'బారసాల' సరైన్ పదమేనా?

260 views
Skip to first unread message

యడవల్లి

unread,
Feb 5, 2012, 1:58:02 AM2/5/12
to తెలుగుపదం
మిత్రులారా...నమస్సులు..

'బారసాల' సరైన్ పదమేనా ?

కాలక్రమంలో 'బాలసార',బారసాలగా మారిందా ?

ధన్యోస్మి..

-యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ.

రమణా రావు ముద్దు

unread,
Feb 8, 2012, 1:24:14 PM2/8/12
to telug...@googlegroups.com
 శబ్దరత్నాకరం నిఘంటువు ప్రకారము 'బారసాల 'కరక్టే.అంటే నామకరణము అని అర్థము.

శబ్దరత్నాకరం నిఘంటువు ప్రకారము 'బారసాల 'కరక్టే.అంటే నామకరణము అని అర్థము.

 శబ్దరత్నాకరం నిఘంటువు ప్రకారము 'బారసాల 'కరక్టే.అంటే నామకరణము అని అర్థము.

2012/2/5 యడవల్లి <etvs...@gmail.com>:

> --
> ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
>
>  * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
>  * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
>  * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
> గుంపును చూడండి

Srinivas Bandi

unread,
Feb 8, 2012, 2:54:14 PM2/8/12
to telug...@googlegroups.com
మిత్రులకు నమస్కారం.
నాకు తెలిసినంత వరకు బాలసారె అంటే బాల్యంలో చేయు వేడుక. ఈ క్రింది వికీపిడియా లింకు చూడండి. అందులో కూడా బాలసారె అనే పదమే వాడారు.
 
కానీ ఒకసారి Attachment చూడండి. బారసాల అని కూడా కనపడుతుంది. బాలసార/బారసాల అంటే నామకరణం అని మాత్రం కాదు.
 
ఇట్లు,
బండి. శ్రీనివాస్ శర్మ


 
2012/2/8 రమణా రావు ముద్దు <ramanar...@gmail.com>
Balasare.jpg
Barasala.jpg

Pulikonda

unread,
Feb 8, 2012, 9:53:58 PM2/8/12
to telug...@googlegroups.com
ఇది వర్ణవ్యత్యయం చెందిన రూపం దీని అసలు రూపం బాలసారె
అంటే బాలలకు ఇచ్చే సారె అన్నమాట. వ్యవహారంలో ఇలా బారసాలగా స్థిరపడింది. ఇక నామకరణం అన్నది బాలసారెలో ఒక భాగం. ఇది ఉండవచ్చు. ఉండక పోవచ్చు.  ఇలా చాలా పదాలు వర్ణవ్యత్యయం అయినవి తెలుగులో ఉన్నాయి. వాటిపైన ప్రత్యేక అధ్యయనమే చేసి ఉన్నారు భాషా శాస్త్రంలో. కాని అన్నంటిని సేకరించడం వివరించడం ఇంకా చేయవలసిన పనే. 

పులికొండ సుబ్బాచారి.

2012/2/5 యడవల్లి <etvs...@gmail.com>
మిత్రులారా...నమస్సులు..
--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.

 * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
 * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
 * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి



--
Prof. P.  Subbachary
Chairman BOS
Department of Folklore & Tribal Studies
Dravidian University
Kuppam 517425
A.P

kv ramana

unread,
Feb 9, 2012, 4:25:43 AM2/9/12
to telug...@googlegroups.com
బాల - సంస్కృతం, సారె - తెలుగు. ఇలాంటి సంధి పూర్వులు చేసేవారా? 
ఇక సూర్యరాయాంధ్ర౦ లో ప్రాకృతం బారవాహో/ పాలీ బారసాహో నుంచి బారసాల వ్యుత్పత్తిని సూచించారు. మిత్రులు పరిశీలించగలరు. 

2012/2/9 Pulikonda <psubb...@gmail.com>



--
కిల్లంసెట్టి వెంకటరమణ

Pulikonda

unread,
Feb 9, 2012, 8:17:37 AM2/9/12
to telug...@googlegroups.com
కెవి రమణ గారు ఇక్కడ సంధిలేదు బాల సారె అనే రెండు పదాలు కలిసి సమాసం అయినాయి. అంతే కాని ఇక్కడ సంధిలేదు. కాకపోతే బాలసారె అనేది వైరి సమాసం అవుతుంది. వైరి సమాసాల వినియోగం శతాబ్దాల నుండి ఉంది. వైరి సమాసం కాలక్రమంలో వర్ణవ్యత్యయం  కావడమూ సహజమే. ఇక దీనికి చాలా మంది పండితులు వ్యుత్పత్తి వివిధ రకాలుగా చెప్పారు. అలా చెప్పడం సాధ్యమే. ఏది చారిత్రకంగా సరైనదో నిర్థరించడం అంత తేలికైన పని కాదు. సూర్యరాయాంధ్ర నిఘంటువు ఇటీవలి కాలంనాటిదే. 
ఇంకా దీనిపైన చర్చించవచ్చు. కొనసాగిద్దాం. 

పులికొండ సుబ్బాచారి.

2012/2/9 kv ramana <kvje...@gmail.com>

kv ramana

unread,
Feb 10, 2012, 12:59:46 AM2/10/12
to telug...@googlegroups.com
నమస్తే 
నాకు సాంకేతిక పదాలు తెలియక సంధి అన్నాను. సమాసమే.  కృతజ్ఞతలు. 
సారె అంటే వేడుక అనే అర్థం ఉందా? సారె అంటే కానుకలు అని మాత్రమే అనుకున్నాను. 
2012/2/9 Pulikonda <psubb...@gmail.com>

రమణా రావు ముద్దు

unread,
Feb 10, 2012, 9:21:37 AM2/10/12
to telug...@googlegroups.com
 సుబ్బాచారిగారితో ఏకీభవిస్తున్నాను.నీను రాసింది శబ్దరత్నాకరం లో
ఉన్నదే.మొదట్లో బాలసారె అయివుండవచ్చును.కాలక్రమాన వ్యవహారంలో మార్పులు
వచ్చి ఉండవచ్చును.నామకరణం బారసాలలో భాగమే.ఐతే నిర్బంధం కాదు.

2012/2/10 kv ramana <kvje...@gmail.com>:

yvs

unread,
Feb 10, 2012, 2:06:35 PM2/10/12
to telug...@googlegroups.com


మిత్రులందరికీ ఓపిగ్గా చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు..
 
ఈ మధ్య రాత్రి పూట టి.వి.లో హరికధ చూస్తుండగా...అందులో భాగవతార్ శ్రీరామనామకరణ ఘట్టం వివరిస్తూ "ఘనంగా బాలసారె కార్యక్రమం జరిగింది,అని అనగా సందేహనివృత్తికై అడిగాను.
 
అందరికీ మరొక్కసారి ధన్యవాదములు.
ఒక పద్యం...మనకోసం... 

కలనాటి ధనములక్కర
గలనాటికి దాచ కమలగర్భుని వశమె 
నెలనడిమి నాటి వెన్నెల
యలవడునె గాదెబోయ అమవసనిశికిన్.

హితైషి

narayana sarma

unread,
Feb 10, 2012, 9:52:59 PM2/10/12
to telug...@googlegroups.com
:) అమవస నిశి అనగానే తెనాలి రామకృష్ణుని తిట్టు పద్యం గుర్తొచ్చింది- 'అమవసనిశియనుచు నీవు అలసని పెదనా!" అని.. :)
బాగుంది బాగుంది.. కలనాటి ధనాన్ని కమలగర్భుడుకూదా దాచలేడనేది కూడాను.

-నారాయణ


2012/2/11 yvs <etvs...@gmail.com>
--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
 
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి



--
తెలుగులో అన్నీ నేర్చుకోవచ్చు... ఇంగ్లీషుకూడా!

సురేశ్ కొలిచాల

unread,
Nov 14, 2014, 8:56:27 AM11/14/14
to telug...@googlegroups.com

From a discussion in 2011.
https://groups.yahoo.com/neo/groups/racchabanda/conversations/messages/23787
http://eemaata.com/em/issues/201111/1862.html

"బారసాల అనే మాటకి వ్యుత్పత్తి ఏంటి? “దీనిని అసలు బాల సారె అంటారు. అదివాడుకలోకి వచ్చే సరికి బారసాల అయినది.” అని “అప్పటిదాకా తల్లి చీరలతో చేసిన పొత్తిగుడ్డల్లో ఉండే బాలకి మొదటిసారి సారె పెట్టడం” అంటూ బోలెడంత లోకనిరుక్తి (folk-etymology) సాహితీ లోకంలోనూ, ఇంటర్నెట్టులోనూ ప్రచారంలో ఉంది (గూగుల్ లో బారసాల బాలసారె అని వెతకండి). ఇక అసలు వ్యుత్పత్తి విషయానికి వస్తే, సంస్కృతంలో 12ను ‘ద్వాదశ’ అంటారుగదా. ఈ ‘ద్వాదశ’ అన్న పదం పాళీలోనూ, ప్రాకృతంలోనూ, ‘బారస’ గాను, ‘బారహా’/బారహ్ గాను మార్పు చెందింది. తెలుగు శాసనాల్లో కనిపించే ‘బారస’ పదానికి తెలుగు ప్రత్యయమైన -(అ)ల జతచేసి 11వ/12వ రోజు చేసుకునే నామకరణోత్సవానికి ఆపాదించాం. మరాఠి భాషలోనూ ‘బారసా’ అంటే 12వ రోజు నాడు చేసే నామకరణ మహోత్సవము (చూ: మోల్స్‌వర్త్ మరాఠి నిఘంటువు)."
Reply all
Reply to author
Forward
0 new messages