పిలుపు / తెలుగు కూటమి - రచ్చబండ / 24-01-2026

2 views
Skip to first unread message

రామప్రసాద్ పురాణం

unread,
Jan 23, 2026, 8:10:31 AMJan 23
to తెలుగు మాట, Kodanda Ramaiah Parupally
ప్రియమైన నేస్తాలకు , 

*”తెలుగు భాష, అస్తిత్వ ఉద్యమాలు, స్థానిక భావనల కలబోత కండ్లకుంట - మౌలికమైన విమర్శలతో పరిశోధకులకు పసిడి పంట !”*
_________________________________
నలభై ఏండ్లు పైబడిన అనుభవం వీరిది- పత్రికారంగంలో, విమర్శనాత్మక తెలుగు సాహిత్య రచనలో. *తెలంగాణ సాహిత్య వికాసం 1900-1940 వరకు,* ఒక కొత్త వచన రచన శైలిలో వీరు రాసిన *సంభాషణ కాలమ్ వ్యాసాలు,* పలు విభిన్న విషయాలపై రాసిన *సంపాదకీయాలు,* *అనేక సందర్భాలు,* *కొత్త వంతెన,* మొదలైన వీరి రచనలు పాఠకుల మనసును చూరగొన్నాయి.
_________________________
జాతీయ అంతర్జాతీయ రాజకీయాలు, న్యాయ వ్యవస్థ మొదలైన వాటిపై నైపుణ్యంతో , ప్రజాశ్రేయస్సు కై వార్తా కథనాలు వెలువరించడం వీరికి కొట్టిన పిండి.
_________________________
ఆగస్ట్ 2025లో బెంగళూరు నగరంలో జరిగిన బుక్ బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్ లో వీరు పాల్గొన్న *”సమకాలీన మాధ్యమాల్లో వికసించిన సాహిత్య స్వరూపం ”* అన్న అంశం పై జరిగిన చర్చా వేదిక అందరినీ ఆకట్టుకున్నది.
__________________________
సీనియర్ పాత్రికేయులు, సామాజిక వ్యాఖ్యాత, కవి, విమర్శకులు, కాలమిస్ట్, ఆంధ్రజ్యోతి దినపత్రిక పూర్వ సంపాదకులు అయిన *డా. శ్రీనివాస్ కండ్లకుంట గారు, *” తెలుగు మనుగడ లో పత్రికల పాత్ర”* అన్న అంశంపై మన తెలుగు సంఘాల ఉమ్మడి వేదికపై, శనివారం, 24-01-2026, మాపులు 7 గం. లకు జరిపే రచ్చబండలో, మాట్లాడుతారు.

కార్యక్రమంలో పాల్గొనటానికి ఎప్పటి లాగా ఈ క్రింది లంకెపై నొక్కండి.
వీడియో కాల్ లింక్:
https://meet.google.com/ste-jdoz-xbs
_____________________________
తెలుగు నుడి ఊడిగంలో మీ అనుగరి(అభిమాని),
*పురాణం రామప్రసాద్ ,*
ఊరట వంౘ మరకాను(రసాయన సాంకేతిక యంత్రశాస్త్రం)
చేపలుకు : 9505255100
telugukootami.org
తెలుగును బతికించుకోవాలంటే తెలుగు భాషా ప్రాధికార సంస్థ ఏర్పాటు తో పాటు 1. ప్రతి కొలువుకు తెలుగులోనే పరీక్ష పెట్టాలనీ 2. ప్రతి బడి/కళాశాలలో తెలుగును ఒక తప్పనిసరి మందల [విషయం] గా నేర్పాలని 3. ఇతర రాష్ట్రాల్లో/దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు చదివే వీలు మనం కలిగించాలని 4. అన్ని రాష్ట్రాల్లోనూ చనిపోతున్న తెలుగు మాటలను సేకరించి బతికించుకోవాలని, వాడాలని మనం జరుపుతున్న ఎసపు [ఉద్యమం] లో మీరు చురుకుగా పాల్గొనాలని విన్నపం.
======================

Reply all
Reply to author
Forward
0 new messages