ఈ మధ్య టీవీల్లో వస్తున్న ఇంటెల్ కంపెనీ ప్రకటన గురించి ఆ ప్రకటనలో
చిట్టచివరన మనకు కనబడే పదం
అది ఆంగ్లములో ఇలా ఉంటుంది
sponsors of tomorow. తెలుగు లో దీన్ని ఇలా అనువదించారు.
రేపటి కొత్త స్ఫూర్తి. ఇది ఆంగ్ల మూలానికి అనువాదం కాదు . ప్రతిలేఖనం
అంతకన్నా కాదు.
అంటే మన డబ్బింగు సినిమాల్లో అనువాదం ఎలాగైతే చేస్తున్నారో వేలకు వేలు
జీతాలు తీసుకొనే కార్పరేటు సంస్థల వారు కూడా అలాగే చేస్తున్నారు. లేదా
తక్కువ ప్రతి ఫలానికి పని చేసే వారితో వారు అనువాదం చేయిస్తునారు. తెలుగు
వారే కదా వారికి ఎలా చెప్పినా భావాన్ని గ్రహిస్తారని ఆ కంపెనీ వారి
అభిప్రాయం కాబోలు.
దీనికి సరైన అనువాదాన్ని మీరు సూచించండి.
--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి
ప్రతిపాదకులు ,లేక ప్రోత్సాహకులు
--
కిల్లంసెట్టి వెంకటరమణ