ధైర్యము యొక్క అర్దం మేమి

4,515 views
Skip to first unread message

చక్రవర్తి

unread,
Aug 11, 2011, 11:19:09 PM8/11/11
to తెలుగుపదం
ఈశ్వర స్వరూపమైన గుంపునకు మఱియు సభ్యులకు నమస్కారములతో,

పైన చెప్పినట్లు, ధైర్యము అనే పదం యొక్క అర్దాన్ని తెలుసుకునే ప్రయత్నంలో
వ్రాసే వినతి ఇది. సాధారణంగా చీకటి అంటే ఏమిటి అని అంటే, మనం వెలుగు
లేకపోవడాన్ని చీకటి అని చెప్పుకుంటాం కానీ నిర్దిష్టంగా చీకటి అంటే ఇది
అని చెప్పలేము. అలాగే చల్లదనం అంటే ఏమిటి అని అడిగితే, ఉష్ణోగ్రతలో
హెచ్చు తగ్గుదలలే చల్లదనం అని చెపుకుంటాం. అందుకనే, చల్లదనాన్ని కూడా
ఇన్ని డిగ్రీల వెచ్చదనం అని చెప్పుకుంటాం. అలాగే ఎక్కువ మంది ధైర్యము
అంటే ఏమిటి అని అడిగితే భయం లేకపోవడమే అని అంటూ ఉంటారు.

కానీ ఈ పదానికి ఓ ప్రత్యేకమైన విశేషము ఉంది అని నా అభిప్రాయము. అందుకే
మొదటి అక్షరాన్ని ప్రాధమికంగా చాలా చాలా పదాలు, ఉదాహరణాకి ధీరుడు, చాలా
చాలా పవిత్రమైన దేవతార్చన శ్లోకాలు మొదలైనాయని మనకు విదితమే. అందువల్ల
ఇంతకీ ఈ ధైర్యము అంటే ఏమిటో తెలియజేయ ప్రార్దన.

తెలుగులో నాకు ప్రావీణ్యం కాదు కదా, సరైన అవగాహనే లేనటువంటి వాడిని,
తెలుగు భాషాప్రవీణ్యులు ఉన్న ఈ గుంపులో ఈ విషయాన్ని తెలియజేస్తే సరైన
అర్దం తెలుస్తుందని చేసే ఈ ప్రయత్నానికి మీ వంతు వివరణ ఇస్తారని
ఆశిస్తున్నాను.

kv ramana

unread,
Aug 13, 2011, 9:41:22 AM8/13/11
to telug...@googlegroups.com
"ధైర్యం" అంటే సహనం, గంభీరం. పాతాళభైరవి సినిమాలో ధైర్యే సాహసే లక్ష్మీ అని మొదటి సారి విన్నాను. అప్పుడు తెలిసింది ధైర్యం సాహసం ఒకటి కావని. సహనం అనే అర్థంతోనే ఉత్తరాది భాషులు వ్యవహరిస్తున్నారు.
సామాన్యంగా తెగువ, సాహసం అనెఅ అర్థంతో "ధైర్యం" అంటున్నాం. ఇలా ఎన్నో సమ్కృత పదాలు మన వాడుకలో వేరుగా కనిపిస్తాయి. అయోమయం చమత్కారం ఆగ్రహం అవసరం అవకాశం అభిమానం ఉచితం ఆలస్యం వ్యవసాయం తాపత్రయం ఉపయుక్తం నా పరిశీలనలో మిగతావారికి భిన్నంగా కనిపించాయి. 
-
కిల్లంసెట్టి వెంకటరమణ

రమణా రావు ముద్దు

unread,
Aug 13, 2011, 2:42:05 PM8/13/11
to telug...@googlegroups.com
ఒకే పదానికి నానార్థాలు ఉండవచ్చును.రెండు పదాలకి రమారమి ఒకే అర్థం
ఉండవచ్చును.తెలుగులోనే గాక ఇతర భాషల్లో కూడా ఇలా ఉండవచ్చును.అందుకే
ధైర్య,సాహసాలు అనే పదాలు అర్థంలో కొద్ది తెడా ఉన్నా కలిపి వాడతారు,

2011/8/13 kv ramana <kvje...@gmail.com>:

> --
> ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం
> ఉంది కాబట్టి.
>
> * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి:
> telug...@googlegroups.com
> * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి:
> telugupadam...@googlegroups.com
> * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
> గుంపును చూడండి
>

NaChaKi (Kiran Chakravarthula)

unread,
Aug 14, 2011, 8:47:23 AM8/14/11
to telug...@googlegroups.com
నాకు తెలిసినంతలో ధీరము నుంచి పుట్టేది ధైర్యము. "ధీరము" అంటే తెగువ, నేర్పు, దీక్షాపరత్వము, స్థితప్రజ్ఞత, నిశ్చితత్వము, వీరము, స్థైర్యము, బలిమి, తెలివి, గాంభీర్యము, ప్రావీణ్యము, విచక్షణ వంటి నానార్థాలున్నాయి.
 
భవదీయుడు,
నచకి
--
 
"And somewhere there are engineers
Helping others fly faster than sound.
But, where are the engineers
Helping those who must live on the ground?"
 
– Young Oxfam Poster
-----అసలు సందేశం-----
From: రమణా రావు ముద్దు
Sent: Saturday, August 13, 2011 13:42
Subject: Re: (తెలుగుపదం) ధైర్యము యొక్క అర్దం మేమి

Kameswari yaddanapudi

unread,
Sep 5, 2011, 3:31:05 PM9/5/11
to telug...@googlegroups.com
ధైర్యం అంటే తెలుగులో గుండెబలం. ఇది వాడుకమాట.
Reply all
Reply to author
Forward
0 new messages