eraకి క్రైస్తవ మతాచారాలు, నమ్మకాలకి ఏ సంబంధమూ లేదు. ఆధునిక శకము, ప్రాచీన శకము అని వ్రయడమే సబబు.

 

మరి ఇన్ని శకాలు వదులు కొని పాశ్చాత్య శకమైన Common Eraని ఎందుకు వాడుతున్నాము అనే బదులు, విక్రమ, శాక, కాలీ శకాలను మీరు ఎందుకు వాడట్లేదు అని నేను అడుగుతున్నాను. J

కారణం: ప్రపంచీకరణ. మొన్ననే నేను జపాన్ ప్రభుత్వ గణాంకాలు చూడవలసిన అవసరం వచ్చింది. వాళ్ళ ఎక్సల్ షీట్ లో ఎండం వైపు వాళ్ళ శకం, భాష ఉండగా, కుడి వైపు ఇంగ్లీషు, ఆధునిక శకంలో సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళని ఆంగ్లేయులు, ఇతర “invaders” ఎప్పుడూ పాలించలేదు, మక్యులేయి గారు వాళ్ళ విద్యాభ్యాసం నడుప లేదు. అయినా, నా లాంటి జపాన్-ఇతర వ్యక్తుల సౌకర్యార్థం ఆధునిక శకంలోకి వాళ్ళ సంవత్సరాలను మార్చవలసి వచ్చింది.

 

అక్షయ్

(ఎన్నో యేళ్ళ క్రితం క్యాలండర్లపై నేను పరిశోధన చేశాను, నా రిపోర్టు ఇక్కడ చదవగలరు.)

Jayanth Varma B

unread,
Apr 4, 2016, 8:22:05 AM4/4/16
to తెలుగుపదం
నాకు ఈ టపా రాసేటప్పుడు ఉన్న కొన్ని ముక్యమైన సందేహాలు తీర్చారు. ధన్యవాదాలు.
Reply all
Reply to author
Forward
0 new messages