|
"శాక్రమెంటో
తెలుగు వెలుగు" పత్రిక - 2026 వార్షిక సంచిక
పాఠక మిత్రులారా,
పాఠక మిత్రులందరికి 2026 నూతన సంవత్సరం మరియూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ
.. "శాక్రమెంటో తెలుగు వెలుగు" పత్రిక - 2026 వార్షిక సంచిక మీ ముందుకు వచ్చింది. ఈ సంచిక కోసం ఈ లంకెను
క్లిక్ చెయ్యండి.
https://tinyurl.com/TagsPatrika35
లేదా
"శాక్రమెంటో
తెలుగు వెలుగు" పత్రిక - 2026 వార్షిక సంచిక
మా సంపాదకీయ బృందం, రచయితలు, అక్షర దోషాల పని పట్టే బృందం ఇంకా కార్యకర్తలు, మరెందరో ఇప్పటివరకు వెలువరించిన
సంచికలకు మూలస్తంభంగా నిలిచారు. వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. పాఠకమిత్రులు ఎప్పటివలె శాక్రమెంటో తెలుగు వెలుగు పత్రికను ఆదరించి, మనసారా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము.
కొత్త రచనలకు, కొత్త రచయితలకు స్వాగతం:
"శాక్రమెంటో తెలుగు
వెలుగు" వార్షిక పత్రిక ఎప్పటికప్పుడు కొత్త రచనలను, కొత్త రచయితలను ఆహ్వానిస్తుంది. ఈ సందర్భంగా పాఠకుల
నుండి, కొత్త కలాలనుండి, అలాగే అనుభవజ్ఞులైన రచయితలనుండి కూడా ఒక అభిప్రాయ
సేకరణ కార్యక్రమానికి మేము పూనుకొన్నాము. ఈ అభిప్రాయ సేకరణలో పాల్గొని మీ అభిప్రాయాలు తెలియజేసినవారందరికీ మా
కృతజ్ఞతలు. అభిప్రాయ సేకరణలో ఇంకా పాల్గొననివారు చెయ్యవలసిందల్లా, ఒక్క ఐదు నిమిషాలు ఈ పనికి కేటాయించి ఈ క్రింది లంకెను నొక్కి మీ
అభిప్రాయాలను, ప్రాధాన్యతలను
మాకూ తెలియజెయ్యడమే.
https://forms.gle/tcN6qr5UpKL6FoLo7
ఇకపోతే ఈ 2026 వార్షిక సంచిక లో శ్రమకోర్చి మేము పొందుపరచిన రచనలు, శీర్షికలు మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాం.
పది ఏండ్ల క్రితం ‘తెలుగు వెలుగు
పత్రిక’ ద్వారా తెలుగు సాహిత్య సేవకు శ్రీకారం చుట్టింది టాగ్స్ సంస్థ. ఇది మనందరి పత్రిక.. మనదైన అచ్చ తెనుగు పత్రిక. ఈ తెలుగు
భాషా సేవ యజ్ఞంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా భాగస్వాములు కావాలి. మీ అందరికీ ఇదే
మా ఆహ్వానం... 2027 వార్షిక
సంచిక కు ప్రచురణ నిమిత్తం మీ రచనలు
ఈరోజే మా ఈమెయిలు telu...@yahoo.com కు పంపండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి మాకు తెలుపండి.
"శాక్రమెంటో తెలుగు వెలుగు" పత్రిక పూర్వ సంచికలకు ఈ లంకెను http://sactelugu.org/tags-patrika/ క్లిక్ చెయ్యండి.
ధన్యవాదాలు,
శాక్రమెంటో తెలుగు పత్రిక సంపాదక
బృందం
Telugu Association Of Greater Sacramento (TAGS)
Post Box: 1666
Folsom, CA-95763, USA
Website: http://sactelugu.org/tags-board
Facebook: https://facebook.com/sacTelugu
Our TAGS, the 3000+ member Telugu community for
Telugu people in and around Sacramento, CA region in the USA.
|