history of telugu thesis

55 views
Skip to first unread message

rpandura...@gmail.com

unread,
Apr 19, 2008, 11:15:58 AM4/19/08
to తెలుగుపదం
వెబ్ సైట్ చరిత్ర

నేను ఫోరం బోర్డ్ http://teluguthesis.invisioni.com/ ను 04-04-2008
నాడు ప్రారంభించాను.
ఇంతకంటే ముందు గత సంవత్సరం 29-04-2007 రోజు www.freewebs.com/teluguthesis
పేరున ప్రారంభించాను. ఏవో కొన్ని పుస్తకాలు పెట్టాను కాని పెద్దగా
ప్రజాదరణ పొంద లేదు.కారణం-నేను దాని మీద వెచ్చించాల్సిన సమయం వెచ్చించ
లేదు. శ్రమ కూడా తగినంత చేయ లేదు.

సైట్ అడ్రస్ మార్పు- కారణం:-

పై చిరునామాలో ఉన్నప్పుడు, అందులో తెలుగు లో పోస్టింగ్ లు పెట్ట లేక పోయే
వాడిని. తెలుగు పోర్టల్ లో ఇంగ్లీష్ లో విషయాలను పెట్టడం నాకంతగా నచ్చ
లేదు.ఇందులో తెలుగులోనే అన్నింటిని పెట్టగలగడం నాకు కొంత
ఉత్సాహాన్నిచ్చింది.అందుకే ఇక్కడికి మార్చాను.

సైట్ ను ఎందుకు ఏర్పాటు చేసానంటే...

నేను Ph.D. చేసే రోజుల్లో నా క్షేత్రం లోనే జరిగిన పరిశోధనా గ్రంథాలను
పొందలేక పోయాను అవి ముద్రణా భాగ్యం పొందక పోవడం వల్ల. అంతే కాకుండా
ముద్రణ పొందిన గ్రంథాలైనా ఒకసారి ప్రతులు చెల్లాయంటే పునర్ముద్రణ
లేదన్నట్టే.ఈ పరిస్థితుల్లో ఎన్నో పుస్తకాలు అందుబాటులో ఉండడం లేదు. ఇది
నాకు చాలా బాధ కలిగించింది.

మనం తెలుగుకు ప్రాచీన భాషా స్థాయి కలిగించాలని అంటున్నాము.ఎందుకు?
తెలుగుకు గొప్ప వైభవాన్ని కలిగిస్తామని.ఆ వైభవానికి కేంద్ర ప్రభుత్వం
నిధులిస్తేనే కలిగిస్తామా ?లేక మనవంతు కృషి ఏమైనా ఉంటుందా? మనం కూడా ఎంతో
కొంత చేయాలిగా?

ఏం చేస్తాం ఉన్న పుస్తకాలన్నీ కలగర్భం లో కలిపి? పరిశోధన లన్నింటినీ
విశ్వ విద్యాలయాల్లోనె మురగ బెట్టి?తెలుగు వారికి విజ్ఞానం అందుబాటులో
లేకుంటే మనం చేయగలిగిన సేవ ఏముంది?అందుకే ఈ సైట్ ఆలోచన చేసా. నెట్ లో
పుస్తకాలను భద్ర పరిస్తే అవి పురుగులు పట్టవని,వరదల్లో కొట్టుకు పోవనీ...
ఇంకే విధమైన నష్టం జరగదని భావించా.అందుకే ఈ పోర్టల్ ప్రారంభించా.

పోర్టల్ కు పరిశోధన అనే పేరు పెట్టా.చిరునామా లో పొరపాటు దొర్లకుండా
ఉండేందుకు గాను ఇంగ్లీష్ లో చిరునామా పెట్టా. పరిశోధనా గ్రంథాలన్నీ
ఇందులో ఉండాలని నా కోరిక.భావి పరిశోధకులకు ఇది కల్ప వృక్షం కావాలని
కోరిక. అందుకే పరిశోధనా విభాగం తో పాటు గ్రంథాలయ విభాగాన్ని పెట్టాను.ఇది
తెలుగు వారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అక్కరకు రావాలని నా కోరిక.

లక్ష్యాలు పెద్దవే. కానీ ఒక్కడితో సాధ్యమయ్యేవి కావు. అందుకే అందరం
పూనుకొని తలొక చెయ్యి వెయ్యాలి.మన లైబ్రరీని మనమే ఏర్పాటు
చేసుకుందాం.పరిశోధన అనేది ప్రపంచానికి అక్కరకు రాకున్నాక ప్రయోజనం
ఏముంటుంది?అందుకే వాటిని అందరికీ అందుబాటులోకి తేవాలని ప్రయత్నం.అలా
చేసిన నాడే మనం తెలుగుకు గొప్ప వైభవాన్ని తేగలుగుతాం.లేకుంటే నిధులు
తేగలుగుతాం కానీ,వైభవాన్ని మాత్రం తేలేము.

అందుకే మీరంతా మీ బంధు మిత్రులతో చెప్పండి.సభ్యులుగా చేరేట్టు చెయ్యండి.
మీకు తోచిన అభిప్రాయాన్ని రాయండి.మీ సలహాలు రాయండి.మీకు తోచిన విధంగా
తెలుగు భాషామతల్లికి సేవ చెయ్యండి.

ఒక్కమాట ఈ పోర్టల్ ఈ రోజు పెద్దగా అక్కరికి వచ్చేదిగా కనిపించకున్నా-
కొంతకాలం తరువాత ఎంతో అక్కరికి వస్తుంది.అక్కరికి వచ్చెట్టుగా
చేసుకుందాం. ఈ సైట్ నాది కాదు.మనది.మనమంతా కలిసి తెలుగు భాషా సాహిత్యాలను
అభివృద్ధి చేసుకుందాం.తెలుగుకు గొప్ప వైభవాన్ని కలిగిద్దాం.

తరచూ www.teluguthesis.blogspot.com అనే బ్లాగ్ ను,
www.teluguthesis.invisioni.com ను దర్శించండి.




రానారె

unread,
Apr 21, 2008, 11:19:40 AM4/21/08
to తెలుగుపదం
చాలా మంచి పని చేస్తున్నారు. అభినందనలు. ఈ పనిని ఒక ప్రయివేటుగూటిలో
చేసేబదులు తెలుగువికీసోర్సును ఉపయోగించుకోవచ్చుకదా! అక్కడయితే ఇప్పటికే
ఎందరో ఔత్సాహికులు సభ్యులుగా వున్నారు కూడా.

--రానారె.
Reply all
Reply to author
Forward
0 new messages