Tracker ని తెలుగులో ఏమనొచ్చు.

1 view
Skip to first unread message

Kiran Kumar Chava

unread,
Aug 6, 2010, 1:09:56 AM8/6/10
to తెలుగు పదం గుంపు
ట్రాకర్ అంటే ముందు ఎవడన్నా వెళ్తుంటే వాడికి ఒక చిప్ అంటించి వాడు ఎక్కడ ఉన్నాడో చూట్టం అన్నమాట. ఈ ట్రాకర్ను తెలుగులో ఏమనొచ్చు.

----
నెనర్లు,
కిరణ్ కుమార్ చావా
http://te.chavakiran.com/blog
http://en.chavakiran.com/blog
http://abbigaadu.com
http://tolireyi.com


ముక్కు శ్రీరాఘవకిరణ్ శర్మ

unread,
Aug 6, 2010, 3:18:01 AM8/6/10
to telug...@googlegroups.com
శోధకం అనవచ్చంటారా?

Pulikonda

unread,
Aug 7, 2010, 1:03:53 AM8/7/10
to telug...@googlegroups.com
దీనికి మంచి తెలుగు మాటను కొత్తదాన్ని చేసుకోవచ్చు. వెదుకరి అని దీన్ని వెదుకు అరి అనే రెండింటి కలయిక ద్వారా చేస్తాం. 
దీన్ని వ్యాకరణ సమ్మతంగానే చేసుకోవచ్చు. అరి ప్రత్యయాన్ని ఇక్కడ చక్కగా వాడుకోవచ్చు. 
ఈ వెదుకరి అచ్ సమీకరణం అంటే ఓవెల్ హార్మనీ జరిగితే వెదకరి అని కూడా వ్యవహారంలో కావచ్చు. 
నలుగురు ఏమంటారే చూద్దాం. 

సుబ్బాచారి. 

2010/8/6 ముక్కు శ్రీరాఘవకిరణ్ శర్మ <msrk...@gmail.com>
శోధకం అనవచ్చంటారా?

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
 
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి



--
Prof. P.  Subbachary
Department of Folklore & Tribal Studies
Dean, School of Human and Social Sciences
Dean, Academic Affairs (Principal)
Dravidian University
Kuppam 517425
A.P

Sirish Kumar Tummala

unread,
Aug 7, 2010, 1:47:52 AM8/7/10
to telug...@googlegroups.com
శోధన, వెతకటం ట్రాకరుకు సమానార్థకా లనిపించడంలేదు. నిశితవీక్షణ, పరిశీలన, గమనింపు -ఇలాంటివాటికి దగ్గరగా ఉండాలనుకుంటాను.

- తుమ్మల శిరీష్ కుమార్
-----------
నా బ్లాగు: http://chaduvari.blogspot.com
బ్లాగులన్నీ: http://koodali.org, http://jalleda.com


2010/8/7 Pulikonda <psubb...@gmail.com>

ANANDASWARUP GADDE

unread,
Aug 7, 2010, 2:01:35 AM8/7/10
to telug...@googlegroups.com
2010/8/7 Sirish Kumar Tummala <sirish...@gmail.com>:

> శోధన, వెతకటం ట్రాకరుకు సమానార్థకా లనిపించడంలేదు. నిశితవీక్షణ, పరిశీలన,
> గమనింపు -ఇలాంటివాటికి దగ్గరగా ఉండాలనుకుంటాను.
>

గమనించేతునక?

NaChaKi (Kiran Chakravarthula)

unread,
Aug 7, 2010, 2:30:31 AM8/7/10
to telug...@googlegroups.com
పదనిష్పాదనకి వాడదగ్గ కొన్ని పదాలు, బ్రౌణ్యం నుంచి:
 
పరిసర్య, పరిసారము or పరీసారము [pari-sarga] = The act of following the track of a hill, a river (Is it పరిసర్య or పరిసర్గ? English transliteration reads పరిసర్గ for some reason.) - పరీసారిక
జాడ = trace (జాడకాడు = n. One who can trace the way) - జాడకము అనవచ్చా?
వాసనపట్టు = to scent, to catch the scent of, to trace, to track. - వాసిపట్టు అనవచ్చా?
అంగమచ్చము = Mark, trace, sign, track - అంగమచ్చకం అనవచ్చా?
 
వీటిని బట్టి యథాతథంగానో వీటినే కొంత మార్పుతోనో (పరీసారిక, జాడకము, వాసిపట్టు, అంగమచ్చకము) trackerకి వాడుకోవచ్చా?
 
ఒక్కోసారి tracker అన్నది అపరాధపరిశోధకులు అనుమానితుల మీద వాఱికి తెలియకుండా అంటించే ఒక చిన్న "bug"లా ఉంటుంది. కనుక "జాడవేగు" అనవచ్చేమో?
 
నచకి
 
 
 
--
 
"And somewhere there are engineers
Helping others fly faster than sound.
But, where are the engineers
Helping those who must live on the ground?"
 
– Young Oxfam Poster

Sirish Kumar Tummala

unread,
Aug 7, 2010, 2:46:52 AM8/7/10
to telug...@googlegroups.com
నా ఓటు "జాడకము" కు.
2010/8/7 NaChaKi (Kiran Chakravarthula) <email4...@gmail.com>

Ravi Chandra Enaganti

unread,
Aug 7, 2010, 2:49:19 AM8/7/10
to telug...@googlegroups.com
జాడకము అనే పదం బాగుంది.

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Aug 7, 2010, 5:41:04 AM8/7/10
to తెలుగుపదం
జాడకం (Zaadakam) అనే పదం ఉందో లేదో నాకు తెలియదు. కానీ బావుంది.

Kiran Kumar Chava

unread,
Aug 7, 2010, 5:50:22 AM8/7/10
to telug...@googlegroups.com
అద్భుత.
 
జాడకం బాగుంది.
 

----
నెనర్లు,
కిరణ్ కుమార్ చావా
http://te.chavakiran.com/blog
http://en.chavakiran.com/blog
http://abbigaadu.com
http://tolireyi.com




2010/8/7 తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <subtad...@gmail.com>
జాడకం (Zaadakam) అనే పదం ఉందో లేదో నాకు తెలియదు. కానీ బావుంది.

--

Ravi.Localizer

unread,
Aug 8, 2010, 9:38:49 AM8/8/10
to తెలుగుపదం
వెదుకరి చాలా బాగుంది.ఇది మన తెలుగు పద నిర్మాణ సూత్రాల ప్రకారం ఉంది.
ఉదాహరణ పదాలు : గడసరి,సొగసరి.
Ravikumar Ragam
Project Engineer
C-DAC, Pune

On Aug 7, 10:03 am, Pulikonda <psubbach...@gmail.com> wrote:
> దీనికి మంచి తెలుగు మాటను కొత్తదాన్ని చేసుకోవచ్చు. వెదుకరి అని దీన్ని వెదుకు
> అరి అనే రెండింటి కలయిక ద్వారా చేస్తాం.
> దీన్ని వ్యాకరణ సమ్మతంగానే చేసుకోవచ్చు. అరి ప్రత్యయాన్ని ఇక్కడ చక్కగా
> వాడుకోవచ్చు.
> ఈ వెదుకరి అచ్ సమీకరణం అంటే ఓవెల్ హార్మనీ జరిగితే వెదకరి అని కూడా వ్యవహారంలో
> కావచ్చు.
> నలుగురు ఏమంటారే చూద్దాం.
>
> సుబ్బాచారి.
>

> 2010/8/6 ముక్కు శ్రీరాఘవకిరణ్ శర్మ <msrki...@gmail.com>


>
> > శోధకం అనవచ్చంటారా?
>
> > --
> > ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం
> > ఉంది కాబట్టి.
>
> > * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి:
> > telug...@googlegroups.com
> > * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి:
> > telugupadam...@googlegroups.com

> > * మరిన్ని విషయాలకై,http://groups.google.com/group/telugupadam?hl=teవద్ద

Kiran Kumar Chava

unread,
Aug 8, 2010, 9:40:58 AM8/8/10
to telug...@googlegroups.com
అవును వెదుకరి కూడా బాగుంది, కాని నాకు ఈ పదం విన్నప్పుడు వ్యక్తి స్పురిస్తున్నాడు యంత్రం బదులుగా అదే జాడకం అంటే టక్కున యంత్రమే స్పురిస్తుంది. కాకపోతే ఎవరికి నచ్చినవి వారు వాడుకోవచ్చు.
----
నెనర్లు,
కిరణ్ కుమార్ చావా
http://te.chavakiran.com/blog
http://en.chavakiran.com/blog
http://abbigaadu.com
http://tolireyi.com




2010/8/8 Ravi.Localizer <ragam...@gmail.com>
 * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ

Aasish Pappu

unread,
Aug 9, 2010, 9:48:05 AM8/9/10
to telug...@googlegroups.com
కిరణ్ గారు, 
మీరు తెలుగు లో సైన్స్ ఫిక్షన్ నవల ఏమైనా రాస్తున్నారా ?

2010/8/8 Kiran Kumar Chava <chava...@gmail.com>:
--
Aasish Pappu



Kiran Kumar Chava

unread,
Aug 9, 2010, 10:39:16 AM8/9/10
to telug...@googlegroups.com
http://te.chavakiran.com/blog/?cat=373

:-)


----
నెనర్లు,
కిరణ్ కుమార్ చావా
http://te.chavakiran.com/blog
http://en.chavakiran.com/blog





2010/8/9 Aasish Pappu <aas...@gmail.com>

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Aug 11, 2010, 2:14:39 PM8/11/10
to తెలుగుపదం
వస్తువుకు "వెదుకరం" అందాం. ఏం పోయింది ?
Reply all
Reply to author
Forward
0 new messages