శ్రీయుతులు ప్రొ.సుబ్బాచారిగారు, లలితా బాలసుబ్రహ్మణ్యంగార్ల (మార్చ్
తొమ్మిది) వివరణలను చదివిన తరువాత నా అభిప్రాయాన్ని తెలియచేస్తున్నాను.
తెలుగు భాషాభివృద్ధికి మిత్రుల ఉత్సాహం చాలా గొప్పగా ఉన్నది. అయితే, చర్చ
కేవలం అసలు విషయవస్తువు పరిధి దాటకుండా వుండటం అభిలషణీయం. ఇది కేవలం నా
విశ్లేషణ తప్ప, పెద్దలు శ్రీయుతులు తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం,
ప్రొ.సుబ్బాచారిగార్లు ఇప్పటికే ఇచ్చిన వివరణలపై విమర్శ కాదు.
శ్రీ సుబ్బాచారిగారు ఇచ్చిన వివరణలు దృష్ట్యా, " వి-లేఖ " అనే పదం
చాల ఖచ్చితమైనదిగా నాకు అనిపిస్తున్నది.
నా వివరణ:- ఆంగ్ల పదానికి మనం సరి తెలుగు పదం వెతుకుతున్నాం. ఆక్స్-
ఫొర్డ్ డిక్~షనరీ ప్రకారం, "మెయిల్" అనే పదానికి " లెటర్స్ ఽ పార్శెల్స్
కారీడ్ బై పోస్ట్ " అని అర్ధం వున్నది. " లెటర్ " అనే పదానికి " ఎ
రిటెన్ ఆర్ ప్రిన్టెడ్ మెసేజ్, యూజ్వల్లీ సెన్ట్ బై పోస్ట్ ఇన్ యాన్
ఎన్వలెప్ " అని అర్ధం వున్నది.
ఇక తెలుగు "శబ్ద రత్నాకరము" ప్రకారము, " లేఖ " అంటే " జాబు " అని
అర్ధం వున్నది. " ఉత్తరము " అను శబ్దానికి మనం అనుకొనే "లెటర్" అని అసలు
అర్ధం చెప్పబడిలేదు. "ఉత్తరం" - అనే పదం "సంస్కృత" పదము. "అమరకోశం"లో
దీనికి ఒక అర్ధం:"మారుమాట". "వేగు" అనే పదానికి "రాజ్య సమాచారం" అని
అర్ధం చెప్పబడినది. అంటే, ఈ పదాన్ని, పూర్వంకూడా "రహస్య సమాచారాన్ని"
సూచించే అర్ధంలోనే ఎక్కువుగా వాడటం జరిగింది.
శ్రీ తాడేపల్లివారు, తమ మార్చ్, తొమ్మిది వ్యాఖ్యలో, " లేఖ అంటే
ఉత్తరం; మెయిళ్ళన్నీ ఉత్తరాలుకావు; మెయిల్ అంటే సందేశం" అని అన్నారు.
కానీ, ఆక్స్-ఫోర్డ్ నిఘంటువులోని వివరణలో, మెయిల్ కి, లెటర్ కి
ఏమీతేడాలేదు. మెయిల్ కి అర్ధం చెప్పేటప్పుడు లెటర్ గురించి, లెటర్ కి
అర్ధం చెప్పేటప్పుడు మెయిల్ గురించి ప్రస్తావించటం జరిగింది.
శ్రీ తాడేపల్లివారు సంస్కృత పదాల వాడుక వద్దాన్నారు కాబట్టి, "ఉత్తరం"
అనేది సంస్కృత పదం కాబట్టి, దాన్ని వదిలేద్దాం. ఇక మిగిలింది, "లేఖ",
"సందేశం". లేఖ, ఒకరికొకరు, అంటే నేను వ్రాసిన విషయానికి మీరు వ్రాసే
జవాబు లేదా జాబు. సందేశం అంటే, ఏ ఒక్కరు, ఏ ఒక్కరికోసం వ్రాయకపోయనా,
జన సామాన్యంగా వ్రాసే లేదా చెప్పే విషయంగా ప్రస్తుతం వాడుకలో ఉన్నది.
ఉదా: ముఖ్యమంత్రి సందేశం; స్వామీజీ సందేశం; ప్రధానోపాధ్యాయిని సందేశం.
కాబట్టి, సందేశం అనే పదాన్ని కూడా వదిలి వేయవచ్చును. ఇక మిగిలింది "
లేఖ " మాత్రమే. కాబట్టి, దీనిని ఆమోదిస్తూ, "వి-లేఖ" అనే పదాన్ని మనం
ఆమోదించవచ్చును.
శ్రీ తాడేపల్లివారు తమ మార్చ్, తొమ్మిది/పది వ్యాఖ్యలలో, " ఉన్న
తెలుగు పదాలకు నూతన అర్ధావగతిని కల్పించాలి; ఆధునీకరించడం అవసరం అని
అన్నారు. కానీ, వి-లేఖ, ఈ-మెయిల్ అనే ఈ రెండు పదాల్లో ఏదైనా ఒకటి
ఎంచుకోవాల్సివస్తే, నేను "ఈ-మెయిల్" నే ఎంచుకుంటాను అని అన్నారు.
దీనినిబట్టి, వారు, ఈ చర్చకి స్వస్తి చెప్పినట్లుగా భావించవలసి వస్తుంది.
వారి ఉద్దేశ్యం నాకు అర్ధం కాలేదు. నా వివరణని మన్నించగలరు. సెలవు.
భవదీయుడు,
మాధవరావు.
Dravidian University
Kuppam 517425
A.P
"వి" అన్నది "విద్యుత్తు"కు పొట్టి రూపమా లేక ఉపసర్గనా అన్నది పదాన్ని బట్టి తెలుసుకుని ఇబ్బంది వచ్చే దాకా ఆగి "అప్పుడు చూద్దాం" అనుకోవటం భాషాభివృద్ధి విషయంలో సమంజసం కాదేమో. మీరే అన్నట్టు నలుసు పడక ముందే రెప్ప మూయాలి... వి. ఉపసర్గ బహుళ ప్రాచుర్యంలో ఉండటం మూలాన abbreviated "వి-" వాడకానికి ఇబ్బంది రాక ముందే మనం జాగ్రత్త పడటం మంచిదేమోనని నా అభిప్రాయం.
శ్రీ తాడేపల్లివారి విశ్లేషణ చక్కగావున్నది. అయితే, వారు, "వి" అనే ఉప-
సర్గని "వి-లేఖ"లో వాడినట్లైతే, తెలుగు భాషకు ఎటువంటి ఇబ్బందులు
కలుగుతాయో కొన్ని ఉదాహరణలు ఇచ్చివుంటే బాగుండేది. అలా కాకుండా, భాషకు
నష్టం జరుగుతుంది అని వదిలేస్తే చర్చ పూర్తిగాదు. నాకు తెలిసినంతవరకూ
సంస్కృత భాషలో,మరియు తెలుగులో కూడా "వి"ని అనేక పదాలముందు, ఆ పదాలయొక్క
విశిష్టతను ( అంటే, సూపర్‌లేటివ్ డిగ్రీ ని తెలిపేదిగా ), వాడటం
జరుగుతున్నది.
ఉదా: వి-లక్షణం; వి-శిష్టత; వి-కర్మ; వి-నియోగం; వి-శిష్యతే మొదలైనవి.
కాబట్టి, "వి-లేఖ" లో, "వి" విద్యుత్ అనే పదానికి సంకేతం కాదని
అనుకున్నప్పటికీ, వి-లేఖ అంటే "విశిష్టమైన లేఖ" అని అర్ధం
చెప్పుకోవచ్చును. కాబట్టి, "వి-లేఖ" ని ఆమోదించవచ్చును.
On Mar 23, 12:51 pm, Veeven (వీవెన్) <vee...@gmail.com> wrote:
> 2009/3/23 Kiran Na.Cha. <email4gro...@gmail.com>
కాబట్టి, "వి-లేఖ" లో, "వి" విద్యుత్ అనే పదానికి సంకేతం కాదని
అనుకున్నప్పటికీ, వి-లేఖ అంటే "విశిష్టమైన లేఖ" అని అర్ధం
చెప్పుకోవచ్చును. కాబట్టి, "వి-లేఖ" ని ఆమోదించవచ్చును.
నెనర్లు. (Thanks)
Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com
ఇట్లు భవదీయుడు
తాడేపల్లి
This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org
Dravidian University
Kuppam 517425
A.P
"వి" మీద మనకి ఆకస్మికంగా మోజు కలిగింది కనుక దాన్ని విశృంఖలంగా అన్ని
పదాల్లోను ప్రవేశపెట్టి ఆ తరువాత అడిగేవాళ్ళకి "విశిష్టం" అనీ,
అడగనివాళ్ళకి
"విద్యుత్" అనీ చెప్పేసి సరిపుచ్చుకుందామంటే ఆ ద్వంద్వవిధానం
కుదురుతుందా ? "
On Mar 24, 2:50 pm, తాడేపల్లి T.L. Bala Subrahmanyam Tadepalli
<subtadepa...@gmail.com> wrote:
> "వి" ఒకరికి నచ్చితే కాదనడానికి నేనెవరిని ? అయితే నాదొక చిఱువిన్నపం. సదరు
> "వి"
> తెలుగులో బహుళప్రచారంలో ఉన్న సంస్కృత పదాలకి చేర్చకుండా, లేదా ఇప్పటికే "వి"
> ని కలిగి ఉన్న పదాల అర్థాన్ని ప్రభావితం చెయ్యకుండా జాగ్రత్త వహించగలరు. అంటే
> ఇప్పటికే "వి"తో కలవని పదాల్ని ఎంచుకోవలసి ఉంటుంది. ఎందుకంటే "వి" పక్కన
> చేఱుద్దామంటున్న అడ్డగీత లిఖితమే తప్ప ఉచ్చారణలో వినపడదు గనుక అది పాతపదాల్ని
> ప్రభావితం చేసే అవకాశం మిక్కిలి ఎక్కువ.
>
> అసందర్భమైనా చెప్పక తప్పదు. ఇప్పటికే ఈనాడు వంటి "దినం"పత్రికలు తమ punల
> కక్కుర్తికోసం ఉన్న పదాల స్వరూపాన్ని మార్చి punలే సాధురూపాలేమోనన్న భ్రాంతిని
> సామాన్యుల్లో కలిగిస్తూ అసలు తెలుగుని పాడుచేస్తున్నాయి.
>
> ఉదాహరణకి విలేఖరుల చేత వాయించబడే (వ్రాయించబడే) రూపాలు ఇలా ఉంటున్నాయి.
>
> లొంగుబాటు = లొంగుబాట
> రాయబారం = రాయబేరం మొ||
>
> వాళ్ళలా మనం చెయ్యొద్దని చెప్పడానికే ఇంత రాశాను. మళ్ళీ నేనీ చర్చలో
> పాల్గొనలేకపోవచ్చు.
>
>
>
> >> నెనర్లు. (Thanks)
>
> >> Yours Truly
> >> T. L. Bala Subrahmanyam
> >>http://www.tadepally.com
>
> >> ఇట్లు భవదీయుడు
> >> తాడేపల్లి
>
> >> This mail might have been sent to you in Telugu language. If you are
> >> unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE
> >> (UTF-8). For writing in Telugu, usehttp://lekhini.org
>
> >> Dravidian University
> >> Kuppam 517425
> >> A.P
>
> --
> నెనర్లు. (Thanks)
>
> Yours Truly
> T. L. Bala Subrahmanyamhttp://www.tadepally.com