*”మాతృభాషపై ఎడతెగని మక్కువ చూపే జ్ఞాననేత్రం - సాటి దేశ భాషల అణచివేతపై రుద్రనేత్రం”*
__________________
తాను చదువుతున్న ఐఐటీ, ఢిల్లీ వారి నిబంధనలకు విరుద్ధంగా తన ప్రాజెక్ట్ రిపోర్ట్ ను హిందీలో సమర్పించి, అలనాటి రాష్ట్రపతి గియానీ జైల్ సింగ్ గారి ప్రశంసకు పాత్రుడైన తెగువ వీరిది. తన నిరంతర పోరాటాల ఫలితంగా ఐఐటీ , పలు ఇతర ఉన్నత విద్యా సంస్థల ప్రవేశ పరీక్షల్లో ఆయా ప్రాంతాల మాతృభాష అయిన హిందీని ప్రవేశపెట్టగలిగారు
__________________
భారత అత్యున్నత న్యాయస్థానం , రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాల్లో వ్యవహార భాషగా ఆంగ్లమే వాడి తీరాలన్న నిబంధనకు వ్యతిరేకంగా అలుపెరుగని ఉద్యమాలు చేసి నిర్బంధాలకు సైతం వెరవని భాషోద్యమ జోదు వీరు. ఆంగ్లంతో పాటు స్థానిక భాషల్లో కూడా న్యాయవ్యవహారాలు నడిపి తీరాలని ఈనాటికీ పోరాటం చేస్తున్నారు
_____________________
మాతృభాష లో మాట్లాడగలిగే , రాయగలిగే స్వాతంత్ర్యం ఉంటేనే సంపూర్ణ స్వరాజ్యం సిద్ధిస్తుందని వీరు ఎలుగెత్తి చాటుతారు.
_______________________
పలు ఉన్నత స్థాయి సంస్థలలో ఉన్నత ఉద్యోగాలు దొరికే వీలున్నా, ఇతర ఆకర్షణలున్నా, తాను మాత్రం పలు రకాల దమననీతి కార్యకలాపాలకు వ్యతిరేకంగా
పోరాట మార్గాన్నే ఎంచుకున్నారు.
—————————————
పలు సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా సత్యాగ్రహ పోరాటాలు చేస్తున్న, పలు స్థానిక భాషల మనుగడకై నిరంతరం ఉద్య్యమాలు చేస్తున్న
*శ్యామ్ రుద్ర పాఠక్* గారు, *” ఆంగ్లం , హిందీల బలవంతపు అమలుతో మన దేశంలో జరిగిన వినాశకర పరిణామాలు ”* అన్న అంశంపై మన తెలుగు సంఘాల ఉమ్మడి వేదికపై, శనివారం, 28-02-2026, మాపులు 7 గం. లకు జరిపే రచ్చబండలో, మాట్లాడుతారు.
కార్యక్రమంలో పాల్గొనటానికి ఎప్పటి లాగా ఈ క్రింది లంకెపై నొక్కండి.
వీడియో కాల్ లింక్:
https://meet.google.com/ste-jdoz-xbs ______________________
తెలుగు నుడి ఊడిగంలో మీ అనుగరి(అభిమాని),
*పురాణం రామప్రసాద్ ,*
ఊరట వంౘ మరకాను(రసాయన సాంకేతిక యంత్రశాస్త్రం)
చేపలుకు : 9505255100
telugukootami.org తెలుగును బతికించుకోవాలంటే తెలుగు భాషా ప్రాధికార సంస్థ ఏర్పాటు తో పాటు 1. ప్రతి కొలువుకు తెలుగులోనే పరీక్ష పెట్టాలనీ 2. ప్రతి బడి/కళాశాలలో తెలుగును ఒక తప్పనిసరి మందల [విషయం] గా నేర్పాలని 3. ఇతర రాష్ట్రాల్లో/దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు చదివే వీలు మనం కలిగించాలని 4. అన్ని రాష్ట్రాల్లోనూ చనిపోతున్న తెలుగు మాటలను సేకరించి బతికించుకోవాలని, వాడాలని మనం జరుపుతున్న ఎసపు [ఉద్యమం] లో మీరు చురుకుగా పాల్గొనాలని విన్నపం.
======================