పత్రికా ప్రకటన తేది: 24.07.2025
*సీనియర్ సంపాదకుడు, ఉపన్యాసకుడు,సాహిత్య విశ్లేషకులు డా. కె. శ్రీనివాస్ కు కె.ఎన్. జయమ్మ స్ఫూర్తి పురస్కారం*
"తెల్లారని తెలంగాణ,బుల్ డోజర్ సందర్భాలు, కె.శ్రీనివాస్ సంపాదకీయాలు, తెలంగాణలో సాహిత్య వికాసం, జూన్ 2 , అనేక సందర్భాలు, కొత్త వంతెన, సంభాషణ" ఇలా.....తెలుగు ప్రపంచానికి అవసరమైన అన్ని సందర్భాలలో విలువైన ఎన్నో పుస్తకాలను వెలువరించారు కె. శ్రీనివాస్.
జర్నలిస్టుగా నాలుగు దశాబ్దాలకు పైగా కె.శ్రీనివాస్ రాసిన కథనాలు, సంపాదకీయాలు, చేసిన ఇంటర్వ్యూలు, సమకాలీన ప్రపంచ చరిత్రను కొత్త కోణంలో చూపిస్తాయి.
వార్త అయినా కవిత్వం అయినా
సమీక్ష అయినా, విమర్శ అయినా విశ్లేషణా వ్యాసం అయినా, ఉపన్యాసం అయినా, చర్చా కార్యక్రమం అయినా,
సంపాదకీయం అయినా...అన్ని సామాజిక సందర్భాలలో ధైర్యంగా నిజాలను మాత్రమే మాట్లాడే
నిలువెత్తు తెలుగు అక్షరం,
పీడితుల పక్షం వహించే
సామాజిక కార్యకర్త, కుల మత సామాజిక స్థితిగతులకు అతీతంగా మనిషిని సమానంగా గౌరవించాలనే తపన కలిగిన రచయిత , సాహిత్య విశ్లేషకులు, ఆంధ్రజ్యోతి దినపత్రిక (అ) పూర్వ సంపాదకుడు, ఉపన్యాసకులు
ఈ కాలపు అద్భుతమైన
సృజనకారుడు
డాక్టర్ కె. శ్రీనివాస్ గారు ఇప్పటికే
"తాపీ ధర్మారావు స్మారక పురస్కారం, సి.వై. చింతామణి అవార్డు, ఎన్.ఆర్. చందూర్ అవార్డు, డి. శ్రీపాదరావు అవార్డు, మాదల వీరభద్రరావు స్మారక పురస్కారం, దేవులపల్లి రామానుజరావు స్మారక సాహిత్య పురస్కారం.." మొదలైన పురస్కారాలను వారు పొందారు.
వారి నిరంతర సాహిత్య కృషిని గౌరవిస్తూ *కె. ఎన్. జయమ్మ స్ఫూర్తి పురస్కారాన్ని* ఆగస్టు 8 శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు పలమనేరులో జరిగే సాహిత్య కార్యక్రమంలో డా.కె.శ్రీనివాస్ గారికి అందజేస్తున్నాం. ఈ పురస్కారం కింద జ్ఞాపిక, ఇరవై ఐదువేల రూపాయల నగదు అందచేయటం జరుగుతుంది. సాహితీ మిత్రులు పాల్గొనాలని మనవి.
కార్యక్రమ నిర్వహణ & వివరాలకు:
పలమనేరు బాలాజి, పలమనేరు , చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
9440995010