తెలుగు పాత్రికేయులు మన వాడుకలకున్న అందాన్నీ, అర్థాన్నీ కూడా ఎలా పనిగట్టుకొని చెడగొడుతున్నారో స్పష్టంగా తెలియజేసే ఉదాహరణ - ఈమధ్య మనం తఱచుగా చూస్తున్న "న భూతో నభవిష్యత్" .
దీని అసలు రూపం - అనగా ఇటీవలి దాకా తమ రచనల్లో రచయితలంతా వాడిన రూపం "న భూతో న భవిష్యతి"
అనగా - "జరుగలేదు, జరుగబోదు" అని అర్థం.
ఇప్పుడు కించిద్ జ్ఞానులైన పాత్రికేయులు వాడుతున్నది "....న భవిష్యత్" - అంటే భవిష్యత్తే లేదు. (No future at all) అని !
ఎందుకిలా చేస్తున్నారు అంటే Column space కక్కుర్తి. (కానీ ఈ వాడుక విషయంలో పొదుపయ్యేదేమీ లేదు)
ఇలా Column space కక్కుర్తి కోసమూ, సంచలనాల కుతికోసమూ ముచ్చటైన తెలుగు పదాన్నింటినీ కట్టగట్టి గంగలో కలిపి పెద్దపెద్ద అక్షరాల్లో "టూర్ లో సీయం, గ్రాంటుకి కేబినెట్ నో" అంటూ సర్వం ఆంగ్లమయం చేసి పారేస్తున్న ఈ తెలుగుభాషాద్రోహులైన పాత్రికేయుల నుంచి మనం భాషాపరంగా ఏ విధమైన మార్గదర్శకత్వాన్నయినా ఆశించగలమా ? ఒకప్పుడు ఆశించగలిగేవాళ్ళమేమో, తెలుగుమీడియమ్ లో కాకలు తీఱి వచ్చిన మహామహులు పత్రికారంగంలో ఉన్నరోజుల్లో ! ఇప్పుడు మాత్రం రామ, రామ ! సాధ్యం కాదు.
--
నెనర్లు. (Thanks)
Yours Truly
T. Lalitha Bala Subrahmanyam
ఇట్లు భవదీయుడు
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use
http://lekhini.org