కవిత తెలుగు జనాల నాడీని పట్టుకొన్నది.

5 views
Skip to first unread message

Murthy krishnalanka

unread,
Mar 22, 2026, 10:33:27 PM (14 days ago) Mar 22
to తెలుగు మాట

అయ్యా,
కవిత తన కొత్త పార్టీ పేరును ప్రకటించింది; తెలంగాణ ప్రజా జాగృతి అని. మనం అందరం సంతోషపడాలి.
తెలుగు జనాల నాడిని గట్టిగా పట్టుకొన్నది కవిత. తెలుగు వారికి ఆత్మ న్యూనత భావం పరాకాష్ట కు చేరుకొన్నది. తెలుగు భాష, సంస్కృతులు తెలుగు వారికి చాల నీచంగా కనపడుతున్నాయి. రెండు ప్రభుత్వాలు కూడ బడి చదువులకు పనికి రాని రోత భాష తెలుగు అని అంటే తెలుగు వారు చాల సంతోషపడుతున్నారు. ప్రపంచం లో ఎక్కడైనా, మన దేశం లో ఏ రాష్ట్రంలోనైనా, మాతృ భాష ను ఇంత లేకిగా చూసే ప్రభుత్వాలు ఎక్కడైనా ఉన్నాయా?
ఒక పల్లెటూరుకు పోయి అడగండి: తెలంగాణ ప్రజా జాగృతి అంటే ఏమిటని. 10% మంది కూడ సరిగా చెప్పలేరు. అందుకనే ఆ పేరును ఎన్నుకొన్నది కవిత. 
తెలుగు రాష్ట్రాలలో ఒక పార్టీ పేరు కూడ ఆంగ్ల, సంస్కృత మాటలు లేకుండా, లేవు. వామపక్షాలు కూడ మినహాయింపు కాదు. వారు చాల తెలివిగల వారు. మొత్తం ఆంగ్లం లోనే రాసుకొంటారు. రష్యా, చైనా లాంటి దేశాలలో వారు తమ పార్టీల పేర్లను వారి భాష లోనే రాసుకొంటారు. ఎంగిలిపీసు లో రాయరు. 

తమిళనాడు జనానికి తిక్క ఎక్కువ. అక్కడ ప్రతి పార్టీ తన పేరులో ఆంగ్ల, సంస్కృత పదాలు లేకుండ- తమిళం మాటలే ఉండేట్లు- జాగ్రత్త పడుతుంది. అలా పేరు లేకపోతే ఆ పార్టీ కు ఒక ఓటు కూడ పడదు. 

మన్నించాలి. నేను పైన సరిగా రాయలేదు. తెలుగు రాష్ట్రాలలో ఒక మినహాయింపు ఉన్నది. తమ మాతృభాష మీద నిజమైన ప్రేమ ఉన్న అసదుద్దీన్ తన పార్టీ పేరును  All India Majlis-e-Ittehadul Muslimeen (AIMIM).  
అని నడుపుతున్నాడు. 

అలా లేకపోతే ఆయనకు ఓట్లు పడవు మరి!

మీ,
కె. మూర్తి. 
Reply all
Reply to author
Forward
0 new messages