కొన్ని పదాలు

225 views
Skip to first unread message

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Jul 14, 2007, 3:32:03 PM7/14/07
to తెలుగుపదం
Homepage - ముఖపత్రం
mail (n) - వేగు
mail (v) - వేగుపంపు
mailer - వేగరి
mail ID - వేగు పేరు
user-name = వాడుకరి పేరు
mail address - వేగు చిరునామా
sign up - సంతకించు
sign in - లో-సంతకించు
sign out - వెలి-సంతకించు
password = సైగ-పదం
log-in (v) - విచ్చేయు
log-in (n) - విచ్చేత

పరిశీలించగలరు.

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Jul 14, 2007, 3:36:53 PM7/14/07
to తెలుగుపదం
మరికొన్ని పదాలు :

profile = ప్రవర
account = ఖాతా (పాత వాడుకే)

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Jul 15, 2007, 6:18:57 AM7/15/07
to తెలుగుపదం
అలవోక అందుబాటు జ్ఞాపకం = random access memory
కార్యక్రమించు = to program
కార్యక్రమింపు = programming
కార్యక్రమరి/కార్యక్రమింపరి = programmer
కార్యక్రమింపు భాష = programming language
గడుసు కార్యక్రమణం = smart program
దత్తాంశావళి/భోగట్టా = data
భోగట్టా నివేశింపు = data entry
భోగట్టా నివేశింపరి = data entry operator

Message has been deleted

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Jul 15, 2007, 6:38:01 AM7/15/07
to తెలుగుపదం
చెరుపు = delete
ఐ.పి.పట్టరి - IP finder
ఐ.పి.దాపరి - IP Hider
సరిచూచు = to proofread
సరిచూపరి - proofreader
సరిచూపు - proofreading
సవదరించు - edit
ప్రతిసవదరించు - copyedit

ఈ చివరిది మరీ మక్కికి మక్కి అన్నట్లుంది. ప్రత్యామ్నాయాలకు స్వాగతం.

Veeven (వీవెన్)

unread,
Jul 15, 2007, 6:46:22 AM7/15/07
to telug...@googlegroups.com
On 7/15/07, తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <subtad...@gmail.com> wrote:
చెరుపు = delete

తొలగించు, తుడిచివేయు

సవదరించు - edit

సవరించు (దీనికి ఇతర అర్థాలు కూడా ఉన్నట్టున్నాయి)

ప్రతిసవదరిచు - copyedit

ప్రతిసవరించు

Kiran NaCha

unread,
Jul 15, 2007, 7:57:19 AM7/15/07
to telug...@googlegroups.com
<<
సవదరించు - edit

సవరించు (దీనికి ఇతర అర్థాలు కూడా ఉన్నట్టున్నాయి)
>>
 
సవదరించు = to wear, hold, bear,  endure - ani unnadi Brown-lO.
"సవరిం"చు అన్న పదానికి "తప్పును దిద్దు" (సవ్యముగా చేయు) అన్న అర్థం వస్తుంది. Edit అన్న పదం అంత కన్నా విస్తృతమైనది, వేరైనది అని నాకు అనిపిస్తోంది. (ఇవి సమీపార్థకాలేననటంలో సందేహం లేదు.) నిజానికి సినీ పరిభాషలో దీనికి "కూర్పు" అన్నది సమానార్థకంగా వాడుతున్నారు. ఆ సందర్భానికి అది ఉచితమైన పదమే - పనికి వచ్చే సన్నివేశాలను ఎంచుకుని, ఆయా సన్నివేశాలను ఒక దాని వెంట ఒకటి కూర్చటమే పని కనుక.
 
మార్పు_చేర్పు_తొలగింపు_సవరణ_కూర్పు_పర్యవేక్షణ - వీటిలో ఒకటి కానీ అంత కన్నా ఎక్కువ కానీ చెయ్యటం edit అన్న పదంతో చెప్పబడుతుందని నా అభిప్రాయం. వీటిలో యే ఒక్కటీ కూడా పూర్తి అర్థాన్ని సూచించవు. సందర్భాన్ని బట్టి వేరు వేరు పదాలు అవసరమేమో. (ఉదాహరణకి సినిమాలకు సంబంధించినంత వరకు కొత్త పదం "అవసరం" కనిపించటంలేదు.. పర్యాయపదాలు ఉండటం మంచిదే అయినా.)
 
"జల్లికూర్పు" అన్న పదం ఎలా ఉంది? (లేక ఈ పదానికి ఇప్పటికే ఏదైనా వాడుక ఉన్నదా?) ఈ పదంలో "జల్లించటం" అన్న పదసూచనతో మార్పును, తొలగింపును, ఒక రకంగా చేర్పును సూచించవచ్చు. కానీ జల్లించటం = filtering అన్న అర్థం రూఢియైనది కనుక "కూర్పు"ను దానికి కూర్చటం :-) ద్వారా "పర్యవేక్షణ" అన్న అర్థం తప్పించి తక్కినవన్నీ సరిపుచ్చవచ్చా?
 
తక్కిన ప్రయోగాలు కూడా ఇందు నుంచే తీసుకోవచ్చు. [జల్లికూర్చు, జల్లికూర్పరి, జల్లికూర్పించు, జల్లికూర్పిత(ము)... sub-editor అనటానికి ఇబ్బంది... ఉపకూర్పరి అనుకోవలసిందేనా? ఇందుకేనేమో తత్సమశబ్దాలు వాడితే పదనిర్మాణం సులువుగా ఉంటుందంటారు!)
 
నచకి
 
----- Original Message -----

Kiran Varanasi

unread,
Jul 15, 2007, 8:42:39 AM7/15/07
to telug...@googlegroups.com

తరుచుగా ఉపయోగించే పదాలు, కొత్త పదాలను పుట్టించగలిగే పదాలను  తెలుగు పదాలుగా ఉంచుకోవడం అవసరం. వీటిలో క్రియాపదాలు అతిముఖ్యమైనవి, ఎన్నోరకాలైన కొత్తపదాలకవి జన్మనిస్తాయి. కొన్ని నామవాచకాలు కూడా పెక్కురకాలుగా పదసృష్టి చేస్తాయి.

ఇలాకాక, కేవలం ఒకపదంగానే ఒంటరిగా మిగిలిపోయే పదాలను మనం ప్రత్యేకంగా తెలుగించుకోవడం అంత ముఖ్యం కాదు. పలకడానికి సుళువుగా ఉండి, భాషలో మధురంగా ఇమిడిపోవగలిగేటట్లు ఉంటే చాలు. ఉదాహరణకి హోం పేజీ, డెస్కు టాపు,  వేరే పదాలకి సృష్టినివ్వడం చెయ్యవు. అందుకని, దానిని యదాతథంగా తెలుగులోకి తీసుకున్నా పెద్ద నష్టం కాదు. ఇప్పటికే మంచి ప్రచారంలో ఉన్న ఇటువంటి పదాలను కాదని భీకరమైన తెలుగు పదాలు ఇవ్వడం వలన ప్రేక్షకులను కోల్పోతాం.

వేరే ఇంకొన్ని పదాలుంటాయి, వాటికి తెలుగు అనువాదాలు కల్పించడం వల్ల తెలుగుని బాగా ప్రోత్సహించవచ్చు. random, data, net మొదలైనవి. వీటికి సాధ్యమైనంత సరళంగా పొట్టిగా ఉండే పదాలను సూచిస్తే, వీటిని మూలాలుగా తీసుకుని కొత్తపదాలను నిర్మించొచ్చు.

నా సూచనలు :

random : యతాయత
memory : జ్ఞప్తి

random access memory : యతాయత జ్ఞప్తి / యతాయత గ్రహణా జ్ఞప్తి

writable memory : మార్చసహిత జ్ఞప్తి
read only memory : మార్చవారిత జ్ఞప్తి

database : చిట్టా
data : చిట్టులు ? (back-derivation) ఇంకేమన్నా తోచితే సూచించండి ..

data entry : చిట్టారాత
enter data : చిట్టా రాయు
data entry operator : చిట్టా రాతగాడు


ఇదే పదం log కి కూడా సమానార్థంగా వాడుకోవచ్చు, ఏ ప్రమాదం లేకుండా.

login : చిట్టా తెరువు
log off : చిట్టా మూయు


program : కార్యలేఖ (ముందే సూచించాను)
to program : కార్యలేఖించు
programmer : కార్యలేఖరి
programming language : కార్యలాష (getting too bold)

edit : సరిమార్చు
edit (n) : సరిమార్పు

పోస్టు ఆఫీసు వారి పుణ్యమా అని ఇప్పుడు మనం పోస్టు అనే అంటున్నాం. ఇది కాదని వేగు అనడం ఎందుకు ? జాబు అనొచ్చు మరీ ప్రేమ ఎక్కువైతే.

email : ఈ-జాబు
to mail : జాబంపు (జాబు + పంపు) లేదా పోస్టంపు (పోస్టు + పంపు)

తాబాసు గారు

మీ పోస్టుల మధ్యలలో ఇంగ్లీషు వ్రాస్తున్నారెందుకు ? తెలుగులో అయితే సరిగా నొక్కి వక్కాణించడం కుదరట్లేదా ? లేదా, ఇక్కడ మాకు ఇంగ్లీషు తప్ప తెలుగులో అయితే అర్థం కాదు అని మీ విశ్వాసమా ? ఏదేమైనా, ఇలా తెలుగువారం మధ్యలో ఇంగ్లీషు మాట్లాడడం బాలేదు, అదీ మీలాంటివారు.

- - వకీబా

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Jul 15, 2007, 12:56:08 PM7/15/07
to తెలుగుపదం
ఇప్పటి వాడుకలో mail & post రెండూ ఒకటి కాదు. రెండో విషయం-ఒక
వేగు(email) లో ఎన్ని జాబులైనా ఉండొచ్చు. పదాల అర్థాలకు అన్యథాప్రకల్పన
చెయ్యడం ద్వారా భాష ఆధునికమౌతుంది. అయితే వాడుకలో ఉన్న పదాల్ని అందుకు
ఉపయోగించుకోవడం సాధ్యపడదు.

Kiran Kumar Chava

unread,
Jul 16, 2007, 12:44:56 AM7/16/07
to telug...@googlegroups.com

దత్తాంశము data తెలుగు మీడియం వారికి తెలుసు !
మెయిలుకి వేగు కూడా బాగుంది మనము అన్నీ ఉపయోగించ వచ్చు, ఓ సారి అది మరో సారి ఇది

వీటన్నిటినీ ఎవరన్నా వికీలో (తెలుగు పదం వికీ) ఉంచుతున్నారా?

--
----
ధన్యవాదములు,
కిరణ్ కుమార్ చావా
http://www.oremuna.com
http://flickr.com/photos/chavakiran
naa sOdi
Reply all
Reply to author
Forward
0 new messages