తెలుగులో పదనిష్పాదన మఱింత ప్రజాస్వామికం కావాల్సిన ఆవశ్యకత ఉంది. అంటే
ఎల్లప్పుడూ ఎవఱో ఒకఱిద్దఱు లేదా ముగ్గుఱు, నలుగుఱు సమార్థకాల్ని
సూచించడం, వారి వద్ద మాత్రమే సమాధానాలు ఉండడమూ, మిహతావారి వద్ద ప్రశ్నలు
మాత్రమే ఉండడమూ - తరగతి-గది (Class-room) లాంటి ఈ పరిస్థితి శీఘ్రంగా
మారడం మిక్కిలి వాంఛనీయం. దాని బదులు ఈ గుంపు పదప్రయోగశాలగా పరివర్తన
చెందాలి. ఈ గుంపుని స్థాపించి మూడేళ్ళవుతోంది. ఈ మూడేళ్ళలో జఱిగిన పని
అల్పం (మనముందున్న కార్యశేషం - అనగా backlog తో పోల్చినప్పుడు). దీనికి
గల ఒక కారణం - ఈ గుంపు ఆచరణాత్మకంగా, అప్రయత్నంగా అడిగేవారూ, చెప్పేవారూ
అని రెండు వర్గాలుగా చీలిపోయి ఉండడం. కానీ మన అసలు ఉద్దేశం ఏంటంటే -
అందఱూ అడగాలి, అందఱూ చెప్పాలి అని ! అంటే ఈ గుంపులో చేఱిన ప్రతిసభ్యుడూ
పూర్తిస్థాయి పదనిష్పాదకుడుగా రూపొందాలి. మూడేళ్ళయినా ఈ నిపుణతా పరిణామం
(skill set evolution) ఆశించినంతగా చోటు చేసుకోకపోవడం శోచనీయమే అనక
తప్పదు. ఇందునిమిత్తం సహసభ్యులు స్వచ్ఛందంగా కొంత చొఱవ తీసుకోవాలని
కోరుతున్నాను. జీవనోపాయమైన వారివారి వృత్తివ్యాసంగ వ్యగ్రతలకూ ఈ సేవా
కార్యకలాపానికీ మధ్య వైరుద్ధ్యం ఏర్పడకూడదని ఆ సర్వేశ్వరుని
ప్రార్థిస్తున్నాను.
ఇది నిజానికి ఒక అభ్యసనా ప్రక్రియ (learning process). ఇది ఒక
ఇబ్బందికరమైన ప్రక్రియ. ఎందుకంటే మనం మానసికంగా కొంచెం ముదిఱిపోయి
ఉన్నాం. మనం ఈ వయసులో - స్వయంగా నేర్చుకునే కంటే ఇతరులకు నేర్పడానికి
ఎక్కువ ప్రయత్నిస్తూంటాం. ఈ వైఖరి మన మానసిక అభివృద్ధికి
అడ్డుపడుతున్నది. అదే సమయంలో భాషాభివృద్ధికి కూడా ! అందుచేత నేను
సవినయంగా సహసభ్యులకు మనవి చేసేదేమంటే-
౧. మన సభ్యులు మఱింతగా పాత-కొత్త తెలుగు-ఇంగ్లీషు పుస్తకాల్ని చదవడం
అలవాటు చేసుకోవాలి.
అంతకన్నా ముఖ్యంగా తెలుగులో ఆలోచించడం అలవాటు చేసుకోవాలి.
౨. ప్రతి పదానికీ తెలుగు సమార్థకం ఏమై ఉంటుందో అని ఊహించే ప్రయత్నం
చేయాలి.
౩. తెలుగు పుస్తకాల్లో దర్శనమిచ్చే పదఘటనా వైచిత్రికి క్షణికంగా
ముఱిసిపోయి ఆ తరువాత వాటిని అక్కడికక్కడే మర్చిపోకుండా అవి ఏ ఆధునిక పద-
అవసరాల్ని తీర్చగలవో అని ఉత్ప్రేక్షించే ప్రయత్నం చేయాలి.
౪. మాండలిక పదాల్ని ఇతోఽధికంగా అధ్యయనం చేయాలి. అవి కూడా మాండలిక
ప్రతిపత్తిని అధిగమించి మఱికొంత ఉన్నతశ్రేణిలో ఏ ఆధునిక పద-అవసరాల్ని
తీర్చగలవో అని ఉత్ప్రేక్షించే ప్రయత్నం చేయాలి. కొన్నిసార్లు ప్రామాణిక
వాడుకలు చేయజాలని పనిని మాండలిక పదాలు లెస్సగా నెఱవేఱుస్తాయి.
౫. పదనిర్మాణ నిమిత్తం తెలుగు-సంస్కృత వ్యాకరణ గ్రంథాల్ని తఱచుగా
తిరగేయాలి. వ్యాకరణ పరిజ్ఞానం లేకుండా అర్థవంతమైన, పదునైన పదాల నిష్పాదన
సాధ్యం కాదు. ఒక మేస్త్రీ ఎంత గట్టి పనివాడైనప్పటికీ, ఇసుక, ఇటుక,
సిమెంటు అనే ఉపచయాలు (inputs) లేకపోతే ఎలాగైతే ఏమీ చెయ్యలేడో అదే విధంగా
పద-ధాతు-ప్రత్యయ పరిజ్ఞానం లోపిస్తే - ఇతరత్రా ఎంత మేధావులమైనా- మనం
చేయగలది కూడా శూన్యం. పదనిర్మాణాలకి ఒక తార్కికమైన, హేతుబద్ధమైన
consistency అవసరం. దాన్ని వ్యాకరణ పరిజ్ఞానం మాత్రమే సమకూర్చగలదు. మనం
మాట్లాడే భాషలోని పదాలూ, వాక్యాలూ, వ్యాకరణమూ ఎంత తార్కికంగా ఉంటే మన
జాతి యొక్క మేధాశక్తి కూడా అంత హేతుబద్ధంగానూ, నాగరికంగానూ ఉంటుంది.
ప్రజలు, ప్రజాభాష - వీటికి ఆ పరిజ్ఞానం అవసరం లేదని, అజ్ఞానమే
సుజ్ఞానమనీ, రాచపుండు రాచబాట అనీ వాదించే మహామేధావులకు దూరం నుంచే ఒక
నమస్కారం పెట్టవలసినది. ఎందుకంటే వైజ్ఞానికంగా అభివృద్ధి చెందిన ఆంగ్లంలో
కూడా ప్రామాణిక శాస్త్ర పదజాలమంతటికీ వ్యాకరణం ఉన్నది. అందుచేత వ్యాకరణం
లేకుండా ఆంగ్లం లేదు. తెలుగైనా అంతే !
౬. ఇతర భాషల్లో ఇంగ్లీషుకు ప్రతిగా వాడుతున్న సంస్కృత సమార్థకాల్ని
యథాతథంగా తెలుగులోకి దింపుదల చేయడంలో ఉన్న సాంస్కృతికమైన ఇబ్బందుల్ని
సమీచీనంగా గుర్తెఱగాలి. వారూ, మనమూ వాడుతున్నది గీర్వాణమే అయినప్పటికీ
వారి వాడుకా, మన వాడుకా అచ్చుమచ్చుగా ఒకటి కాదు గనుక ఆ పదాలు
తెలుగువారికి సద్యః స్ఫురణ కావని గుర్తించినప్పుడు వాటిని వర్జించి మనం
స్వకీయంగా, సరికొత్తగా పదనిష్పాదన చేయడమే వాంఛనీయం.
--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి
To unsubscribe, reply using "remove me" as the subject.
2010/4/7 Ravi Chandra Enaganti <ravichandr...@gmail.com>:
> తాడేపల్లి గారూ,
> చాలా చక్కటి సూచనలిచ్చారు. నేను వీటిలో చాలా వరకు పాటిస్తున్నాను. ఇంకనూ
> మెరుగుపరుకోవలసి ఉన్నది. నా వరకైతే పాత పుస్తకాలు క్రింద చెప్పిన వెబ్‌సైటు
> లోనుంచి సేకరించి చదువుతున్నాను.
> పాత తెలుగు పుస్తకాల్లో స్వచ్చమైన తెలుగు పదాలు దొరుకుతాయి కాబట్టి ఆసక్తి
> ఉన్నవారు డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా వారి సైటు ను సందర్శించి ఎన్నో అమూల్యమైన
> పుస్తకాలను చదవచ్చు.
>
-స్వాప్నిక్
On Apr 7, 11:57 am, Ravi Chandra Enaganti
<ravichandra.enaga...@gmail.com> wrote:
> తాడేపల్లి గారూ,
> చాలా చక్కటి సూచనలిచ్చారు. నేను వీటిలో చాలా వరకు పాటిస్తున్నాను. ఇంకనూ
> మెరుగుపరుకోవలసి ఉన్నది. నా వరకైతే పాత పుస్తకాలు క్రింద చెప్పిన వెబ్‌సైటు
> లోనుంచి సేకరించి చదువుతున్నాను.
> పాత తెలుగు పుస్తకాల్లో స్వచ్చమైన తెలుగు పదాలు దొరుకుతాయి కాబట్టి ఆసక్తి
> ఉన్నవారు డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా వారి సైటు
> <http://www.new.dli.ernet.in/>ను సందర్శించి ఎన్నో అమూల్యమైన పుస్తకాలను
> చదవచ్చు.
>
> ఇట్లు
> రవిచంద్ర
>
> 2010/4/7 తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <subtadepa...@gmail.com>
> ...
>
> read more »
--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి
వృత్తి పనివాళ్ళు ముఖ్యంగా మంగళ్ళు కంసాల్లు తోటివాళ్ళతో మాట్లాడేది తెలుగే ఐనా వింటున్న ఇతరులకి తెలుగువాళ్ళే ఐనా బోధపడదు. ఇతరులకి విషయం తెలియకుండా ఉండేందుకు అ ప్రయత్నం. అలాగే తెలుగు కూడా ఇతర భాషుల వారికి బోధపడకుండా ఉండేలాగా రూపొందించు కోవాలి అని బాలసుబ్రమణ్యం అంటున్నారా? ఇప్పుడంటే ఇంగ్లిషు పదాలు వచ్చాయి - మరి పూర్వం సంస్కృత పదాలు, ఉర్దూ పదాలు ఉండేవీ ఉన్నాయీ కదా ! అవి అందరికీ తెలిసిపోవా? తెలుగువాళ్ళకి బోధ పడే పదాలతో భాషను వృద్ధి పరచుకోవాలి - ఇతర భాషులకి అర్థం కాకూడదు అనే హద్దు అనవసరం.
- కిల్లంసెట్టి వెంకటరమణ
వృత్తి పనివాళ్ళు ముఖ్యంగా మంగళ్ళు కంసాల్లు తోటివాళ్ళతో మాట్లాడేది తెలుగే ఐనా వింటున్న ఇతరులకి తెలుగువాళ్ళే ఐనా బోధపడదు. ఇతరులకి విషయం తెలియకుండా ఉండేందుకు అ ప్రయత్నం. అలాగే తెలుగు కూడా ఇతర భాషుల వారికి బోధపడకుండా ఉండేలాగా రూపొందించు కోవాలి అని బాలసుబ్రమణ్యం అంటున్నారా? ఇప్పుడంటే ఇంగ్లిషు పదాలు వచ్చాయి - మరి పూర్వం సంస్కృత పదాలు, ఉర్దూ పదాలు ఉండేవీ ఉన్నాయీ కదా ! అవి అందరికీ తెలిసిపోవా? తెలుగువాళ్ళకి బోధ పడే పదాలతో భాషను వృద్ధి పరచుకోవాలి - ఇతర భాషులకి అర్థం కాకూడదు అనే హద్దు అనవసరం.
- కిల్లంసెట్టి వెంకటరమణ
ఉదాహరణకు
తమిళములో "Thank you" అని చెప్పాల్సి వచ్చినప్పుడు 'nanRi' (నన్ ఱి)
అంటారు. మన తెలుగువారు దానికి సంస్కృత పదమైన 'ధన్యవాదాలు'కు అలవాటు
పడిపోయాం. అయితే మన భాషా మూలమైన ద్రావిడ పదంనుంచి పుట్టిన తెలుగు పదం
'నెనరు' అనే పదాన్ని మనం మర్చిపోయాం. నెనరు అనే పదం పూర్తి ద్రావిడ
పదంకాగా అది తమిళ 'నన్ ఱి'కి అతి దగ్గరి పదము ఉచ్చారణానూ. ఆంగ్లమైనా
పరభాషా పదాలను అంగీకరించాల్సి వచ్చినప్పుడు సాపేక్షంగా ఫ్రెంచి, లాటిన్,
జర్మను, స్పానిష్ భాషా పదాలను అంగీకరించినంత సులువుగా ఇతర భాషా పదాలను
అంగీకరించదు.
మన తెలుగున అసలు లేని పదాలు ఉపయోగించేటప్పుడు పరభాషా పదాలు అవసరార్థం
ఉపయోగించక తప్పదు. అయితే మనం నిరసించాల్సిన విషయమేమిటంటే పైన శిరీష్ గారు
ఉదహరించిన మొదటి వాక్యం. తెలుగు పదాలు సులువుగా లభ్యమవుతున్నా భాషను
సంకరంచేయటం.
అచంగ,
మాంఛెస్టర్, ఇంగ్లాండ్
2011/8/18 ramana kumar <ramana...@gmail.com>: