రిష్టం అనేపదం `రిష=హింసాయాం' అనే ధాతువునుండి పుట్టింది. రిషతి అంటే
హింసించునది/ చెరచునది అని అర్థం.
౧ . రిషతి అశుభాని ఇతి రిష్టం. అశుభాలను చెరచునది - రిష్టం =
క్షేమము,శుభము.
౨. రిషతి శుభాని ఇతి రిష్టం. శుభాలను చెరచునది - రిష్టం = అశుభము,
వినాశము.
అంతే కాదు దీని మీదనే పుట్టిన `అరిష్ట ' శబ్దానికీ ఇలాగే అర్థం.
౧. న విద్యతే రిష్టం = అశుభం ఇత్యరిష్టం. అశుభం లేనిది అరిష్టం = శుభం.
౨.న విద్యతే రిష్టం = శుభం ఇత్యరిష్టం. శుభం లేనిది అరిష్టం = అశుభం.
నమస్కారములతో -
బుధజనవిధేయుడు,
రామక పాండురంగశర్మ
------------------------------------------------------------------------------------------------------------------------------
సంస్కృతాంధ్ర గ్రంథాలకు నిలయం.... http://teluguthesis.com