అనునాసిక సంధి

450 views
Skip to first unread message

phani deep prayaga

unread,
Mar 31, 2011, 7:03:38 AM3/31/11
to తెలుగుపదం
బ్లాగ్/బ్లాగు + మిత్రులు = బ్లాగ్మిత్రులా ? బ్లాఙ్మిత్రులా
(వాక్ + మయం = వాఙ్మయం కదా)

Venu Ch

unread,
Mar 31, 2011, 8:11:07 AM3/31/11
to telug...@googlegroups.com

 బ్లాక్ + మిత్రులు కాదు కదా?  అలా  అయితేనే  మీరన్న రూపం వస్తుంది! 

2011/3/31 phani deep prayaga <phanidee...@gmail.com>
బ్లాగ్/బ్లాగు + మిత్రులు = బ్లాగ్మిత్రులా ? బ్లాఙ్మిత్రులా
(వాక్ + మయం = వాఙ్మయం కదా)

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.

 * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
 * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
 * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి

Sri Raghava Kiran Mukku

unread,
Mar 31, 2011, 8:18:54 AM3/31/11
to telug...@googlegroups.com
నాకు తెలిసినంతలో... ఇక్కడ బ్లాగ్ మిత్రులు అన్న రెండు పదాలనూ వ్యవధానం లేకుండా చదువుతున్నాం/వ్రాస్తున్నాం అంతేనండీ. ఐనా, బ్లాగ్ సంస్కృతపదం కాదు కదా, సంస్కృతసంధి చేయటానికి.

నమస్సులతో
రాఘవ

phani deep prayaga

unread,
Mar 31, 2011, 9:21:19 AM3/31/11
to తెలుగుపదం
నెనరులు.
పలికినప్పుడు బ్లాఙ్మయం,బ్లాఙ్మిత్రులు లా అనిపిస్తున్నాయని అడిగానండీ

kv ramana

unread,
Mar 31, 2011, 9:32:32 AM3/31/11
to telug...@googlegroups.com
బ్లాగ్-మిత్రులు అనే పలుకు బ్లాఙ్మిత్రులు అంటే బ్లాంగ్మిత్రులు అని
వినిపిస్తోందా? అదెలాగ?

Sri Raghava Kiran Mukku

unread,
Mar 31, 2011, 9:34:20 AM3/31/11
to telug...@googlegroups.com
ఫణిదీప్ గారూ,

నిజానికి సంస్కృతవ్యాకరణం ప్రకారం బ్లాగ్ మిత్రుడు - బ్లాఙ్ మిత్రుడు - బ్లాఙ్మిత్ర్డుడు అనే ఔతుందండీ. ఎలా పలకబడుతోంది అన్నది మాట్లాడే వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది, సంధి చేయటమా వద్దా అన్నది.

బ్లాగ్, మిత్రుడు -- రెంటినీ పెద్ద వ్యవధానం లేకుండా పలికితే బ్లాగ్మిత్రుడు ఔతుందని ఇందాక అన్నాను చూచారూ, ఇది కూడా నిజానికి పలికే వ్యక్తి యొక్క ఇష్టమే. వ్యవధానం లేనపుడు కూడా సంధి చేయకపోవటం ఇక్కడి ప్రత్యేకత!

నావఱకూ నాకు సంధి చేయటమే నచ్చుతుందండీ. ఇదివఱకెప్పుడో నేను నెట్ జనుడు - నెజ్జనుడు అని వాడిన గుర్తు.

Pulikonda

unread,
Mar 31, 2011, 11:52:27 PM3/31/11
to telug...@googlegroups.com
సంధి సూత్రాలు సంధిని గురించిన చర్చలు వ్యవహారంలో పదాలు బాగా నలిగిన తర్వాతనే ఏర్పడ్డాయి. అంతే కాని సంధి సూత్రాలు ఉన్నాయని దానిప్రకారం వ్యవహారం జరగదు. బ్లాగ్ మిత్రులు అనే రెండు పదాల్ని వ్యవహారంలో అందరూ కనీసం ఎక్కువ మంది ఎలా వ్యవహరిస్తున్నారో చూసి దాని ప్రకారం దీన్ని గురించి చెప్పాలి. రెండు భిన్న భాషల పదాలకు సంధిచేయడం ఇంగ్లీషు పదాలు వచ్చిన తర్వాత కొత్తగా ఏర్పడింది కాదు. మన వ్యవహారంలో చాలా ఉన్నాయి. కాని వ్యాకర్తలు వాటికి ఇంకా కొత్త సూత్రాలను రాయలేదు. కొన్ని చోట్ల పాలాభిషేకం అని అంటారు. పేపరు వాళ్ళు కూడా దీన్ని ఇలాగే రాస్తున్నారు. వైరి సమాసాలు కవులు చేసేవి. కాని భిన్నభాష ల పదాలు కలిపి వాడడం వ్యవహారంలో ఉందే. పాలు తెలుగు పదం అభిషేకం సంస్కృత పదం ఏ వ్యాకరణ నియమం ప్రకారం కూడా ఈ సంధి జరగదు. కాని మాట్లాడే వారు వ్యాకరణ నియమాలు చూచి మాట్లాడరు. జనం మాట్లాడిన తర్వాత దానికి నియమాలు సూత్రాలు రాయడం వ్యాకరణం రాసే వారి పని. మెట్లోత్సవం, తెప్పోత్సవం ఇట్లాంటి సంధులే. ఫిల్మోత్సవం అని కూడ అంటున్నాం కదా. ఇక్కడ గుణసంధినియమాలు పనిచేయడం కాదు. వ్యవహర్తలు ఒక పదాలబంధం సామ్యంతో మరికొన్నింటిని చేసుకుని వ్యవహరిస్తున్నారు. కాని ఇక్కడ భాషా పండితులు మీరందరూ తప్పుడు సంధులు చేస్తున్నారు అని గోలపెడితే ప్రయోజనం లేదు. ఈ వ్యవహారాలు ఆగువు. కాగా ఇలా కొత్త సంధులు ఎనాలజీ ప్రకారం జరుగుతున్నాయని విశ్లేషించి కొత్తనియమాలు ఇవి అని చెప్పాలి.
 
ఇంటర్ నెట్ సాంకేతక పరిజ్ఞానం వల్ల ఇంగ్లీషు లోనికి కూడా చాలా కొత్త పదాలు వచ్చాయి. అక్కడి వ్యాకర్తలు కూడా వాటికి నియమాలు చెప్పాలి. అన్ని భారతీయ భాషలలోను ఈ పరిస్థితి ఉంది.
దీన్ని గురించి అధ్యయనాలు ఇంకా జరగవలసే ఉంది.

 

పులికొండ సుబ్బాచారి


2011/3/31 phani deep prayaga <phanidee...@gmail.com>
బ్లాగ్/బ్లాగు + మిత్రులు = బ్లాగ్మిత్రులా ? బ్లాఙ్మిత్రులా

(వాక్ + మయం = వాఙ్మయం కదా)
--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.

 * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
 * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
 * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి



--
Prof. P.  Subbachary
Department of Folklore & Tribal Studies
Dean, School of Human and Social Sciences
Dean, Academic Affairs (Principal)
Dravidian University
Kuppam 517425
A.P

అచంగ

unread,
Apr 1, 2011, 3:12:06 AM4/1/11
to తెలుగుపదం
ఫణిదీప్ గారూ,

తెలుగులో ఱ, ఫ, చ, జ, ఙ్ఞ, ఙ, ఞ, శ, ళ అక్షరాల ఉచ్ఛారణ, వాడుక ప్రస్తుతం
అత్యంత వివాదాస్పదం. వీటిని ఉచ్ఛారణా దోషాలుగా వ్యాకరణ సూత్రాలు
నిర్వచిస్తాయి. దీనికి సంబంధించి సుబ్బాచారిగారి వివరణ చూడండి.

Reply all
Reply to author
Forward
0 new messages