పిలుపు / తెలుగు కూటమి - రచ్చబండ / 13-06-2026

7 views
Skip to first unread message

రామప్రసాద్ పురాణం

unread,
Jun 10, 2026, 12:14:18 AM (10 days ago) Jun 10
to తెలుగు మాట
ప్రియమైన నేస్తాలకు , 

*”మూడు నుడికారాల మేళవింపు సౌరభాల సిరిమల్లి - అచ్చతెనుఁగు పట్టింపుల పూలతోట రాళ్ళపల్లి”*
_______________________________________
పాఠశాల విద్య మొత్తం తెలుగు మాధ్యమంలోనే చదివిన ఈ జంతుశాస్త్ర పట్టభద్రులు, తెలుగులోనే కాక కన్నడ , సంస్కృత భాషలలో కూడా స్నాతకోత్తర పట్టాలు పుచ్చుకున్నారు. యాభై ఏండ్ల క్రితమే, వాడుక తెలుగులో రాసి పరిశోధన పట్టా (పిహెచ్.డి) సాధించిన తొలి వ్యక్తిగా పేరుపడ్డారు.

1969 నుండి 2008 వరకు మైసూరు విశ్వవిద్యాలయంలో, 1990-93మధ్య తెలుగు విశ్వవిద్యాలయములోనూ, ఆచార్యులుగా పనిచేశారు.
అమెరికా లోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో కూడా సందర్శకాచార్యులుగా పనిచేశారు.
_____________________________
“ఆర్వీయస్” అని ముద్దుగా పిలువబడే సుందరం గారు , తెలుగు, కన్నడ , ఆంగ్లము- ఈ మూడు భాషలలో నూట ఆరు పుస్తకాలు-కవిత్వం, కథ, నవల, అనువాదం, జీవిత చరిత్ర, జానపదం, విమర్శ మొదలైన వాటితో మెండుగ ప్రచురించారు. ఈ మూడు భాషలతో కలిపి మొత్తం ఆరు భాషలలో ప్రావీణ్యులు.

తెలుగు మీద వల్లమాలిన మక్కువ గల వీరు, తెలుగు భాషాభివృద్ధి కోసం , తెలుగు జానపద విజ్ఞానం కోసం, గత యాభై ఏండ్ల నుండి గట్టి పూనికలు చేస్తూనే ఉన్నారు.

చెన్నైలోని త్యాగరాయ కళాశాల , తెలుగు శాఖవారి ఆధ్వర్యంలో “ఆచార్య ఆర్వీయస్ సుందరం సాహిత్యం - జీవితం” పేరిట , ఆగస్టు , 2020లో ఒక అంతర్జాల సదస్సులో వీరి పుస్తకం “ఆంధ్రుల జానపద విజ్ఞానం” పై ఒక పత్ర సమర్పణ కూడా జరిగింది. ఈ పుస్తకం ఇటీవల ఆరవ ముద్రణకు నోచుకున్నది.
___________________________
*తెలుగులో మొదటి రచన- కవిజనాశ్రయమును,*
*ఆరు ప్రాచీన కన్నడ కావ్యాలు, శాస్త్రాలను ఆంగ్లం లోనికి అనువదించారు* ఇటీవల వీరు. *కువెంపు భాషాభారతి (కర్నాటక అనువాద అకాడెమి) విశిష్ట పురస్కారం* , *ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కళారత్న పురస్కారం* అందుకున్నారు.
______________________________
తెలుగుకు ప్రాచీన భాష హోదా రావటానికి ముఖ్యకారకులలో ఒకరు , హోదా వచ్చిన తరువాత కూడా ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం పెంపుకై అలుపెరుగక పాటుపడుతున్న, శ్రీ రాళ్ళపల్లి వేంకట సుబ్బు సుందరం గారు, *”తెలుగు భాష అంటే ఒక సంస్కృతి కూడా..”* అన్న అంశంపై మన తెలుగు సంఘాల ఉమ్మడి వేదిక పై, 13-06-2026 నాడు, మాపులు 7 గం. లకు జరిపే రచ్చబండలో ప్రసంగిస్తారు .
________________________________
సమావేశంలో పాల్గొనటానికి ఎప్పటి లాగా ఈ క్రింది లంకెపై నొక్కండి.
వీడియో కాల్ లింక్:
https://meet.google.com/ste-jdoz-xbs
_____________________________
తెలుగు నుడి ఊడిగంలో మీ అనుగరి(అభిమాని),
*పురాణం రామప్రసాద్ ,*
ఊరట వంౘ మరకాను(రసాయన సాంకేతిక యంత్రశాస్త్రం)
(విశ్రాంత సంచాలకుడు - రసాయన మందు దినుసుల ఉత్పత్తి)
చేపలుకు : 9505255100
telugukootami.org
తెలుగును బతికించుకోవాలంటే తెలుగు భాషా ప్రాధికార సంస్థ ఏర్పాటు తో పాటు 1. ప్రతి కొలువుకు తెలుగులోనే పరీక్ష పెట్టాలనీ 2. ప్రతి బడి/కళాశాలలో తెలుగును ఒక తప్పనిసరి మందల [విషయం] గా నేర్పాలని 3. ఇతర రాష్ట్రాల్లో/దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు చదివే వీలు మనం కలిగించాలని 4. అన్ని రాష్ట్రాల్లోనూ చనిపోతున్న తెలుగు మాటలను సేకరించి బతికించుకోవాలని, వాడాలని మనం జరుపుతున్న ఎసపు [ఉద్యమం] లో మీరు చురుకుగా పాల్గొనాలని విన్నపం.
======================

రామప్రసాద్ పురాణం

unread,
Jun 10, 2026, 12:18:48 AM (10 days ago) Jun 10
to తెలుగు మాట
ప్రియమైన నేస్తాలకు , 

సమావేశంలో  పాల్గొనటానికి వీడియో కాల్ లింక్:
_____________________________
మీ 
పురాణం రాజప్రాసాదం
తెలుగు కూటమి అనుగరి 
భాగ్యనగరము

Reply all
Reply to author
Forward
0 new messages