నంగనాచి తుంగబుర్ర

358 views
Skip to first unread message

గోపాల్(Gopal Koduri)

unread,
Sep 5, 2009, 4:57:07 PM9/5/09
to telug...@googlegroups.com, sahityam
నమస్కారం,

నంగనాచి తుంగబుర్ర ఎలా వచ్చిందో, అర్థం ఏమిటో వివరించగలరు :)

--
ఇంగ్లీషు భాషే అడ్డుగా కంప్యూటర్ వాడలేని వారికి సహాయంగా -  తెలుగీకరణ (http://tidbits.co.in/telugeekarana-enduku-ela) మరియు
ఈ-తెలుగు (http://etelugu.org/helpcenter)

---------------------------------
Gopala Krishna Koduri,
Cognitive Science Lab,
Computer Science & Engineering, IIIT.
Hyderabad - 500032, A.P, India.

---------------------------------------------------------
more about my life at : http://tidbits.co.in

ANANDASWARUP GADDE

unread,
Sep 5, 2009, 6:41:03 PM9/5/09
to telug...@googlegroups.com
2009/9/6 గోపాల్(Gopal Koduri) <go...@tidbits.co.in>:
> నమస్కారం,
>
> నంగనాచి తుంగబుర్ర (ఎలా వచ్చిందో, అర్థం ఏమిటో వివరించగలరు :)
>
ఎలావచ్చిందో తెలియదు. గూగులమ్మ (తుంగబుర్ర ) ప్రకారం:
http://www.andhrafolks.net/SJPdesc.asp?Type=J&Category=36&ID=10&action=V
Jatiyam : నంగనాచి తుంగబుర్ర
Description : అనీ తెలిసి, తెలీనట్టు నటించేవాళ్ళని నంగనాచి తుంగబుర్ర అంటారు.

Praveen Kumar NANDAGIRI

unread,
Sep 7, 2009, 1:38:23 AM9/7/09
to telug...@googlegroups.com
నాకు తెలిసినంతవరకు "నంగనాచి" అనేది హిందీ పదం. నాంగ్ అంటే నగ్నముగా, నాచి అంటే ఆడేది (నాట్యము చేసేది) అని అనుకుంటున్నాను...
- Praveen
2009/9/6 ANANDASWARUP GADDE <ananda...@gmail.com>


--
ఇట్లు,

ప్రవీణ్ కుమార్ నందగిరి
Test Engineer
Franklin Templeton Investments.

My Diary: http://www.hydbachelors.wordpress.com
To read many telugu blogs: http://koodali.org (or) http://jalleda.com
తెలుగులో రాయడానికి (To write in telugu): http://lekhini.org

ANANDASWARUP GADDE

unread,
Sep 7, 2009, 2:35:29 AM9/7/09
to telug...@googlegroups.com
2009/9/7 Praveen Kumar NANDAGIRI <pravy...@gmail.com>:

> నాకు తెలిసినంతవరకు "నంగనాచి" అనేది హిందీ పదం. నాంగ్ అంటే నగ్నముగా, నాచి అంటే
> ఆడేది (నాట్యము చేసేది) అని అనుకుంటున్నాను...
> - Praveen
From http://tinyurl.com/m6c9vn
"నంగ (p. 0626) [ naṅga ] or నంగనాచి nanga [Tel.] n. A weevil, or
canker worm, a book worm, a round white worm, (also called వడ్లచిలుక
and ముడికొక్కు.) which looks harmless but is destructive. Hence, a
demure minx, a sly jade, a specious hypocrite. Sometimes used for a
mosquito or gnat because it looks harmless దిట్టతనము కలిగియు బయటికి
ఏమియు తెలియని దానివలె నుండునది. Swa. iii. 43. నంగనాచితనము
nanga-nāchi-tanamu. n. Feigned simplicity."
The next bit is a guess on my part. తుంగ గాలికి వంగిపొతూ ఉంటంది కదా.
దానినుంచి తుంగబుర్ర వచ్చిందేమో

Kiran Na.Cha.

unread,
Sep 7, 2009, 3:56:41 AM9/7/09
to telug...@googlegroups.com
తుంగ "బూరా" కాస్తా "తుంగబుఱ్ఱ" అయిందేమోనని నా అనుమానం. తుంగతో బూరా చేస్తే
బూర లాగా అనిపించదేమో కానీ అదే స్థాయి వాయిద్యంగా పనికి వస్తుందేమో. "దిట్టతనము
కలిగియు బయటికి ఏమియు తెలియని దాని వలెనుండు" అన్న నైఘంటికార్థానికి సరిపోతుంది
ఇలా. కానీ... నా అనుమానము, నా ఊహ సరైనవో కాదు నాకు తెలియదు! :-D

- నచకి

--------------------------------------------------
From: "ANANDASWARUP GADDE" <ananda...@gmail.com>
Sent: Monday, September 07, 2009 01:35
To: <telug...@googlegroups.com>
Subject: [తెలుగుపదం] Re: నంగనాచి తుంగబుర్ర

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Sep 7, 2009, 4:25:57 AM9/7/09
to telug...@googlegroups.com
ఏ తెలుగుపదానికైనా ఏదో ఒక వేఱే భారతీయ భాషాపదంతో సామ్యం చూపవచ్చు. కానీ అది ఇక్కడ ఎలా అతుకుతుందో అర్థం కావడం ముఖ్యం. నంగా నాచ్ కీ నంగనాచికీ శబ్దసామ్యమే తప్ప పొత్తు కుదరడంలేదు.


నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org

Praveen Kumar NANDAGIRI

unread,
Sep 7, 2009, 5:10:03 AM9/7/09
to telug...@googlegroups.com
నా మనసులోని సంశయాన్ని మీ విశ్లేషణలో చూసుకున్నాను...
 
నెనర్లు సుబ్రహ్మణ్యం గారు.


2009/9/7 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>

Subbachary Pulikonda

unread,
Sep 7, 2009, 5:46:58 AM9/7/09
to telug...@googlegroups.com
ఇది చక్కని తెలుగు పలుకుబడి. ఈ పలుకు బడికి లేదా జాతీయానికి ఉన్న అర్థం గురించి ముందు విచారించ వలసి ఉంది.
 
నంగనాచి అంటే ఒక స్త్రీ తనకు ఏమీ తెలియకున్నా అన్నీ తెలిసిన దానిలాగా పండితురాలిలాగా మాట్లాడే వారిని ఆమె పెద్ద నంగనాచిలే అని అంటుంటారు. దీనికి పూర్తిగా వ్యతిరేకార్థంలో కూడా చేయవలసిన పనులు అన్నీ చేసి తనకు ఏమీ తెలియదు అన్నట్లు కూచున్న వారిని కూడా నంగనాచి అని అంటారు. ఈ అర్థాలలోనే కాకుండా వినియోగించే సందర్భాన్ని బట్టి దీనికి వేరు వేరు అర్థాలు వస్తున్నట్లుగా ఉంది. ఈ పలుకుబడికి నిష్పత్తిని అంటే ఎటిమాలజీని కనుక్కోవాలంటే ఆ సందర్భాలలో వచ్చే అన్ని అర్థాల్ని కూడా చర్చిస్తే మనకు మంచి జాడలు లభిస్తాయి. నంగనాచి అనే మాట విశేషించి ఆడవాళ్ల వ్యవహారంలో విశేషంగా ప్రచలితంగా ఉంది. ఇది సాటి ఆడవాళ్ళమీద చేసే కామెంట్ లో వస్తుంది. నంగా నాచి అనే వ్యుత్పత్తి ఏమాత్రం సరిపోదు. నంగనాచి, నాలి, నాలిముచ్చు వంటి తెలుగు అభివ్యక్తులకు నిరుక్తి చెప్పడం మనవల్ల కాదు. ఇవన్నీ విశేషణాలుగా వినియుక్తం. అవి ఏఏ అర్థాలలో వినియోగంలో ఉన్నాయో చూడడం మొదటి పని.
 
సుబ్బాచారి
--
Prof. P.  Subbachary
Head, Department of Folklore & Tribal Studies
Dean, School of Human and Social Sciences
Dravidian University
Kuppam 517425
A.P

గోపాల్(Gopal Koduri)

unread,
Sep 7, 2009, 5:58:17 AM9/7/09
to telug...@googlegroups.com
చర్చ బావుందండీ, అందరికీ నెనర్లు :)


--
ఇంగ్లీషు భాషే అడ్డుగా కంప్యూటర్ వాడలేని వారికి సహాయంగా -  తెలుగీకరణ (http://tidbits.co.in/telugeekarana-enduku-ela) మరియు
ఈ-తెలుగు (http://etelugu.org/helpcenter)

---------------------------------
Gopala Krishna Koduri,
Cognitive Science Lab,
Computer Science & Engineering, IIIT.
Hyderabad - 500032, A.P, India.

---------------------------------------------------------
more about my life at : http://tidbits.co.in


2009/9/7 Subbachary Pulikonda <psubb...@gmail.com>

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Sep 7, 2009, 7:30:59 AM9/7/09
to telug...@googlegroups.com
ఇది మొదట్లో
నంగినాతి
= నంగిగా (తెచ్చిపెట్టుకున్న గాంభీర్యముతో) మాట్లాడే నాతి - స్త్రీ కావచ్చును.

ANANDASWARUP GADDE

unread,
Sep 7, 2009, 11:16:58 PM9/7/09
to telug...@googlegroups.com
2009/9/7 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>:

> ఇది మొదట్లో
> నంగినాతి
> = నంగిగా (తెచ్చిపెట్టుకున్న గాంభీర్యముతో) మాట్లాడే నాతి - స్త్రీ కావచ్చును.
>
'నంగనాచి' గూగుల్ చేస్తే ఇంకా బాగానే వాడుతున్నట్లు కనపడుతున్నది. చాలా
పాటలు కూడా ఉన్నవి. ఒక పాటలో 'నంగనాచి నిజాము ' అని ఒక చోట 'అమ్మ నంగనాచి
నాన్న తుంగబుర్ర ' అని వాడారు. తెలుగు ఎటిమాలజీ నిఘంటువులేమీ వెబ్లో
కనపడలేదు. హైదరాబాదులో తెలుగు భాషను గురించి భద్రిరాజు క్రిష్ణమూర్తి ,
చేకూరి రామారావు లాంటి వారు, చరిత్ర విషయాలలో పి. వి. పరబ్రహ్మశాస్త్రి
గారు బహుశా చెప్పగలరు.

veeranjaneyulu matcha

unread,
Nov 21, 2016, 1:10:06 AM11/21/16
to తెలుగుపదం, sahi...@googlegroups.com, go...@tidbits.co.in
నంగ‌నాచి- తుంగ‌బుర్ర అన్న మాట నంగినాతి-తుంగ భ‌ద్రం అన్న మాట‌నుండి వ‌చ్చింది. నంగినాతి చేసిన‌దంతా చేసి  అంటే అతివిన‌యం ప్ర‌ద‌ర్శిస్తూ అమాయ‌కంగా త‌న‌కేమీ తెలియ‌ద‌న్న‌ట్లు నంగిగా మాట్లాడే స్త్రీ.  తుంగ భ‌ద్రం అంటే మ‌ద‌పుటేనుగు. నంగినాతి-తుంగ భ‌ద్రం అంటే క‌నుపిస్తున్న‌ట్లుగా అమాయ‌కురాలు కాద‌నీ, ఆమె మ‌ద‌పుటేనుగులాంటి స్థిర‌మైన‌, ధృఢ‌మైన మ‌న‌స్త‌త్వం క‌ల‌ద‌ని అర్ధం. నంగినాతి-తుంగ భ‌ద్రం అన్న ప‌దం కాల‌క్ర‌మేణా వాడుక‌లో నంగ‌నాచి- తుంగ‌బుర్ర గా మారింది.
Reply all
Reply to author
Forward
0 new messages