పద నిష్పాదన కళ

97 views
Skip to first unread message

వీవెన్

unread,
May 26, 2014, 5:26:25 AM5/26/14
to తెలుగుపదం
కొత్త తెలుగు పదాలను కనిపెట్టడం గురించి తాడేపల్లి గారు వ్రాసిన పద నిష్పాదన కళ అనే పుస్తకం గత కొన్ని వారాలుగా కినిగె పత్రికలో ధారావాహికగా వస్తూంది. చూసి, చదివి మరిన్ని తెలుగు పదాలను కాయిస్తారని ఆశిస్తున్నాను.

ఇట్లు,
వీవెన్.

Marripoodi Mahojas

unread,
Dec 30, 2014, 12:35:43 AM12/30/14
to telug...@googlegroups.com
గూగుల్ లో వెతగ్గా ఆ పుస్తకం ఇప్పుడు ఆయన scribd ఖాతాలో ఈ క్రింది లంకెలో కూడా ఉచిత దింపుకోలుకు లభిస్తున్నట్లు తెలిసింది.

https://www.scribd.com/doc/204171621/%E0%B0%AA%E0%B0%A6%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B7-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A6%E0%B0%A8-%E0%B0%95%E0%B0%B3-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81-Pada-Nishpaadana-Kala-Telugu 

Arun Gaddipati (అచంగ)

unread,
Dec 30, 2014, 1:12:07 AM12/30/14
to telug...@googlegroups.com
ఎవరైనా ఈ పుస్తకాన్ని దింపుకొని ఉంటే (PDF) దయచేసి నా ఈమెయిలుకు పంపగలరు.

ఇట్లు,
అరుణ్ గడ్డిపాటి (అచంగ), యమ్మెస్సీ.,
తెనాలి, ఆంధ్రప్రదేశ్, భారతదేశం,
బ్లాగు (తెలుగు): కృష్ణవేణీతీరం.

Regards,
Arun Gaddipati (Achamga), MSc.,
Tenali, Andhra Pradesh, India,  
Blog (Telugu): Krishnaveniteeram.

Note: Information conveyed via this email may be confidential and strictly not to be used for any commercial purposes without consent. There is no guarantee that the files sent via this email if any are virus/malware free.

2014-12-30 11:05 GMT+05:30 Marripoodi Mahojas <mahojasm...@gmail.com>:
గూగుల్ లో వెతగ్గా ఆ పుస్తకం ఇప్పుడు ఆయన scribd ఖాతాలో ఈ క్రింది లంకెలో కూడా ఉచిత దింపుకోలుకు లభిస్తున్నట్లు తెలిసింది.

https://www.scribd.com/doc/204171621/%E0%B0%AA%E0%B0%A6%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B7-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A6%E0%B0%A8-%E0%B0%95%E0%B0%B3-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81-Pada-Nishpaadana-Kala-Telugu 

--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుపదం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugupadam...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.

Marripoodi Mahojas

unread,
Dec 30, 2014, 2:02:37 AM12/30/14
to telug...@googlegroups.com

@ అచంగ...నేను అక్కణ్ణుంచే దింపుకున్నాను. అలాగే చాలామంది దింపుకుంటున్నారు. మీరు కూడా దింపుకోవచ్చు గదా ?

అదీ గాక ఈ గుంపు అమరికలు వేగు చిరునామాల్ని పూర్తిగా ప్రదర్శించనివ్వకపోవడం ఒక సమస్య. 

వీవెన్

unread,
Dec 30, 2014, 3:58:41 AM12/30/14
to తెలుగుపదం
30 డిసెంబర్, 2014 12:32 [PM] న, Marripoodi Mahojas <mahojasm...@gmail.com> ఇలా రాసారు :


అదీ గాక ఈ గుంపు అమరికలు వేగు చిరునామాల్ని పూర్తిగా ప్రదర్శించనివ్వకపోవడం ఒక సమస్య. 

గుంపు అమరికలలో సంబంధిత అమరిక ఏమీ కనబడలేదు. గూగుల్ గుంపుల జాల పేజీల నుండి మన వేగు చిరునామాలను స్పామర్లు తస్కరించకుండా ఆ ఏర్పాటు అనుకుంటాను.

గుంపు సందేశాలను మన మెయిలుకే వచ్చేలా చేసుకుంటే, ఈమెయిలు చిరునామాలను చూడవచ్చు.

Marripoodi Mahojas

unread,
Dec 30, 2014, 7:22:59 AM12/30/14
to telug...@googlegroups.com
నిజమే వీవెన్ గారూ ! నేనా ఏర్పాటు చేసుకోలేదు.

పదనిష్పాదన కళని scribd.com సైటు నుంచి దింపుకోవడం సాధ్యపడని వారు నాకో వేగు పంపండి. నేను ఆ PDF పంపుతాను. నా వేగు చిరునామా :

mahojasm...@gmail.com

Marripoodi Mahojas

unread,
Feb 3, 2015, 12:57:55 AM2/3/15
to telug...@googlegroups.com
ప్రస్తుతం పదనిష్పాదన కళ ఒక ఏకాండి పుస్తకంగా scribd.com లో మాత్రమే లభ్యమవుతోంది. అయితే ఈ నెల తర్వాత అది ఆ విధంగా కూడా లభ్యం కాదని తెలుస్తోంది. ఆ సైటులో రచయిత ఇటీవల ఈ కిందివిధంగా ఒక నోట్ పెట్టినట్లు కనిపిస్తోంది.

"దీన్ని వాణిజ్యపరంగా ముద్రించే ప్రతిపాదన ఉంది కనుక ఈ పుస్తకం 2015 ఫిబ్రవరి తరువాత అంతర్జాలంలో లభ్యం కాదని మనవి."

కాబట్టి ఇప్పుడే డౌన్ లోడ్ చేసుకోవడం ఉత్తమం అనుకుంటా. లేదంటే వాళ్లు ముద్రించి విపణిలో విడుదల చేసేదాకా ఎదురుచూడాలి.

Vasu Valluri

unread,
Feb 3, 2015, 3:34:50 AM2/3/15
to telug...@googlegroups.com

పద నిష్పాదన కళను అభ్యసించటం మొదలు పెట్టాను, ప్రస్తుతము మున్నుడి చదువుతున్నాను. ఆసక్తికరంగా సాగుతున్నంతలో ఒక పద బంధం దాని ఆంగ్ల    మాతృకతో సహా ఎదురైనవి. ఆంగ్లంనుండి తెనుగీకరించటంలో తప్పుదొర్లినట్లు అనిపించింది కాబట్టి ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.
role models - నమూనా పాత్రలు (రచయిత అనువాదం)
నా ఉద్దేశంలో సరైన అనువాదం -
మార్గదర్శక నమూనాలు.

వాసు వల్లూరి

--

Marripoodi Mahojas

unread,
Feb 3, 2015, 5:41:20 AM2/3/15
to telug...@googlegroups.com
వాసు వల్లూరి.....మీరు సూచించినది కూడా బావున్నది. నాకు నచ్చింది. ఆయన Role model (literally పాత్ర-నమూనా) ని తిరగదిప్పి "నమూనా పాత్రలు" అనేశారు. సరే. పోనివ్వండి. తన పుస్తకం ఆ టాపిక్ మీద మొదటిదేనని, తన రచన కూడా అంత పర్ఫెక్టు కాదనీ రచయితే మున్నుడిలో చెప్పుకున్నట్లు జ్ఞాపకం. ఒక భావానికి ఒక్కొక్కరికీ ఒక్కో పదం స్ఫురించడం సహజం. చాలా అవసరం కూడా. మనం రచయితతో విభేదిస్తూ ఇంకా సృజనాత్మకమైన కొత్తపదాలు సూచిస్తున్నామంటేనే - దానర్థం ఆ పుస్తకం రాసిన ప్రయోజనం నెరవేరుతోందని ! మనం ప్రతిసారీ రచయితతో గుడ్డిగా ఏకీభవిస్తే బహుశా ఆ రచన ఉద్దేశం విఫలమైనట్లే ననుకుంటా.

raki gollapelli

unread,
Feb 3, 2015, 6:17:57 AM2/3/15
to telug...@googlegroups.com

roll models-ఆదర్శనీయులు

Vasu Valluri

unread,
Feb 3, 2015, 9:47:01 AM2/3/15
to telug...@googlegroups.com

రాకి మీరు సరిగ్గా సూచించారు. కాకపోతే roll కాదు role.

కాకర్ల నాగేశ్వరయ్య

unread,
Feb 3, 2015, 10:49:10 AM2/3/15
to telug...@googlegroups.com
గుంపు సభ్యులకు నమస్కారం. పద నిష్పాదన కళ పుస్తకం ఎవరైనా నాకు
విద్యుల్లేఖ మూలంగా పంపవలసినదిగా కోరుచున్నాను.

కృతజ్ఞతలతో.

raki gollapelli

unread,
Feb 3, 2015, 10:49:10 AM2/3/15
to telug...@googlegroups.com

అవును "విపరీతాక్షర దోషం "spelling mistake

Sunny D

unread,
Feb 3, 2015, 7:51:01 PM2/3/15
to telug...@googlegroups.com
నాగేశ్వర రావుగారు,

ఇక్కడ జత చేశాను, దింపుకోగలరు.. 

- సునీల్ 
204171621-పదనిష-పాదన-కళ-తెలుగు-Pada-Nishpaadana-Kala-Telugu.pdf

Marripoodi Mahojas

unread,
Feb 5, 2015, 12:58:35 AM2/5/15
to telug...@googlegroups.com
ఈ మధ్య నేను రచయితకి ఒక వేగు పంపితే ఆయన నాకిచ్చిన సమాధానం. బొమ్మ మీద నొక్కి చూడండి.

Authors Reply to me.jpg

Marripoodi Mahojas

unread,
Mar 6, 2015, 11:13:14 AM3/6/15
to telug...@googlegroups.com
నాదొక సందేహం.

మనలో ప్రొఫెషనల్/ పూర్తికాలిక పాత్రికేయులెవరైనా ఉన్నారా?
వారెవరైనా మనలాగా పదనిష్పాదనకళ పుస్తకాన్ని చదివారా?
నాబోటివాళ్ళం ఎంత పదపరిజ్ఞానాన్ని పెంచుకున్నా మీడియాతో ప్రత్యక్ష సంబంధాలు లేకపోవడం చేత ఏమీ చేయలేకపోతున్నాం.

Vasu Valluri

unread,
Mar 6, 2015, 3:00:32 PM3/6/15
to telug...@googlegroups.com

మహోజా గారు
మీరు సరిగ్గానే విశ్లేషించారు మా నాన్నగారు మీరన్నట్లు పూర్తికాలిక పాత్రికేయులు కానీ వారి ద్ృష్టిలో వాడుకలో ఉన్న పదాలను వాటి మూలాలు ఆంగ్లమైనా లేదా ఉర్దూ అయినా లేదా ఏ ఇతర భాష అయినా సరే ప్రాచుర్యంలో ఉంటే వాటినే వాడాలి.

--

వీవెన్

unread,
Mar 6, 2015, 11:34:09 PM3/6/15
to తెలుగుపదం

ఇది చెట్టు ముందా విత్తు ముందా లాంటి సమస్య. కొత్త పదాలు ప్రాచుర్యం లోకి రావాలంటే మీడియా వాళ్ళు వాడాలి. జనంలో ఉన్నవాటినే వాడాలని మీడియా వారికి నిర్దేశం.

Marripoodi Mahojas

unread,
Mar 7, 2015, 4:14:37 AM3/7/15
to telug...@googlegroups.com
అంటే తెలుగుభాష విషయంలో అభివృద్ధినిరోధక పాత్ర పోషిస్తున్న ఓల్డ్ ఫ్యాషన్డ్ ఛాందస శక్తి మీడియాయేనన్నమాట. ఎవఱూ కనిపెట్టకుండా, ఎవఱూ వాడకుండా కొత్తపదాలు ఎలా ప్రాచుర్యంలోకొస్తాయి? 

Marripoodi Mahojas

unread,
Mar 7, 2015, 5:32:39 AM3/7/15
to telug...@googlegroups.com
మీడియావాళ్ళేదో మన ఆశయాలకి తోడ్పడాలనుకోవడం బహుశా మన అత్యాశా, అమాయకత్వం, తెలివితక్కువతనం గట్రా గట్రా కావచ్చు. వాళ్ళకి భాషాభివృద్ధి, దాని సంక్షేమం ముఖ్యమైన విషయాలు కావు. ఈరోజుల్లో మీడియా అనేది ప్రధానంగా - బాగా లావుగా డబ్బున్నవాళ్ళ రంగం. మనలాంటి అత్యంత సామాన్యులకీ, వీళ్ళ మాతృభాషలాంటి మధ్యతరగతి సెంటిమెంట్లకీ అక్కడ ప్రవేశం లేదు. ఆ రంగంలో అలాంటి సెంటిమెంట్లున్నవాళ్ళంతా ఎప్పుడో పోయారు. ఇప్పుడున్నవాళ్ళు ఆ పోయినోళ్ళ తీపిగురుతులు మాత్రం కారు. నా అభిప్రాయంలో- మన వార్తాపత్రికలకి భాష నిర్దుష్టంగా ఉండడం కంటే ఒక మిల్లీమీటర్ కాలమ్ స్పేస్ ని పొదుపుచేయడమే అత్యంత ముఖ్యమైన విషయం. అందుకనుగుణంగా తమ దగ్గర పనిచేసేవాళ్ళ బ్రెయిన్స్ వాష్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. సరే, ఉద్యోగులదేముంది? పైవాళ్లు నేర్పిన చిలకపలుకులే పలుకుతారు. ఇందులో నెలజీతాల గొడవ తప్ప మాతృభాషాభిమానం ప్రసక్తే లేదు. ఈ కాలమ్ స్పేస్ పొదుపుకు పొడవైన తెలుగుపదాలు అడ్డమొస్తాయనుకుంటే అవి ఎత్తేసి పొట్టిగా ఉండే ఇంగ్లీషుపదాలే వాడడానికి సిద్ధపడతారు. ఇందులో ఏ విధమైన భాషాభిమానాలకీ తావు లేదు. ఉదాహరణకి ఈనాడులో చూడండి. ఈమధ్య దీర్ఘాలన్నీ హ్రస్వాలుగా మార్చిన దోషభూయిష్ఠమైన పదజాలాన్ని పదే పదే  ప్రచురిస్తున్నారు. పర్యాటకం కాదు, పర్యటకం అట. నిరాశాజనకం కాదు. నిరాశజనకం అట.

సరేలెండి, వాళ్ళ దారిన వాళ్ళని పోనిద్దాం.మనం మన దారిన మన బ్లాగుల ద్వారా పుస్తకాల ద్వారా మన తంటాలేవో మనమే పడదాం. 

hydka...@gmail.com

unread,
Aug 12, 2020, 12:57:33 PM8/12/20
to తెలుగుపదం
  నమూనా అన్నది ఉర్దూ పదము
మార్గదర్శకము, అదర్శము అన్నవి సంస్కృత పదములు
మాదిరికరము/మాదిరికాడు అన్నది తెలుగు పదము
Reply all
Reply to author
Forward
0 new messages